సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ చేస్తున్న స్వార్ధ రాజకీయాలపై మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత గొడవను రాజకీయరంగు పులమడంపై మనస్థాపం చెందిన నల్లపు సునీత అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, సోమవారం రోజున నల్లపు సునీత మాట్లాడుతూ.. రెండు కుటుంబాల మధ్య గొడవకు రాజకీయ రంగు పులిమి తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాడికొండ మండలం కంతేరుకు చెందిన బాధితురాలి తల్లి నల్లపు సునీత ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వచ్చిన గొడవకు, టీడీపీ నాయకులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తానూ టీడీపీకి చెందిన మహిళనేనని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చూపించారు. తనతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వారిని కూడా బయటకు లాగి తప్పుడు కేసులు పెట్టించడం దుర్మార్గమని అన్నారు. ఆడపిల్లపై బురదచల్లి రోడ్డుపైకి లాగడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భర్తలేని తను చిన్న టీ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నానని, ఆడపిల్లకు పెళ్ళి చేయాలంటే తన పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రక్షణ కల్పించి, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చదవండి: (యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment