
విలేకరులతో మాట్లాడుతోన్న వైఎస్సార్‌సీపీ నేతలు
గుంటూరు జిల్లా: నాపై ఆరోపణలు చేసిన కోడెల శివరామ్ బహిరంగ చర్చకు పోలీసు పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌లతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..సత్తెనపల్లి, నరసరావుపేటలో కోడెల కుటుంబం ఎన్నో భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. రైల్వే కాంట్రాక్టర్లను కమిషన్ కోసం కోడెల శివరాం బెదిరించాడని, సత్తెనపల్లిలో మిఠాయి దుకాణం దగ్గర కూడా మామూళ్లు వసూలు చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
అవినీతి సొమ్ముతో గుంటూరులో రూ.150 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని చెప్పారు. సొంత కార్యకర్తల గురించి కూడా కోడెల పట్టించుకోరని విమర్శించారు. ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణం ఉందని, దానిని చెడగొట్టవద్దని విన్నవించారు. కోడెల కుటుంబం వల్ల మళ్లీ ఉద్రిక్తత నెలకొంటోందని వ్యాఖ్యానించారు. అవాంఛనీయ శక్తులను తరిమికొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment