న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా మంత్రి అతిషి ప్రమాణస్వీకారం 21న ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణస్వీకార తేదీని అతిషి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు అందజేసిన లేఖలో తెలపలేదు. అయితే ఎల్జీ మాత్రం 21న అతిషి ప్రమాణస్వీకారాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారమందించారు.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు అతిషి అందించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపించారు. ఈ సందర్భంగా అతిషి ప్రమాణస్వీకారం 21న ఎల్జీ ప్రతిపాదించారు. అయితే అతిషి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఆమెతో ప్రమాణస్వీకారం చేస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖలో ఎల్జీకి కాకుండా రాష్ట్రపతిని ఉద్దేశించి ఒకే ఒక వ్యాఖ్యంలో రాశారు. లేఖ అందించడానికి మాత్రం కేజ్రీవాల్ స్వయంగా ఎల్జీ వద్దకు వెళ్లి అందిచడం గమనార్హం.
ఇదీ చదవండి.. ‘అతిషి డమ్మీ సీఎంగా ఉంటారు’
Comments
Please login to add a commentAdd a comment