సీఐకి ఫిర్యాదు చేస్తున్న స్టార్ టీవీ ప్రతినిధులు
సాక్షి, నరసరావుపేట టౌన్: సాంకేతిక ఫైరసీకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ బండారం మరోమారు బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత కొన్నేళ్లుగా కోడెల శివరాం గౌతం కమ్యూనికేషన్ పేరిట కే చానల్ నిర్వహిస్తూ అక్రమ ఫైరసీకి పాల్పడుతున్నాడు. స్టార్ టీవీ ప్రసారాలకు సంబంధించి డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడి ప్రతి నెలా లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నాడు. దీనిపై స్టార్ టీవీ ప్రతినిధులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కమిషన్ సభ్యుల బృందం ఈ ఏడాది ఏప్రియల్ 18న రాజాగారి కోటలోని మాజీ స్పీకర్ కోడెల నివాస గృహంలో నిర్వహిస్తున్న కే చానల్ సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అక్కడ సాంకేతిక పరంగా ప్రసారాలు చౌర్యం చేస్తున్నట్లు గుర్తించి డీకోడర్, ఎన్‌కోడర్‌లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.
న్యాయస్థానం కోడెల శివరాంకు సమన్లు జారీ చేసినా స్పందించలేదు. దీంతో కమిషన్ న్యాయవాది లక్ష్యవీర్ ముని మంగళవారం కే చానల్ కార్యాలయానికి వెళ్లి సమన్లు తీసుకోవాల్సిందిగా కోరగా సిబ్బంది నిరాకరించారు. కోర్టు ధిక్కారణ కింద న్యాయస్థానానికి నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు. శివరామ్‌పై చర్యలు తీసుకోవాలని స్టార్ ప్రతినిధులు సీఐని కోరారు. (చదవండి: కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!)
Comments
Please login to add a commentAdd a comment