kodela sivaram
-
కోడెల శివరామ్ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య
పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్ డీమార్ట్‌లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?
వాడుకుని వదిలేయడంతో చంద్రబాబును మించినవాళ్లు లేరు అనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. తనకు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తేసి తరువాత మొహం చాటేయడంతో ఆయన్ను మించినవాళ్లు లేరని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే వాస్తవానికి చంద్రబాబు అపారమైన ప్రేమ చూపిస్తారు. చూపిస్తారో నటిస్తారో తెలియదుకానీ.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇన్ని దెబ్బలు కాసినా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. బాబు శవ రాజకీయం.. ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం ఆయన కుమారుడు శివరామ్ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేటలో ఒక రోజు ఇలా మూడు రోజులు ఆయన శవంతో రాజకీయం చేశారు చంద్రబాబు. ఆ తరువాత శివరామ్‌ను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అంటూ రెండు.. రెండంటే రెండే.. కన్నీటి బొట్లు కుడికన్ను నుంచి కార్చి వెళ్లిపోయారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరామ్ గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరామ్‌కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేశారు. అదన్నమాట బాబుగారి వాడకం. శివమెత్తుతోన్న శివరామ్.. శని పట్టుకున్నా వదులుతుందేమో కానీ చంద్రబాబు పట్టుకుంటే మాత్రం వదలడు అనే నానుడి ఒకటి తెలుగు తమ్ముళ్లు తరచుగా చెప్పుకుంటారు. బతికి ఉండగా కోడెల శివప్రసాద్‌ను అనగదొక్కి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి కట్టబెట్టి మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నారు చంద్రబాబు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరామ్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి.. అదే స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను ప్రొజెక్ట్ చేయడంతో శివరామ్ శివాలెత్తి పోతున్నారు. ‘ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. మా కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా’ అని నేరుగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివరామ్. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఇనేళ్లు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరామ్ కూల్చేశాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు..సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరి దగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్‌ను పోలింగ్ రోజున ఇనుమేట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్తితి ఎదురైంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూసి సత్తెనపల్లిలో ఓటర్లు నవ్వుకుంటున్నారు. ప్రజల ప్రశ్నలు ఇవే.. - సత్తెనపల్లి ఎవరి ఆస్తి? - మేమే పాలిస్తామని ఎవరైనా ఎలా చెప్పుకుంటారు? - ఈ పవర్ చంద్రబాబు చేతికి ఎవరిచ్చారు? - సత్తెనపల్లికి ఎవరు రుణపడి ఉన్నారు? - ఇన్నాళ్లు కోడెల చేసిందేంటీ? - స్పీకర్‌గా ఉంటూ ఫర్నీచర్ ఎత్తుకురావడమేంటీ? - కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి ఏంచేశారు? - అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? - పదవుల కోసం పార్టీలు మారిన వారిని ఎందుకు ఎంచుకోవాలి? - రాజకీయ అవసరాల కోసం సత్తెనపల్లిని తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్! -
బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?
మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ నెపాన్ని మొత్తం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన యత్నం ఇంతా, అంతా కాదు. ఎన్నడూ లేనిది హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు ఆయన శవయాత్ర కూడా చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే, గత మూడేళ్లుగా కోడెల కుటుంబాన్ని చంద్రబాబు అసలు పట్టించుకోలేదట. ఇది వేరే ఎవరో చెబితే నమ్మొచ్చో, లేదో అన్న సందేహం ఉండేది. స్వయంగా కోడెల కుమారుడు శివరామ్ చెబుతున్నారు. ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట.. రాజమండ్రి మహానాడులో ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తే పార్టీతో కలిసి భోజనం చేయవచ్చని ఆఫర్ ఇచ్చిన పార్టీ అధిష్టానం కోడెల కుటుంబానికి ఐదు నిమిషాల టైమ్ ఇవ్వలేదట. కోడెలను స్మరించుకోకపోవడం సరికదా! ఆయన భార్యకు, కొడుకుకు కనీస గౌరవం దక్కలేదట. పుండుమీద కారం చల్లినట్లు కొత్తగా టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్ ప్రకటించారన్నది ఆయన ఆవేదన. ఈయనే కాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీపై అసంతృప్తితో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చ రచ్చ మరో వైపు నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీ వర్గాలు రచ్చకెక్కి నడి రోడ్డు మీదే కొట్టుకున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఆందోళన కలిగించేవే. వీటిలో సత్తెనపల్లి రాజకీయం మాత్రం చంద్రబాబు తన సహజమైన యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించినట్లుగా ఉంది. కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడు చేసిన చర్యలపై నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దాంతో టీడీపీ నాయకత్వం కోడెలను ఎలా వదలించుకోవాలా అన్న ఆలోచనలో పడింది. ఆ తరుణంలో చంద్రబాబు పల్నాడు పర్యటనకు వెళితే కోడెలను కనీసం రమ్మని కూడా పిలవలేదు. దాంతో ఆయన కలత చెందారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన అనారోగ్యానికి గురై గుంటూరు ఆస్పత్రిలో ఉన్నారు. కోడెలను పరామర్శించాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరినా వెళ్లలేదని అంటారు. ఫలితంగా కోడెల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కారణం ఏమైనా కోడెల హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడు ఆయన ఏమైనా లేఖ రాశారా ?లేదా? అన్నది తెలియకుండా జాగ్రత్తపడ్డారు. శవయాత్రకు ప్లాన్.. కోడెల చనిపోగానే చంద్రబాబు రంగంలోకి దూకి శవయాత్రకు ప్లాన్ చేశారు. దాని వెంట ఆయన స్వయంగా వెళ్లారు. ఆయా చోట్ల కాని, స్మశానంలో కాని ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కనపెడితే కోడెల మరణాన్ని రాజకీయంగా కాష్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నించిన విషయం అందరికి అర్దం అయింది. ఆ తర్వాత కోడెల కుమారుడు శివరామ్ సత్తెనపల్లి లో రాజకీయాలు చేయడం ఆరంభించారు. కాని అందుకు మాత్రం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఫలితంగా ఆ నియోజకవర్గంలో రెండు,మూడు గ్రూపులు తయారయ్యి గొడవలు పడసాగాయి. ఆ విషయం శివరామ్‌తో చెప్పించారట.. ఈ క్రమంలో సడన్‌గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు అక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో హతాశుడైన శివరామ్ తీవ్రంగా స్పందించారు. అప్పుడు కాని కొన్ని అసలు విషయాలు బయటపెట్టలేదు. కోడెల మరణించినప్పుడు హడావుడి చేయడం తప్పించి, తదుపరి ఆయన కుటుంబ సభ్యులను పట్టించుకోలేదని ఇప్పుడు వెల్లడైంది. చివరికి ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు జరపవద్దని శివరామ్‌తో చెప్పించారట. కోడెల టీడీపీ నేతగా ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో ఉండేవారు. వారిద్దరి మధ్య రాజకీయ విమర్శలు సాగుతుండేవి. నమ్ముకున్న కుటుంబాన్ని నట్టేట ముంచేశారు.. కోడెలపై కన్నా కేసులు పెట్టించారని కూడా శివరామ్ ఆరోపిస్తున్నారు. కోడెలతో గొడవలేమో కాని, చంద్రబాబుపై కన్నా తీవ్ర విమర్శలే.. కాదు.. కాదు.. దూషణలే చేసేశారు. తనను హత్య చేయించడానికి చంద్రబాబు యత్నించారని కూడా కన్నా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును పట్టుకుని వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా వీరిద్దరి మధ్య ఎక్కడ రాజీకుదిరిందో కాని కన్నా సడన్‌గా టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేయడం, ఇంతకాలం తనను నమ్ముకున్న కోడెల కుటుంబాన్ని నట్టేట ముంచేయడం జరిగాయన్నమాట. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో.. శివరామ్‌తో పాటు మరికొందరు సత్తెనపల్లి టీడీపీ నేతలకు కూడా కన్నాను అభ్యర్ధి చేయడంపై జీర్ణించుకోలేకపోయినా,వారు పెద్దగా స్పందించినట్లు కనిపించలేదు. చంద్రబాబు ఎందుకు శివరామ్‌ను బలి చేయడానికి వెనుకాడలేదన్న చర్చ సహజంగానే వస్తుంది. శివరామ్ సత్తెనపల్లిలో గెలవలేడన్న అభిప్రాయానికి వచ్చి ఉండాలి. లేదా శివరామ్‌కు సత్తెనపల్లిలో మంచి పేరు లేదన్న భావన అయినా కావాలి. లేదూ కోడెల వల్ల అప్పట్లో పార్టీకి నష్టం కలిగిందని అనుకుని ఉండవచ్చు. కాకపోతే కోడెల చనిపోయినప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే లక్ష్యంతో ఆయన మృతిని వాడుకున్నారన్నమాట. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! నిజానికి కన్నాపై చంద్రబాబు కూడా గతంలో చాలా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు అసెంబ్లీలో తిట్టుకున్నంత పనిచేశారు. అయినా రాజకీయం మారింది. ఇద్దరూ తమ తిట్లను తూచ్ అనుకున్నారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరన్నదానికి ఇదొక ఉదాహరణ కూడా కావచ్చు. కన్నా నిజానికి జనసేన పార్టీలో చేరవచ్చని అంతా అనుకున్నారు. ఆ మేరకు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు కూడా జరిగాయి. కన్నా కాపు సామాజికవర్గంలో కొంత గుర్తింపు పొందిన సీనియర్ నేత కనుక ఆయన జనసేనలో చేరితే ఆ పార్టీ పరిస్థితి మెరుగు అయితే పొత్తు సమయంలో ఎక్కువ సీట్లు అడుగుతారని చంద్రబాబు ఊహించి ఉండవచ్చు. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసింది.. అందుకే కన్నా జనసేనలోకి వెళ్లకుండా టీడీపీలోకి లాగేసి జనసేనను, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఒక దెబ్బేశారన్నమాట. అయినా పవన్ పెద్దగా పీల్ అవరు కాబట్టి ఆయన చంద్రబాబు చొక్కా పట్టుకుని వెళుతున్నారు. ఇదే సమయంలో మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. గతంలో పొత్తు లేనప్పుడు పవన్‌ను ఉద్దేశించి తోక కట్ చేస్తానని చంద్రబాబు అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పవన్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఆయన సీఎం పదవి డిమాండ్ చేయకుండా తోక కట్ చేయగలిగారని అనుకోవాలి. ఇక కన్నాకు సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపులు సహకరిస్తాయా?లేదా?అన్నది సంశయమే. టీడీపీకి గుండెలో రాయి పడినట్లే.. ఇప్పటికే శివరామ్ తాను సత్తెనపల్లిలో పోటీచేస్తానని అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీలో దిగితే కన్నా కష్టాలు తప్పకపోవచ్చు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇస్తే ఏమిటి అని వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు నాయుడును ఇబ్బందిలో పెట్టారు. ఉన్న ముగ్గురు లోక్ సభ సభ్యులలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అంటీ,అంటనట్లు ఉంటున్నారు. కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో అభివృద్ది విషయంలో కలిసి పనిచేస్తానని చెబుతున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ పిట్టలదొరకు ఎంపీ టిక్కెట్ ఇవ్వబోతోందని తేల్చేశారు. నానీ సోదరుడు చిన్నీకి టిక్కెట్ ఇవ్వవచ్చని వార్తలు వస్తున్న తరుణంలో నాని తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారన్నమాట. అవసరమైతే స్వతంత్రంగా పోటీచేస్తానని నాని సంకేతం ఇవ్వడం టీడీపీకి గుండెలో రాయి పడినట్లే అవుతుంది. చదవండి: కేసీఆర్‌కు ఆ భయం పట్టుకుందా?.. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది..! కాగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఇటీవల టీడీపీలోని మరో గ్రూపు సుబ్బారెడ్డి అనుచరులపై దాడి చేసి జైలుకు వెళ్లివచ్చారు. భర్తతో కలిసి ఆమె చేస్తున్న చర్యలతో పార్టీ పరువు పోతోందని కార్యకర్తలు చెబుతున్నారు. ఆమెకు పార్టీ నోటీసు ఇచ్చింది. అసలే నంద్యాల, కర్నూలు జిల్లాలలో పార్టీ బాగా బలహీనంగా ఉందనుకుంటుంటే, ఈ గొడవలతో మరింత అప్రతిష్టపాలవుతోంది. మరో వైపు చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫౌండేషన్ల పేరుతో కొందరు వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటే వారికి టీడీపీ టిక్కెట్లు ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు వైసీపీలో జరిగి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఆ పార్టీ పని అయిపోయిందని విపరీత ప్రచారం చేసేవి. టిడిపిలో ఈ పరిణామాలపై మాత్రం అవి కిమ్మనకుండా మూసుకుని ఉండడం కూడా గమనించదగ్గ అంశమే. మహానాడుతో టీడీపీకి ఊపు వచ్చిందని ప్రచారం చేయాలని అనుకున్న టీడీపీకి, చంద్రబాబుకు ఈ పరిణామాలు జీర్ణం కానివే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
కోడెలకు అన్యాయం చేస్తున్నారు
సాక్షి, నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి మరణించే వరకు ఆ పార్టీ కోసం పోరాడిన డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబానికి చంద్రబాబునాయుడు అన్యాయం చేస్తున్నారని శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘వైద్య వృత్తిలో పల్నాడు గడ్డపైనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారందరికీ ఆదర్శంగా నిలిచిన కోడెల శివప్రసాద్ ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ కోరిక మేరకు కోడెల 11 ఏళ్లు కష్టపడి బసవతారకం ఆసుపత్రిని నిర్మించారు. చనిపోయేవరకు పార్టీ, కార్యకర్తలు, పేదలకు అండగా నిలిచారు. పల్నాడు ప్రాంతం, కోటప్పకొండ అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే పేరు కోడెల. అటువంటి కోడెలను పార్టీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారు. ఆయన పేరును చెరిపివేయాలని మా పార్టీలోని కొందరు కుట్ర పన్నుతున్నారు’ అని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలను వద్దన్నారు ‘గత నాలుగేళ్లుగా చంద్రబాబుతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. పల్నాడు టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు, అచ్నెన్నాయుడు, చంద్రబాబు వ్యక్తిగత సహాయకుల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశా. మహానాడులో రూ. 5 లక్షలు విరాళం ఇచ్చిన వారితో చంద్రబాబు కలసి భోజనం చేశారు. మా తండ్రి, మా కుటుంబం పార్టీ కోసం ఆహార్నిశలు కష్టపడినా మాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన నాయకుడి కుటుంబానికి చంద్రబాబు 5 నిమిషాలు సమయం ఇవ్వడంలేదు. డబ్బే ప్రామాణికమైతే ఆస్తులు అమ్మి అయినా ఇస్తాం. కోడెల త్యాగానికి వెల కడితే ఆమేరకు చెల్లిస్తాం. మా తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పింది. అయితే, టీడీపీ అధిష్టానం వద్దని చెప్పడంతో మేము ఆ లాంఛనాలను తిరస్కరించాం. కన్న కొడుకుగా నా తండ్రికి దక్కాల్సిన గౌరవాన్ని వదులుకున్నందుకు బాధ కలిగింది. అయినా టీడీపీ కోసం ఆ బాధనూ భరించాం. ఇన్ని చేసినా చంద్రబాబు, లోకేశ్ మా కుటుంబాన్ని కావాలనే దూరం చేస్తున్నారు’ అని చెప్పారు. బసవతారకం ట్రస్ట్‌లో చోటు ఇవ్వలేదు... ‘ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎందరినో కలుపుకొని బసవతారకం ఆసుపత్రి నిర్మించిన కోడెల చనిపోతే.. ఆయన స్థానంలో ట్రస్ట్ మెంబర్‌గా మా తల్లిని నియమించలేదు. ఆ స్థానంలో చంద్రబాబు కోడలు బ్రాహ్మణిని తెచ్చారు. ఇది అన్యాయం కాదా? ఇది ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధం. రాష్ట్రంలో ఎన్నో స్థానాలలో నాయకులు చనిపోతే వారి వారసులకు సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అదే పాలసీ సత్తెనపల్లిలో ఎందుకు పాటించరు? కోడెల జయంతి, వర్ధంతులకు ట్వీట్లు చేయడంతో సరిపుచ్చుతున్నారు. మా అమ్మను కనీసం ఫోన్ చేసి ఓదార్చలేదు. కోడెల విగ్రహాల ఏర్పాటును కూడా సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు. ఇదేమి పార్టీ’ అని అన్నారు. పోటీ చేస్తా.. గెలుస్తా ‘టీడీపీ, చంద్రబాబు, కోడెల అంటేనే పడని వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. అక్రమాస్తులు కలిగి ఉన్నారని చంద్రబాబుపై కన్నా కేసులు వేశారు. చంద్రబాబును బూతులు తిట్టారు. అవకాశాల కోసం పార్టీలు మారిన వ్యక్తి కన్నా. అటువంటి వ్యక్తిని సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా నియమిస్తారా? ఇది చాలా బాధించింది. పార్టీ శ్రేణులు కూడా హర్షించడంలేదు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి తీరుతా. నేనే గెలుస్తా. కోడెల కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులకు అండగా నిలుస్తా. నాకు పదవులు, అధికారం ముఖ్యం కాదు. కోడెల ఆశయాల సాధనే ప్రధానం. అందుకోసమే పోరాడుతా’ అని శివరాం చెప్పారు. -
నా టిక్కెట్ ఎవడికో ఇవ్వడమేంటి ?
-
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
కోడెల శివరామ్‌కు బిగ్ షాక్!
తెనాలిరూరల్: టీడీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్, అతడి భార్య పద్మప్రియ విజ్ఞప్తి మేరకు శివరామ్‌కే చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు బాలవెంకటసురేష్ రూ.24.25 లక్షల పెట్టుబడి పెట్టారు. మరో ముగ్గురు సుమారు రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టారు. అందుకు సంబంధించి చెక్కుల ద్వారా లావాదేవీ జరిపారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా శివరామ్, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. బాలవెంకటసురేష్ పిటిషన్‌పై కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శివరామ్‌పై 420, 407, 403, 386, 389, 120బి, 506, 509 ఐపీసీ, 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ సమావేశం సందర్భంగా మరోసారి నియోజకవర్గంలో నాయకుల వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. మాటలు పెరిగి కుర్చీలతో దాడులు చేసుకున్నారు. గతంలో ఇక్కడ పోటీచేసి ఓటమిపాలైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యానంతరం పార్టీ అధిష్టానం ఎవరికీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించలేదు. దీంతో నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన కోడెల శివరాం, మాజీ శాసనసభ్యుడు వై.వి.ఆంజనేయులు, తెలుగుయువత నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు (అబ్బూరి మల్లి) ఎవరికివారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో సత్తెనపల్లిలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొండెపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ హాజరయ్యారు. అప్పటికే మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కోడెల శివరాం తన వర్గంతో ర్యాలీగా ఎన్టీఆర్ భవన్ వద్దకు వచ్చి ఇన్చార్జిని నియమించకుండా సంస్థాగత కమిటీ నియామకాలు ఏమిటని ప్రశ్నించారు. స్థానికులుకాని వారి సలహాలు అవసరం లేదంటూ నినదించారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. పరస్పరం కుర్చీలతో కొట్టుకున్నారు. సమావేశానికి వచ్చిన పరిశీలకులు ఇన్చార్జి నియామక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ప్రస్తుతం సంస్థాగత కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అయినా గొడవ ఆగకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, ముఖ్య నాయకులు బయటకు వచ్చారు. తెలుగుతమ్ముళ్ల గొడవను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై శివరాం వర్గీయులు దురుసుగా ప్రవర్తించడమేగాక సెల్ఫోన్లు లాక్కున్నారు. దీంతో సమావేశాన్ని కవర్ చేయకుండా మీడియా ప్రతినిధులు బాయ్‌కాట్ చేశారు. -
సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ పరువును నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. నిన్న కళ్యాణదుర్గం.. నేడు సత్తెనపల్లి వరుసగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ సంస్థాగత కమిటీల విషయంలో తెలుగుదేశం నేతలు ఘర్షణ పడ్డారు. కోడేల శివరాం, వైవీ ఆంజినేయులు వర్గాలు ఒకరిపై ఒకరు గొడవపడ్డారు. కుర్చీలతో కూడా కొట్టుకున్నారు. దీంతో సంస్థాగత నియామకాల సమావేశం రసాభాసగా మారింది. కోడెల శివరాం, జీవి ఆంజినేయుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. దీంతో కమిటీ మీటింగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజినేయులు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. చదవండి: (అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. కుర్చీలతో కుమ్మేసుకున్నారు) -
కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదు
తెనాలి రూరల్: దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్‌కు చెందిన కైరా ఇన్ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ.24,25,000 పెట్టుబడి పెట్టారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రూరల్ ఎస్ఐ జి.ఏడుకొండలు శివరామ్‌పై చీటింగ్ కేసును సోమవారం నమోదు చేశారు. -
కోడెల శివరాం టీడీపీ నేతలను హింసిస్తున్నాడు
-
కోడెల శివరాం కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు: టీడీపీ నేత
సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గత ఐదేళ్లలో కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ సంచలన వ్యాఖలు చేశారు. నకరికల్లు మండలం కల్లకుంటలో రేపు(గురువారం) కోడెల విగ్రహావిష్కరణకు వచ్చే చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా జోక్యం చేసుకోవాలన్నారు. తమ దగ్గర నుంచి కోడెల శివరాం రూ.32 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి మాకు చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. 30ఏళ్ల నుంచి పార్టీకి ఎంతో ఖర్చు పెట్టి అంకితభావంతో పని చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేస్తున్న తమని కోడెల శివరాం బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. కోడెల శివరాం వల్ల తాము బాగా నష్టపోయామని, తమచేత ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం చేసిన కోడెల శివరాం మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోడెల శివరాం ధన దాహం వల్ల నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నష్టపోయారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ నేత పమిడి బాలకృష్ణ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు
సాక్షి, సత్తెనపల్లి: శాసన సభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ తన వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్ తీసుకుని డబ్బులివ్వడం లేదని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఆదివారం టీడీపీ నేత నర్రా రమేష్ ఫిర్యాదు చేశాడు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా రమేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపారం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు తన తండ్రి శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్‌ను తీసుకుని నగదు చెల్లించలేదని, డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు. -
పోలీసుల అదుపులో కోడెల బినామీ!
సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
శివరామ్ విచారణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్‌ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు. బసవతారకం ఆస్పత్రి వైద్యురాలికి చివరి కాల్.. హైదరాబాద్‌లో కోడెల ఉరి వేసుకున్న గదిని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా వినియోగిస్తున్న మందులను వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని నిర్ణయించారు. అదే సమయంలో కోడెల పర్సనల్ మొబైల్ సెల్‌ఫోన్ ఎక్కడుంది? దాన్ని దాచాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆత్మహత్యకు ముందు ఆ ఫోన్‌తో ఆయన ఎవరితో మాట్లాడారు? ఫోన్ దొరికితే గుట్టు రట్టవుతుందని ఎవరైనా భయపడుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కాల్‌డేటా రికార్డర్ యాప్ (సీడీఆర్ఏ)తో కాల్‌లిస్ట్‌ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యురాలికి ఫోన్ చేసి 24 నిమిషాలు మాట్లాడినట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడారు అనేది తెలుసుకోవడానికి ఆ డాక్టరును విచారించాలని నిర్ణయించారు. కేబుల్ వైరుతో ఉరి.. పోస్టుమార్టం నివేదిక కోడెల శివప్రసాదరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ఆ నివేదికను బుధవారం పోలీసులకు అందించారు. మెడకు కేబుల్ వైరు బిగించుకోవడం ద్వారానే మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడెల గొంతు భాగంలో ఎనిమిది అంగుళాల పొడవుతో మచ్చ ఉందని తెలిపారు. ముందుగా తన పంచెను చింపి తాడుగా చేసుకుని ఉరి వేసుకోవాలని కోడెల ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో గదిలో ఉన్న కేబుల్ వైరుతో ఉరి వేసుకున్నారని తెలిపారు. 12 మందిని విచారించాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు కోడెల ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా కుటుంబీకులు, గన్‌మెన్, డ్రైవర్ తదితరులతో కలిపి మొత్తం 12 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన కుమారుడు, ఇతర కుటుంబీకులు, సన్నిహితులతోపాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కొడుకు శివరామ్ స్టేట్మెంట్ కీలకం కానుందని పేర్కొన్నారు. కోడెల ఫోన్లోని కాల్‌డేటా ఆరా తీస్తున్నామన్నారు. ముగిసిన కోడెల అంత్యక్రియలు నరసరావుపేట/నరసరావుపేటటౌన్: అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు టీడీపీ కార్యకర్తలు కన్నీటి వీడ్కోలు పలికారు. నరసరావుపేట కోటలోని కోడెల నివాసం నుంచి స్వర్గపురి వరకు సాగిన కోడెల అంతిమయాత్రలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, లోకేష్‌తో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొన్నారు. కోడెల భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం కోటలో ఉంచారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో చంద్రబాబు వచ్చి నివాళులర్పించి అంతియాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శామ్యూల్ కోడెల కుటుంబ సభ్యులకు వివరించగా.. వారు నిరాకరించారు. కోడెల చితికి శాస్త్రోక్తంగా ఆయన కుమారుడు శివరామకృష్ణ నిప్పంటించి అంతిమ సంస్కారం నిర్వహించారు. కోడెల అంతిమయాత్రలో ప్రతిపక్షనేత చంద్రబాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత.. కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం అంతిమయాత్ర సాగనీయకుండా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం మీదుగా తీసుకెళ్లాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు అడ్డు చెప్పారు. అంతిమయాత్ర మల్లమ్మసెంటర్కు చేరిన అనంతరం తిరిగి ఉచ్చయ్య,పెంటయ్య వీధి గుండా స్వర్గపురికి వెళ్లాల్సి ఉంది. అయితే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటివైపు మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి , డీఎస్పీ వీరారెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని ముందస్తు రూట్ మ్యాప్ ప్రకారం వాహనాన్ని మళ్లించారు. సంబంధిత కథనాలు.. ‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు ఒక మరణం.. అనేక అనుమానాలు కోడెల మృతికి చంద్రబాబే కారణం గ్రూపులు కట్టి వేధించారు.. -
కొడుకే వేధించాడు: కోడెల బంధువు
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు చెబుతున్న తరుణంలో ఆయన కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని మృతుని సమీప బంధువు కంచేటి సాయిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్ నన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు నా కొడుకు నుంచే నాకు ప్రాణహాని ఉంది’ అని గత నెలలో శివప్రసాదరావు తనతో ఫోన్లో పలుమార్లు ఆందోన వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ విషయం తనతో వ్యక్తిగతంగా కూడా చెప్పారన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కోడెల మృతిని టీడీపీ నేతలు రాజకీయం చేస్తూ.. వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్న నేపథ్యంలో సాయిబాబు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన వాడినని, వ్యాపార రీత్యా గుంటూరులో నివసిస్తున్నానని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మరణించిన కోడెల శివప్రసాదరావు తనకు మేనమామ కుమారుడన్నారు. ఆగస్టు నెలలో శివప్రసాదరాడు సెల్ నంబర్ 9848005923 నుంచి తన నంబర్ 6305322989కు పలుమార్లు ఫోన్లు చేసి కుమారుడు కోడెల శివరామ్ తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పాడన్నారు. కోడెల మృతికి ఆయన కుమారుడే కారణమంటూ.. పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు కుమారుడి బారి నుంచి కాపాడాలని కోరారు ఆస్తులను తన పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని శివప్రసాదరావు తనతో ఆవేదన పంచుకున్నాడని సాయిబాబు చెప్పారు. తనతో నాలుగు సార్లు వ్యక్తిగతంగా కూడా కోడెల అదే విషయం చెప్పారని వివరించారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని బారి నుంచి తనను కాపాడాలని కోరారన్నారు. దీంతో తాను శివరామ్‌కు పలుమార్లు ఫోన్ చేసి శివప్రసాదరావును ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించానన్నారు. శివరామ్‌ను కలిసి మాట్లాడదామని ప్రయత్నిస్తే.. అతను కుదరదని చెప్పాడన్నారు. ఇప్పుడు కోడెల మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోడెల మృతిపై తనకు అనుమానం ఉందన్నారు. అతని కుమారుడే చంపి లేదా చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని చెప్పారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆయన మరణానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్ నాకు పలుమార్లు ఫోన్ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్‌కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించాను. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివప్రసాద్‌ను శివరామే హత్య చేశాడు. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా మాజీ స్పీకర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుండెపోటు మృతి చెందితే.. అపోలో, కేర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు మాత్రం ఆయన ఉరేసుకుని మృతిచెందారంటూ చెబుతున్నారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించగా.. మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో ఏ-2 నిందితుడు అజేష్ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్‌యిన నిందితుడు స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లు మాయం అవ్వడంతో ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు విషయమై బయటకు రావడంతో డీఆర్డీఏ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు. -
ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజయ్ చౌదరి అరెస్ట్
-
కోడెల అక్రమ నిర్మాణంపై చర్యలు
సాక్షి, గుంటూరు: అధికారం అండతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. శివరామ్ తన షోరూమ్‌లో టీఆర్ లేకుండా బైక్‌ల విక్రయించి ప్రభుత్వానికి రూ.లక్షల్లో టోకరా వేశాడు. తన తండ్రి అక్రమంగా తెచ్చిపెట్టిన అసెంబ్లీ ఫర్నిచర్‌ను షోరూమ్‌లో ఉపయోగించుకున్నాడు. కే–ట్యాక్స్‌లు, ఉద్యోగాల పేరుతో అనేక మంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పటికే శివరామ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనగారి అక్రమాలు నరసరావుపేట, సత్తెనపల్లిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుంటూరు నగరంలో అక్రమంగా జీ ప్లస్–2 భవంతి నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఈ నెల 20న ‘సాక్షి’ దినపత్రికలో ‘యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కోడెల శివరామ్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలకు దిగారు. గుంటూరు నగరంలోని భాగ్యనగర్ కాలనీ ఎనిమిదో లైన్‌కు శివారులోని ఎక్స్టెన్షన్ ఏరియాలో సర్వే నెంబర్ 281/ఏ, 296/ఏ లలో 997 గజాలు, 291/ఏ, 296/డీ లలో 1019 గజాల స్థలం కోడెల శివరామ్‌కు ఉంది. ఈ స్థలంలో సుమారు ఎనిమిది నెలల క్రితం శివరామ్ జీ ప్లస్–2 భవనం నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో తన తండ్రి స్పీకర్ కావడంతో భవనం నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. స్పీకర్ తనయుడి భవంతి కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలేశారు. నోటీసు జారీ... అక్రమ కట్టడం వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. కోడెల కుమారుడి అక్రమ నిర్మాణానికి నోటీసు జారీ చేశారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 452(1), 428, 461(1), ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టం 2014 115(1)(2), 116(1) కింద అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్టడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బీపీఎస్ దరఖాస్తు తిరస్కరణ.. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని బీపీఎస్‌లో పెట్టి క్రమబద్ధీకరించేందుకు కోడెల శివరామ్ ప్రయత్నించారు. ఏ విధంగా ఆ భవనం బీపీఎస్ కిందకు వస్తుందో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బీపీఎస్ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు తిరస్కరించారు. కోడెల శివరామ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం 2018 సెప్టెంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసేందుకు సర్వే చేయడం కోసం కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సిబ్బంది అంతకు ముందు వరకూ ఆ స్థలం వ్యవసాయ భూమి కింద ఉండేది. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడానికి ఆ స్థలం పరిశీలించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వెళ్లగా అక్కడ భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. కోడెల శివరామ్ మాత్రం గత ఏడాది ఆగస్టు నెలకు ముందే భవన నిర్మాణం ప్రారంభం అయిందని ఆగస్టు నెలాఖరికి శ్లాబ్ పూర్తయిందని బీపీఎస్‌కు దరఖాస్తు చేశారు. అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తారనే భయంతో భవనాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్‌లోని కొందరు అధికారులు సైతం ఆయనకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు సమాచారం. కోడెల కుమారుడితో అంటకాగి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఏ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ షోరూమ్‌లో ఉన్న శాసన సభ ఫర్నిచర్‌ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. 2017లో అనుమతులు లేకుండా వెలగపూడి, హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుంటూరులో ఉన్న తన కుమారుడికి చెందిన గౌతమ్ షోరూమ్‌కు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తరలించిన విషయం విదితమే. ఎటువంటి అనుమతులూ లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్‌ను గౌతమ్ షోరూమ్‌కు తరలించిన కోడెల శివప్రసాదరావు, ఆ ఫర్నిచర్‌ను వినియోగిస్తున్న అతని కుమారుడు శివరామ్‌పై అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈ శ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ ఫర్నిచర్‌ను సోమవారం రాత్రి రెండు లారీల్లో వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. -
చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!!
సాక్షి, గుంటూరు: ఆ సీనియర్ నాయకుడిని చేసిన పాపాలే వెంటాడుతున్నాయి. అన్ని విధాలుగా ఉచ్చు బిగుస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువే కాదు.. కుటుంబపరువూ పోయింది. ఇలాంటి నాయకుడిని పార్టీ నుంచి గెంటేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన చేసిన పాపాలు ఏంటి? గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావుది ఒక చరిత్ర. రాజకీయాల్లోకి రాకముందు ఒక మంచి డాక్టరుగా పేరు పొందారు. కానీ ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కావాల్సినంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. తీవ్రమైన అత్యాశ, పదవీకాంక్ష కోడెలను రాజకీయంగా భ్రష్టు పట్టించాయి. కోడెల ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాక 1983 నుంచి 85 వరకూ బాగానే సాగింది. ఆ తర్వాతే రాజకీయంగా ఎదగటం కోసం అనేక అడ్డదారులు తొక్కారు. విపరీతమైన పదవీ కాంక్ష కోడెలను పక్కదారి పట్టేలా చేసిందన్నది ఆయన అనుచరులే మాట. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లల్లోనే తుపాను బాధితులకు సాయంగా అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఏకంగా తన ఇంట్లో దాచుకున్న ఆ బియ్యాన్ని అప్పట్లో కమ్యూనిస్టులు వెలుగులోకి తెచ్చారు. తుఫాను బియ్యం దోచుకున్న దొంగ అని అప్పట్లో చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇతరుల ఆస్తులు బలవంతంగా లాగేసుకోవటం దగ్గర్నుంచి విలువైన స్థలాలు కబ్జాలు చేయటం, కమీషన్లు దండుకోవటం ఇలా ఎన్నో చేశారు. 1999 ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన సొంత ఇంట్లోనే బాంబులు పేలి నలుగురు ముఖ్య అనుచరులు చనిపోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కోడెల సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలోనే విజయవాడలో వంగవీటి రంగా హత్య జరగటం, అందులో కోడెల పాత్ర ఉందన్న అరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించటంతోపాటు ఎన్టీయార్ కుటుంబానికి కూడా కోడెల చాలా దగ్గర. ఈ కారణంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను ఏమీ చేయలేకపోయారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కొంతకాలం వరకూ కోడెలే ఛైర్మన్ గా ఉన్నారు. ఆదే సమయంలో అక్కడ అక్రమాలు జరగడంతో ఆయన ఆ పదవిని వదలాల్సి వచ్చింది. ఇక గుంటూరు రాజకీయాల్లో శివప్రసాదరావు ఏం చెప్తే అదే జరిగేది. అలాంటి రాజకీయాలు చేయటం వల్ల అధినేత చంద్రబాబు కూడా ఆయనను పల్లెత్తి మాట అనలేదు. కొంతకాలంగా కోడెలకు, చంద్రబాబుకు పొసగటంలేదన్న వార్తలున్నాయి. అయినా తనకున్న పలుకుబడితో 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి సీటు సంపాదించి గెలిచారు. ఒక పత్రికాధిపతి రికమెండేషన్‌తో అసెంబ్లీకి స్పీకర్‌గా కూడా పనిచేశారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ కోడెల వైఖరిలో మార్పు రాలేదు. పైగా ఆయనే కాకుండా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కూడా రంగంలోకి దిగారు. వారు సత్తెనపల్లి, నరసరావుపేటలో చక్రం తిప్పారు. ఎమ్మార్వో ఆఫీసులో ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే కోడెల మనుషులకు ఐదు వందల రూపాయలు లంచం ఇవ్వాలి. ఆ తరువాతే సర్టిఫికెట్ తెచ్చు్ఓవడానికి వీలయ్యేది. ఈ లంచావతారాలను తట్టుకోలేక బిల్డర్లు పనులు ఆపేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. కే టాక్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు ప్రజల ముక్కుపిండి వసూలు చేశారు. చివరికి ప్రభుత్వ ఆస్తిని సైతం చోరీ చేసే స్థాయికి దిగజారారు. అసెంబ్లీలో ఉండాల్సిన కోట్ల విలువైన ఫర్నీచర్‌ను నేరుగా తన ఇంటిలో దాచిపెట్టుకున్నారు కోడెల శివప్రసాద్. తాజాగా చోరీ వ్యవహారం బయట పడటంతో అధినేత చంద్రబాబుకు మంచి అవకాశం దొరికింది. దాంతో కోడెలను పార్టీ నుంచి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంపై పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. కోడెల చేసింది తప్పేనన్నారు. చంద్రబాబు కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. కోడెల తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవచ్చంటూ సూచించారు. అంటే కోడెలను బయటకు పంపించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే కోడెల వ్యవహారంపై ఒక కమిటీ ద్వారా విచారణ జరిపించి, వెంటనే షోకాజు నోటీసులు ఇవ్వటం, దానిపై కోడెల స్పందించిన తీరు నచ్చలేదన్న కారణంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. మొత్తమ్మీద కోడెలకు పచ్చ పార్టీలో నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ సంకట స్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి. -
కోడెల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్‌ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శివరామ్.. ప్రభుత్వ కార్యాలయంలోని విలువైన వస్తువులను అనుచరులకు విచ్చలవిడిగా పంచిపెట్టారు. ఈ సందర్భంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని విలువైన ల్యాప్‌టాప్‌లను తన అభిమానులకు ధారాదత్తం చేశాడు. తాజాగా వాటిపై కేసు నమోదు కావడంతో తప్పించుకునేందుకు రాత్రికిరాత్రే కొత్త ల్యాప్‌టాప్‌లు కొని వాటి స్థానంలో పెట్టారు. కాగా కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన ఇంటికి మళ్లించిన వ్యవహారం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను భద్రపరిచానని కోడెల చెప్పడం, అది ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూంలో కూడా వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో రూ.కోట్ల అసెంబ్లీ ఫర్నిచర్ ఉందని తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచి, వినియోగిస్తున్న కోడెల, శివరామ్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించారు. అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ తాతా మోహన్‌రావు తదితరులు శుక్రవారం గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్‌లో తనిఖీలు నిర్వహించారు. మొదటి అంతస్తులో 10 బర్మా టేకు కుర్చీలను, రెండు, మూడో అంతస్తుల్లో యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న 22 కుర్చీలు, నాలుగు సోఫాలు, డైనింగ్ టేబుల్, టీపాయ్, దర్బార్ కుర్చీ, కంప్యూటర్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించారు. 22 యూరప్ కుర్చీలు, డైనింగ్ టేబుల్ విలువ రూ.65 లక్షలు పైమాటేనని తెలుస్తోంది. అసెంబ్లీ అధికారుల బృందం వస్తున్నట్టు తెలియడంతో కోడెల తనయుడు శివరామ్ రవాణా శాఖ అధికారుల అధీనంలో ఉన్న తన షోరూమ్ తాళాలను తీసుకోలేదు. షోరూమ్ తాళాలను అప్పగించేందుకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదయం నుంచీ ఫోన్ చేస్తున్నా మేనేజర్ అందుబాటులోకి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేనేజర్ తాళాలు తీసుకుని షోరూమ్ తెరిచారు. పైఅంతస్తుల్లోకి అధికారులు తనిఖీకి వెళ్లే సమయంలో కోడెల తన లాయర్‌ను పంపి అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ చేయడానికి వచ్చారంటూ సుమారు గంటపాటు కోడెల తరఫు న్యాయవాది టి.చిరంజీవి అధికారుల్ని అడ్డుకుని వాదనకు దిగారు. ఎట్టకేలకు పైఅంతస్తుల్లో తనిఖీ చేసిన అధికారులు పాత అసెంబ్లీ ఫర్నిచర్ మొత్తం అక్కడ ఉందని చెప్పారు. ఇదిలావుంటే.. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయంలో రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారని పుకారు పుట్టించారు. నిన్న మొన్నటి వరకు కోడెల కార్యాలయంలో పనిచేసిన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆకురాతి మల్లికార్జునరావు (అర్జునుడు) వాటిని దొంగిలించాడని కట్టుకథ అల్లారు. చోరీ జరిగినట్లు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. శుక్రవారం ఉదయం కోడెల కార్యాలయం వెనుక ఎవరో ఓ కంప్యూటర్ పడేశారని అదే వ్యక్తి పట్టుకొచ్చాడు. చోరీకి గురైనట్టు చెబుతున్న కంప్యూటర్ల లో కోడెల కే–ట్యాక్స్ వ్యవహారాలు, ఇతర బాగోతాలకు సంబంధించిన డేటా ఉందనే ప్రచారం సాగుతోంది. 30 ల్యాప్‌టాప్‌లు పట్టుకెళ్లారు! ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేశారు. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్(ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్ఎస్పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్ఎస్పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోడెల కుమారుడు శివరామ్ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి ఆర్జా శ్రీకాంత్ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెలకు అస్వస్థత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను గుంటూరు నగరం మూడు వంతెనల రోడ్డులోని శనక్కాయల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కోడెల కుమార్తె విజయలక్ష్మీకి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.