Gopireddy Srinivasreddy
-
బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. 'బట్ట కాల్చి మీద వేయడం టీడీపీకి అలవాటే. టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నారు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు. ఏపీకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') కాల్‌మనీ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు బుద్ధా వెంకన్న, జీవీ ఆంజనేయులు మాట్లాడుతున్నారు. గతంలో జీవీ ఆంజనేయులు ప్రభుత్వం తయారు చేసే ఫర్టిలైజర్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. కాల్‌మనీ కేసులో డైరెక్ట్‌గా దొరికిన వ్యక్తి బుద్దా వెంకన్న. ఇలాంటి నాయకులు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి చర్యలకు పాల్పడరు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు మాచవరం సుధాకర్ జగన్ అనుచరుడంటూ జీవీ ఆంజనేయులు దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒడి వంటి అద్భుతమైన పథకాలతో జగన్ పాలన చేస్తున్నారు. సీఎం జగన్ డ్రగ్స్‌ను ఏపీలోకి రానివ్వరు. ఆధారాల్లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు. సత్తెనపల్లిలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు. అయ్యన్న పాత్రుడు చాలా నీచంగా మాట్లాడారు. రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని గోపిరెడ్డి మండిపడ్డారు. చదవండి: (రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స) -
'సీఎం జగన్ దమ్మేంటో ప్రజలకు తెలుసు'
సాక్షి, నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దమ్మూధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రులకు తెలియకపోవటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్‌కు దమ్మూధైర్యం లేవంటూ ట్విట్టర్లో లోకేష్, పవన్‌కల్యాణ్ ఒకేరోజు పోస్ట్ చేశారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ఎదుట లోకేష్, పవన్‌కల్యాణ్ పోస్టులపై స్పందించారు. అప్పటి ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాందీని ఎదిరించి సొంతగా పార్టీ పెట్టుకున్న ధైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని గుర్తుచేశారు. ఇటీవలి ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత వైఎస్ జగన్ సొంతమని పేర్కొన్నారు. తాను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరి పేరును కూడా స్పష్టంగా పలకలేని లోకేష్‌కు, పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్మూ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలతో పాటు పవన్ కల్యాణ్ మంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ప్రజల మధ్య మతం, కులాల ప్రస్థావన తెస్తున్నారని, మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయోలేదో అని కాకుండా మంచి పనులు చేస్తున్నామా లేదా అనే ధోరణితోనే సీఎం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే దానికి కూడా మతం రంగు పులిమే సంస్కృతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. అమలుచేసే పథకాల్లో తప్పులు, పొరపాట్లు ఉంటే చెబితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. వ్యక్తిగతంగా సీఎంను దూషిస్తూ, ప్రజల మధ్య మతం, కులం పేరిట విభేదాలు తెచ్చే చర్యలకు ఇకనైనా ప్రతిపక్ష నాయకులు విడనాడాలని హితవుపలికారు. -
ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును మారుస్తామని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దించేందుకు రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యడ్లపాడు మండలంలోని కొండవీడు సమీపంలో రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల ప్రారంభానికి విచ్చేసిన ఆయన కొండవీడు కోటను శనివారం సందర్శించారు. ఎమ్మెల్యే విడదల రజని, మాజీ ఎమ్మెల్సీ జి.వి.కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డితో కలిసి ఘాట్ రోడ్డు, మహాద్వారం, కొండపై ఉన్న శివాలయం, మూడు చెరువులను పరిశీలించారు. ఇప్పటివరకు కొండవీడులో చేసిన పనుల వివరాలను కలెక్టర్ మంత్రికి తెలియజేశారు. కొండవీడు అభివృద్ధికి సంబంధించి చిన్నారుల పార్కు, వెహికల్ పార్కింగ్‌ల ఏర్పాటు, మూడు చెరువుల అభివృద్ధి, తూర్పువైపు ప్రధాన ద్వారం అభివృద్ధితో పాటు 0.75 కి.మి ఘాట్ రోడ్డు రెండో దశ పనులు, కొండలపై 20 కి.మి మేర ఉన్న కోటగోడ, శిథిలమైన బురుజులను, విద్యుత్తు సబ్‌స్టేషన్, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే విడదల రజని లిఖిత పూర్వకంగా రాసిన లేఖను మంత్రికి అందించారు. నాటి చారిత్రాక అంశాలను, జాతి సంపదకు దుండగుల బారి నుంచి రక్షణ కల్పించాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి మంత్రిని కోరారు. కొండవీడు అభివృద్ధికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజని, అన్నిశాఖల ఉన్నతాధికారులతో ఈ నెల 18న సమీక్షను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. తొలుత జరిగిన మ్యూజియం ప్రారంభోత్సవ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. ప్రపంచపటంలో వై.ఎస్.జగన్ నిలుపుతారు : ఎమ్మెల్యే రజని కొండవీడు అభివృద్ధికి తొలి సంతకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని ఎమ్మెల్యే విడదల రజని చెప్పారు. ఘాట్రోడ్డుతోనే ప ర్యాటక రంగంగా మారుతుందని గ్రహించి ని ధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ము ఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హ యాంలో కొండవీడు పర్యాటక రంగంలో ప్ర పంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. ప్రాచీన సంపదను భావితరాలకు చూపించాలని ప్రైవేటు సంస్థ ఇంతటి బాధ్యత తీసుకొని దిగ్విజయంగా పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే అంశం అన్నారు. ఆంధ్ర చారిత్రక దినంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే గోపిరెడ్డి కొండవీటి చరిత్రను తెలుగులోకి అనువదించిన ప్రముఖ రచయిత మల్లంపల్లి సోమశేఖరశర్మ జయంతి (డిసెంబర్ 9)ని ఆంధ్ర చారిత్రక దినంగా ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యం, పాలనా వైభవాన్ని మాతృభాషలో అందరికీ అందించిన శర్మ జయంతిని చారిత్రక దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి గతంలోనే నివేదించామన్నారు. అనేక ప్రాంతాల్లో రెడ్ల సమాఖ్య పలు కార్యక్రమాలు నిర్వహించిందని, మన ప్రాంతంలో మ్యూజియం నిర్మించడం అభినందనీయమన్నారు. మ్యూజియం ఏర్పాటుకు పట్టుబట్టా : ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి కొండవీటి రెడ్డిరాజుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ఏర్పాటు చేసిన వారసత్వ మ్యూజియంను నాడు అంతా అమీనా బాద్‌లో ఏర్పాటు చేయాలని సూచిం చినా, చిన్న గ్రామమైన హౌస్ గణేష్‌పాడులో ఏర్పా టు చేయాలని తాను కోరినట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. మ్యూజి యం అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి నిధులు ఇచ్చి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కొండవీడు రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, రజని, శ్రీదేవి తదితరులు భావితరాలకు చేరువ చేయండి : నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పూర్వీకుల ఆదర్శాలకు నిదర్శంగా రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోల్కోండ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి, సమాఖ్య పూర్వ అధ్యక్షుడు జంగం శ్రీనివాసరెడ్డి, వి.బాలమద్దిలేటిరెడ్డి, అధ్యక్షుడు వనం వెంకట రామిరెడ్డి, కార్యదర్శి తాతిరెడ్డి, కోశాధికారి తోడేటి నర్సింహ్మారెడ్డి, కల్లి శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, నాయకులు బాలవిజయచంద్రారెడ్డి, బసెల శివరామకృష్ణ, జాకీర్, విడదల లక్ష్మీనారాయణ, బేరింగ్ మౌలాలి, సింగారెడ్డి కోటీరెడ్డి, కాట్రగడ్డ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రారంభోత్సవం ఇలా.. వేదపండితులు ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. ముందుగా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మ్యూ జియం భవనం ప్రారంభించారు. పల్నాటి నాగమ్మ విభాగాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రోలయవేమారెడ్డి విభాగం, కొండవీడు నమూనా విభాగాలను ఎమ్మెల్యే విడదల రజని, రేచర్ల రుద్రారెడ్డి విభాగాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, నంది విగ్రహాన్ని ఎంపీ బ్రహ్మానందరెడ్డి, గ్రంథాలయాన్ని గోల్కోండ గ్రూప్ హోటల్స్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డి ప్రాంభించారు. అతిథులంతా ప్రత్యేక పూజలు చేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. -
వైద్యుడిపై పోలీస్ ఆఫీసర్ దాడి..!
సాక్షి, నరసరావుపేట రూరల్ : ఎన్నికల సమయంలో పోలీసులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన వీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట టూటౌన్ సీఐ ఆదినారాయణ.. అత్యవసర చికిత్స అందించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న వైద్యునిపై అకారణంగా దాడికి పాల్పడి వీధి రౌడీలాగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ల ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరింది. ఇదే సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన సుస్మిత ఆర్థో ట్రామాకేర్ సెంటర్లో రోగికి చికిత్స అందించేందుకు డాక్టర్ జయభారత్‌రెడ్డి తన కారులో అక్కడికి చేరుకున్నారు. కారు ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో ర్యాలీ రావడంతో అక్కడే విధుల్లో ఉన్న టూటౌన్ సీఐ ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో ఉన్న వాకీటాకీతో కారు అద్దంపై గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. డ్రైవింగ్ సీటులో ఉన్న డాక్టర్ జయభారత్‌రెడ్డిని కారు నుంచి బలవంతంగా చొక్కా పట్టుకుని కిందకు లాగి భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో జయభారత్‌రెడ్డి తాను డాక్టర్‌నని, రోగికి అత్యవసర చికిత్స అందించేందుకు వెళ్తున్నానని ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డాక్టర్‌ను గుర్తించిన స్థానికులు.. సీఐకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు. కాగా, సంఘటనలో కారు అద్దం దెబ్బతినగా, డాక్టర్ జయభారత్‌రెడ్డి ఒంటిపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి చేరుకుని జయభారత్‌రెడ్డిని పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఐ దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. డాక్టర్ విధులకు ఆటంకం కలిగించిన సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ పట్టణ శాఖ అధ్యక్షుడు డా.ఏఏవీ రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన సీఐ ఆదినారాయణపై జయభారత్‌రెడ్డి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
‘పద్ధతి మార్చుకోకుంటే ఆందోళన చేస్తాం’
సాక్షి, గుంటూరు : ఓటర్ల తొలగింపులో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి 2,800 ఓటర్లను తొలగించాలంటూ ఆన్లైన్లో ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. ‘వేల ఓట్ల గురించి ఒకే వ్యక్తి ఫిర్యాదు చేయడం.. దాని ఆధారంగా అధికారులు విచారణ చేయడం.. అది కూడా అర్హత లేని వాళ్లతో. అధికారులు పద్ధతులు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ అంశాలపై సరైన విచారణ జరిపించాలంటూ నరసరావుపేట ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. -
కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు
గుంటూరు జిల్లా: నాపై ఆరోపణలు చేసిన కోడెల శివరామ్ బహిరంగ చర్చకు పోలీసు పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌లతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..సత్తెనపల్లి, నరసరావుపేటలో కోడెల కుటుంబం ఎన్నో భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. రైల్వే కాంట్రాక్టర్లను కమిషన్ కోసం కోడెల శివరాం బెదిరించాడని, సత్తెనపల్లిలో మిఠాయి దుకాణం దగ్గర కూడా మామూళ్లు వసూలు చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో గుంటూరులో రూ.150 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని చెప్పారు. సొంత కార్యకర్తల గురించి కూడా కోడెల పట్టించుకోరని విమర్శించారు. ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణం ఉందని, దానిని చెడగొట్టవద్దని విన్నవించారు. కోడెల కుటుంబం వల్ల మళ్లీ ఉద్రిక్తత నెలకొంటోందని వ్యాఖ్యానించారు. అవాంఛనీయ శక్తులను తరిమికొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘అవినీతిని కొత్తపుంతలు తొక్కిస్తున్న కోడెల’
సాక్షి, గుంటూరు : అవినీతిని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీనేత, శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్రావుదేనని నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతలు దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని అన్నారు. తెలుగు యువత అధ్యక్షుడే నరసరావుపేటలో బెట్టింగ్గులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. స్పీకర్ కోడెల కుమారుడు, కుమార్తె చేస్తున్న అవినీతి అంతఇంత కాదని ఇవన్ని కోడెల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. కోడెలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కోటప్పకొండ మీద ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. దేవెన్నాదేవిలో భూకబ్జా చేసింది, కమీషన్ కోసం రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించింది, అపార్ట్మెంట్లలో ప్రతి ఫ్లాటుకు రూ.లక్ష వరకూ మాముళ్లు వసూలు చేసింది ఎవరని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యత కోడెలదేనని తెలిపారు. -
'నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే'
గుంటూరు: 'నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని' నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నరసరావుపేటలో మాట్లాడుతూ...జీవితాంతం వైఎస్ జగన్‌తో ఉంటానని చెప్పారు. బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండిచేయి చూపించిందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పోలవరానికి రూ.100 కోట్లు కేటాయిస్తే ఎప్పటికీ నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
పోలీసుల ‘దేశం’ భక్తి
నమస్తే సాబ్... బాగున్నా సాబ్... నాకేంటి సార్.. మీరు అధికారంలో ఉన్నారు.. నేను సేఫ్ అంతా మీ చలవ సార్....చెప్పండి సార్... ఫోన్ చేశారు...ఓ..మన వాళ్లేనా..ఐతే ఓకే సాబ్..మీరింతగా ఫోన్‌చేసి చెప్పాలా...నాకు తెల్వదా ఏంది సార్... నో ప్రాబ్లం.... నేనున్నాగదా సాబ్. ...నే చూసుకుంటా...మీరు మీ పనుల్లో ఉండండి...మీరు ఫోన్ పెట్టేలోపు మీ వాళ్లాంతా మీ ముందుంటారు.... ఠీక్‌హై సాబ్...అచ్చా సాబ్..నమస్తే సాబ్. సాక్షి, గుంటూరు ఫోన్‌కు ముందో నమస్కారం....చివర్లో మరో నమస్కారం....మధ్యలో వంగి వంగి సలాములు...అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసులు చేస్తున్న ‘రాజ సేవ’ఇది..పెట్టీ కేసు నుంచి పెద్ద కేసు వరకు ఆ ఎమ్మెల్యేలకు వంత పాడటం జిల్లాలో పోలీస్ అధికారులకు నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కేసులో ముఖ్య నిందితులను తప్పించి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. అమరావతి మండలం మండెపూడి గ్రామంలో అక్టోబరు 23 రాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు పాత పంచాయతీ కార్యాలయం సెంటర్లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విగ్రహాన్ని ఊరుబయట మురుగు కాలువలో పడవేశారు. ఈ సంఘటనపై అదేరోజు పెదకూరపాడు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ నాయకుడు కోటా హరిబాబులు కలిసి టీడీపీకి చెందిన సుమారు 20 మందిపై అమరావతి సీఐ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర జిల్లా నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఒకటి రెండు రోజులలో నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ హనుమంతరావు హమీ ఇచ్చారు. కేసు నమోదు చేసిన అమరావతి పోలీసులు అధికారపార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి10 మంది ముఖ్యుల పేర్లు తొలగించి వారి అనుచరులు 10 మందిపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చారు. బెయిలబుల్ కేసు కావటంతో వెంటనే బయటకు వచ్చారు. ఈ కేసులో అమరావతి పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ విషయమై అమరావతి సీఐ హనుమంతరావును ‘సాక్షి’ వివరణ కోరగా కేసుకు సంబంధం లేదని నిర్ధారించుకుని 10 మంది పేర్లు తొలగించామని, చట్ట ప్రకారమే సెక్షన్లు నమోదు చేశామని చెప్పారు. పోలీసుల వైఖరే కారణం.. ఇదిలావుంటే... గ్రామాల్లో విగ్రహ ధ్వంసాలు, గొడవలు జరిగినప్పుడు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడదని గ్రామస్తులు చెబుతున్నారు. అలా కాకుండా అధికారపార్టీ నేతల ఒత్తిడితో కేసులు నీరుగార్చడం, తప్పు చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తుండటంతో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుండటంతో గ్రామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయని వాపోతున్నారు. అధికారపార్టీ వర్గీయులకు కొమ్ముకాస్తూ వారికి రక్షణ కల్పించడంతోపాటు, వారు చెప్పినట్లుగా ఇతరపార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి మండలం మండెపూడి గ్రామంలో వైఎస్సార్ పార్టీ నాయకుడు కోట హరిబాబుపై తప్పుడు కేసు బనాయించి వారం రోజుల పాటు జైల్లో ఉండేలా చేశారు. ఏదేమైనా పోలీసులు చట్టప్రకారం వ్యవహరించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ప్రతీ కార్యకర్తకు భరోసా!
చెక్ పెడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు న్యాయపోరాటానికి దిగుతున్నారు. రాష్ట్ర స్థాయి త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, నియోజకవర్గాల్లో తమ కంట్లో నలుసుగా ఉంటారనే ఉద్దేశంతో కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారు. మరి కొందరిపై హత్యాయత్నాలకు దిగారు. ఇంకా దాడులకు తెగబడుతూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం నేతల ఆగడాలను అరికట్టేందుకు వైఎస్సార్ సీపీపెద్ద ప్రయత్నమే ప్రారంభించింది. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో మంగళగిరి, గుంటూరు తూర్పు, బాప ట్ల, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల, గురజాల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. నిబంధనల పేరుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల పింఛన్లు, రేషన్‌కార్డులను తొలగించడమే కాకుండా గెలిచిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ గౌరవం కల్పించకుండా అవమాన పరుస్తున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం సైతం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ విషయాలన్నిటినీ వైఎస్సార్ సీపీ నేతలు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. నరసరావుపేట నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు ఏ పదవీ లేకపోయినా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటే కోడెల కుమారునికే ప్రొటోకాల్ గౌరవ మర్యాదలు కల్పించడంతో పార్టీ దానిని నిలువరించే ప్రయత్నం చేసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తల కిడ్నాప్, దాడులపై హైకోర్టు సీరియస్ కావడంతో దోషులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సరస్వతి సిమెంట్స్ భూముల విషయంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. రిమాండ్‌లో ఉన్న బాధితులను పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సోమవారం గురజాలలోని సబ్‌జైలులో కలుసుకుని ధైర్యం చెప్పారు. ‘ మీకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.’ అని భరోసా ఇచ్చారు. సిమెంట్స్ భూముల్లో వివాదం జరిగినప్పుడు అక్కడ లేకపోయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. {పత్తిపాడు నియోజకవర్గంలోనూ పరిస్థితులు ఇందుకు మినహాయింపు కాదు. మంత్రి అండదండలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఇప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీడీపీ దాడులను నిలువరించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కమిటీల ఏర్పాటుతో నూతన ఉత్తేజం ... అధికార పార్టీ అక్రమాలకు కళ్లం వేయడంతోపాటు బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టపరిచేందుకు వీలుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కమిటీల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు, అధికార పార్టీ అక్రమాలను ఎండగట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని నేతలు భావిస్తున్నారు.