
సాక్షి, గుంటూరు : ఓటర్ల తొలగింపులో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తి 2,800 ఓటర్లను తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. ‘వేల ఓట్ల గురించి ఒకే వ్యక్తి ఫిర్యాదు చేయడం.. దాని ఆధారంగా అధికారులు విచారణ చేయడం.. అది కూడా అర్హత లేని వాళ్లతో. అధికారులు పద్ధతులు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం’ అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ అంశాలపై సరైన విచారణ జరిపించాలంటూ నరసరావుపేట ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment