న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ (Atishi Marlena)పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆమెపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ పరిణామాలతో ఆమె ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సుమారు అరవై మంది మద్ధతుదారులతో.. పది వాహనాల్లో ఆమె పతేహ్ సింగ్ మార్గ్‌కు వచ్చారు. అయితే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా.. ఆమె నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమే అని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదైంది.
అయితే ఈ పరిణామంపై అతిషి ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు అక్రమంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, నిజంగా కోడ్‌ను ఉల్లంఘించిన వాళ్లను వదిలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌పైనా ఆరోపణలు గుప్పించారు.
ఎన్నికల సంఘం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. రమేష బిధూరి కుటుంబ సభ్యులు బహిరంగంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. అయినా వాళ్ల మీద ఎలాంటి చర్యలు లేవు. అందుకు సంబంధించిన ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. ప్రతిగా నా మీదే కేసు నమోదు చేశారు. రాజీవ్‌కుమార్‌గారూ.. ఎన్నికల ప్రక్రియను ఇంకెంత దిగజారుస్తారు? అంటూ సందేశం ఉంచారామె. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ సైతం సీఈసీ రాజీవ్‌కుమార్ మీద ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగాల్సి ఉంది.
चुनाव आयोग भी ग़ज़ब है!
रमेश बिधूड़ी जी के परिवार के सदस्य खुले-आम आचार संहिता का उल्लंघन कर रहे हैं। उन पर कोई एक्शन नहीं।
मैंने शिकायत कर के पुलिस और @ECISVEEP को बुलाया, और इन्होंने मेरे ऊपर केस दर्ज कर दिया!
राजीव कुमार जी: आप चुनावी प्रक्रिया कि कितनी धज्जियां उड़ायेंगे https://t.co/UlRiBzbELV— Atishi (@AtishiAAP) February 4, 2025
Comments
Please login to add a commentAdd a comment