tadikonda
-
చంద్రబాబు వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశారు
-
తాడికొండ టీడీపీలో కాకరేపుతున్న వివాదం.. అక్కడ ఏం జరుగుతోంది?
సాక్షి, గుంటూరు జిల్లా: తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఫ్లెక్సీల వివాదం కాకరేపుతోంది. చంద్రబాబు మేడికొండూరు పర్యటనలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమయ్యింది. బాబు రాక సందర్భంగా టీడీపీ నేత తోకల రాజవర్థన్‌రావు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్ ఆ ప్లెక్సీలను తీయించివేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన తోకల రాజవర్థన్‌రావు వర్గీయులు.. తెనాలి శ్రావణ్‌కుమార్‌తో పాటు అతని అనుచరులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’ -
కులవాదులకు తగిన శాస్తి తప్పదు
తాడికొండ: తమకు హక్కులు అందకుండా కుట్ర పన్నుతున్న కులవాదులకు తగిన శాస్తి తప్పదని, కోర్టులో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోపోతే బాబు అండ్ కోను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 691వ రోజుకు చేరుకున్నాయి. పలువురు ప్రసంగిస్తూ, కులవాదమే అజెండాగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలో టీడీపీ నాయకులు, ప్యాకేజీ పార్టీలు, దళిత దళారులు మినహా ప్రజల మద్దతు లేదన్నారు. అధికారంలో ఉండి భూములిచ్చిన రైతులకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నట్టేట ముంచిన చంద్రబాబును నిలదీయకుండా ఉండేందుకు ముందస్తు ఎత్తుగడతో అమరావతి ఉద్యమం పేరుతో దొంగ దీక్షలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. అరసవెల్లి పేరుతో చందాల యాత్రలకు శ్రీకారం చుట్టిన అమరావతి జేఏసీ నాయకులకు కోట్లాది రూపాయలు ఎక్కడనుంచి అందుతున్నాయో నిఘా వేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎత్తుగడలు వేస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సమితి నాయకులు గురునాథం, సాంబయ్య, జోషి, ఈపూరి ఆదాం, దాసు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం) -
Guntur: కంతేరులో నల్లపు సునీత ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ చేస్తున్న స్వార్ధ రాజకీయాలపై మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత గొడవను రాజకీయరంగు పులమడంపై మనస్థాపం చెందిన నల్లపు సునీత అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, సోమవారం రోజున నల్లపు సునీత మాట్లాడుతూ.. రెండు కుటుంబాల మధ్య గొడవకు రాజకీయ రంగు పులిమి తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాడికొండ మండలం కంతేరుకు చెందిన బాధితురాలి తల్లి నల్లపు సునీత ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వచ్చిన గొడవకు, టీడీపీ నాయకులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తానూ టీడీపీకి చెందిన మహిళనేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చూపించారు. తనతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వారిని కూడా బయటకు లాగి తప్పుడు కేసులు పెట్టించడం దుర్మార్గమని అన్నారు. ఆడపిల్లపై బురదచల్లి రోడ్డుపైకి లాగడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భర్తలేని తను చిన్న టీ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నానని, ఆడపిల్లకు పెళ్ళి చేయాలంటే తన పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రక్షణ కల్పించి, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: (యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్లో..) -
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్లో..
కంతేరు(తాడికొండ): తాడికొండ మండలం కంతేరు గ్రామంలో టీడీపీ కార్యకర్త కర్లపూడి వెంకాయమ్మ కొడుకు వంశీ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య రెండురోజులుగా వివాదం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం వెంకాయమ్మ, ఆమె కొడుకు వంశీ ఆ యువతి కుటుంబ సభ్యులపై తిట్లదండకం అందుకున్నారు. దాడికి యత్నించారు. వారి నుంచి రక్షణగా యువతి కుటుంబ సభ్యులు ఎదురుదాడికి యత్నించారు. దీంతో రాజకీయ రంగు పులిమేందుకు టీడీపీ నేతలు యత్నించారు. వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలూ ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడినట్టు చెబుతున్న వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు ఒక్కొక్కరిగా టీడీపీ నేతలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ వెంకటాద్రితో వాగ్వివాదానికి దిగారు. యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నా పట్టించుకోకుండా వెంకాయమ్మ కొడుకుపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ వాదనకు దిగారు. చదవండి: (ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! ) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ కలిపి వెంకాయమ్మతో మాట్లాడించి ఎల్లో మీడియా ఎదుట లేనిది ఉన్నట్లు సృష్టించే యత్నం చేశారు. బాధితురాలి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి వత్తాసు పలుకుతారా.. అంటూ టీడీపీ నేతలను నిలదీశారు. దీంతో ఓ దశలో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలకూ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. -
‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి..
Mother Kills Her Baby: పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్నతల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది పాపను పరిశీలించి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. మంగళవారం పాప నోటి నుంచి నురగ వస్తోందని తల్లి బొంతా లక్ష్మి సమాచారమివ్వగా వైద్యసిబ్బంది వెళ్లి జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. సాయంత్రం మళ్లీ పాపను చూసేందుకు వెళ్లారు. దీంతో పాప చనిపోయిందని, ఖననం కూడా చేశామని తల్లి సమాధానమిచ్చింది. అనుమానమొచ్చిన ఏఎన్ఎం స్వప్న నిలదీయగా తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో తానే పాప గొంతులో వేలుపెట్టి చంపేసినట్టు నేరం అంగీకరించింది. ఈ విషయం కాగితంపై రాసి సంతకం పెట్టిన లక్ష్మి దీని గురించి ఎవరికైనా చెబితే తన చావుకు ఏఎన్ఎం కారణమని పేరు రాసి చస్తానని బెదిరించినట్టు స్వప్న ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గ్రంధి వెంకటాద్రి తెలిపారు. చదవండి: Omicron Variant Symptoms In Telugu: కొత్తవేరియంట్ లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి! -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
తాడికొండ: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో జరిగింది. తాడికొండ ఎస్ఐ జి.వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం మందపాడు గ్రామానికి చెందిన మేరుగ మరియదాసు(50)కి తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన నాగమణితో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కుమార్తెల వివాహాలు జరిపి అప్పుల పాలయ్యాడు. నిడుముక్కల గ్రామంలో ఉన్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని మరియదాసు తన భార్యకు చెప్పగా నాగమణి అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ గుంటూరులో వేర్వేరుగా ఉంటున్నారు. మంగళవారం నిడుముక్కల గ్రామానికి వచ్చిన మరియదాసు వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. -
పరంజ్యోతి రూపంలో దర్శనమిచ్చే..
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఓ అపురూప క్షేత్రం తంటికొండ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందీ ఆలయం. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ క్షేత్రంలో స్వామి వారి ఆవిర్భావం వెనుక పురాణ గా«థ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ కొండ మీద అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాలంలో ఆ పుణ్య పురుషులంతా తమ తపశ్శక్తిని ఈ కొండపై ధార పోశారట. అనంతరం వారు ఇక్కడ అపూర్వమైన జ్ఞానాన్ని అందుకున్నారట. తర్వాత నేతాజీ కళా సమితి అనే నాటక సమాజం వారు ఈ కొండపై ఏకాహాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఇక్కడ ఓ దివ్యమైన తేజస్సు సాకారమైందట. ఆ కాంతి పుంజాన్ని శ్రీనివాసుని స్వరూపంగా భక్తులు భావించి ఈ కొండపై ఆలయాన్ని నిర్మించారు. తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారు 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం విలసిల్లుతోంది.1961 సంవత్సరంలో ఈ కొండపై స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్టించి అప్పటి నుంచి స్వామి వారిని సేవించుకుంటున్నారు. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి వారు దర్శనమిస్తారు. స్థానక భంగిమలో ఉన్న స్వామి వారిని మాఘ శుద్ధ పంచమి నాడు ప్రతిష్టించారు. బద్దిరేద్ది శేషామణి అనే భక్తురాలికి స్వామి కలలో కనిపించి తాను పరంజ్యోతి రూపంలో సాకారమవుతానని చెప్పారట. అనంతరం నేతాజీనాటక సమితి నిర్వహించిన ఏకాహం తరువాత స్వామి జ్యోతిగా సాకారమిచ్చారట. అనంతరం మరో భక్తురాలికి తన అర్చావతార మూర్తుల గురించి వివరాలు చెప్పినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఏటా మాఘ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఇచ్చే మహత్తర క్షేత్రమిది. ఎలా చేరుకోవాలి? ఈ ఆలయానికి చేరుకోవడానికి రాజ మహేన్ద్రవరం వరకు వచ్చి అక్కడ నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోకవరం చేరుకోవాలి. గోకవరం నుంచి ఏదైనా వాహనంలో ఆలయానికి చేరుకోవచ్చు . – దాసరి దుర్గా ప్రసాద్, పర్యాటక రంగ నిపుణులు -
‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’
హైదరాబాద్/తాడికొండ: అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఏబీఎన్ చానెల్ అధినేత రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్మీ’ అని చంద్రబాబు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా దొరికినప్పుడు దాన్ని ప్రసారం చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి చానెల్లో వాటా ఉండటమే దీనికి కారణమన్నారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు బాగా అర్థమవుతోందన్నారు. మీ చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు.. చదువుకోరు అని కించపరిచారని గుర్తుచేశారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్సైట్లో పెడితే మీరు బాధపడరా అని రాధాకృష్ణను ప్రశ్నించారు. ‘ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోండి. నాకు వైఎస్ జగన్ రాజకీయ భిక్ష పెట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుంది’ అని శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు. -
అంతులేని విషాదం
గుంటూరు, తాడికొండ: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. నాలుగు మెతుకులు సంపాదించడానికి పిల్లలను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే సారి ముగ్గుర్ని బలిగొని ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన తాడికొండ మండలం లాం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ సెల్‌ఫోన్ వెనక్కి ఇద్దామనుకొనే ప్రయత్నంలో ఒంటి చేతితో వాహనం నడపడం, అతివేగంతో వెళ్లడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మృతితోపాటు మరో ఐదురుగు గాయాలపాలయ్యారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసే వీరందరిదీ ఒక్కో గాథ. పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడిని వెంట బెట్టుకొని పనికి వెళదామని ఆటోలో మోతడక నర్సరీలలో పని చేసేందుకు బయలుదేరిన షేక్ దరియాబీ కుమారుడు దరియావలి (12) ప్రమాదంలో ఛాతి, పొట్టలో బలమైన గాయం కావడంతో అసుపత్రికి చేరుకొనేలోపుగా మరణించాడు. మరో కుటుంబానికి చెందిన మృతురాలు రాయపూడి భారతి(28) 2వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల కుమారుడు సంతోష్‌ను వెంటబెట్టుకొని వెళుతుండగా తలకు బలమైన గాయం కావడంతో అమె ఆసుపత్రికి చేరుకొనేలోగా ప్రాణాలొదిలింది. కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరో మృతురాలు మాతంగి నాగేంద్రమ్మ (52) అనే మహిళ తీవ్ర గాయాలతో జీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈమె కోడలు ఎస్తేరు రాణికీ తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతుండగా ఇంటివద్ద ఎత్తుకొనేందుకు ఎవరూ లేరని వెంట తీసుకెళ్లిన 2 సంవత్సరాల కుమారుడు చిన్నారి అరుణ్ తేజ్ కూడా ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్తేరు రాణి చెల్లలు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. మృతురాలు నాగేంద్రమ్మకి నలుగురు కుమారులు. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన ఈమె వ్యవసాయ పనుల నిమిత్తం 7 సంవత్సరాల నుంచి చిన్న కుమారుడు వద్దే ఉండి కూలి పనులకు వెళుతోంది. ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో నిర్జీవంగా పడి ఉన్న తీరు అందరినీ కలచివేసింది. ఘటనకు కారణమైన ఆటో డ్రైవర్‌ది నిడుముక్కల గ్రామం కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కలెక్టర్ పరామర్శ గుంటూరు ఈస్ట్: లాం సంమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల బంధువులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మంగళవారం పరామర్శించారు. -
మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఎమ్మెల్యే
సాక్షి, గుంటూరు: పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని హైవేపై కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రగాయాలై రక్తపుమడుగులో పడిఉన్నాడు. అయితే అప్పటికే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి రోడ్డు ప్రమాదంపై సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనాస్థలికి వెళ్లిమరీ క్షతగాత్రుడిని పరీక్షించారు. అంబులెన్స్‌ను రప్పించి మరీ బాధితుడికి ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఎమ్మెల్యే శ్రీదేవి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. -
‘మొక్క’ తొడిగిన ‘పచ్చని’ ఆశయం
పచ్చదనం పెంపుదలే ధ్యేయంగా వనమహోత్సవ యజ్ఞంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద జరిగిన 70వ వనమహోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ యజ్ఞంలో పాల్గొని వేప మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా అన్ని శాఖల సహకారంతో కృషిచేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడు మొక్కలు నాటితే భవిష్యత్తు తరాలు భద్రమైన జీవితాన్ని గడపగలుగుతాయని అన్నారు. ఈ మేరకు సభాప్రాంగణంలో ఉన్న వారందరితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. సాక్షి, తాడికొండ(గుంటూరు) : జాతీయ అటవీ చట్టం ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు పెంచడమే లక్ష్యంగా పచ్చదనం పెంపొందించడానికి అన్ని శాఖల సహకారంతో ఈ ఏడాది రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 70వ వన మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో శనివారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ భూమి మీద పచ్చదనం లేకపోతే భవిష్యత్తులో అంతా ఎడారిగా మారిపోతుందని, పంచభూతాలను మనం పరిరక్షించుకోవాలని అన్నారు. ఏలిన వారు మంచివారైతే...: మంత్రి బాలినేని రాష్ట్రాన్ని పచ్చదనం చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో వరుణుడు కూడా కరుణించాడని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వర్షాలు లేవని, పెద్దలు అన్న రీతిలో ఏలిన వారు మంచివారైతే వర్షాలు పడతాయని జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి సాగర్, శ్రీశైలం ఇతర ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని రాష్ట్ర ఇంధన వనరులు, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హరితాంధ్రప్రదేశ్ చేయాలని కలలు కన్నారని, నేడు జగన్ మోహన్‌రెడ్డి హయాంలో ఆ కల నెరవేరనుందన్నారు. అటవీ శాఖకు సంబంధించి ఎర్ర చందనం నిల్వలు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడ స్మగ్లింగ్ చేసి దోచుకున్న పరిస్థితులు గతంలో ఉన్నందున ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహనరెడ్డి వచ్చిన తరువాత ఎర్ర చందనం కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారన్నారు. ఎర్రచందనం అమ్మేందుకు అనుమతివ్వాలని కేంద్ర మంత్రిని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కంఫా నిధులు రూ.1734 కోట్లు అందుబాటులోకి వచ్చాయని వాటిని సద్వినియోగం చేసి రాష్ట్రంలో విస్తారంగా పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తానన్నారు. శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు, తుడిచే నాయకుడు జగనన్న శ్రామికుల కష్టాలు, కన్నీళ్లు తుడిచే నాయకుడు వైఎస్ జగనన్న అని, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాజధానిలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తాడికొండ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అధికారులకు ఆయుధాలు, పురస్కారాల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఆయుధాలు పంపిణీ చేశారు. చిత్తూరు ఈస్ట్ డివిజన్ ఎఫ్ఎస్వో చినబాబు, ఆర్.సలాఉద్దీన్, ఎఫ్‌డీవో లక్ష్మీ ప్రసాద్, పి.కామేశ్వరరావు, ఎస్.రవిశంకర్ తదితరులకు ఆయుధాలను పంపిణీ చేశారు. విధుల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన 80 మంది అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, విడదల రజని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కిలారి వెంకట రోశయ్య, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు. సామినేని ఉదయభాను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు–2 సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, పార్టీ నాయకులు నూతలపాటి హనుమయ్య, కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఎంకు బోన్సాయ్ మొక్కను బహూకరిస్తున్న మంత్రి బాలినేని సభ కొనసాగిందిలా... • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి మొక్కలనే పుష్పగుచ్ఛంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ అందజేశారు. • సీఎం ప్రసంగం ప్రారంభించే సమయంలో మహిళలు, విద్యార్థులు సీఎం, సీఎం అంటూ ఉత్సాహభరితంగా చేతులు పైకెత్తి కేరింతలు కొట్టడంతో ఆయన ఉత్సాహంగా నవ్వుతూ ప్రసంగం ప్రారంభించారు. • ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సభా ప్రాంగణంలో ఉన్నవారందరితో ప్రతిజ్ఞ చేయించారు. • అటవీ శాఖ తరఫున ముఖ్యమంత్రికి మంత్రి బాలినేని చేతుల మీదుగా పలువురు అధికారులు బోన్సాయ్ ప్లాంట్‌ను బహుమతిగా అందజేశారు. • కార్యక్రమం చివరిలో జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. -
వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి
సాక్షి, తాడికొండ: తాడికొండ ఎస్సై రాజశేఖర్ వైఖరి నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులకు ఎస్సై తొత్తుగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఏ ఒక్క పక్షానికి కొమ్ముకాయకూడదన్న కనీస ధర్మాన్ని విస్మరించి పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా ఎస్సై వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులు, శ్రేణులు తప్పులు చేసి ఠాణాకు వచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు టీడీపీపై ఉన్న ప్రేమానురాగాలు పరాకాష్టకు చేరాయి. కంతేరు గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారంలో టీడీపీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నల్లమట్టిని తరలిస్తున్న ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్ నిర్వాహకుడిని బంధించి వారితో వైఎస్సార్ సీపీ నాయకులే మట్టి తరలించమని చెప్పారని చెప్పించేందుకు తీవ్రంగా యత్నించారు. ఇందులో భాగంగా కంతేరు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి వీడియోలు తీస్తూ బెదిరించిన వ్యవహారం బయటకు రావడంతో తాడికొండ వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి ఎస్ఐ రాజశేఖర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్సై పక్కన పడేశారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కేసు నమోదు చేయడం గమనించాల్సిన విషయం. గతంలోనూ ఇదే పరిస్థితి.. ఎస్సై రాజశేఖర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలోనూ వాస్తవాలు పక్కనపెట్టి కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులను వేధింపులకు గురిచేశాడు. 2018 జనవరిలో వైఎస్సార్ సీపీ నాయకుడిపై సోషల్ మీడియా కేసు బనాయించి కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. బండారుపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు టపాసులు కాల్చుతూ రాకెట్‌కు చంద్రబాబు నరకాసురుడు అని రాసి పైకి ఎగరేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటుపల్లి రాంబాబుపై టీడీపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఓ వ్యక్తితో నామమాత్రపు ఫిర్యాదు ఇప్పించి అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించారు. కానీ నాడు సంబంధిత వీడియోలో కేసు నమోదు చేసిన వ్యక్తులు కానీ టపాసులు కాల్చిన చిన్నారులు కానీ కనిపించలేదు. కేవలం కేసు నమోదు చేసిన వ్యక్తి ఫేస్బుక్లో ఆ వీడియోను షేర్ చేశాడనే నెపంతో అక్రమ కేసు బనాయించడం విశేషం. ఘటనపై స్పందించిన నాటి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీక్రిస్టినా, సురేష్ కుమార్ దంపతులు రాత్రి 12 గంటల వరకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేసినా కనీసం స్పందించిన దాఖలా లేదు. నేడు అందుకు విరుద్ధం.. నాడు రాంబాబు తప్పు లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసిన ఎస్సై నేడు టీడీపీ నాయకులు మట్టి తరలింపు వ్యవహారంలో ట్రాక్టర్ డ్రైవర్లు, వెంచర్ యజమానిని వేధిస్తూ పక్కా ఆధారాలతో దొరికినా వారిపై కేసు నమోదు చేయడం లేదు. ఇది ఎస్సై ఏకపక్ష ధోరణికి ప్రత్యేక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చదవండి: వివాదాస్పదంగా ఎస్ఐ వినోద్ వ్యవహారశైలి -
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
-
అందుకే వార్ వన్‌సైడ్: ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ప్రజలు భావించారని, అందుకే ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అయిందని తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రజలందరూ కూడబలుక్కుని వైఎస్సార్ సీపీకి ఓటు వేశారనిపిస్తోందన్నారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర తిరగరాశారన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గత అయిదేళ్ల పాటు అబద్ధాలు చెప్పారంటూ శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మలేదని అందుకే తమ ఓటు హక్కు ద్వారా సరైన గుణపాఠం చెప్పారన్నారు. తాడికొండ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్నారన్నారు. అందుకే ఆయన రాజధాని కూడా ఇక్కడ పెట్టారన్నారు. తుళ్లూరు పరిధిలోని 19 గ్రామాలు టీడీపీకి కంచుకోట అని, అలాంటి చోట వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగురవేసిందన్నారు. ఇక రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టీడీపీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కాకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. పేదలకు పక్కా ఇళ్లు కూడా ఇవ్వలేదని, వృద్ధులకు కనీసం పింఛన్లు కూడా సరిగ్గా అందించలేదన్నారు. ప్రజలందరూ మార్పు కోరుకున్నారని అందుకే వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది -
ఎన్నికల అక్రమాలపై సీ-విజిలెన్స్
సాక్షి, తాడికొండ : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు పలు ఎత్తుగడలు వేస్తారు. ప్రచారం ఊపందుకొన్న నాటి నుంచి ఓటింగ్ జరిగేంత వరకు డబ్బు, మద్యం ఎరజూపి ఓటర్లను మభ్య పెడుతుంటారు. అంతటితో ఆగకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎంతటి చర్యలకైనా వెనుకాడకుండా వారిని తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తారు. ఇలాంటి వారి ఆగడాలను అరికట్టి వాళ్లు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీ–విజిల్ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జరుగుతున్న అక్రమాలను సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంది. అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకొనే వీలుండదు సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన వారు తప్పించు కోవటానికి వీలుండదు. ఈ యాప్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎన్నికల కమిషన్ గోప్యంగా ఉంచుతుంది. గత ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యాప్‌ను ఉపయోగించి అధికారులు సత్ఫలితాలు సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో దీనిని అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఫిర్యాదు చేయడం ఇలా.. ఆండ్రాయిడ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో గూగూల్ ప్లేస్టోర్ నుంచి సీ–విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేయగానే వీడియో, ఫొటోలు అనే రెండు ఆప్షన్లు వస్తాయి. ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అక్కడ సెల్ఫోన్లో నుంచి వీడియోల లేదా ఫొటోలు తీసి యాప్ ద్వారా పంపించవచ్చు. మద్యం, డబ్బుతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు పెట్టటం వంటివి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత ఎన్నికల అధికారి లేక ఫ్లయింగ్ స్కాడ్స్కు సమాచారం అందిస్తారు. కేవలం 25 నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరుకొని అక్కడ విచారణ చేపడతారు. విచారణ అనంతరం ఫిర్యాదుదారునికి వారు పూర్తి చేసిన కార్యచరణను మెసేజ్ రూపంలో అందిస్తారు. ఈ తతంగం అంతా 100నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసివారి పేర్లు ఎక్కడా బహిర్గతం కావు. పౌరులుగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవటానికి ఓటరుకు బ్రహ్మాస్త్రం సీ–విజిల్. -
తాడికొండతో...తరాల అనుబంధం
సాక్షి, తాడికొండ : గుంటూరు జిల్లాలో ప్రధాన పార్టీల తరుఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులే అధికంగా పోటీ చేయడం విశేషం. మొత్తం 8 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుంటూరు ఎంపీగా వైఎస్సార్ సీపీ తరఫున తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల ఎంపీగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన నందిగం సురేష్ బరిలో నిలిచారు. ఇక అసెంబ్లీ అభ్యర్థులుగా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికత కోటాలో తాడికొండ నియోజకవర్గానికి ఉండవల్లి శ్రీదేవి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, పెదపరిమి గ్రామానికి చెందిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాడికొండ గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో సారి ఎన్నికలకు వెళ్తున్నారు. సీపీఐ తరుఫున మంగళగిరి నుంచి తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రావెల కిషోర్‌బాబుది తాడికొండ మండలం రావెల గ్రామమే. -
తాడికొండలో పాగా ఎవరిదో..?
సాక్షి,గుంటూరు : ఎందరో ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ అధికారులు, వైద్యులు, విద్యావేత్తలను సమాజానికి అందించిన చదువుల కర్మాగారం తాడికొండ గురుకుల పాఠశాల.. ఆంధ్రా రోమ్‌గా కీర్తిపొందిన పుణ్యభూమి ఫిరంగిపురం.. చిరుధాన్యాల పరిశోధన కేంద్రంగా ఏర్పాటై ఎన్జీరంగా విశ్వవిద్యాలయంగా అవతరించిన లాంఫాం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నియోజకవర్గం తాడికొండ. ఇది తొలి నుంచి సెంటిమెంట్ నియోజకవర్గంగా జిల్లాలో పేరు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేది. రాష్ట్ర విభజనానంతరం కూడా ఈ సెంటిమెంటే కొనసాగింది. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ప్రసిద్ధ ఆలయంగా భాసిల్లుతూ రాష్ట్రంలోనే ప్రధాన చర్చిగా కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు జరుపుకొనే ఎత్తయిన చర్చిగా ప్రత్యేకతను సంతరించు కొని ఆంధ్రా రోమ్‌గా కీర్తిపొందిన ఫిరంగిపురం తాడికొండ నియోజకవర్గంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. బాల ఏసు కొలువైన ఫిరంగిపురం కథెడ్రల్ దేవాలయానికి 125 ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది. చదువులమ్మ నిలయం తాడికొండ గురుకులం 1970వ దశకంలో తాడికొండలో ప్రారంభమైన బేసిక్ ట్రైనింగ్ స్కూల్ కాలగమనంలో గురుకుల పాఠశాలగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఏడు జిల్లాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులు ఇక్కడ చదువుకునేవారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులకు నిలయంగా మారిన తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకున్న వారిలో ఐఏఎస్ అధికారులు కాంతీలాల్ దండే, ధర్మారావు, పార్వతీపురం ఎంపీగా సేవలు అందించిన డి.వి.జి.శంకరరావు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మండవ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. వ్యవసాయ క్షేత్రం లాంఫాం తాడికొండ మండలం లాం గ్రామంలో 1942లో చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ప్రైవేటు గృహంలో కొనసాగింది. తదనంతర కాలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంగా రూపాంతరం చెందింది. అపరాల పరిశోధనతో పాటు పత్తి, ఉద్యాన పరిశోధనా స్థానాలు ఇక్కడ రైతులకు ఎన్నో సేవలు అందించాయి. రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయ విశ్వ విద్యాలయంగా లాం పరిశోధనా స్థానాన్ని ప్రకటించడంతో రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు ఇక్కడ నుంచే కొనసాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు ఇక్కడ ఏర్పాటు చేసిన పశు పరిశోధనా కేంద్రంలో బ్రీడ్ ఉత్పత్తి జరుగుతోంది. తొలినుంచి సెంటిమెంట్‌కే పట్టం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజధాని నియోజకవర్గమైన తాడికొండ ఉత్కంఠ రేపుతోంది. తొలినుంచి సెంటిమెంట్ నియోజకవర్గంగా పేరొందిన తాడికొండలో ఏ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో అదేపార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రలో కూడా పునరావృతం అయింది. 1972 ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న తాడికొండ 1978 ఎన్నికలకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. అమలుకాని ప్రభుత్వ హామీలు జ కొండవీటి వాగు ముంపు నుంచి పంటలను కాపాడేందుకు వాగు పూడికతీత పనులు చేపడ్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరలేదు. జ తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురంతో పాటు రాజధాని పూలింగ్‌లోకి తీసుకున్న గ్రామాల్లో సైతం ఎన్నికల్లో హామీ ఇచ్చిన తాగునీటి సమస్య పరిష్కారానికి నోచలేదు. వేసవి కాలం వస్తే పలు గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఉంది. ప్రభుత్వం విఫలమైంది ఇలా... నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలం మంజూరుచేయలేదు. పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు అధికారుల అండదండలతో స్థలాలను ఆక్రమించుకొని అక్రమంగా ఇళ్లు నిర్మించి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనంతో అర్హులకు కూడా పింఛన్లు మంజూరవక వృద్ధులు వికలాంగులు, వితంతువులు ఇబ్బందిపడ్డారు. నీరు– చెట్టు పేరుతో టీడీపీ నాయకులు గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి, ఇసుక దోచేశారు. వాటాల పంపకంలో తేడాలు రావడంతో రోడ్డున పడి తిట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. వివిధ కార్పొరేషన్ల రుణాలు అనర్హులకు అందాయి. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అనుయాయులకే కట్టబెట్టి రైతులను విస్మరించారు. రాయితీ ఎరువులు, విత్తనాల సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు టీడీపీ అంటేనే మండిపడుతున్నారు. మండలాల వారీగా ఓటర్ల వివరాలు మండలం మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు తాడికొండ 53,241 27,253 25,985 తుళ్ళూరు 45,368 21,855 23,513 మేడికొండూరు 44,681 22,155 22,522 ఫిరంగిపురం 50,068 24,744 25,324 వైఎస్సార్ కాంగ్రెస్‌వైపే ఓటర్ల మొగ్గు రాజధాని అమరావతి పేరిట భూ సమీకరణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు ఐదేళ్లుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష పనితీరు, అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. తొలి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది. నేడు కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగరేయడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి స్థానికురాలు కావడం, ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావుకు స్థానికంగా గట్టి పట్టు ఉండటంతో ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హవా చాటిన స్థానికేతరులు తాడికొండ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి పురుషులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో మహిళా అభ్యర్థిగా కత్తెర హెనీక్రిస్టినాకు అవకాశం ఇచ్చింది. అయితే ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ పార్టీ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని మరోసారి అభ్యర్థిగా బరిలో నిలిపింది. జనరల్ కేటగిరీలో ఉండగా గద్దె రత్తయ్య తుళ్లూరు మండలం మల్కాపురం నుంచి గెలుపొందగా తదనంతరం స్థానికేతరులే ఎక్కువసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో తాడికొండ గ్రామానికి చెందిన ఆడపడుచు ఉండవల్లి శ్రీదేవికి తాడికొండ ప్రజల ఆశీస్సులు మెండుగా లభిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. -
జనం నాడి తెలిసింది
సాక్షి, అమరావతి : ప్రభుత్వ బడిలో చదువుకుని డాక్టర్‌గా ఎదిగి పలు అవార్డులు పొందారు. అమ్మతనం లేక ఇబ్బందిపడుతున్న ఎందరికో మాతృత్వ వరం ప్రసాదించారు. పుట్టిన నేలకు,ప్రజలకు సేవా చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి సమస్యలను తెలుసుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకున్న తాడికొండ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అంతరంగం ఆమె మాటల్లోనే.. ‘మాది గుంటూరు జిల్లా తాడికొండ. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. అమ్మ వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. నాన్న ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ నుంచి రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైద్యురాలిగా రోగులకు సేవలందించా. రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చని భావించా. తాడికొండలో స్థానికేతరులే ఇప్పటివరకు పోటీ చేశారు. వైఎస్సార్సీపీలో మహిళలకు సముచిత స్థానం కల్పించారు. 40 ఏళ్ల తరువాత లోకల్ అభ్యర్థి, మహిళ, విద్యావంతురాలికి ఇక్కడ పోటీచేసే అవకాశాన్ని జగనన్న కల్పించి స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని చాటారు. 2వేల మందికి పైగా మాతృత్వం ప్రసాదించా.. సంతాన లేమితో బాధపడుతున్న స్త్రీలకు పలు ప్రముఖ మీడియా చానల్స్‌లో ఇంటర్వ్యూల ద్వారా కూడా చైతన్యం కలిగించా. రెండువేల మందికి పైగా స్త్రీలకు అమ్మతనం కలిగించాననే తృప్తి ఉంది. నేను డీజీఓ ఫెలో ఇన్ ఏఆర్టీ క్లావండ్ క్లినిక్ ఓయోహో ఇన్ అమెరికాలో విద్యనభ్యసించాను. వైద్యరత్న, వైద్య శిరోమణి, అంబేడ్కర్ ఎక్సెలెన్స్తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నా. ఆప్యాయంగా పలుకరిస్తూ.. ఆశీర్వదిస్తున్నారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నన్ను స్థానిక మహిళను కావడంతో తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆప్యాయంగా పలుకరిస్తూ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. మా ఇంటి పెద్ద కూతురు వచ్చిందన్న ఆనందంతో ప్రజలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మేమంతా నీవెంట నడుస్తామని ముందుకు కదులుతున్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని దందాలే.. రాజధాని ప్రాంతంలో రైతులకు, రైతు కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి భూమిని తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇసుక మాఫియా, భూదందాలు, ఎస్సీ, ఎస్టీ భూములను ఆక్రమించుకోవడం, అసైన్డ్ భూములకు సరైన ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. భూమిలేని రైతు కూలీలకు భూసేకరణ చట్టం ప్రకారం రూ.9,400 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2,500 మాత్రమే ఇస్తున్నారు. సొంతిళ్లు నిర్మిస్తామని మోసం చేశారు. రైతులకు ప్లాట్లు కేటాయించామని చెబుతున్నా కాగితాల మీద తప్ప ఫీల్డ్‌లో కనిపించడం లేదు. కంపచెట్లు తప్ప ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. గ్రాఫిక్ డిజైన్లతో బాబు ప్రాంత ప్రజలను మోసగిస్తున్నారు. రాజకీయాలే సరైన వేదిక.. పుట్టిన గడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలనే కృతనిశ్చయంతోనే రాజకీయాల్లోకి వచ్చా. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాకు ఆదర్శం. రూపాయి డాక్టర్‌గా, మేనిఫెస్టోలో లేకపోయినా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహానుభావుడు. జగనన్న పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి సమస్యలను తెలసుకున్నారు. ఆయన సీఎం అయితేనే పేద ప్రజలతో పాటు అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని విశ్వసిస్తున్నా. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణాన్ని ఆయనలో గమనించా. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిరంతరం వారికి అందుబాటులో ఉండాలన్న ఆయన సూచనను పాటిస్తా. మెరుగైనవైద్యం.. తాడికొండ పరిధిలోని నాలుగు మండలాల్లో ఏరియా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తా. నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీతో అనుసంధానించి కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మిస్తా. విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తా. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో హైస్కూళ్లు లేని పరిస్థితి. మహిళల రక్షణపై దృష్టి పెట్టి సమాజంలో గౌరవం పెరిగేలా కృషి చేస్తా. ప్రతి గ్రామానికి కృష్ణా జలాలు తీసుకురావడంతోపాటు మినరల్ వాటర్ అందిస్తా. గ్రామాల్లో శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తా. రోడ్లు, బస్సు, కమ్యూనిటీ హాలు అందుబాటులోకి వచ్చేలా తెస్తా. 20 ఏళ్లు ప్రజల నాడి పట్టుకుని డాక్టర్‌గా వైద్య సేవ చేశా. వారంతా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. -
తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్‌లో చక్కర్లు కొడుతుందీ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్‌బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. -
తాడికొండలో పోటీకి ‘దేశం’ రెబల్ రెడీ
సాక్షి, తాడికొండ: స్థానిక తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మళ్లీ రేగింది. సీటు కేటాయింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట్లో ఓ నిర్ణయం... తరువాత మరో నిర్ణయం ప్రకటించడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. తొలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌ను వ్యతిరేకిస్తున్న జెడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు వర్గం ఆయనకు సీటు రాకుండా చేయడంలో తమ పంతం నెగ్గించుకున్నారు. అయితే, ఈ సంతోషం తాత్కాలికమే అయింది. అసమ్మతి వర్గానికి దీటుగా శ్రావణ్ అనుకూల వర్గం పావులు కదిపి తిరిగి సీటు శ్రావణ్‌కు ఇప్పించుకుని పూర్ణచంద్రరావు వర్గానికి షాక్ ఇచ్చారు. సీఎం నివాసం ముందు మూడు రోజుల పాటు నిరసన ధర్నాలు నిర్వహించడంతో పాటు నాలుగు మండలాల ఎంపీపీలు, ఇద్దరు మార్కెట్ యార్డు చైర్మన్లు, 44 మంది సమన్వయ కమిటీ సభ్యులు, మూడు మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వాసిరెడ్డి జయరామయ్య పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని సీఎంను బెదిరించారు. దీంతో పునరాలోచనలో పడిన ముఖ్యమంత్రి ఉన్న పళంగా మాల్యాద్రిని అక్కడి నుంచి తిరిగి బాపట్ల ఎంపీ స్థానానికి పంపి, పూర్ణచంద్రరావు వర్గానికి ఝలక్ ఇచ్చారు. తెనాలి శ్రావణ్‌ను తిరిగి అభ్యర్థిగా నిలపడంతో పూర్ణచంద్రరావు వర్గానికి ముద్ద మింగుడుపడటం లేదు. తమకు తీరని అవమానం జరిగిందని భావించిన అసమ్మతి వర్గం దూకుడు పెంచింది. ముందో మాట, వెనుకో బాట నడుస్తున్న అధినేత చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన నాయకులు ఆయనతో మాట్లాడినా తమకు ఒరిగేందేమీ లేదనుకున్నారో ఏమో.. మంగళవారం తాడికొండలోని యెడ్డూరి హనుమంతరావు నివాసంలో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. పెదపరిమి గ్రామ మాజీ సర్పంచ్ సర్వా యలమంద కుమారుడు సర్వా శ్రీనివాసరావును రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్న అనంతరం అనుకున్నదే తడవుగా జెడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు అనుచరగణంతో జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకొని రాజీనామాను సమర్పించేందుకు యత్నించినా కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోడంతో వెనుదిరిగారు. అయితే, తమ మనోభావాలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం బాధించిందని అసమ్మతి వర్గం వాపోతున్నారు. శ్రావణ్‌కుమార్‌కు సహకరించేది లేదని, రెబల్ అభ్యర్థిని ఇండిపెండెంట్‌గా బరిలో దించి గెలిపించుకుంటామంటూ చెబుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ 21వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధం కాగా టీడీపీలో నెలకొన్న అనిశ్చితి కారణంగా క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. సొంత పార్టీ నేతలే అసలు అభ్యర్థి ఎవరు, ఎప్పుడు నామినేషన్ వేస్తారు, ప్రచారం ఉందా లేదా అంటూ పలువురు బహిరంగంగా వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటుండటంతో టీడీపీకి క్యాడర్ బలహీనంగా మారుతుంది. రాజధాని సీటు కావడంతో వైఎస్సార్ సీపీ నాయకులు కలసికట్టుగా విజయం వైపుగా అడుగులు వేస్తున్నారు. -
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు
-
ఆయనకు టికెట్ ఇవ్వొద్దు; అమరావతిలో ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రావణ్ కుమార్‌ను వ్యతిరేకిస్తూ వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఆయన వ్యతిరేక వర్గం పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో వెంకటపాలెం చేరుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గం పాదయాత్రను అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.(టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు) కాగా గత కొంతకాలంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి పెరిగిపోతోంది. దీనిని నివారించేందుకు ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వారు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. -
టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న విబేధాలపై చర్చలు జరిపిన మంత్రులకు గట్టిషాక్ తగిలింది. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు గతకొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విబేధాలపై దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను మంత్రులు ప్రతిపాటి పుల్లరావు, నక్కా ఆనంద్‌బాబులకు అప్పగించింది. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో చర్చలు జరిపిన మంత్రులు.. వారి హెచ్చరికతో ఖంగుతిన్నారు. సమస్యల ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు కోరగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రావణ్‌కుమార్‌కు ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వద్దన్నదే తమ ఏకైక డిమాండ్ అని వారు మంత్రులకు తెల్చిచెప్పారు. గత ఎన్నికల్లో తామే చందాలు వేసుకుని శ్రావణ్‌కుమార్‌ను గెలిపించామని గుర్తుచేశారు. ఈ సారి మళ్లీ శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే మాత్రం తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో ఈ విబేధాలను పరిష్కరించడం మంత్రులకు తలనొప్పిగా మారినట్టు సమాచారం. -
మాటలు రానివాడంటే లోకేశ్..
సాక్షి, ఇచ్ఛాపురం: చంద్రబాబు దోపిడీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు సిండికేట్‌లా తయారయి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని భూముల నుంచి ఇసుక వరకు ప్రతిదాంట్లోనూ దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ‘అవినీతి చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం ఇచ్ఛాపురం వచ్చిన ఆమె ‘సాక్షి’టీవీతో మాట్లాడారు. ఇచ్ఛాపురం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నలుమూలల జనం నుంచి తరలిరావడంతో ఇసుక వేసినా రాలనంతగా జనం కనబడుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిని ఆమె ఎద్దేవా చేశారు. ‘మాటలు రానివాడంటే లోకేశ్, మాటలు చెప్తే అర్థంకాకపోతే ఆయన పవన్ కళ్యాణ్. మాట తప్పితే అది చంద్రబాబు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటారు కనుక తామంతా జగన్ వెంట ఉన్నామ’ని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు.