భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య   | Man Commits suicide By Hanging From Tree In Guntur | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య  

Published Wed, Jan 27 2021 9:05 AM | Last Updated on Wed, Jan 27 2021 9:05 AM

Man Commits suicide By Hanging From Tree In Guntur - Sakshi

తాడికొండ: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో జరిగింది. తాడికొండ ఎస్‌ఐ జి.వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం మందపాడు గ్రామానికి చెందిన మేరుగ మరియదాసు(50)కి తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన నాగమణితో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కుమార్తెల వివాహాలు జరిపి అప్పుల పాలయ్యాడు. నిడుముక్కల గ్రామంలో ఉన్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని మరియదాసు తన భార్యకు చెప్పగా నాగమణి అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ గుంటూరులో వేర్వేరుగా ఉంటున్నారు. మంగళవారం  నిడుముక్కల గ్రామానికి వచ్చిన మరియదాసు వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటాద్రి తెలిపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement