Rayapati Rangarao
-
చంద్రబాబుకి అది అలవాటే: రాయపాటి రంగారావు
గుంటూరు, సాక్షి: టీడీపీని వీడినా.. చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టినా రాయపాటి రంగారావు కోపం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా ఆయన మరోసారి టీడీపీ అధినేత, ఆయన తనయుడు నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటైన పనేనని.. ఇప్పుడు తన కుటుంబంపై పడ్డారంటూ ఆగ్రహం వెల్లగక్కారాయన. ‘‘చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్.. కరప్షన్ కింగ్. రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునేవాళ్లకు ఆయనొక రిఫరెన్స్. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు’’ అని రంగారావు ఆరోపించారు. ఇదీ చదవండి: చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకే పవన్.. శైలజకు ఘాటు కౌంటర్ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబు అలవాటేనని.. ఈ క్రమంలోనే రాయపాటి శైలజతో తనపై విమర్శలు చేయిస్తున్నారని రంగారావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విజయవాడలో కేశినేని నాని కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికే రాయపాటి శైలజ తో నా మీద ఆరోపణలు చేయిస్తున్నాడు. అసలు రాయపాటి శైలజకు పార్టీలో సభ్యత్వం ఉందా?.. అమరావతి ఉద్యమం పేరుతో ఎంత ఎంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలి. వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళినాయో అంతా నాకు తెలుసు. రాజకీయాల్లో చంద్రబాబు నిన్ను వాడుకుని వదిలేస్తాడంటూ శైలజకు రంగారావు హితవు పలికారు. -
టీడీపీ దిక్కుమాలిన పార్టీ: రాయపాటి రంగారావు
సాక్షి, గుంటూరు: టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు.. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని.. ఒక వ్యాపార సంస్థగా ఆయన అభివర్ణించారు. మా కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది టీడీపీ.. గత ఎన్నికల్లో 150 కోట్లు మా నుంచి తీసుకున్నారు. లోకేష్, చంద్రబాబు మా దగ్గర ఎంత తీసుకున్నారో లెక్కంతా ఉంది. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానంటూ రంగారావు సవాల్ విసిరారు. కియా కంపెనీ తానే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేష్ ఎక్కడ పనిచేయనివ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడని, తాము అన్ని కులాలకు పని చేస్తామని రాయపాటి రంగారావు అన్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్ దిగారు. మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావు రాంరాం చెప్పారు. మరో నేత లింగమనేని శివరామ ప్రసాద్ కూడా రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని.. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు నడవనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి! -
చంద్రబాబుకు షాక్ మీద షాకులు
సాక్షి, గుంటూరు: ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీకి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్ దిగారు. మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావు రాంరాం చెప్పారు. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు నడవనున్నట్లు సమాచారం. సొంత సామాజిక వర్గం నుండి తగులుతున్న షాకులతో టీడీపీ కుదేలవుతుంది. ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని క్యాడర్ అంటోంది. చంద్రబాబుకు బ్యాడ్ టైం షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టీడీపీకి మరో నేత లింగమనేని శివరామ ప్రసాద్ రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని.. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈయన ద్వారానే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పలు పిటిషన్లు వేయించారు. -
సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి
గుంటూరు : సత్తెనపల్లి టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి టీడీపీ అసమ్మతి నేతలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే కోడెల అసమ్మతి నేతలతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సమావేశమయ్యారు. కోడెల వ్యతిరేకులను ఏకతాటి మీదకు తెచ్చి.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు రాయపాటి రంగారావు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన అనుచరులతో కోడెల శివప్రసాదరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీకి చెందిన రెండు కార్యాలయాల్లో వీరి సమావేశాలు జరిగాయి. కోడెలను సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా తొలగించేందుకు అసమ్మతి నేతలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు బుధవారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి.. కోడెలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరపైకి రాయపాటి రంగారావు రావడం.. ఆయన కోడెల అసమ్మతి వర్గంతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: క్విట్ కోడెల.. సేవ్ సత్తెనపల్లి కోడెల పంచాయతీ.. ‘డోంట్ వర్రీ’ అన్న బాబు! -
ఎంపీ రాయపాటి కుమారుడి బెదిరింపులు
సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడి వేధింపుల తాళలేక కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్న కులానికి చెందిన తనను కులం పేరుతో రాయపాటి తనయుడు రంగారావు దూషించారని సూసైడ్ నోట్లో డ్రైవర్ విజయ్‌రాజు పేర్కొన్నాడు. రంగారావు కూతురి కారు డ్రైవర్ పని చేసినప్పుడు రూ. 15 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నానని లేఖలో తెలిపాడు. అయితే, ఆ తర్వాతి నుంచి కులం పేరుతో దూషణలు ఎదురవ్వడంతో అవమాన భారం భరించలేక ఉద్యోగం మానేసినట్లు వెల్లడించాడు. గత కొద్దిరోజులుగా రాయపాటి రంగారావు, కోటపాటి పూర్ణచంద్ర, డ్రైవర్ వెంకటేష్‌లు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆత్మహత్యకు కారణం ఈ ముగ్గురేనని, చట్ట ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాడు.