
సాక్షి, గుంటూరు: పరిస్థితి ఏదైనా ప్రజాసేవే ముఖ్యమనుకున్నారు. చదువుకున్న దానికి, తాను నిర్వర్తించిన వృత్తికి న్యాయం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని హైవేపై కారు ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రగాయాలై రక్తపుమడుగులో పడిఉన్నాడు. అయితే అప్పటికే అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి రోడ్డు ప్రమాదంపై సమాచారం అందింది. హుటాహుటిన సంఘటనాస్థలికి వెళ్లిమరీ క్షతగాత్రుడిని పరీక్షించారు. అంబులెన్స్‌ను రప్పించి మరీ బాధితుడికి ప్రాథమిక వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఎమ్మెల్యే శ్రీదేవి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment