ముగిసిన కోడెల అంత్యక్రియలు | Kodela Siva Prasada Rao Cremation Complete At Narasaraopet | Sakshi
Sakshi News home page

ముగిసిన కోడెల అంత్యక్రియలు

Published Wed, Sep 18 2019 5:46 PM | Last Updated on Wed, Sep 18 2019 5:53 PM

Kodela Siva Prasada Rao Cremation Complete At Narasaraopet - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటురు జిల్లా నరసరావుపేటలో స్వర్గపురిలో కోడెల చితికి ఆయన కుమారుడు శివరామ్ నిప్పంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు హాజరయ్యారు. హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి కోడెల భౌతికాయాన్ని నిన్న రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. నేతల నివాళి అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement