టీడీపీ నేత అఘాయిత్యం.. యువతి ఆరోగ్య పరిస్థితి విషమం | TDP Leader Harassment On Young Girl At Tenali | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత అఘాయిత్యం.. యువతి ఆరోగ్య పరిస్థితి విషమం

Published Mon, Oct 21 2024 11:08 AM | Last Updated on Mon, Oct 21 2024 11:31 AM

TDP Leader Harassment On Young Girl At Tenali

సాక్షి, తెనాలి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. ప్రతీరోజూ ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ రౌడీ షీటర్‌ చేతిలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల ప్రకారం.. అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె బాడీపై కమిలిన గాయాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బాధితురాలిని హింసించి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్‌ నవీన్.. మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్‌ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక, ఘటనలో నిందితుడు నవీన్‌కు తాజాగా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే, కూటమి నేతలు నవీన్‌ను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement