స్పీకర్‌ కోడెల తనయుడిపై కేసు నమోదు | police case filed against ap speaker kodela sivaprasadarao son sivaram | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ కోడెల తనయుడిపై కేసు నమోదు

Published Sat, Apr 29 2017 3:27 PM | Last Updated on Tue, Aug 27 2019 5:55 PM

police case filed against ap speaker kodela sivaprasadarao son sivaram

గుంటూరు : నర్సరావుపేటలో కేబుల్‌ వైర్ల కత్తిరింపు వ్యవహారంలో ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నరసరావుపేటకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్‌సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు  గతంలో దాడిచేశారు.

పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. అప్పట్లోనే కోడెల తనయుడు శివరామ్‌పై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో శివరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement