సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ పరువును నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. నిన్న కళ్యాణదుర్గం.. నేడు సత్తెనపల్లి వరుసగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ సంస్థాగత కమిటీల విషయంలో తెలుగుదేశం నేతలు ఘర్షణ పడ్డారు.
కోడేల శివరాం, వైవీ ఆంజినేయులు వర్గాలు ఒకరిపై ఒకరు గొడవపడ్డారు. కుర్చీలతో కూడా కొట్టుకున్నారు. దీంతో సంస్థాగత నియామకాల సమావేశం రసాభాసగా మారింది. కోడెల శివరాం, జీవి ఆంజినేయుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. దీంతో కమిటీ మీటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజినేయులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
చదవండి: (అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు)
Comments
Please login to add a commentAdd a comment