
కోడెల శివరామ్ షోరూమ్‌లో స్వాధీనం చేసుకున్న ఫర్నిచర్‌ను లారీలో లోడు చేస్తున్న సిబ్బంది
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ షోరూమ్‌లో ఉన్న శాసన సభ ఫర్నిచర్‌ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. 2017లో అనుమతులు లేకుండా వెలగపూడి, హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుంటూరులో ఉన్న తన కుమారుడికి చెందిన గౌతమ్ షోరూమ్‌కు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తరలించిన విషయం విదితమే. ఎటువంటి అనుమతులూ లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్‌ను గౌతమ్ షోరూమ్‌కు తరలించిన కోడెల శివప్రసాదరావు, ఆ ఫర్నిచర్‌ను వినియోగిస్తున్న అతని కుమారుడు శివరామ్‌పై అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈ శ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ ఫర్నిచర్‌ను సోమవారం రాత్రి రెండు లారీల్లో వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment