కార్యకర్తలకు అండగా ఉంటా
- వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి
మద్దికెర: తన భర్తను రాజకీయంగా ఎదుర్కోలేక హతమర్చారని అయినా కార్యకర్తలు అధైర్య పడొద్దని తాను ఎల్లావేళలా అండగా ఉంటానని చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి, వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. సోమవారం మొదటిసారిగా మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాలులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయన మరణం ఒంటరిని చేసిందని భావించానని అయితే ఇంతమంది ఆదరణ చూస్తుంటే అక్కలు, తమ్ముళ్లు, అన్నలు తోడు ఉన్నారనే ధైర్యం వచ్చిందన్నారు. నారాయణరెడ్డి నిత్యం ప్రజల గురించే ఆలోచించేవారని, ఏ చిన్న కష్టమొచ్చినా వెళ్లి పరామర్శించేవారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లాæ పనిచేసి పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దామన్నారు.
అనంతరం పలువరు మాట్లాడుతూ కొందరు బీసీ నాయకులమని చెప్పుకుంటూ బీసీలు ఎదగకుండా అణదొక్కుతున్నారన్నారు. నాడు చెరుకులపాడు నారాయణరెడ్డి పోటీ చేయకపోయి వుంటే నేడు పదవులు అలంకరించివుండేవారా అని ప్రశ్నించారు. నేడు అనుభవిస్తున్న మంత్రి పదవి నారాయణరెడ్డి బిక్షేనన్నారు. కార్యక్రమంలో నారాయణరెడి‍్డ సోదరుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ మురుళీధర్‌రెడ్డి, సర్పంచు లోకిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్‌రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున, బసినేపల్లి నీటిసంఘం మాజీ అధ్యక్షుడు భద్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు విష్ణు, చంద్రశేఖర్‌రెడ్డి, బాలచంద్ర, వెంకటరాముడు, గోపాల్ పాల్గొన్నారు.
20 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిక:
మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో సర్పంచు గంపల వెంకటేశులు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరాయి. తుమ్మిటి కృష్ణమూర్తి, డీలర్ అంజి, హనుమంతు, గోపాల్, హనుమన్నతోపాటు మరో 70 మంది పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రవిరెడ్డి, మహేష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుమల, విజయుడు, మంజు పాల్గొన్నారు.