
విజయరాజు రాసిన ఆత్మహత్య లేఖ
సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడి వేధింపుల తాళలేక కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్న కులానికి చెందిన తనను కులం పేరుతో రాయపాటి తనయుడు రంగారావు దూషించారని సూసైడ్ నోట్‌లో డ్రైవర్ విజయ్‌రాజు పేర్కొన్నాడు.
రంగారావు కూతురి కారు డ్రైవర్ పని చేసినప్పుడు రూ. 15 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నానని లేఖలో తెలిపాడు. అయితే, ఆ తర్వాతి నుంచి కులం పేరుతో దూషణలు ఎదురవ్వడంతో అవమాన భారం భరించలేక ఉద్యోగం మానేసినట్లు వెల్లడించాడు.
గత కొద్దిరోజులుగా రాయపాటి రంగారావు, కోటపాటి పూర్ణచంద్ర, డ్రైవర్ వెంకటేష్‌లు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆత్మహత్యకు కారణం ఈ ముగ్గురేనని, చట్ట ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment