
గుంటూరు, సాక్షి: టీడీపీని వీడినా.. చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టినా రాయపాటి రంగారావు కోపం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా ఆయన మరోసారి టీడీపీ అధినేత, ఆయన తనయుడు నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటైన పనేనని.. ఇప్పుడు తన కుటుంబంపై పడ్డారంటూ ఆగ్రహం వెల్లగక్కారాయన.
‘‘చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్.. కరప్షన్ కింగ్. రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునేవాళ్లకు ఆయనొక రిఫరెన్స్. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు’’ అని రంగారావు ఆరోపించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకే పవన్..
శైలజకు ఘాటు కౌంటర్
కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబు అలవాటేనని.. ఈ క్రమంలోనే రాయపాటి శైలజతో తనపై విమర్శలు చేయిస్తున్నారని రంగారావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విజయవాడలో కేశినేని నాని కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికే రాయపాటి శైలజ తో నా మీద ఆరోపణలు చేయిస్తున్నాడు. అసలు రాయపాటి శైలజకు పార్టీలో సభ్యత్వం ఉందా?.. అమరావతి ఉద్యమం పేరుతో ఎంత ఎంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలి. వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళినాయో అంతా నాకు తెలుసు. రాజకీయాల్లో చంద్రబాబు నిన్ను వాడుకుని వదిలేస్తాడంటూ శైలజకు రంగారావు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment