సాక్షి, అమరావతి: పశువుల మందుల సరఫరాలో అక్రమాలపై పశు సంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... ’టీడీపీ నేతలు దేనిని వదలకుండా అవినీతికి పాల్పడ్డారు. పశువులకు సరఫరా చేసే గడ్డిని కూడా వదలకుండా దోచుకున్నారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పశువుల మందులు, గడ్డిలోనూ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ కంపెనీల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. అయిదు కంపెనీల కోసం అక్రమంగా టెండర్ల నిబంధనలు మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. రూ.4.5కోట్ల వరకూ వాళ్లకి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆదేశించాను. అయిదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టెండర్లు పిలుస్తాం.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment