swearing in as CM
-
21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా మంత్రి అతిషి ప్రమాణస్వీకారం 21న ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణస్వీకార తేదీని అతిషి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు అందజేసిన లేఖలో తెలపలేదు. అయితే ఎల్జీ మాత్రం 21న అతిషి ప్రమాణస్వీకారాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారమందించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు అతిషి అందించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపించారు. ఈ సందర్భంగా అతిషి ప్రమాణస్వీకారం 21న ఎల్జీ ప్రతిపాదించారు. అయితే అతిషి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఆమెతో ప్రమాణస్వీకారం చేస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.కాగా, అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖలో ఎల్జీకి కాకుండా రాష్ట్రపతిని ఉద్దేశించి ఒకే ఒక వ్యాఖ్యంలో రాశారు. లేఖ అందించడానికి మాత్రం కేజ్రీవాల్ స్వయంగా ఎల్జీ వద్దకు వెళ్లి అందిచడం గమనార్హం. ఇదీ చదవండి.. ‘అతిషి డమ్మీ సీఎంగా ఉంటారు’ -
Jharkhand politics 2024: సీఎంగా చంపయ్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్ సోరెన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్‌తో చంపయ్ సోరెన్ -
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
నేడే పట్టాభిషేకం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు. ఈ వేదికపైనే ఆయా గ్యారంటీలకు సంబంధించిన ఫైల్‌పై రేవంత్ సీఎంగా తొలి సంతకం చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. పకడ్బందీగా ఏర్పాట్లు: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఎల్బీ స్టేడియంను ముస్తాబు చేశారు. భారీ వేదికను సిద్ధం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్, ప్రియాంకలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ సీనియర్ నేతలు వేదికపై ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం డీజీపీ రవిగుప్తాతో కలసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా అన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో తాగునీరు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేయాలని.. వాహనాల పార్కింగ్, బందోబస్తు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు. కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. -
తమిళనాడు సీఎంగా స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను భారీ విజయం దిశగా నడిపిన ముత్తువేల్ కరుణానిధి(ఎంకే) స్టాలిన్(68) ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. స్టాలిన్‌తోపాటు 33 మంది మంత్రులతో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి 500 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కొత్త కేబినెట్ గ్రూప్ ఫొటో ఉదయం 9.10 గంటలకు ‘ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను..’అంటూ స్టాలిన్ తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు. అనంతరం, డీఎంకే సీనియర్ నేత, పార్టీ జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ప్రమాణం చేశారు. ఆయనకు జల వనరుల శాఖ, నీటిపారుదల ప్రాజెక్టులు, గనులు, ఖనిజాల శాఖలను అప్పగించారు. మంత్రులంతా డీఎంకే అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం తమిళంలోనే ప్రమాణం చేశారు. స్టాలిన్ క్యాబినెట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. హోం, సాధారణ ప్రజా వ్యవహారాల నిర్వహణ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తదితర విభాగాలను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు క్యాబినెట్లో చోటివ్వలేదు. కార్యక్రమం అనంతరం స్టాలిన్ రాజ్‌భవన్ నుంచి గోపాలపురంలో తండ్రి కరుణానిధి నివసించిన ఇంటికి వెళ్లి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై, కరుణాని«ధి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సచివాలయానికి చేరుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు. మొదటి విడత కోవిడ్ సాయం విడుదల సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ ప్రధాన ఎన్నికల హామీల అమల్లో భాగంగా పలు చర్యలను ప్రకటించారు. కోవిడ్ సాయం కింద బియ్యం కార్డు దారులకు రూ.4 వేలకు గాను మొదటి విడతగా రూ.2 వేలను ఈ నెలలోనే అందజేసేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో, రాష్ట్రంలోని 2,07,67,000 రేషన్ కార్డు దారులకు రూ.4,153.69 త్వరలో అందుతాయి. అదేవిధంగా, ప్రత్యేక బీమా పథకం కింద కోవిడ్ బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ఆవిన్ పాల ధరను లీటరుపై రూ.3 తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. శనివారం నుంచి రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ అమలుకు ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’పథకం అమలు కోసం ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
శాసనసభాపక్ష నేతగా స్టాలిన్ ఎన్నిక
చెన్నె: పదేళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారం చేపట్టనుంది. ఆ పార్టీ శాసనసభ పక్షనేతగా డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ స్టాలిన్‌కు ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్ ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు కొద్దిమంది సమక్షంలోనే గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో స్టాలిన్ ప్రమాణం చేయనున్నారు. స్టాలిన్‌తో పాటు కొద్ది మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నారని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి ఏకంగా స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ కన్నా అధిక సీట్లు ఉన్న డీఎంకేను అధికారం చేపట్టాలని గవర్నర్ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు బుధవారం ఉదయం స్టాలిన్‌ను తమ ఎమ్మెల్యేలంతా తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. చదవండి: కరోనాపై యుద్ధం ప్రకటించిన మమత చదవండి: కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌కు శాసనసభ పక్ష తీర్మాన ప్రతిని అందిస్తున్న కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ -
దేశవ్యాప్త విస్తరణ దిశగా ‘ఆప్’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. అరవింద్ కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో సభ్యుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్.. ఆప్ రాష్ట్రాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు విషయాలపై పని చేయాలని నిర్ణయించాం. మొదటిది, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్లు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్ కార్యక్రమం చేపడ్తాయి. ఇందులో పార్టీ వాలంటీర్లు ప్రజలను కలుస్తారు. కనీసం కోటి మందిని కలవాలనేది లక్ష్యం. అలాగే, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కలసిరావాలని కోరుతూ పోస్టర్లతో ప్రచారం చేస్తాం. ఇందుకు 9871010101 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లను అంటిస్తాం. ఆ తరువాత, అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రధాన నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో భాగంగా ఆప్‌లో చేరాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు’ అని గోపాల్ రాయ్ వివరించారు. రానున్న నెలల్లో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నామన్నారు. తద్వారా, ఆయా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఏయే రాష్ట్రాల్లో పోటీకి దిగాలనేది పార్టీ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆప్’ను ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ, గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జాతీయ స్థాయిలో సత్తా చూపాలన్న ఆ పార్టీ కోరిక నెరవేరలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అదీ పంజాబ్‌లోనే. ఢిల్లీలోని అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. -
మోదీ ఆశీస్సులు కావాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతోనూ ఇక పనిలేదని, ఎన్నికల సమయంలో తనపై అనేక విమర్శలు గుప్పించిన రాజకీయ ప్రత్యర్థులను క్షమించేశా నన్నారు. ఆదివారం ఉదయం చారిత్రక రాంలీలా మైదానంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లతో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్.. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. తనను తాను ఢిల్లీ కొడుకునని చెప్పుకున్నారు. ఈ విజయం తనది కాదని, ప్రతి ఢిల్లీ పౌరుడిదని అన్నారు. గతంలో కేంద్రంతో పలు సందర్భాల్లో తలపడిన కేజ్రీవాల్ ఈసారి మాత్రం.. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానికి కూడా ఆహ్వానం పంపామనీ, ఆయన బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారని అన్నారు. ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపనని, వచ్చే ఐదేళ్లూ ఢిల్లీ ప్రజలందరి కోసం పనిచేస్తానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు. ‘హమ్ హోంగే కామ్యాబ్..’ అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రజలతో గొంతుకలిపి పాడి కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ముగించారు. -
కేజ్రీవాల్ ప్రమాణానికి సీఎంలకు ఆహ్వానం నో
న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆమ్ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం లేదు. ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎంలు, రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించడం లేదని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్‌రాయ్ చెప్పారు. కేజ్రీవాల్ తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి, మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజల మధ్యనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలే అతిథులని కేజ్రీవాల్ భావిస్తున్నారని వివరించారు. ఏడాది బుడతడికి పిలుపు అవ్యాన్ తోమర్ అనే చిన్నారికి మాత్రం ప్రత్యేకంగా ఆప్ నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెట్టర్, మఫ్లర్, కళ్లజోడు ధరించిన ఈ ఏడాది వయస్సున్న ఈ బుడతడు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడిరోజు అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ‘బేబీ మఫ్లర్ మాన్’గా పేరొందిన తోమర్ తల్లిదండ్రులు ఆప్ కార్యకర్తలు. 24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్టు ఆప్ వెల్లడించింది. పార్టీ సభ్యత్వం తీసుకోదలిచిన వారికోసం ఆ పార్టీ ఓ ఫోన్ నంబర్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. పార్టీలో జాయిన్ అవడానికి ఆ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. -
ప్రమాణ స్వీకారానికి రండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆర్పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని సోనియాతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లూ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్‌ను ఆహ్వానించారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బుధవారం తెలిపింది. మంగళవారం హేమంత్, ఇతర కూటమి నేతలతో గవర్నర్‌తో సమావేశమై తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ అందజేశారన్నారు. -
నేడు బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం
పాట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు నితీశ్ ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు లోక్‌సభ, రాజ్యసభలోని ఆ పార్టీ నేతలుకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని ఇప్పటికే నితీశ్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఇంతకుముందే ఈ రోజు నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హాజరవుతారని నితీశ్‌కు మోదీ చెప్పినట్లు సమాచారం. వెంకయ్యతోపాటు మరో కేంద్ర మంత్రి, బిహార్‌కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ కూడా నితీష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలిసింది. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీకి ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. డిప్యూటీ సీఎం పదవి తమ కుమారుడు లేదా కుమార్తెకు ఇవ్వాలని ఇప్పటికే లాలూ...నితీశ్‌ను కోరినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నితీశ్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది.