
సాక్షి, గుంటూరు : అవినీతిని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీనేత, శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుదేనని నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతలు దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని అన్నారు. తెలుగు యువత అధ్యక్షుడే నరసరావుపేటలో బెట్టింగ్గులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
స్పీకర్ కోడెల కుమారుడు, కుమార్తె చేస్తున్న అవినీతి అంతఇంత కాదని ఇవన్ని కోడెల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. కోడెలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కోటప్పకొండ మీద ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. దేవెన్నాదేవిలో భూకబ్జా చేసింది, కమీషన్ కోసం రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించింది, అపార్ట్‌మెంట్లలో ప్రతి ఫ్లాటుకు రూ.లక్ష వరకూ మాముళ్లు వసూలు చేసింది ఎవరని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యత కోడెలదేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment