నీరు- చెట్టు కార్యక్రమం కోసం చెరువుల నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగింది.
గుంటూరు: నీరు- చెట్టు కార్యక్రమం కోసం చెరువుల నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగింది. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని సత్తెనపల్లి- నర్సరావుపేట రోడ్డులో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అక్రమాలపై వారు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.