
సాక్షి, తాళ్లపుడి: నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణ చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకురాలు తానేటి వనిత ఆధ్యర్యంలో తాడిపుడి ఇసుక ర్యాంపు వద్ద ధర్నా నిర్వహించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న లారీలను పార్టీశ్రేణులు అడ్డుకోవడంతో ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ..మంత్రి జవహర్ అండతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కన్నుసైగల్లోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని విమర్శించారు. అక్రమంగా ఇసుక తరలించే ముఠాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment