rayapati sambasivarao
-
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత
నగరంపాలెం: తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసిందని, దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలోని నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి కొత్తకాదని, అందులో భాగంగానే రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్ ఎక్కడా గెలవడని జ్యోస్యం చెప్పారు. యువగళానికి ఒక్క రోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. -
ఈడీ సోదాలు.. టీడీపీ మాజీ ఎంపీకి షాక్
-
పరువు నష్టం కేసులో రాయపాటి, కన్నా రాజీ
గుంటూరు లీగల్: పరువు నష్టం కేసులో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావులు రాజీ అయ్యారు. మంగళవారం నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇందుకు వేదికైంది. 2010లో రాయపాటి సాంబశివరావు పలు ఆరోపణలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణను విమర్శించారు. అవి తన పరువుకు నష్టం కలిగించాయంటూ కన్నా కోర్టులో పరువు నష్టం దావా చేశారు. పరిహారంగా రూ.కోటి చెల్లించడంతోపాటు భవిష్యత్‌లో మళ్లీ ఏవిధమైన ఆరోపణలు చేయకుండా ఉండేలా పర్మినెంట్ ఇంజెంక్షన్ ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. ఇప్పటికే కన్నా తరఫున సాక్ష్యాలు కోర్టుకు సమర్పించగా.. ప్రస్తుతం రాయపాటి తరఫున సాక్ష్యాలు సమర్పించే దశలో కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్జి ఇరు పార్టీలను మంగళవారం కోర్టుకు పిలిపించి, వారి న్యాయవాదుల సమక్షంలో రాజీ చర్చలు జరిపారు. తాను చేసిన ఆరోపణలను ఉపసహరించుకుంటున్నట్టు రాయపాటి చెప్పగా, దానికి కన్నా అంగీకరించారు. ఇరువర్గాల వారు స్నేహ పూర్వకంగా కేసు రాజీ పడేందుకు అంగీకరించి కోర్టులో ఉమ్మడి మెమో దాఖలు చేశారు. దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
ఎంపీ రాయపాటి కుమారుడి బెదిరింపులు
సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడి వేధింపుల తాళలేక కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్న కులానికి చెందిన తనను కులం పేరుతో రాయపాటి తనయుడు రంగారావు దూషించారని సూసైడ్ నోట్లో డ్రైవర్ విజయ్‌రాజు పేర్కొన్నాడు. రంగారావు కూతురి కారు డ్రైవర్ పని చేసినప్పుడు రూ. 15 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నానని లేఖలో తెలిపాడు. అయితే, ఆ తర్వాతి నుంచి కులం పేరుతో దూషణలు ఎదురవ్వడంతో అవమాన భారం భరించలేక ఉద్యోగం మానేసినట్లు వెల్లడించాడు. గత కొద్దిరోజులుగా రాయపాటి రంగారావు, కోటపాటి పూర్ణచంద్ర, డ్రైవర్ వెంకటేష్‌లు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆత్మహత్యకు కారణం ఈ ముగ్గురేనని, చట్ట ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరాడు. -
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
-
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే బోర్డుపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ జరుగుతున్న సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రైల్వేమంత్రి చెప్పినా అధికారులు లెక్కచేడయం లేదని, వారు ప్రధానికన్నా పవర్ఫుల్ అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులు కూడా అధికారులు చేయడం లేదని, ఇలా అయితే ప్రజలు తమను చెప్పుతో కొడతారని ఆయన అన్నారు. గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లు నుంచి సాగుతునే ఉన్నాయని అన్నారు. అలాగే గుంటూరు-చెన్నై డే ట్రయిన్ అడిగానని, దానిపై కూడా స్పందన లేదన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ ...అధికారుల వల్లే రాలేదని విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం బోర్డు అధికారులకు ఇష్టం లేదని అన్నారు. అసలు ముందు రైల్వే జోన్‌ను ప్రకటిస్తే...తర్వాత చిన్నగా విశాఖకు తరలించవచ్చన్నారు. తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినా తాను మాట్లాడతానని రాయపాటి అన్నారు. చంద్రబాబు పదిసార్లు ప్రధానిని కలిసినా రైల్వే జోన్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై సీఎంకానీ, పార్టీ నేతలు కానీ ఆలోచించడం లేదని, కొద్దిరోజులు ఆగితే రైల్వేజోన్‌ను కూడా మర్చిపోవడమే అని అన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలతో సరిపెడుతున్నారన్నారు. -
టీడీపీలో టీటీడీ చైర్మన్ పదవి చిచ్చు
అమరావతి: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో అప్పుడే చిచ్చు మొదలైంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారు. అవసరం అయితే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధం అయ్యారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు పది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంతకు ముందు కూడా రాయపాటి తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు దక్కుతుందనుకున్న టీటీడీ ఛైర్మన్ పదవి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు కనుమూరి బాపిరాజుకు దక్కడంతో అప్పట్లోనే ఆయన పార్టీ వీడాలనుకున్నారు. తర్వాతి పరిణామాలలో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు ఆశాభంగం తప్పలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన చదలవాడ కృష్ణమూర్తికి ఆ ఛాన్స్ దక్కింది. దాంతో మరోసారి రాయపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆ పదవి దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న రాయపాటి సాంబశివరావుపై ఈసారి అయినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కటాక్షం లభిస్తుందో లేదో మరి. మరోవైపు ఇదే పదవిపై కన్నేసిన ఎంపీ మురళీమోహన్ కూడా తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్న విషయం తెలిసిందే. ఇందు కోసం మురళీమోహన్.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక టీటీడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వాన్ని నియమించనుంది. కాగా ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి రాయలసీమ నేత కావడంతో ఈసారి టీటీడీ చైర్మన్ పదవి కోస్తా జిల్లాల వారికే కేటాయించాలని డిమాండ్ తెరమీదకు వస్తోంది. మరి వెంకన్న స్వామి ఎవరిని కరుణిస్తాడో చూడాలి. -
పెద్దళ్లు ఎవరూ ఇబ్బంది పడలేదు: రాయపాటి
గుంటూరు : పెద్దనోట్ల రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులే ఇబ్బందిపడ్డారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ నోట్ల రద్దు సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పెద్దోళ్లు ఎవరూ నగదు రద్దు వల్ల ఇబ్బంది పడలేదని రాయపాటి వ్యాఖ్యానించారు. ఇక సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ వ్యవహారంపై వివాదం సరికాదని ఆయన అన్నారు. ఏదైనా ఉంటే పార్టీలో చర్చించుకోవాలనే కానీ, పబ్లిక్కు ఎక్కడం సరికాదని రాయపాటి అభిప్రాయపడ్డారు. కాగా ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
వాడే.. వాడే అందుకు కారణం!
-
అయోమయంలో ఉన్నా: డొక్కా
తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా.. లేదా రాయపాటి సాంబశివరావుతో కలిసి టీడీపీలో చేరాలా అన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నానని ఏపీ పీసీసీ కో ఛైర్మన్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ అంశంపై రెండు రోజులుగా సంఘర్షణ అనుభవిస్తున్నానని, రేపు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ గురువైన రాయపాటితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. రాయపాటి సాంబశివరావుకు మరో ఆప్షన్ లేకపోవడం వల్లే ఆయన టీడీపీలోకి వెళుతున్నారని, ఆయనపై విధించిన బహిష్కరణను హైకమాండ్ ఎత్తివేసి ఉండాల్సిందని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా, తాను ఏ పార్టీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం తాటికొండ నుంచి పోటీ చేయబోనని తెలిపారు. -
'తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడాలోచిస్తా'
గుంటూరు : రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ బహిష్కత ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనను బహిష్కరించిందని, ఒకవేళ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కొత్తపార్టీ రాబోతుందని, ఆ పార్టీ తరపునే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రాయపాటి తెలిపారు. కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ సీమాంధ్ర ద్రోహి అని ఆయన మండిపడ్డారు.