గుంటూరు : సత్తెనపల్లి టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి టీడీపీ అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే కోడెల అసమ్మతి నేతలతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సమావేశమయ్యారు. కోడెల వ్యతిరేకులను ఏకతాటి మీదకు తెచ్చి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాయపాటి రంగారావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన అనుచరులతో కోడెల శివప్రసాదరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీకి చెందిన రెండు కార్యాలయాల్లో వీరి సమావేశాలు జరిగాయి. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జిగా తొలగించేందుకు అసమ్మతి నేతలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి.. కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి రాయపాటి రంగారావు రావడం.. ఆయన కోడెల అసమ్మతి వర్గంతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment