
సాక్షి, గుంటూరు : భూకబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు, కులదూషణల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కోడెల ఆయన కుమారుడు కోడెల శివరామ్, విజయలక్ష్మి ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు సమాచారం. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా తన కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కోడెల శివప్రసాదరావు నిన్న ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment