పెద్దళ్లు ఎవరూ ఇబ్బంది పడలేదు: రాయపాటి | Rayapati sambasivarao comments on demonetisaion | Sakshi

‘పెద్దళ్లు ఎవరూ ఇబ్బంది పడలేదు’

Dec 28 2016 6:56 PM | Updated on Sep 4 2017 11:49 PM

పెద్దళ్లు ఎవరూ ఇబ్బంది పడలేదు: రాయపాటి

పెద్దళ్లు ఎవరూ ఇబ్బంది పడలేదు: రాయపాటి

పెద్దనోట్ల రద్దుతో సామాన్యులే ఇబ్బందిపడ్డారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు.

గుంటూరు : పెద్దనోట్ల రద్దు చేస్తూ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులే ఇబ్బందిపడ్డారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ నోట్ల రద్దు సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పెద్దోళ్లు ఎవరూ నగదు రద్దు వల్ల ఇబ్బంది పడలేదని రాయపాటి వ్యాఖ్యానించారు.

ఇక సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ వ్యవహారంపై వివాదం సరికాదని ఆయన అన్నారు. ఏదైనా ఉంటే పార్టీలో చర్చించుకోవాలనే కానీ,  పబ్లిక్‌కు ఎక్కడం సరికాదని రాయపాటి అభిప్రాయపడ్డారు. కాగా ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement