గుంటూరు జిల్లా అచ్చంపేటలో గత నెల ఉపాధ్యాయ దంపతులను బెదిరించి ఆభరణాలను దోచుకున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
సత్తెనపల్లి : గుంటూరు జిల్లా అచ్చంపేటలో గత నెల ఉపాధ్యాయ దంపతులను బెదిరించి ఆభరణాలను దోచుకున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 120 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు గుంటూరు శారదా కాలనీకి చెందిన సయ్యద్ నాగుల్‌బాషా, ఎం.వెంకటేశ్వర్లు, ఎం.వేణుగా పోలీసులు తెలిపారు. ఏడుగురు సభ్యుల దొంగల ముఠాలో ముగ్గురు పరారు కాగా, మరొకరు ప్రకాశం జిల్లా పోలీసులకు పట్టుబడినట్టు వెల్లడించారు.