తాడికొండ (గుంటూరు) : తప్పుడు బిల్లులు చేయడానికి నిరాకరించిన పంచాయతీ కార్యదర్శితో సర్పంచ్ భర్త దురుసుగా ప్రవర్తించి ఆమెను గాయపరిచిన సంఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ రవికుమారి భర్త మహేశ్వరరావు.. భార్య స్థానంలో అనధికారిక సర్పంచ్‌గా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడవలసిందిగా.. తాను చెప్పిన ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సిందిగా.. గత కొన్ని రోజులుగా గ్రామ కార్యదర్శి కె.అనురాధపై ఒత్తిడి తెస్తున్నారు.
దీనికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ భర్త మల్లేశ్వరరావు చేతిలో ఉన్న ఫైల్స్‌ను విసురుగా ఆమె మీదకు విసిరాడు. అవి ఆమె కంటికి తగలడంతో ఆమె ముఖం వాచిపోయింది. దీంతో మండలంలోని కార్యదర్శులందరిని సంప్రదించిన అనురాధ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కార్యదర్శిపై సర్పంచ్ భర్త దాడి
Published Mon, Sep 21 2015 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement
Advertisement