javahar
-
‘టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఆ హత్య జరిగింది’
సాక్షి, పశ్చిమ గోదావరి : కొవ్వూరులో బీసీ వర్గానికి చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి హత్య తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోపాల కృష్ణ హత్య కేసును న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తానని టీడీపీ నాయకుడు ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్య టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని అందరికి తెలుసన్నారు. అందుకే మంత్రి జవహర్, బాపిరాజులు జనాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఏలూరులో ఇందుమతి అనే రజక స్త్రీ స్నానానికి వెళ్తే నిప్పు పెట్టి హత్య చేశారని వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ దారుణాన్ని జిల్లా ఎస్పీ ఆత్మహత్యగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇలాంటి టీడీపీ నాయకులకు బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో 400 మంది బీసీలు లోన్లకు దరఖాస్తు చేస్తే కేవలం ముగ్గిరికి మాత్రమే లోన్ ఇచ్చారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
అక్రమ ఇసుక రవాణ...వైఎస్పార్సీపీ ధర్నా
సాక్షి, తాళ్లపుడి: నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణ చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకురాలు తానేటి వనిత ఆధ్యర్యంలో తాడిపుడి ఇసుక ర్యాంపు వద్ద ధర్నా నిర్వహించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న లారీలను పార్టీశ్రేణులు అడ్డుకోవడంతో ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..మంత్రి జవహర్ అండతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కన్నుసైగల్లోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని విమర్శించారు. అక్రమంగా ఇసుక తరలించే ముఠాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
మంత్రిననే అహంకారంతోనే విమర్శలు
భీమవరం : సాధారణ కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా పనిచేసిన కేఎస్ జవహర్ మంత్రి పదవి రాగానే అహంకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు హెచ్చరించారు. ఎంతోమంది టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్న జవహర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయిలేదన్నారు. మద్యం అమ్మకాలు పెంచుకోడానికి ప్రజలకు హెల్త్‌డ్రింక్ అంటూ ప్రచారం చేసిన జవహర్ మంత్రి పదవికి అనర్హుడని మోషేన్‌రాజు దుయ్యబట్టారు. కొవ్వూరు నియోజకవర్గంలో పరాన్నజీవిగా కొంతమందిపై ఆధారపడి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇసుకదోపిడీ, మద్యం మాఫియాలతో సంబంధాలు పెట్టుకుని తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జవహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఎస్సీల పరువు తీయకుండా మంత్రి సత్ప్రవర్తనతో ఉండాలని హితవు చెప్పారు. -
ఔను నా రూటే సపరేటు..!
సాక్షి కథనంపై మంత్రి జవహర్ అక్కసు జిల్లా వేడుకలకు పోటీగా కొవ్వూరులో జెండా ఆవిష్కరణ వచ్చే ఏడాది మరింత ఘనంగా చేస్తామని ప్రకటన ఆర్డీఓను వెనకేసుకొచ్చిన మంత్రి పోటీ కార్యక్రమంపై ప్రభుత్వానికి నిఘావర్గాల నివేదిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : ’ఔను.. నా రూటే సపరేటు..? వచ్చే ఏడాది కొవ్వూరులో వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహిస్తాను. సాక్షి ప్రతికలో వచ్చిన కథనాన్ని అందరూ ఖండించాలి’ అంటూ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్వాతంత్ర వేడుకలకు పోటీగా కొవ్వూరులోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ సాక్షి మంగళవారం కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం లక్షలాది రూపాయలు సొంతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో ఆయా విభాగాల అధికారులు ఆందోళనను సాక్షి కథనంలో ప్రతిబింబించింది. కథనంలోని అంశాలకు ఏ మాత్రం వివరణ ఇవ్వని మంత్రి జవహర్ సాక్షిపై తన అక్కసు వెళ్లగక్కారు. ’అదో దొంగ పత్రిక , ’సాక్షి’ని బహిష్కరించండి’ అంటూ మండిపడ్డారు. పాపం ఆర్డీఓను ఇబ్బంది పెట్టేలా వార్త రాశారంటూ ఆయనపై జాలి చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవాలు ఎక్కడైనా, ఎవరైనా చేసుకోవచ్చునని, కనీస అవగాహన లేకుండా రాసిన రాతలను ఖండించాలని సూచించారు. వచ్చే ఏడాది ఇంత కంటే ఘనంగా నియోజకవర్గ స్థాయిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వంతపాడారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేస్తే బావుంటుందని సూచించారు. ఆనవాయితీ ఇదీ.. వాస్తవానికి ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా తీసుకుని జిల్లా కేంద్రంలో అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలను ఏటా నిర్వహించడం ఆనవాయితీ. ఇక గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, వాడవాడలా వేడుకలు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ కార్యాల యాల్లో ఆయా శాఖ అధికారులు వేడుకలు చేస్తారు. ఇంత వరకు నియోజకవర్గస్థాయిలో ఉత్సవాలు నిర్వహించిన దాఖలాలు లేవు. మంత్రి జవహర్ మాత్రం కొత్త భాష్యం చెబుతూ ఆయన నియోజకవర్గంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇదే విషయమై ’సాక్షి’ ’నా రూటే సపరేటు’ అన్న శీర్షీకతో కథనం ప్రచురించింది. మంగళవారం కొవ్వూరులో తప్ప ఎక్కడా నియోజకవర్గస్థాయిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించ లేదు. మంత్రి తన ఇలాకాలోని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ వేడుకలు ఏర్పాటు చేశారనే విమర్శలు ఉన్నాయి. నిధులెక్కడివి? ప్రభుత్వం నియోజకవర్గస్థాయి వేడుకలకు పైసా నిధులు ఇవ్వలేదు. అయినా డివిజన్‌స్థాయి అధికారి అయిన ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రాలు ముద్రించి మరీ అధికారులను, రాజకీయ పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చుచేశారు. గృహనిర్మాణ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు శకటాలు ఏర్పాటు చేశాయి. భారీ ఎత్తున టెంట్లు, కుర్చీలు, బారీకేడ్లు, స్టాళ్లు ఏర్పాటుచేశారు. వచ్చిన వాళ్లకు డ్రింకులు, వాటర్ బాటిళ్లు ఇచ్చారు. వ్యవసాయశాఖ ద్వారా అందించే సబ్సిడీ యంత్రాలు, ట్రాక్టర్లు అన్నీ ఇక్కడికి తరలించారు. వీటి కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వ పరంగా నిధులు ఏమీ కేటాయించనప్పుడు ఇవన్నీ ఎలా నిర్వహించారన్న దానిపై అధికారులు నోరుమెదపడం లేదు. నిఘావర్గాల నివేదిక ప్రభుత్వం అధికారికంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకలకు పోటీగా మరోమంత్రి తన నియోజకవర్గంలో వేడుకలు నిర్వహించడంపై ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ఆరాతీసినట్టు సమాచారం. మరోవైపు నిఘా విభాగాలు కూడా ఇక్కడ జరిగిన తంతుపై పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందచేసినట్టు సమాచారం. రాజకీయ సభను తలపించింది సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకోవడం, రాష్ట్ర, దేశాభివృద్ధికి తీసుకునే అంశాలను వెల్లడించడం పరిపాటి. మంత్రి కేఎస్ జవహర్ మాత్రం స్వాతంత్య్ర వేడుకను రాజకీయ సభలా మార్చేశారు. ఆయన ప్రసంగమంతా తన పార్టీని పొగడడానికే ఉపయోగించారు. వేదికపై మంత్రి జవహర్ సతీమణి, ఉపాధ్యాయురాలైన ఉషారాణి, ఆయన కుమార్తె ఆశీనులయ్యారు. -
నా రూటే సపరేటు!
కొవ్వూరులో మంత్రి పోటీ కార్యక్రమం జెండా వందనానికి ఏర్పాట్లు ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : నా రూటే సపరేటు అంటున్నారు అబ్కారీ మంత్రిగారు... ఈసారి జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు జెండా వందనం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో తన నియోజకవర్గంలో పోటీగా కార్యక్రమం నిర్వహించేందుకు మంత్రి కె ఎస్ జవహర్ చేస్తున్న ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆర్డీఓ పేరుతో దీని కోసం ఆహ్వాన పత్రిక కూడా వేయించారు. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడే జెండా వందనం చేసిన మంత్రి గారి సందేశం, పోలీసు వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల ప్రదానం, లబ్దిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల రాయితీల పంపిణీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఏలూరులో పోలీసు పెరెడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీ. అధికారికంగా మాత్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుని జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీనికి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మంత్రి జెండా ఎగువవేయడం రివాజుగా వస్తుంది. గత మూడేళ్లు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెండా అవిష్కరణ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరును ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాత్రం కొత్త పం«థాకు తెరలేపారు. కొవ్వూరులో మాత్రం అన్ని శాఖల అ«ధికారుల భాగస్వామ్యంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. దీనికి ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రం ముద్రించడం తోపాటు అన్ని శాఖల అధికారులతో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు శకటాలను సైతం ఏర్పాటు చేశాయి. ఇతర శాఖలను అడిగినా వారు సానుకూలంగా స్పందించలేదు. మరో ఆరుశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారులంతా గత మూడు, నాలుగు రోజుల నుంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చినప్పటికీ మంత్రి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుందని అధికారులు ఏర్పాట్లులో తలమునకలయ్యారు. కొవ్వూరు మండలంతో పాటు పట్టణ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులను తరలించే బాధ్యతను ఎంఈఓకు అప్పగించారు. ఒక్కో శకటం తయారీకి రూ.50 వేలు ఖర్చువుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లులు అందజేస్తే సొమ్ములు చెల్లిస్తామని ఆర్డీఓ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తీరా ఖర్చు చేసిన తర్వాత సొమ్ములు వస్తాయో రావోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే యంత్ర పరికరాలు, సబ్సిడీపై అందించే పరికరాలు, ఇతర శాఖలు ద్వారా అందించే సబ్సిడీ సామగ్రి అంతా ఈ వేడుకలకు తరలిస్తున్నారు. పట్టణంలో సంస్కృత పాఠశాలలో భారీ ఎత్తున నిర్వహించే ఈ వేడుకలకు సుమారు నాలుగు వేల మంది హాజరవుతారని ఆర్డీఓ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రాంగణంలో ఏర్పాట్లును ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. కుర్చీలు, టెంటులు, వేదికలు, తాగునీరు, డ్రింక్స్ వంటి ఏర్పాటు చేశారు. వీటికి సుమారు రూ.ఐదు లక్షలకు పైనే ఖర్చులు అవుతున్నట్టు అంచనా. ఈ భారమంతా అధికారులపైనే వేస్తున్నారన్న విమర్శలున్నాయి. మొత్తానికి పోటీగా జరుపుతున్న ఈ వేడుకలు జిల్లాలో చర్చకు దారితీసాయి. -
జవహర్‌కు చోటు.. సుజాతకు ఉద్వాసన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన పీతల సుజాతకు ఉద్వాసన పలికిన చంద్రబాబు నాయుడు ఆమె స్థానంలో అదే వృత్తి నుంచి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఎస్ జవహర్‌కు పట్టం కట్టారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి ఎవరికి స్థానం కల్పిస్తారనే దానిపై శనివారం అర్ధరాత్రి వరకూ హైడ్రామా నడిచింది. అదివారం ఉదయం 9,22 గంటలకు మంత్రి వర్గ విస్తరణ ముహూర్తాన్ని నిర్ణయించినా అర్ధరాత్రి వరకూ కసరత్తుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైడ్రామా నడిపారు. దీంతో అశావాహులు మంత్రివర్గ జాబితాలో తమ పేరు ఉంటుందన్న ఆశతో ఎదురుచూశారు. పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పీతల సుజాతను మంత్రివర్గంలో కొనసాగిస్తారంటూ వార్తలు వచ్చాయి. చివరకు అమె పదవిని వదులుకోక తప్పలేదు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కూడా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేశారు. చినబాబు లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో తనకు పదవి వస్తుందని ఆయన ఆశించారు. దీనికోసం ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్దఎత్తున ముఖ్యమంత్రిని కలిశారు. అయితే కుల సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పడంతో అదే సామాజిక వర్గం వారందరూ తమ రెండో ఆప్షన్‌గా జవహర్ పేరు చెప్పడంతో అతనికి పదవి దక్కినట్టు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన రావెల కిషోర్‌బాబుపై అరోపణల నేపథ్యంలో అతని పదవి పోవడంతో ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన జవహర్‌కు చోటు దక్కింది. మరోవైపు ఎస్టీ కోటాలో ఇప్పటివరకూ ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. తెలుగుదేశం తరపున ఎస్టీ శాసనసభ్యునిగా పోలవరానికి చెందిన మొడియం శ్రీనివాస్ ఒక్కరే గెలిచారు. దీంతో అతనికి మంత్రి పదవి ఖరారు చేసినట్టు ప్రచారం సాగింది. పార్టీ కార్యాలయం నుంచి కూడా అందుబాటులో ఉండాలంటూ సమాచారం వచ్చింది. చివరి నిముషంలో ఆయనకు పదవి దక్కలేదు. మరోవైపు మైనారిటీ కోటా కింద నరసాపురానికి చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌కు చోటు దక్కిందని ప్రచారం సాగినా చివరకు ఆయనకు పదవి రాదని తేలిపోయింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేరు కూడా చర్చకు వచ్చింది. సీనియర్ నేత అయిన పితానికి బీసీ కోటాలో తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం సాగింది. కాపు సామాజిక వర్గం తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టిబలిజ కులానికి చెందిన పితానికి పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో పితాని సత్యనారాయణముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. చివరి నిమిషంలో పితానికి చోటు దక్కింది. ఇదిలావుంటే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)కూ స్థానం దక్కవచ్చని ప్రచారం జరిగినా ఇటీవలే అదే సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజుకు ఎమ్మెల్సీ రావడం, శివ కుటుంబ సభ్యులకు వెమ్ ఏరోసిటీ ప్రాజెక్టు దక్కడంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.