– హాజరుకానున్న వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్స్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సంస్మరణ సభను బుధవారం చెరుకులపాడులోని ఆయన నివాసంలో నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి. మాజీ మంత్రి పార్థసారథి, పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నివాళ్లర్పించాలని ఆయన కోరారు.