
తెనాలిరూరల్: టీడీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్, అతడి భార్య పద్మప్రియ విజ్ఞప్తి మేరకు శివరామ్‌కే చెందిన కైరా ఇన్‌ఫ్రా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు బాలవెంకటసురేష్ రూ.24.25 లక్షల పెట్టుబడి పెట్టారు. మరో ముగ్గురు సుమారు రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టారు.
అందుకు సంబంధించి చెక్కుల ద్వారా లావాదేవీ జరిపారు. వీరి పెట్టుబడి, అందుకు తగిన ప్రతిఫలాన్ని మరుసటి ఏడాది 2017లో తిరిగి ఇచ్చేలా శివరామ్, అతడి భార్య ఒప్పందం చేసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తెనాలి కోర్టును ఆశ్రయించారు. బాలవెంకటసురేష్ పిటిషన్‌పై కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శివరామ్‌పై 420, 407, 403, 386, 389, 120బి, 506, 509 ఐపీసీ, 156(3) సీఆర్‌పీసీ సెక్షన్ల కింద రూరల్ ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment