మంత్రిననే అహంకారంతోనే విమర్శలు | Koyye Mohanraju Fires On Javahar | Sakshi
Sakshi News home page

మంత్రిననే అహంకారంతోనే విమర్శలు

Published Sat, Apr 7 2018 11:54 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

Koyye Mohanraju Fires On Javahar - Sakshi

భీమవరం : సాధారణ కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా పనిచేసిన కేఎస్‌ జవహర్‌ మంత్రి పదవి రాగానే అహంకారంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు హెచ్చరించారు. ఎంతోమంది టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకున్న జవహర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయిలేదన్నారు.

మద్యం అమ్మకాలు పెంచుకోడానికి ప్రజలకు హెల్త్‌డ్రింక్‌ అంటూ ప్రచారం చేసిన జవహర్‌ మంత్రి పదవికి అనర్హుడని మోషేన్‌రాజు దుయ్యబట్టారు. కొవ్వూరు నియోజకవర్గంలో పరాన్నజీవిగా కొంతమందిపై ఆధారపడి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు.   ఇసుకదోపిడీ, మద్యం మాఫియాలతో సంబంధాలు పెట్టుకుని తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జవహర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఎస్సీల పరువు తీయకుండా మంత్రి సత్ప్రవర్తనతో ఉండాలని హితవు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement