సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. ‘గత ఆగస్టులో కోడెల శివప్రసాద్ నాకు పలుమార్లు ఫోన్ చేశారు. తన కమారుడైన శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని తన ఆవేదనను నాతో పంచుకున్నారు. శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారు. తరువాత నేనే స్వయంగా శివరామ్‌కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని అనేక సార్లు హెచ్చరించాను. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివప్రసాద్‌ను శివరామే హత్య చేశాడు. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు.
కాగా మాజీ స్పీకర్ కోడెల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుండెపోటు మృతి చెందితే.. అపోలో, కేర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పలువురు మాత్రం ఆయన ఉరేసుకుని మృతిచెందారంటూ చెబుతున్నారు. శవపరీక్షల నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించగా.. మరిన్ని విషయాలు రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తాయని అధికారులు తెలిపారు.
చదవండి:
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
కోడెల మృతితో షాక్కు గురయ్యాను...
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
కోడెల మృతిపై కేసు నమోదు
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
Comments
Please login to add a commentAdd a comment