
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 125వ రోజు తాడికొండ నియోజకవర్గం, మేడికొండూరు మండలంలో కొనసాగింది. మహిళలు, యువతీయువ కులు అడుగడుగునా పూలవర్షంతో జగన్‌కు ఘన స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ఆలకిస్తూ, తానున్నానని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగారు. ప్రజా సంకల్ప యాత్ర శని వారం ఉదయం సరిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. వెలవర్తిపాడు, మేడికొండూరు, గుండ్లపాలెం క్రాస్ మీదుగా పేరేచర్ల వరకు 11.3 కిలోమీటర్ల మేర సాగింది.
పేరేచర్లలో జనసంద్రం
వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణ అధ్యక్షతన పేరేచర్లలో సాయంత్రం జరి గిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. జననేత వైఎస్ జగన్ ప్రసంగిం చేందుకు మైకు తీసుకుని పేరేచర్ల అనగానే సీఎం.. సీఎం.. అన్న నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. ‘తన నివాసానికి 500 గజాల దూరంలో, ఆధునిక యంత్రాలతో కృష్ణానదిలో ఇసుక తోడేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా’ అని జగన్ ప్రశ్నించగా.. ఆయనకు అంతా తెలుసంటూ ప్రజలు స్పందించారు. ‘రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు ఇంద్రలోకం చూపించారని, ప్రస్తుతం మాయాబజారు సినిమా, బాహుబలి సెట్టింగ్‌లతో సింగపూర్, జపాన్ తరహా రాజధాని అంటూ మభ్యపెడుతున్నారు’ అని విమర్శించగా,
ప్రజలు చేతులెత్తి ‘అవునన్నా’ అంటూ మద్దతు తెలిపారు. ‘తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేశారని, ఇంత కంటే దారుణమైన కుంభకోణం, అన్యాయం ఎక్కడైనా ఉంటుందా’ అని అడగ్గా.. ‘లేదు..లేదు..’ అంటూ జనం స్పందించారు. రాజధాని నిర్మించే ఉద్దేశం ఉంటే బాహుబలి సెట్టింగ్‌లు ఎందుకని జగన్ ప్రశ్నించారు. ఆర్కిటెక్‌కు కేటాయించాల్సిన పనిని సినిమా డైరెక్టర్‌కు అప్పజెప్పడం ఏమిటని ఎద్దేవా చేశారు. సీఎం తన ఇంటిని రాజధానిలో కాకుండా హైదరాబాద్‌లో ఎందుకు నిర్మించారంటూ దుయ్యబట్టారు. రాజ ధాని ప్రాంతసమస్యలపై జగన్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల్లో మంచి స్పందన లభించింది. రాజధాని భూములతో సీఎం వ్యాపారాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా ప్రసంగించారు.
సమస్యల వెల్లువ
పాదయాత్ర పొడవునా ప్రజలు తమ సమస్యలను జననేత జగన్‌కు విన్నవించారు. తన భర్త రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పనిచేశారని, అప్పట్లో ప్రభుత్వం 2.90 ఎకరాల భూమిని మిలటరీ కోటాలో ఇచ్చిందని, ఇప్పుడు ఆ భూమిని నీరు–చెట్టు పేరుతో తవ్వేశారని మేడికొండూరు గ్రామానికి చెందిన షేక్ ఆదాం కన్నీటి పర్యంతమయ్యారు. తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నామని వెలవర్తిపాడుకు చెందిన శివకుమారి తదితర మహిళలు వివరిం చారు. జన్మభూమి కమిటీల పెత్తనంతో సంక్షేమ పథకాలు అందడంలేదని షేక్ అమీర్‌సైదా ఆరోపించారు. ముస్లిం మైనార్టీ రుణాలు ఇవ్వడం లేదని సయ్యద్ రేష్మా విన్నవించారు. తాను అగ్రిగోల్డ్ ఏజెంటుగా గ్రామస్తుల నుంచి రూ.7 లక్షలు, తాను మరో రూ.3 లక్షల చొప్పున డిపాజిట్లు జమచేశామని వెలవర్తిపాడుకు చెందిన గుంటుపల్లి నర్సమ్మ తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ మూత పడటంతో డిపాజిట్లు చేసినవారు నిలదీస్తున్నారని, గ్రామంలో తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. తాము వైఎస్సార్ సీపీ మద్దతుదారులమంటూ తమకు పక్కా గృహం మంజూరు చేయడంలేదని అమరావతి మండలం యండ్రాయి గ్రామానికి చెందిన కాకి రమాదేవి వాపోయారు.
పాదయాత్రలో పాల్గొన్న నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణ, అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు హెనీ క్రిస్టీనా, కత్తెర సురేష్‌కుమార్, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గుంటూరు,
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు లావు శ్రీ
కృష్ణదేవరాయలు, నందిగం సురేష్ బాబు, మాజీ ఎంపీ బాలశౌరి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు, ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం సునీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment