Vanitha
-
'పెళ్లి’ ఆశతో ప్రేమలో పడ్డాం.' వనితా విజయ్‌కుమార్ లవర్స్ డే స్పెషల్!
తమిళ నటి వనిత విజయకుమార్ గురించి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేదు. 1995లో 'చంద్రలేఖ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓ సినిమాతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ. అయితే తెలుగులో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించిన వనితా ఈ లవర్స్ డే కానుకగా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.అయితే వనితా విజయ కుమార్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతేడాది అక్టోబర్‌లో వార్తలొచ్చాయి. బీచ్‌లో అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లు ఫోటోలు షేర్ చేయడంతో అందరూ కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైపోయిందని భావించారు. కానీ ఆ తర్వాత మూవీ ప్రమోషన్స్ కోసమే పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసింది.తాజాగా తన మూవీ ప్రమోషన్లలో భాగంగా మరో పోస్టర్‌ను విడుదల చేసింది. మిసెస్ అండ్ మిస్టర్ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. 'పెళ్లి చేసుకోవాలనే ఆశతో ప్రేమలో పడ్డాం.. కలకాలం కలిసి జీవించాలనే ఆశతో పెళ్లి చేసుకున్నాం.. అరుణ్, విద్యాల ప్రపంచంలో ఏం జరిగింది...? అంటూ లవ్ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన కొందరు మళ్లీ పెళ్లి చేసుకోబోతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగంగానే చేసినప్పటికీ పెళ్లికి సంబంధించిన పోస్టర్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో పెళ్లి కూతురిలా రెడీ అయిన వనితా విజయ్ కుమార్‌ను చూసిన కొందరు అభిమానులు ఫిదా అవుతున్నారు.నాలుగో పెళ్లిపై రూమర్స్..గతేడాది అక్టోబర్‌లో నాలుగో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఇలానే ఓ కొరియోగ్రాఫర్ రాబర్ట్‌కు ప్రపోజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నోరెళ్లబెట్టారు. తాజా పోస్టర్ చూసిన కొందరు నెటిజన్స్ మరోసారి పెళ్లి గురించి చర్చ మొదలెట్టారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ కంటే ఆమె పెళ్లి గురించి ఎక్కువ చర్చించుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
తానేటి వనిత స్ట్రెయిట్ టాక్
-
బాబుకు జైల్లో ఎలాంటి లోపాలు లేవు: తానేటి వనిత
-
హీరోగా శివారెడ్డి.. ట్రైలర్ విడుదల
శివారెడ్డి, జాష్ణిని, వనితా రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రెంట్’. రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా వచ్చిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రెంట్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేసిన చిత్రం ‘రెంట్’. ఇందులో థ్రిల్లింగ్ కథ, కామెడీ, యాక్షన్, సందేశం ఉన్నాయి’’ అన్నారు శివారెడ్డి. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వనితా రెడ్డి. -
పేదల చెంతకు విద్య, వైద్య రంగాలు
ఏఎన్‌యూ (గుంటూరు) : సామాన్యుడి సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞంలో మేధావులు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత కోరా రు. ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు–2023 ప్రదానోత్స వం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వనిత మాట్లాడుతూ.. ఎంతో ఖరీదైనవిగా మారిన విద్య, వైద్య రంగాలను ఉచితంగా పేదల చెంతకు చేర్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని విస్మరించిందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగుతోపాటు సంస్కృత అకాడమీని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారని, అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విశ్రాంత అధ్యాపకుడు, చిత్రకళాకారుడు ఆర్.సుభాష్‌బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థి దశలోనే తోటి విద్యార్థులకు ఎంతో ప్రేరణ ఇచ్చేవారని తెలిపారు. ఉగాది పురస్కారాల ప్రదానం షార్ డైరెక్టర్ పి.గోపీకృష్ణ (విద్య, శాస్త్ర సాంకేతిక రంగం), డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే (వైద్య రంగం), పసుమర్తి పావని (లలిత కళలు), కురటి సత్యం నాయుడు (జానపద, నాటక రంగం), వి.గోపీచంద్ (వ్యవసాయ రంగం), మాదిరెడ్డి కొండారెడ్డి (సేవా రంగం), ఆర్.సుభాష్‌బాబు (చిత్రకళా రంగం)కు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఏఎన్‌యూ వీసీ పి.రాజశేఖర్, తెలుగు అకాడమీ డైరెక్టర్ వి.రామకృష్ణ ప్రసంగించారు. ఏపీ వేదికగా విశ్వజనీన ఆరోగ్య పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచానికే ఆదర్శమైన ఆరోగ్య పథకాలు అమలువుతున్నాయి. పేదవాడి ఆరోగ్యంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనే వాస్తవాన్ని గ్రహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో రోగాలకు చికిత్స అందించేలా నిర్ణయం తీసుకుని విశ్వజనీన ఆరోగ్య ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోగ్య ప్రణాళికను నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. నాడు–నేడు పథకం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అవుతోంది. అందుకే ఏపీ ప్రభుత్వంతో కలిసి కొన్ని సేవలందించేందుకు సిద్ధమవుతున్నా.– డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రముఖ కార్డియాలజీ వైద్య నిపుణులు -
ఆ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
నగరి (చిత్తూరు జిల్లా)/సాక్షి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం రూరల్/కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్నారు. ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందన్నారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం వేర్వేరుచోట్ల మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అది: తానేటి వనిత శ్రీదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరంలో అన్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శ్రీదేవికి వైఎస్సార్సీపీ చాలా గౌరవం, గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసిన వారి పక్షానే శ్రీదేవి చేరిందని ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ప్రయత్నిస్తానని శ్రీదేవి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆమె తెలంగాణ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. శ్రీదేవి వ్యాఖ్యలు విడ్డూరం: ఆదిమూలపు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా శ్రీదేవి వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం దళితులను అవమానిస్తోందని శ్రీదేవి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులను అక్కున చేర్చుకున్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని, దళితులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని సురేష్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. వారికి పట్టిన గతే వీరికి: నారాయణస్వామి సీఎం జగన్ అండతో గెలిచి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకూ పడుతుందన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు జైలు కూడు తప్పదన్నారు. వారికి రాజకీయంగా పుట్టగతులుండవు: రోజా సీఎం జగనన్న అండతో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కదారి పట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని రోజా అన్నారు. నీచ రాజకీయాలతో నాలుగు సీట్లు గెలిచి ఏదో సాధించినట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే తాటాకు చప్పుళ్లకు భయపడ్డానికి జగనన్న కుందేలు కాదు సింహమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఏనాడు న్యాయంగా రాజకీయం చేయలేదన్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనగలడేమోగానీ.. కోట్లాదిమంది ప్రజల గుండెల్లో జగనన్నకు ఉన్న అభిమానాన్ని కొనలేడన్నారు. 2019 మాదిరిగానే 2024లో కూడా జగనన్న అదే రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు. ఉండవల్లి శ్రీదేవి కాదు.. ఊసరవెల్లి శ్రీదేవి: అమర్నాథ్ ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగిస్తూనే ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో అన్నారు. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురుతో వచ్చి సీఎం జగన్‌తో ఫొటో కూడా తీయించుకుని సినీనటి శ్రీదేవిని మైమరిపించేలా నటించారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటువేసి.. ఇప్పుడు దళిత కులం కార్డు అడ్డుపెట్టుకుని అందరి మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ముడుపులు తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తురాలేదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనేకన్నా.. ఊసరవెల్లి శ్రీదేవి అనడం బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రజారోగ్యం, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం, మహిళా భద్రత, మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మంత్రులు చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమాధానాలు చెప్పనివ్వకుండా మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రులు వాస్తవాలు చెబుతుంటే తట్టుకోలేక సభను తప్పుదారి పట్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలిలా ఉన్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 1142 పీహెచ్సీలలో 1125 పీహెచ్‌సీలను రూ.670 కోట్లతో ఆధునికీకరించాం. టీడీపీ హయాంలో 5 పీహెచ్‌సీలనే కొత్తగా ఏర్పాటు చేశారు. మా ప్రభుత్వం 88 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టాం. ప్రతి పీహెచ్సీలో కచ్చితంగా 14 మంది వైద్య సిబ్బంది ఉండేలా నియామకాలు చేపట్టాం. 175 రకాల మందులను ఉచితంగా ఇస్తున్నాం. దీంతో ఓపీల సంఖ్య పెరిగింది. పీహెచ్‌సీల్లోనే స్క్రీనింగ్, లేబొరేటరీ సదుపాయాలు తీసుకొచ్చాం. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ తీసుకొచ్చాం. గ్రామాల్లోని చిన్నారుల ఆరోగ్య రక్షణ మా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఉంది. సింగరాయకొండలో పీహెచ్‌సీని రూ.50 లక్షలతో ఆధునికీకరించాం. ఇక్కడ 60 వేల మంది ప్రజలకు ఒకే పీహెచ్సీ ఉంటే దానిని వికేంద్రీకరించాం. పక్కనే పాకాలలో రూ.2.53 కోట్లతో కొత్తది నిర్మిస్తున్నాం. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గంజాయి సాగు నుంచి గిరిజనులకు విముక్తి ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌తో అమాయక గిరిజనులను గంజాయి సాగు ఉచ్చు నుంచి కాపాడుతున్నాం. ఆపరేషన్ పరివర్తన్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. శాటిలైట్ ఫొటోల సాయంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని 8,554 ఎకరాల్లోని గంజాయి పంటను ధ్వంసం చేశాం. మాపై విమర్శిస్తున్న ప్రతిపక్షాలు శాటిలైట్ చిత్రాలు చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 ఏజెన్సీ మండలాల్లో గంజాయి సాగు లేకుండా చేశాం. ఆరు మండలాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా సాగును వదిలేశారు. వీరందరికీ స్వయం ఉపాధితో పాటు ఉద్యోగావకాశాలూ కల్పిస్తున్నాం. టీడీపీ హయాంలో 200 ఎకరాల్లో మాత్రమే గంజాయిని ధ్వంసం చేశారు. సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికడుతున్నాం. మా ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చర్యలు చేపట్టింది. 18 దిశ పోలీసు స్టేషన్లు, 13 ప్రత్యేక న్యాయ స్థానాలను తెచ్చింది. లోకేశ్ ఆధ్వర్యంలో దిశ బిల్లు ప్రతులను తగలబెట్టిన టీడీపీ నాయకులకు మహిళా రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదు. దిశ యాప్‌తో ఆపదలో ఉన్న మహిళలను క్షణాల్లోనే రక్షిస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చదవడం మానేస్తే తప్ప టీడీపీ నాయకులకు వాస్తవాలు బోధపడవు. మహిళలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షం బాధితులనే రోడ్డున పడేస్తూ నీచ రాజకీయాలు చేస్తోంది. – తానేటి వనిత, హోంశాఖ మంత్రి రాష్ట్రమనే తులసి వనంలో టీడీపీ గంజాయి మొక్క రాష్ట్రమనే తులసి వనంలో టీడీపీ గంజాయి మొక్కగా మారింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ సత్ఫలితాలను ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతోంది. – అబ్బయ్య చౌదరి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వైద్య రంగంలో సిబ్బందిని పెంచాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు తగినట్టుగా సిబ్బందిని పెంచాలి. అన్ని పీహెచ్‌సీలకు సమానంగా రోగులు రారు. రేషనలైజేషన్ పేరుతో పీహెచ్‌సీల్లో సిబ్బందిని తగ్గిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. నాడు–నేడులో పీహెచ్‌సీల అభివృద్ధితో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. – కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే దిశ బిల్లు చట్టంగా మారేలా చూడాలి దిశ బిల్లు చట్టంగా రూపుదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం దిశ బిల్లుకు సవరణలు కోరుతూనే ఉంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టాలి. – ఆదిరెడ్డి భవాని, టీడీపీ ఎమ్మెల్యే -
Womens Day: వనిత జీవితం మనందరికీ ఆదర్శం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వనిత గారి జీవితం మనందరికీ ఆదర్శం అంటూ ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వనిత తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచారంటూ కొనియాడారు. వనితతోపాటు మహిళాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం. వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.#InternationalWomensDay pic.twitter.com/rtRHf3O1pF — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2023 ఈ వీడియోలో వనిత ఏం చెప్పారంటే.. వివాహమయ్యాక ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్తతో తనకు గొడవలు అయ్యి పుట్టింటికి వెళ్లిపోయినట్లు టీ వనిత తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తనపైనే పడిందన్నారు. కష్టాల్లో ఉన్న తనకు వలంటీర్ ఉద్యోగం ఇప్పించారని పేర్కొన్నారు. ఆసరా డబ్బులు, సున్నా వడ్డీ డబ్బులు, అమ్మఒడి డబ్బులు అన్నీ అందుతున్నాయని వివరించారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తన జీవితంలో సీఎం జగన్ వెలుగులు నింపారని చెప్పారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్ -
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి : హోంమంత్రి తానేటి వనిత
-
మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత
సాక్షి,విజయవాడ: రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు హోంమినిస్టర్ వనిత సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి తన కాన్వాయ్ ఆపి గాయపడిన దంపతులకు సహాయం చేశారు. అంబులెన్స్‌కు కాల్ చేసి వచ్చే వరకు అక్కడే ఉండి దగ్గరుండి వారిని ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా గాయపడిన దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్
VR Vanitha Announces Retirement: టీమిండియా మహిళా క్రికెటర్ వి ఆర్ వనిత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు 31 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ ప్రకటించింది. టీమిండియాతో తన 12 ఏళ్ల ప్రయాణాన్ని వనిత తన ట్వీట్లో వివరించింది. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యావాదాలు తెలిపింది. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక, బెంగాల్ జట్లకు ఆడిన వనిత.. 2014 జనవరిలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడిన ఆమె.. ఓవరాల్‌గా 300కు పైగా పరుగులు సాధించింది. And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO — Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022 చదవండి: ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సెన్కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ పౌర హక్కుల మహిళా న్యాయవాది, భారతీయ మూలాలున్న వనితా గుప్తా(46) అమెరికా ప్రభుత్వంలో కీలకమైన పదవిని అధిరోహించనున్నారు. వనితా గుప్తాను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపిక చేస్తూ అమెరికా సెసేట్ నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యాయశాఖ విభాగంగా మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్ అటార్నీ జనరల్‌గా శ్వేతజాతీయేతర వ్యక్తి ఎంపికకావడం ఇదే తొలిసారి. ఈ పదవికి ఎంపికైన తొలి పౌర హక్కుల లాయర్ కూడా వనితనే కావడం గమనార్హం. ఎంపిక విషయంలో సెనేట్‌లో బుధవారం జరిగిన ఓటింగ్‌లో వనితకు మద్దతుగా రిపబ్లికన్ మహిళా సెనేటర్ లీసా ముర్కోవ్స్కీ ఓటు వేశారు. దీంతో 51–49 ఓట్లతో వనిత ఎంపిక ఖాయమైంది. ఒకవేళ ఓటింగ్ ‘టై’ అయితే తన ఓటును వినియోగించుకునేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్‌కు వచ్చారు. సెనేట్ రెండు పార్టీలకు చెరో 50 మంది సభ్యులు ఉన్నారు. వనిత 28 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బరాక్ ఒబామా హయాంలో పౌర హక్కులకు సంబంధించి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. -
లాయర్ వనిత: అగ్రరాజ్య అటార్నీ
అమెరికాలో ఈ ఏడాది జనవరి 20 భారతీయులకు పెద్దపండగ. అక్కడ ఉన్న ఎన్నారైలకే కాదు, ఇక్కడున్న మనక్కూడా. ఆ రోజు జో బైడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాధ్యతలు చేపడతారు. కమల భారత సంతతి మహిళ కనుక అది మనకు గర్వకారణం. అయితే ఈ గర్వకారణం ఇప్పుడు కమల ఒక్కరి వల్లే కాదు, వనితాగుప్త వల్ల కూడా. గురువారం జో బైడన్ అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారతీయ అమెరికన్ వనితాగుప్తను నామినేట్ చేశారు. అగ్రరాజ్యానికి శ్వేతసౌధం, జస్టిస్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైనవి. ఈ కీలకమైన విభాగాలు రెండిటిలోనూ కమల, వనిత ఉన్నారు! దీనర్థం వచ్చే నాలుగేళ్ల అమెరికా పరిపాలనలో భారతీయుల సగ భాగస్వామ్యం కూడా ఉండబోతున్నదని. శ్వేతసౌధంలో కమల ఎలాగో, జస్టిస్ డిపార్ట్మెంట్లో వనిత అలాగ. జో బైడన్.. వనితను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చెయ్యగానే ఆ అగ్రరాజ్యపు ప్రధాన న్యాయ వ్యవస్థకు కొండంత బలం చేకూరినట్లయింది. ఇదేమీ అతిశయోక్తితో కూడిన మాట కాదని వనిత ‘ప్రొఫైల్’ చూస్తే అర్థమౌతుంది. అసలు 45 ఏళ్ల వయసుకే వనిత ఆ అత్యున్నత స్థానాన్ని చేపట్టబోతున్నారు. ఆమె నియామకానికి సెనెట్ ఆమోదం తెలుపవలసి ఉన్నప్పటికీ అదేమీ విషమ పరీక్ష కాదు. పాలనా పరమైన ఒక సోపానం మాత్రమే. అటార్నీ జనరల్ జస్టిస్ మెరిక్ గార్లండ్ తర్వాతి స్థానం వనిత దే. ఆమె తర్వాత లీసా మొనాకో డిప్యూటి అటార్నీ జనరల్‌గా ఉంటారు. లీసా తర్వాత క్రిస్టెన్ క్లార్క్ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా ఉంటారు. ఈ టీమ్ అంతా కూడా న్యాయ వ్యవస్థలోని పౌర హక్కుల విభాగానికి పని చేస్తుంది. వనితను ఈ విభాగంలోకి తీసుకోడానికి ప్రధానం కారణం కూడా అదే. పౌర హక్కుల న్యాయవాదిగా ఆమెకు అమెరికా అంతటా మంచి పేరుంది. బైడన్ తనను నామినేట్ చేయగానే ‘‘బాధ్యత ఉన్న స్థానంలోకి నేను ఎంపికవడం నాకు లభించిన గౌరవం’’అని వనిత ట్వీట్ చేశారు. ‘‘రాజకీయ జోక్యాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నా వృత్తి ధర్మాన్ని నేను నెరవేరుస్తాను’’ అని కూడా అమెరికన్ ప్రజలకు ఆమె మాట ఇచ్చారు. గురువారం సరిగ్గా అమెరికన్ పాలనా భవనంలో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే వనిత నియామకం జరిగింది. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టగానే బహుశా ఆమె టేబుల్ మీదకు వచ్చే మొదటి కేసు ఆ ఘటనకు కారకులైన వారికి సంబంధించినదే అయివుండే అవకాశాలున్నాయి. బైడెన్ ప్రతి విభాగంలోని తన టీమ్‌ని ఎన్నో ఎంపికల తర్వాత మాత్రమే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరీ ఖరారు చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే అనితకు వచ్చిన అవకాశమే ఇది. వాస్తవానికి ఇది అమెరికన్ పౌరులకు వచ్చిన అవకాశం అనుకోవాలి. వనిత తల్లిదండ్రులు రాజీవ్, కమల, అక్కాచెల్లెళ్లు అనిత, అమిత అనితాగుప్తా యేల్ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. ఆ వెంటనే న్యూయార్క్‌లోని ప్రముఖ పౌర హక్కుల సంస్థ ఎల్.డి.ఎఫ్. (లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఫండ్’ లో చేరారు. ఆ సంస్థ తరఫున ఆమె చేపట్టిన కేసులన్నీ.. ‘అందరూ తెల్లవాళ్లే జడ్జిలు గా ఉండే’ కోర్టులు టెక్సాస్‌లోని ఆఫ్రో అమెరికన్లపై దోషులుగా ఇచ్చిన తీర్పులు సవాలు చేసి, నిందితులను జైళ్ల నుంచి విడిపించడం. వారి పౌర హక్కులను పరిరక్షించడం. అరేళ్లు అక్కడ పనిచేశాక 2007లో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో న్యాయవాది (స్టాఫ్ అటార్నీ) అయ్యారు. పౌర హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్న అమెరికన్ వలస చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేశారు. పెళ్లయ్యాక మహిళల లక్ష్యాలకు ఆటంకాలు ఏర్పడి ఇల్లే ఆమె గమ్యం అవుతుందని అంటారు. అయితే గత పదిహేడేళ్లుగా వనిత వాదిస్తున్న కేసులలో, సాధిస్తున్న విజయాలలో ఆమె భర్త ఛిన్ క్యు లె సహకారం కూడా ఉంది. 2003లో వారి వివాహం జరిగింది. ఇద్దరు కొడుకులు. ఛిన్ కూడా న్యాయ రంగంలోనే ఉన్నారు. కొలంబియా డిస్ట్రిక్ట్ ‘లీగల్ ఎయిడ్’ సంస్థకు ప్రస్తుతం ఆయన లీగల్ డైరెక్టర్. వనితకు అమిత అనే చెల్లి ఉన్నారు. ఆమె మాత్రం వైద్య రంగాన్ని ఎంచుకుని హెచ్.ఐ.వి., టీబీలపై అమెరికాలోనే వైద్య పరిశోధనలు చేస్తున్నారు. అమ్మ నాన్న చెల్లి వనిత తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్. తండ్రి రాజీవ్ గుప్త. తల్లి కమల వర్షిణి. రాజీవ్ బిజినెస్‌మ్యాన్. ఎం.బి.ఎ. చదివింది అమెరికాలోనే అవడంతో ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. ఇండియాలో ఉన్నప్పుడే 1968 లో వాళ్ల పెళ్లి జరిగింది. 1974లో ఫిలడెల్ఫియాలో వనిత పుట్టింది. తర్వాత అమిత. కమల గోల్ఫ్ ప్లేయర్. టేబుల్ టెన్నిస్ కూడా ఆడతారు. తోట పని అంటే ఇష్టం. రోజులో ఎక్కువ భాగం పూలతోనే గడుపుతుంటారు. రాజీవ్, కమల మూడేళ్ల క్రితం ఇండియా వచ్చి తమ 50 వ పెళ్లి రోజును జరుపుకుని వెళ్లారు. ‘‘కుటుంబం కోసం కమల తన జీవితాన్ని త్యాగం చేసింది’’ అని ఆ సందర్భంగా రాజీవ్ అన్నారు. -
నటి వనితతో గొడవ, ఆ మహిళ ఎక్కడ?
సాక్షి, చెన్నై: నటి వనిత విజయ్‌కుమార్‌తో గొడవ పడి అరెస్టయిన మహిళకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో పోలీసులు వడపళని ఆందోళన చెందుతున్నారు. ఆ మహిళ పత్తా లేకుండా పోవడంతో తనిఖీలు చేస్తున్నారు. మూడో పెళ్లి చేసుకున్న సినీ నటి వనిత ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నిలిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోషల్ మీడియా వేదికగా వనితపై ఓ మహిళ తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వనిత చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో వడపళని పోలీసులు సదరు మహిళను గత వారం అరెస్టు చేశారు. (నాగశౌర్య లుక్ అదుర్స్) కోర్టులో హాజరు పరచగా, బెయిల్‌పై మహిళ బయటకు వచ్చేసింది. అయితే, అంతకుముందు సేకరించిన నమూనాల పరీక్షా ఫలితాల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ, ఆ మహిళ అడ్రెస్ మాత్రం చిక్కడం లేదు. ఆమెకు ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లిన పాటు ఆస్పత్రికి వెళ్లిన వడపళని పోలీసులు కూడా వైద్య పరీక్ష చేసుకున్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఓ పోలీసుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసుస్టేషన్లో విధుల్లో ఉన్న మిగతా సిబ్బంది కూడా కలవరానికి గురవుతున్నారు. నటి వనిత కూడా ఆ మహిళ స్టేషన్లో ఉన్న సమయంలో అక్కడకు వచ్చినట్టు సమాచారం. (కోబ్రాలో విక్రమ్ గెటప్స్ ఎన్నో తెలుసా?) -
అక్రమాలకు పాల్పడితే సహించం: మంత్రి వనిత
సాక్షి, అనంతపురం: అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు, కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తప్పవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. శనివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై మంత్రి వనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు. అంగన్వాడీలకు చేరాల్సిన సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీగా దోపిడీ చేశారని.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వనిత స్పష్టం చేశారు. -
‘చెడుగా ప్రవర్తిస్తే ప్రతిఘటించాలి’
సాక్షి, విశాఖపట్నం: పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. సిరిపురం వుడా చిల్డ్రన్ ఏరినాలో ‘వైఎస్సార్ కిశోర వికాసం ఫేజ్-3’ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్యం నుంచి యవ్వన దశలో అడుగుపెట్టేటప్పుడు అనేక మార్పులు కలుగుతాయని.. ఆ దశలో తీసుకునే నిర్ణయాలే జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కరవయ్యాయన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. చెడుగా ప్రవర్తిస్తే ప్రతిఘటించాలి.. ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితుల ప్రవర్తనను పిల్లలు గమనించాలని.. చెడుగా ప్రవర్తిస్తే ప్రతిఘటించాలని సూచించారు. సినిమాలను చూసి అశ్లీల డ్రెస్సింగ్ చేసుకోవద్దని.. చక్కటి వస్త్రధారణతో సంస్కృతి పాటించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల రక్షణ కోసం సైబర్ మిత్ర ప్రవేశపెట్టారని వెల్లడించారు. టీనేజీ పిల్లలకు చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్ఠికాహారం అవసరం అని తెలిపారు. ఐరన్ ఫుడ్ ద్వారా రక్తహీనత తగ్గించుకోవచ్చని సూచించారు. బాల్య వివాహాలు ఇంకా జరగడం విచారకరమని.. వాటికి అడ్డుకట్ట వేయాల్సింది తల్లిదండ్రులేనని తెలిపారు. మహిళల జీవితాల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధం చేపట్టారన్నారు. మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది: అవంతి శ్రీనివాస్ విదేశీ సంస్కృతికి అలవాటు పడి మన సంప్రదాయాన్ని విస్మరించడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన వివాహ వ్యవస్థ చాలా గొప్పదని.. విలువలతో కూడిన జీవనం సాగించాలని సూచించారు. సీఎం జగన్.. మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దేశాభివృద్ధిలో ఆడపిల్లల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్యెల్యే తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గంటా హైమవతి, జాయింట్ కలెక్టర్ సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. -
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
అనంతపురం ,ధర్మవరం రూరల్: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరానికి చెందిన నాగభూషణ కుమార్తె వనితకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన మణికంఠతో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. మణికంఠ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రోజురోజుకూ వీరి మధ్య గొడవ పెరుగుతూపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ధర్మవరం వచ్చిన మణికంఠ రైల్వే స్టేషన్లో పురుగుమందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు ఇతరుల సహాయంతో మణికంఠను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వనిత భర్తను చూసి అక్కడి నుంచి వెళ్లి తను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..
సాక్షి, అమరావతి: దళిత మహిళా ఎస్ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు పెట్టించారని..ఇప్పుడు దళిత ఎస్ఐను కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఓడినా.. ఇంకా బుద్ధి రాలేదు.. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి..దళిత మహిళా ఎస్ఐని అవమానించడం సిగ్గుచేటని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దళితులను టీడీపీ నేతలు దూషించడం దారుణమన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని గతంలో చంద్రబాబు అవమానిస్తే..ఇప్పుడు దళితులు దరిద్రమంటూ నన్నపనేని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు దళితల పట్ల వివక్షత తగదని హితవు పలికారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా.. ఆ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్రిపుల్ ధమాకా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మంత్రివర్గంలో జిల్లాకు మంచి ప్రాధాన్యం కల్పించారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు కల్పించడం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాకు తాను ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చెప్పకనే చెప్పారు. మంత్రి పదవులు లభించనున్న ముగ్గురూ సీనియర్లే కావడం గమనార్హం. ఏలూరు ఎమ్మెల్యేఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వీరు శనివారం సచివాలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2014లో ఒక్క సీటు కూడా లేని స్థితి నుంచి ఏకంగా 13 సీట్లు కట్టబెట్టిన జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. పదవుల్లో కూడా సామాజిక న్యాయం పాటించారు. ఒకటి కాపు, ఒకటి క్షత్రియ,మరోటి ఎస్సీలకు కట్టబెట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐదుగురికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నానని, మంత్రులలో కూడా 90 శాతం మందిని రెండున్నర ఏళ్ల తర్వాత మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. అందరికీ న్యాయం చేస్తానని, మంత్రి పదవిని హోదాలా కాకుండా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇద్దరు మంత్రులను ఓడించిన ఘనత జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంచి వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు. 2004 నుంచి 2009 వరకూ అత్తిలి శాసన సభ్యునిగా పనిచేశారు. అప్పటి రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించారు. 2019 ఎన్నికలలో ఆచంట నుంచి పోటీ చేసి రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణను 12,886 ఓట్ల తేడాతో ఓడించారు. ఇద్దరు మంత్రులను ఓడించిన ఘనత శ్రీంగనాథరాజుకి దక్కింది. గత 24 సంవత్సరాలుగా జిల్లా రైసుమిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగి, ప్రస్తుతం జిల్లా గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. జిల్లా రైసుమిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో ఉచిత భోజన సదుపాయం కల్పించడం, ట్రస్టు ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రోగులకు ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు, రాయితీపై వైద్య పరీక్షలు, యండగండిలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన డీఎన్ఆర్ కళాశాలకు అధ్యక్షునిగా పనిచేశారు. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఏలూరు అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆళ్ల నాని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితునిగా మారారు. అనంతరం 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2016 నుంచి పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 2017వ సంవత్సరంలో జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ స్థానం సంపాదించుకున్నారు. ఇంకా నాలుగున్నర ఏళ్ల పదవీ కాలం ఉన్నా, జగన్ ఆదేశాల మేరకు 2019లో ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి మళ్లీ గెలుపొందారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షునిగా కూడా ఉన్నారు. జిల్లాలో పార్టీకి మళ్లీ ఊపు తేవడంతో ఆళ్ల నాని ప్రముఖ పాత్ర వహించారు. ఇసుక, మద్యం మాఫియాపై పోరు తానేటి వనిత 2009లో శాసనసభకు తెలుగుదేశం తరపున గోపాలపురం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2012లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. 2014లో కొవ్వూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయినా నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చి 2019లో మంచి మెజారిటీతో గెలుపొందారు. విద్యాధికురాలైన వనిత గత ఐదేళ్లుగా ఇసుక, మద్యం మాఫియాపై అలుపెరుగని పోరాటం చేశారు. వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు కూడా రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. అందరివాడు ఏలూరు (టూటౌన్): వివాద రహితుడు, సౌమ్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి రాష్ట్ర కేబినెట్లో చోటు లభించింది. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల నాని మాటల కన్నా చేతల మనిషి అనే పేరును సంపాదించుకున్నారు. ఏలూరు నగర అభివృద్ధి జరిగిందంటే అది ఆళ్ల నాని ఎమ్మెల్యేగా పనిచేసిన 10 ఏళ్ల కాలంలోనే అనేది జగమెరిగిన సత్యం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై ఓటమి చెందారు. విధేయతకు పెద్ద పీట వేసిన వైఎస్ జగన్ ఆళ్ల నానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గానూ, అనంతరం ఏలూరు పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గానూ ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జిపై గెలుపొంది మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి జిల్లా నుంచి ఆళ్ల నానికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందుకు అనుగుణంగానే ఆళ్ల నానికి వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రి స్థానం దక్కింది. నాని హయాంలోనే ఏలూరు అభివృద్ధి ఎమ్మెల్యే ఆళ్ల నాని గతంలో పనిచేసిన సమయంలోనే ఏలూరు అభివృద్ధి జరిగింది. ఆయన హయాంలోనే ఏలూరు మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థ హోదా లభించింది. గోదావరి జలాలను నగర ప్రజలకు అందించాలనే సంకల్పంతో దెందులూరు సమీపంలో వంద ఎకరాలను సేకరించి మంచినీటి చెరువును తవ్వించారు. అప్పటి వరకూ కృష్ణా జలాలు మాత్రమే ఏలూరుకు తాగునీటిని అందించేవి. ఇప్పుడు గోదావరి జలాలే ఏలూరు నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నాడు నాని ముందు చూపు కారణంగానే నేడు ఏలూరు ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా ఉందనేది ప్రజలు చెబుతున్నారు. ఏలూరు నగరంలోని నిరుపేదలకు సొంత గూడును కల్పించిన ఘనత ఎమ్మెల్యే ఆళ్ల నానిదే. ఆయన హయాంలోనే పోణంగిలోని వైఎస్సార్ కాలనీ, వంగాయగూడెం, కొత్తూరులలో ఇళ్ల కాలనీలు ఏర్పడ్డాయి. 5 వేల మందికి పైగా పేదలకు పక్కా ఇళ్లు అందించారు. నాని తమ్మిలేరు నుంచి నగరానికి వరద ముంపు బాధ తప్పించారు. ఆయన హయాంలో సుమారు రూ.30 కోట్లతో తమ్మిలేరుకు రివిట్మెంట్లు, రక్షణగోడను నిర్మించారు. నగరంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్‌ను సైతం ఆళ్ల నాని హయాంలోనే ప్రారంభించారు. నానికి కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వనితకు వరమాల కొవ్వూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తానేటి వనితకి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదైన ఘనత దక్కించుకున్నారు. శనివారం ఏ శాఖ కేటాయించారో వెల్లడించనున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరు నుంచి ఆమె 25,248 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఏఏ అజీజ్ అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గం పునర్విభజన అనంతరం గత ఎన్నికల్లో గెలుపొందిన కేఎస్ జవహర్‌కి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. మూడో మంత్రిగా ఇప్పుడు తానేటి వనిత అవకాశం దక్కించుకున్నారు. 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తిరిగిపల్లి ఉషారాణిపై సుమారు 14 వేల ఓట్ల మెజార్టీతో వనిత గెలుపొందారు. 2012లో ఎమ్మెల్యే పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగి ఓటమిని చవిచూసినప్పటికీ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం సాగిస్తూ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ విధేయురాలిగా ఉంటూ అంకితభావంతో పనిచేయడంతో ఈ ఎన్నికల్లో రెండో సారి పోటీ చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ముప్పై ఏళ్ల కాలంలో ఏ ఎమ్మెల్యేకి దక్కని భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడుతున్న రెండో ప్రభుత్వంలో వనిత అమాత్యురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేనే రాజు.. నేనే మంత్రి ఆచంట : ఆచంట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు కేబినెట్లో స్థానం లభించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సర్వత్రా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై 12,886 తేడాతో ఓడించి రికార్డు సృష్టించి తెలుగుదేశం కంచుకోటలో పాగా వేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్లో బెర్తు ఖరారు చేశారు. 2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన శ్రీరంగనాథరాజు అప్పటి మంత్రి, రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించి సంచలనం సృష్టించారు. నేడు మళ్లీ ఆచంట నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి రాష్ట్ర మంత్రిగా సుదర్ఘీకాలం పాటు పనిచేసిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను ఓడించి మరోసారి రికార్డు సృష్టించారు. ఇలా జిల్లాలో ఉద్దండులైన ఇద్దరు మంత్రులను మట్టి కరిపించిన ఘనత శ్రీరంగనాథరాజుకే దక్కించుకుని మంత్రివర్గంలో స్థానం సాధించారు. శ్రీరంగనాథరాజుకు రాజకీయ చతురుడిగా, వ్యూహకర్తగా, సామాజిక సేవాతత్పరుడిగా శ్రీరంగనాథరాజుకు జిల్లాలో మంచిపేరు ఉంది. ఆచంటకు ముచ్చటగా మూడో మంత్రి పదవి ఆచంట నియోజకవర్గానికి ఇప్పటివరకూ మూడు సార్లు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం దక్కింది. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాసరి పెరుమాళ్లుకు తొలిసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014లో టీడీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ మంత్రి పదవులు పొందారు. మళ్లీ నేడు ఓసీ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆచంటకు వెను వెంటనే మళ్లీ మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. అనతికాలంలోనే ఆచంట మా‘రాజు’ గతేడాది మే నెలలో శ్రీరంగనాథరాజు వైఎస్సార్ సీపీలో చేరారు. జూన్ 2, 3 తేదీల్లో నియోజకవర్గంలో సాగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. నాటి నుంచి నేటి వరకూ నియోజకకవర్గంలో పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. ఒక పక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, మరో పక్క సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. లంక గ్రామమైన అయోధ్యలంకను దత్తత తీసుకుని లక్షలాది రూపాయిల సొంత ఖర్చుతో రక్షిత మంచినీటి పథకం, రహదారులు, విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేశారు. ఇదే విధంగా ఆచంట నుంచి విద్యార్థుల సౌకర్యార్థం పెనుగొండ ఎస్వీకెపీ కళాశాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి ప్రతి శనివారం, సోమవారం ఉచిత బస్సు సౌకర్యంతోపాటు, వైద్య పరీక్షల్లో రాయితీ సౌకర్యం కల్పించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై ఇంటింట సర్వే చేయించి ఆయా సమస్యల పరిష్కారం చేస్తానంటూ హామీ పత్రాలు ఇచ్చి ప్రజల మెప్పు పొందారు. నియోజకవర్గంలోని తూర్పుపాలెంలో స్థిర నివాసం, పార్టీ కార్యాలయం నిర్మించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇలా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువై అనూహ్య విజయం సాధించారు. -
కొవ్వురులో మార్వాని భరత్, తానేటి వనిత ప్రచారం
-
చింతమనేనీ.. దళిత జాతికి క్షమాపణ చెప్పు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్య లకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంబే డ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఆయన కాళ్లు పట్టుకుని దళిత జాతికి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ కొవ్వూరు కన్వీనర్ తానేటి వనిత డిమాండ్ చేశారు. ఏలూరు వైఎ స్సార్ సీపీ కార్యాలయంలో దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరితో కలిసి ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. చింతమనేనితో క్షమాపణ చెప్పించే విషయంలో సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలన్నారు. దళితుల కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించి దళితులపై దాడులకు పచ్చజెండా ఊపినట్టు అర్థమవుతోందన్నారు. దళితుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి వారిని కించపరచడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై కొవ్వూరు నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా ఒక్కచోట కూడా కేసు నమోదుచేయకపోవడం ఈ ప్రభుత్వానికి దళితులపై ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. వారి అరాచకాలకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. చింతమనేని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది దళితులేనని, ఓటుతో వారికి బుద్ధి చెబు తామని పిలుపునిచ్చారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకోవాలని, అధికారం శాశ్వ తం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల న్నారు. చింతమనేని దౌర్జన్యానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చింతమనేని అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలు పేట్రేగిపోతున్నాయని, అతడిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ఎన్నికల కమిషన్ ప్రకటించాలని కోరారు. ‘దమ్ముంటే నాపై పోటీ చేయాలి’ దమ్ముంటే నాపై పోటీ చెయ్యి చింతమనేనీ అంటూ వైఎస్సార్ సీపీ దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్యచౌదరి సవాల్ విసిరారు. చింతమనేని స్థాయిని మరిచి జగన్‌ను తనపై పోటీచేయమని ఒకసారి, పవన్ కల్యాణ్‌ను తనపై పోటీ చేయమని మరోసారి సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారిద్దరూ కాదని కనీసం తనపైనైనా గెలవడానికి ప్రయత్నించాలని అబ్బయ్యచౌదరి హితవుపలికారు. రాష్ట్రంలో దళితులపై ప్రేమ ఉంటే దళితులను అవమానించిన చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయించు చంద్రబాబూ అని డిమాండ్ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చింతమనేని ఇప్పుడు రాజధాని అమరావతి, విశాఖల్లో వందలాది ఎకరాల భూములు సొంతం చేసుకుని శ్రీమంతుడయ్యారని అన్నారు. తమ్మిలేరులో ఇసుకను, పోలవరం గట్టుపై ఉన్న మట్టిని అమ్ముకుని కోట్లు గడించారన్నారు. నియోజకవర్గంలోని వట్లూరులో వెమ్‌టెక్ అనే సంస్థ పేరిట 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. విజయరాయి గ్రామంలో పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడిని దుర్భాషలాడి అతని కుమారులపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. పెదవేగి మండలం గుమ్మడిగుంట గ్రామానికి చెందిన దళితుల భూముల విషయంలో 70 రోజులు ఆందోళన చేస్తే ఒక్కరోజైనా వెళ్లి వారిని పరామర్శించారా అని చింతమనేనిని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అధికారులు, సాధారణ ప్రజలను కూడా వేధిస్తూ చింతమనేని రాక్షస పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన రోజునే కటకటాల వెనక్కి నెట్టాల్సిన నిన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలి వేయడంతోనే బరితెగించావన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులపైనే దాడి చేసిన నీకు వ్యతిరేకంగా గ్రామమంతా ఏకమై పోరాటం చేసిన విషయం నిజం కాదా అన్నారు. ఇటీవల దళితులపై చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్ర బాబు మాత్రం చింతమనేనిని వెనకేసుకొస్తూ అది మార్ఫింగ్ చేసిన వీడియో అని ప్రకటించడం దళితులను అవమానించడమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, మున్నుల జాన్ గురునాథ్, పల్లెం ప్రసాద్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నటి వనిత మళ్లీ అరెస్ట్
చెన్నై, పెరంబూరు: తండ్రి విజయకుమార్ ఫిర్యాదు మేరకు ఆయన కూతురు, నటి వనితను శుక్రవారం మధురవాయిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సీనియర్ నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దాన్ని ఆయన షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. అలా విజయకుమార్ కూతురు, నటి వనిత ఆ మధ్య షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కోరి.. తరువాత ఆ ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో విజయకుమార్ వనితను ఇల్లు కాళీ చేయించాలని మధురవాయిల్ పొలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను అరెస్ట్ చేయడానికి ఆ ఇంటికి వెళ్లారు. అయితే వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి పరారైంది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెను ఇంట్లో ఉండడాన్ని ఎవరూ అడ్డుకోరాదని, అవసరమైతే పోలీసులు వనితకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనిత గురువారం విజయకుమార్ ఇంట్లో చేరింది. శుక్రవారం నటుడు విజయకుమార్ మళ్లీ మధురవాయిల్ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు. ఆమెను తన ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వనిత ఉంటున్న ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమెను పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. -
తండ్రి ఇంటికి చేరిన నటి
తమిళనాడు, పెరంబూరు: సంచలన నటి వనిత మరోసారి తన తండ్రి ఇంటికి చేరింది. ఇంతకు ముందు షూటింగ్ కోసం వచ్చి ఇంటిని ఆక్రమించుకోజూసిన ఈమె ఈ సారి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తన న్యాయవాదితో కలిసి తండ్రి ఇంటిలో పాగా వేసింది. వివరాలు చూస్తే సీనియర్ నటుడు విజయకుమార్ రెండో భార్య నటి మంజుల ముగ్గురు కూతుర్లలో ఒకరు నటి వనిత. నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో భవంతి ఉంది. దాన్ని ఆయన సినీ, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. ఆయన కూతురైన నటి వనిత ఇటీవల షూటింగ్ కోసం ఆ భవంతిలోకి వచ్చి అక్కడే మకాం పెట్టేసింది. దీంతో విజయకుమార్ స్థానిక మదురవాయిల్ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు వనితను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారు. దీంతో నటి వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తన తల్లి మంజుల పేరు మీద ఉన్న ఆ ఇంటిని తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో తన సంపాదనతో కట్టించారని, కాబట్టి ఆ ఇంటిపై తనతో పాటు తన ఇద్దరు సోదరీమణులకు హక్కు ఉంటుందని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నటి వనితకు సాధకంగా తీర్పునిచ్చింది. నటి వనితను ఆ ఇంటి నుంచి పంపే హక్కు ఎవరికీ లేదని, అవసరమైతే పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా నటి వనిత సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల పత్రాలతో గురువారం విజయకుమార్ ఇంటికి వచ్చింది. తనతో పాటు తన న్యాయవాదిని కూడా వెంట తీసుకొచ్చింది. సుప్రీమ్‌కోర్టు జారీ చేసిన తీర్పు పత్రాలను చెన్నై పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఈ సందర్భంగా నటి వనిత మీడియాకు తెలిపింది. -
తండ్రిపై నటి వనిత ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: నటుడు విజయకుమార్ కూతురు, నటి వనిత పరారయ్యింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన ఇంటిని అక్రమించుకునే ప్రయత్నం చేసిందని, కిరాయి మనుషులతో బెదిరించిందని ఆమె తండ్రి ఆదివారం మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలపాక్కం, అష్టలక్ష్మి నగర్‌లోని విజయకుమార్ ఇంటికి వచ్చి నటి వనితను విచారించిన విషయం తెలిసిందే. కాగా ఇంట్లో భాగం ఉంది.. ఇల్లు ఖాళీ చేయనని నటి వనిత పోలీసులతో వాగ్వాదం చేసింది. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై అనిత అనుచరులు దాడి చేశారు. గురువారం మధ్యాహ్నం పో లీసులు మరోసారి నటి వనితను విచారించడానికి అష్టలక్ష్మీ నగర్‌కు వెళ్లారు. పోలీసులతో ఆమె ఇల్లు ఖాళీ చేయనని తెలిపింది. అనుచరులతో కలిసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి నానా హంగా మా చేసింది. పోలీసుల పైనా దాడి చేయడంతో కేసు నమోదు చేసి వనిత, ఆమె అనుచరులు 7 మందిని అరెస్ట్ చేశారు. కాగా వారిలో నటి వనిత పరారైంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అమ్మ ఇంట్లోనే ఉన్నా.. కాగా పరారైన నటి వనిత గురువారం రాత్రి వడపళనిలోని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తండ్రి విజయకుమార్‌పై ఫిర్యాదు చేసింది. అందులో తండ్రి కిరాయి మనుషులతో తనను కొట్టిస్తున్నాడని, ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది. అనంతరం వనిత విలేకరులతో మాట్లాడుతూ తాను తన తల్లి ఇంట్లోనే ఉన్నానని చెప్పింది. విజయకుమార్ తనను ఇంట్లో ఉండరాదంటున్నాడని తెలిపింది. వెంటనే ఇల్లు ఖాళీ చేయించా ల్సిందిగా మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడంది. సినిమా వాళ్లకు బయట ఇల్లు అద్దెకు ఎవరూ ఇవ్వడం లేదని, అలాంటిది తాను ఎక్కడ ఉండాలని ప్రశ్నించింది. అందుకే అమ్మ ఇంటికి వచ్చానని చెప్పింది. సినిమాల్లో, టీవీ.సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న తన తండ్రి విజయకుమార్ తనను మాత్రం కూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి బయటకు గెంటించేశాడని ఇదేమి న్యాయం అని వాపోయింది. -
కూతురిపై నటుడు విజయకుమార్ ఫిర్యాదు
చెన్నై ,పెరంబూరు: షూటింగ్ కోసం ఇం టిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయకుండా ఆక్రమించుకుందని సీనియర్ నటుడు విజయకుమార్ తన కూతురు వనితపై స్థానిక మధురవాయిల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అందులో స్థానిక మధురవాయిల్, అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో తనకు ఇల్లు ఉందన్నారు. దాన్ని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తూ, తాను తన కొడుకు అరుణ్‌తో కలిసి కొట్టివాక్కమ్లో నివశిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం తన కూతురు షూటింగ్ కోసం అపపాక్కమ్లోని ఇంటిని అద్దెకు అడగడంతో ఇచ్చానన్నారు. అయితే షూటింగ్ పూర్తి అయినా వనిత ఇంటిని ఖాళీ చేయడం లేదని, అడిగితే రౌడీలు, న్యాయవాదులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్ పోలీస్మిషనర్ విచారణ చేస్తున్నారు. కాగా గురువారం పోలీసులు విజయకుమార్ ఇంటికి వెళ్లి కేసు విషయమై వనితను విచారించగా ఈ ఇంట్లో తనకు భాగం ఉందని, అందువల్ల తాను ఖాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఇల్లు మీదనడానికి ఆధారాలుంటే చూపాలని చెప్పారు. వనిత పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విషయం గురించి తెలియడంతో మీడియా వాళ్లు అక్కడికి చేరారు. దీంతో వనిత మీడియా వాళ్లపై తిరగబడింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు విజయకుమార్, వనితల కేసును విచారిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వనిత కుటుంబాల మధ్య గొడవలు జరిగాయన్నది గమనార్హం. -
రైలు నుంచి పడి పీటీఎం యువతి మృతి
పెద్దతిప్పసముద్రం: తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ సమీ పంలోని జహీరాబాద్–మెట్లకుంట్ల రైల్వే సేష్టన్ల మధ్య శనివారం రైలు నుంచి జారి పడి పీటీఎం మండలం సంపతికోట పంచాయతీ కానుగమాకులపల్లికి చెందిన వనిత (21) మృతి చెందింది. కానుగమాకులపల్లికి చెందిన కొత్త వెంకటప్ప గారి వెంకట్రాయుడు, యశోదమ్మ దంపతులకు వనిత, స్వాతి సంతా నం. వనిత కర్ణాటక రాష్ట్రం చింతామణి సిటీ కళాశాలలో ఇంటర్, చిక్ బళ్లాపురంలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్న కుమార్తె స్థానికంగా ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో వనిత ఆరు నెలల క్రితం బెం గళూరులోని ఓ ప్రైవేటు కంపనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరింది. నెలకోసారి స్వగ్రామానికి వచ్చివెళుతోంది. ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన వనిత బెంగళూరు వెళుతున్నానని చెప్పింది. ఉన్నట్టుండి వికారాబా ద్ సమీపంలో రైలు నుంచి పడి మృతిచెంది నట్టు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వనిత బెంగళూరుకు కాకుండా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లింది? ఆమె ఒంటరిగా వెళ్లిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా? ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడిందా? లేక ఎవరైనా కిందకు తోసేసారా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వనిత మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆదివా రం హుటాహుటిన వికారాబాద్ వెళ్లారు. వనిత అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఓ ఇల్లాలి ఉల్లాసం
కదిలేంత వరకే జీవితం బెరుకు బెరుగ్గా ఉంటుంది. కదిలాక ఎక్కడ లేని దీమా వచ్చేస్తుంది. కొత్త జీవితం అంటే ఏం లేదు. కొత్త ప్రదేశమే. అది మారిన దేశం కావచ్చు, మారిన రాష్ట్రం కావచ్చు, ఆఖరికి మారిన ఇల్లయినా కావచ్చు. వనితా దురై గోథెన్బర్గ్ వెళ్లే వరకు స్వీడన్‌లోని ఆ తీరప్రాంత పట్టణంలో నివాసం ఉంటున్న భారతీయ మహిళలు ఎవరికివారిగా ఉండేవారు. ఐదేళ్లయింది వనిత చెన్నై నుంచి అక్కడికి వెళ్లి. వెళ్లేటప్పుడు భర్తకు మాత్రమే ఉద్యోగం. వెళ్లాక తనూ ఒక ఉద్యోగం సంపాదించుకుంది. వాల్వో కార్ల కంపెనీలో చేస్తోంది తనిప్పుడు. అయితే ఆ ఉద్యోగం ఆమెకు ఏమంత తేలిగ్గా రాలేదు. అదనే కాదు, ఏ ఉద్యోగమూ కష్టపడి తెచ్చుకోనిదే రాదు. తిరగాలి. తెలియని భాష మాట్లాడాలి. అప్లికేషన్లో మనకు ఉన్నాయని చెప్పుకున్న ప్రతిభాసామర్థ్యాలకు మించి ఇంటర్వ్యూలో కనబరచాలి. ఉద్యోగంలో చేరాక అంతకుమించి నిరూపించుకోవాలి. అప్పుడే పరాయిదేశంలో స్థిరపడగలం. స్థిరపడ్డాక ఏమిటి జీవితం? రోజూ ఆఫీసుకు వెళ్లిరావడం, రోజూ భర్తను, పిల్లల్ని సిద్ధం చేసి పంపించడం ఇదేనా?! ఇదే కావచ్చు. ఇందులోనే సంతోషం వెతుక్కోవచ్చు. అయితే వనిత ఈ స్థిరత్వంలోనే ఉండిపోదలచుకోలేదు. గోథెన్‌బర్గ్‌లో ఉన్న మిగతా భారతీయ ఉద్యోగులను, గృహిణులను కలుపుకుని ఏదైనా చేయాలని అనుకున్నారు. ఏదైనా చెయ్యడం తర్వాత. ముందు కలుపుకోవడం ఎలా? ఫేస్బుక్ ఉందిగా. అందులోంచి వెల్కమ్ చెప్పారు. మంచీచెడ్డా చెప్పుకున్నారు. మీ పిల్లలేం చదువుతున్నారంటే, మీ పిల్లలేం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకున్నారు. పండగలొస్తే వేడుకలు చేసుకున్నారు. దీపావళికి స్వీట్లు పంచుకున్నారు. క్రిస్మస్ వస్తే ఫ్రూట్ కేకులు పంపుకున్నారు. రంజాన్‌కు శుభాకాంక్షలు తెలుపుకుని ఆత్మీయ విందులకు ఆహ్వానించారు. బర్త్‌డేలు ఎలాగూ ఉంటాయి. ఏదైనా సాధించిన రోజూ ఉంటుంది. ఇటీవలే ఈ టీమ్‌లోని ఉల్లాసవంతులంతా కలిసి ఓ సెంట్రల్ మాల్లో ‘ఫ్లాష్‌మాబ్’ ఈవెంట్లో డ్యాన్స్ కూడా చేశారు. అంతా డ్యాన్సు వచ్చే చేయలేదు. డ్యాన్స్ వచ్చినవాళ్లతో కలసి చేశారు. స్త్రీత్వంలోని సౌందర్యాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అలా గోథెన్‌బర్గ్‌లో ఒక అందమైన భారతీయ మహిళా దేశం ఆవిర్భవించింది. ఆ దేశం వ్యవస్థాపకురాలు వనితా దురై. ఆ దేశం పేరు ‘ఇండియన్ ఉమెన్ ఇన్ గోథెన్బర్గ్’. ముప్పై నాలుగేళ్ల వనితా దురై స్వీడన్ తనకెంత బాగా నచ్చిందో చెబుతున్నప్పుడు చూడాలి ఆమె కళ్లను. ఆ మెరుపు గోథెన్బర్గ్ మొత్తాన్నీ వెలిగిస్తున్నట్లుగా ఉంటుంది. ‘‘స్వీడన్ వచ్చాక, ఒక ఉద్యోగం వెతుక్కునేవరకు పరిస్థితులు కాస్త గడ్డుగా ఉన్నట్లనిపిస్తాయి. ఉద్యోగంలో చేరాక అంతా మనోహరంగా మారిపోతోంది. నాకైతే కుటుంబ జీవితానికి స్వీడన్‌ని మించిన దేశం లేదనిపిస్తుంది. సెలవుల్ని, సాయంత్రాలను ఇక్కడ తప్ప ఎక్కడా ఇంత ఆహ్లాదకరంగా అనుభూతి చెందలేమేమో అనిపిస్తుంది. చుట్టూ అన్నీ మైదానాలే. ఎక్కడా రద్దీ ఉండదు. కాలుష్యం కనిపించదు. శబ్దాలు ఉండవు. ఈ సంస్కృతిలోంచి వీచే ఏ దేవగానమో మార్మికంగా చెవులకు సోకుతూ మనసును ప్రశాంత పరుస్తుంటుంది. అంతా కలిసి కూర్చొని దీర్ఘంగా ముచ్చటించుకుంటూ కాఫీ తాగే ఇక్కడి ‘ఫికా’ కల్చర్ కోసమైనా చెన్నై నుంచి ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి రావచ్చు. ఇక్కడి వాళ్లు ఎంత హ్యాపీగా, రియల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారో చెప్పలేను. మనం మనలా ఉంటే చాలు, వాళ్లలో కలిసిపోవచ్చు’’ అని వనితా దురై పెట్టిన పోస్టును ఇండియాలో, విదేశాల్లో ఉన్న ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఒక ట్రావెలాగ్‌లా చదివి గోథెన్బర్గ్ను కాఫీ పరిమళాలతో కలిసి ఆస్వాదిస్తున్నారు. కదిలేంత వరకే జీవితం బెరుకు బెరుగ్గా ఉంటుంది. కదిలాక ఎక్కడ లేని దీమా వచ్చేస్తుంది. కొత్త జీవితం అంటే ఏం లేదు. కొత్త ప్రదేశమే. అది మారిన దేశం కావచ్చు, మారిన రాష్ట్రం కావచ్చు. ఆఖరికి మారిన ఇల్లయినా కావచ్చు. -
అమ్మా.. నన్ను క్షమించు!
కర్నూలు, మద్దికెర: మండల కేంద్రంలో ఓ ఉపాధ్యాయిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ మారుతి వివరాల మేరకు... అనంతపురం జిల్లా గుత్తికి చెందిన జయమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె బండారి వనిత (30) గుత్తి మండలం తొండపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితశాస్త్రం ఉపాధ్యాయునిగా పని చేసేది. అనిత చిన్నప్పటి నుంచి మద్దికెరలోని అమ్మమ్మ గద్దల నాగమ్మ వద్ద పెరిగింది. అయితే 8 నెలల క్రితం అమ్మమ్మ మరణించింది. దీంతో అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యేది. వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం తల్లి చెల్లెలు, తమ్ముడితో కలిసి గుత్తిలోని చర్చికి వెళ్లింది. ఫోన్ చేసినా కుమార్తె ఫోన్ తీయకపోవడంతో తల్లి బంధువులకు సమాచారం తెలియజేసింది. వారు వెళ్లి చూడగా వనిత ఉరికి వేలాడుతూ కనిపించింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ రాసిన సూసైడ్ నోట్ ఘటన స్థలంలో లభించింది. ఎస్ఐ ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అక్రమ ఇసుక రవాణ...వైఎస్పార్సీపీ ధర్నా
సాక్షి, తాళ్లపుడి: నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణ చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకురాలు తానేటి వనిత ఆధ్యర్యంలో తాడిపుడి ఇసుక ర్యాంపు వద్ద ధర్నా నిర్వహించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న లారీలను పార్టీశ్రేణులు అడ్డుకోవడంతో ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..మంత్రి జవహర్ అండతోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ కన్నుసైగల్లోనే ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని విమర్శించారు. అక్రమంగా ఇసుక తరలించే ముఠాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
అడ్డంకికి ఆవల...
మహిళాసాధికారత బయట దొరికే వస్తువు కాదు. అది మహిళ మనసులో అంతరాంతరాల్లో ఉండాలి. బయటి నుంచి లభించేది ప్రోత్సాహం మాత్రమే... అంటారు వనితా దాట్ల. అనుకున్నది అందకపోతే మరోదాని కోసం ప్రయత్నించాలి... అంటారామె. డాక్టర్ కావాలనుకున్న వనిత... పారిశ్రామికవేత్త అయిన వైనమే అందుకు నిదర్శనం. నాకు పర్యటనలంటే చాలా ఇష్టం. 50 దేశాలు చూశాను. ట్రెకింగ్, సైక్లింగ్, మారథాన్ పరుగుల్లో పాల్గొంటాను. మానస సరోవరం, ఎవరెస్టు బేస్ క్యాంపు, ఆఫ్రికాలోని కిలిమంజరో పర్వతాలను అధిరోహించాను. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకోవడమే నా విజయరహస్యం. ఒక పుస్తకం చదవడం, ఒక సెమినార్లో పాల్గొనడం, నిపుణుల ప్రసంగాన్ని వినడం... ఇలా ఏదో ఓ మార్గంలో ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉంటాను. – వనిత దాట్ల, వైస్ చైర్పర్సన్, ఎలికో లిమిటెడ్, రీజనల్ చైర్ఉమన్ సిఐఐ– ఐడబ్లు్యఎన్ సదరన్ రీజియన్ వనితాదాట్ల... కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్ర విభాగానికి మాజీ చైర్పర్సన్. ప్రస్తుతం ఎలికో లిమిటెడ్ కంపెనీకి వైస్ చైర్‌పర్సన్‌తోపాటు ఇండియన్ ఉమెన్ నెట్వర్క్కి రీజనల్ చైర్ఉమన్ కూడా. ఈ శిఖరాలను చేరడానికి మొదలు పెట్టిన ప్రయాణంలో తొలి అడుగులను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.‘‘నేను 22 ఏళ్లుగా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నాను. మా తాతగారు పద్మభూషణ్ బి.వి.రాజు. ఆయన మనదేశంలో తొలితరం పారిశ్రామికవేత్త. ఆయన నుంచి నేను పరిశ్రమ నిర్వహణ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా పరిశ్రమను నడిపించడం నేర్చుకున్నాను. బాల్యంలో నా మీద మా నాన్నగారి ప్రభావమే ఎక్కువ. ఆయనలా డాక్టర్ కావాలనుకున్నాను. మెడిసిన్‌లో సీటు రాలేదు. దాంతో బి.ఎలో చేర్చి ఫస్ట్ ఇయర్ అయిపోగానే పెళ్లి చేసేశారు. మా వారితో అమెరికా వెళ్లిన తర్వాత అక్కడి సమాజం నా మీద చాలా ప్రభావాన్ని చూపించింది. అక్కడ ఎవరూ మరొకరి మీద ఆధారపడి జీవించరు. ఎవరికి వారే స్వతంత్రంగా జీవిస్తుంటారు. నాకేమో గ్రాడ్యుయేషన్ కూడా లేదప్పటికి. ఇక అప్పుడు అక్కడి విద్యాసంస్థల్లో చేరాను. అలా చదువుతూ ఉండగానే అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుకు సహాయకారిగా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నా సంపాదన నాకెంతటి ఉత్సాహాన్నిచ్చిందంటే... ‘ఇది నా సొంత సంపాదన’ అనే భావనే మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఎలాగైనా సరే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఆకాంక్ష కూడా ఎక్కువైంది. ఇంతలో బాబు పుట్టడంతో ఆ ఉద్యోగాన్ని మానేశాను. చదువుకి మరోసారి అంతరాయం. ఆ తర్వాత పాప పుట్టింది. చదువుని మళ్లీ కొనసాగిద్దామనుకునే లోపు ఇండియాకి వచ్చేశాం. ఎం. బి.ఎ కోసం... డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బిఎ పూర్తి చేసి, తాతగారి ఫైనాన్స్ సంస్థలోనే ఉద్యోగంలో చేరాను. కంపెనీలో నేను నిర్వహిస్తున్న బాధ్యతలకు ఎంబిఎ కూడా ఉంటే బావుంటుందనిపించింది. ఆ నిర్ణయం నా జీవితంలో మరో మైలురాయి. ఇక్ఫయ్ యూనివర్శిటీలో ఎంబిఎలో చేరిన నాటికి నేనేమో ఇద్దరు పిల్లల తల్లిని. నా క్లాస్మేట్స్ అంతా చిన్నవాళ్లు. పైగా ఒక్కొక్కరు ఇంజనీరింగ్, ఐఐటి గ్రాడ్యుయేట్లు. వీరితో చదివి రాణించగలనా అనే భయం ఉండేది. ఆ భయం తోనే అసైన్మెంట్లను గడువు లోపలే పూర్తి చేసేదాన్ని. నేను ఉద్యోగం చేస్తుండడం, విశాలమైన ప్రపంచాన్ని చూసి ఉండడం వల్ల యూనివర్శిటీ సిల్వర్ మెడల్ తెచ్చుకోగలిగాను. ఉద్యోగం చేస్తూ ఎంబిఎ చేశాను. మగవారి ఆధిపత్యరంగంలోకి... తాతగారి రాశి ఫైనాన్స్ తర్వాత మా అన్నయ్య టేకోవర్ చేసిన అంజని సిమెంట్ కంపెనీలో చేరాను. సిక్ కంపెనీని పైకి లేపడానికి చేసిన కసరత్తే నాకు పరిశ్రమ నిర్వహణ, బ్యాంకు లావాదేవీలనూ నేర్పించింది. మగవారి ఆధిపత్యం ఉండే రంగంలో నేనొక్కదాన్నే మహిళని. నల్గొండ ప్లాంటుకు కూడా క్రమం తప్పకుండా వెళ్లేదాన్ని. అప్పుడు నా కెరీర్లో మరో విరామం. పిల్లలు స్కూలు ఫైనల్ దశలో తల్లి పాత్ర చాలా ఎక్కువ. అందుకే రెండేళ్లపాటు పిల్లల కోసమే స్పెండ్ చేశాను. పిల్లలు కాలేజ్‌కొచ్చిన తర్వాత మా వారు ఓ రోజు ‘పార్ట్టైమ్గానైనా కంపెనీకి రావచ్చు కదా’ అన్నారు. అలా ఎలికో కంపెనీలో చేరాను. అప్పటి నుంచి అదే నా పూర్తి వ్యాపకమైంది. నిత్య చైతన్యమే పురోగతి... ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే మహిళల కోసం ఓ వేదిక ఏర్పాటు చేయడంలో నా ప్రధాన ఉద్దేశం వారిని నిత్యం చైతన్యవంతంగా ఉంచడమే. ఎక్కడికక్కడ పరిధి విధించుకోవడం, క్రమేణా ఆ పరిధిని కుదించుకోవడం వంటి నిరాసక్త లక్షణాలను వదలాలని చెప్పడమే. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఇస్తున్న సూచనలన్నీ మహిళల శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం కల్పించమనే. సాధికారత సాధించాలనే తపన మహిళల్లో ఉంటే అవకాశాలు కొల్లలు. సక్సెస్‌ను అందుకోవాలంటే ఒక్కో మెట్టునూ స్వయంగా ఎక్కాల్సిందే. దీనికి షార్ట్కట్లు ఉండవు.ఇల్లు, ఆఫీసు, వ్యాపారం... అన్నింట్లోనూ ఒడిదొడుకులుంటాయి. ప్రతికూల పరిస్థితులూ ఉంటాయి. ‘పరిస్థితులు అనుకూలంగా లేవు’ అనుకుంటే ఏదీ సానుకూలం కాదు. దేనినీ సాధించలేరు. ఒక దారి మూసుకుపోతే మరో దారి కోసం ప్రయత్నించాల్సిందే. అందుకు నేనే ఉదాహరణ. మెడిసిన్‌లో సీటు రాలేదు. డొనేషన్ సీటులోనైనా చదివించాలంటే పొరుగు రాష్ట్రాలకు పంపించాలి. ‘ఆడపిల్లను అంతదూరం పంపడమా’ అనే సందేహమే పెద్ద అడ్డంకి అయింది. అయితే మెడిసిన్ చదవలేకపోవడం ద్వారా అన్నింటినీ కోల్పోయినట్లు దిగాలు పడలేదు. దిగులు పడి అక్కడే ఆగిపోతే ఇప్పుడీ స్థానాన్ని అందుకోగలిగేదాన్నే కాదు. తెలియని రంగంలో అడుగుపెట్టి ప్రతిదీ నేర్చుకుంటూ ఎదిగాను. ఎక్కడా ఆగిపోలేదు’’ యాభై శాతం ఉన్నాం! ఐదు శాతమే కనిపిస్తున్నాం!! వనిత ఎలికో పరిశ్రమను నడుపుతూ సిఐఐలో చురుగ్గా పాల్గొంటున్నారు. సిఐఐలో ఔత్సాహిక మహిళాపారిశ్రామిక వేత్తలకో వేదిక కోసం కృషి చేశారామె. వారికి పరిశ్రమ నిర్వహించే నైపుణ్యాలను పెంచడానికి అవసరమైన సూచనలు, వర్క్ ప్లేస్‌లో భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. మహిళలకు భవిష్యత్తు పట్ల భరోసా కల్పించాలంటారు వనిత.సమాన అవకాశాల కోసం చేసే ఈ పోరాటం కొనసాగాలి. జెండర్ ఈక్వాలిటీ విషయంలో మనదేశం 87వ స్థానంలో ఉంది. మొదటి పది స్థానాల్లోకి ఎదిగినప్పుడు మాత్రమే ఈక్వల్ ఆపర్చునిటీస్ మనకు అందేటంత దగ్గరకు వచ్చినట్లు. అవకాశాలు దూరంగా ఉన్నాయని పోరాటాన్ని ఆపకూడదు. ప్రస్తుతం విద్యాసంస్థల నుంచి బయటికొస్తున్న గ్రాడ్యుయేట్లలో 50 శాతం మహిళలు ఉంటున్నారు. కానీ ఉద్యోగవ్యాపారాలలో అడుగుపెట్టిన తర్వాత కలకాలం కొనసాగుతున్న వాళ్లు ఐదు శాతానికి మించడం లేదు. అలాంటి వారిలో చైతన్యం తీసుకురావడం, స్ఫూర్తి కలిగించడం, కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి మెంటార్షిప్ కల్పించడమే ఆ వేదిక ఉద్దేశం. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
విజయ్‌ని డబ్బులు డిమాండ్ చేయలేదు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కమెడియన్ విజయ్‌సాయి భార్య వనితారెడ్డి న్యాయవాదితో కలిసి బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన విజయ్, భార్య వనితపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని ఈ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో వనితపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా పరారీలో ఉన్న వనిత.. తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసులు సరెండర్ కావాలని నోటీసులు ఇచ్చారని, అందుకే తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు వనిత తెలిపింది. ఆమె మీడియాతో ఏమన్నారంటే.. 'విజయ్ను నేను వేధించలేదు. అతని సెల్ఫీలో వాస్తవాలు చెప్పలేదు. విజయ్ నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదు. తల్లిదండ్రలు వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పాప తట్టుకోలేదనే భయంతోనే విజయ్ మృతదేహాన్ని చూపించలేదు. సాక్ష్యాల కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నా. విజయ్‌కి నాకు మధ్య మూడేళ్లుగా మాటలు లేవు... పాపను చూడడానికి వచ్చినప్పుడు నన్నే ఇబ్బంది పెట్టే వాడు. నేనెవరినీ బెదిరించలేదు. తప్పు కప్పిపుచ్చుకునేందుకే నాపై విజయ్ తల్లిదండ్రులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ ఆత్మహత్యకు కారణం తెలియదు. నాపై కక్ష తీర్చుకునేందుకే సూసైడ్ నోట్లో విజయ్ నాపేరు రాసి ఉంటాడు. విజయ్‌ని డబ్బులు డిమాండ్ చేయలేదు. నేను తప్పు చేయలేదనే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేనెప్పుడు విజయ్ పై పగ తీర్చకోవాలనుకోలేదు. విజయ్ ఆత్మహత్యకు నేను తీసుకెళ్ళిన కారు కారణం కాదు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా' అని వనితారెడ్డి తెలిపారు. విచారణ అనంతరం 41 సీఆర్పీసీ నోటీసు కింద వనితను పోలీసులు ఇంటికి పంపించారు. వనిత దగ్గర ఉన్న అధారాలతో మూడు రోజుల్లో మళ్లీ విచారణకు హాజరవ్వాలని పోలీసులు చెప్పారు. విజయ్‌ని డబ్బులు డిమాండ్ చేయలేదు -
లొంగిపోయిన వనితారెడ్డి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కమెడియన్ విజయ్‌సాయి భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. న్యాయవాదితో కలిసి వచ్చిన ఆమెను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన విజయ్ ఈ వీడియోలో భార్య వనితపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని ఈ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో వనితపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా పరారీలో ఉన్న వనిత.. తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. అందుకే అజ్ఞాతంలో ఉన్నా..: వనితారెడ్డి విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆధారాలు పోలీసులకు సమర్పించబోతున్నట్టు అంతకుముందు ఆమె మీడియాకు తెలిపింది. పోలీసులు సరెండర్ కావాలని నోటీసులు ఇచ్చారని, అందుకే తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపింది. ఆమె మీడియాతో ఏమన్నారంటే.. 'విజయ్ను నేను వేధించలేదు. అతని సెల్ఫీలో వాస్తవాలు చెప్పలేదు. విజయ్ నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదు. తల్లిదండ్రలు వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్ష్యాల కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నా. పోలీసులకు అన్ని సాక్ష్యాధారాలు సమర్పిస్తా' అని వనితారెడ్డి తెలిపారు. విజయ్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వనితరెడ్డి గతంలో మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని ఆమె గతంలో వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. 'విజయ్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో వారు ఉన్నారు' అని ఆమె గతంలో అన్నారు. లొంగిపోయిన వనితారెడ్డి! -
సైకోలా ప్రవర్తించేవాడు
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు విజయసాయి ఆత్మహత్యకు తాను కారణం కాదని అతడి భార్య వనిత స్పష్టం చేశారు. మూడేళ్లుగా విడిపోయి ఉంటున్నప్పుడు అతడి మరణానికి తాను ఎలా కారణమవుతానని ప్రశ్నించారు. గురువారం ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టే అతడిపై సానుభూతి చూపిస్తూ తనను నేరస్తురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. అత్తింటి నుంచి ఎలాంటి ఆస్తులు తీసుకోలేదని, సాక్ష్యాలు సేకరించడం కోసమే తాను పోలీసులకు లొంగిపోలేదని వివరించారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని విజయ్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లైన తర్వాత అతడి ప్రవర్తన నచ్చక విడాకులకు దరఖాస్తు చేశాను. పాప తీసుకుని మా ఇంటికి వచ్చేసాను. మూడేళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నాను. అతడితో పర్సనల్‌గా మాట్లాడలేదు. మా మామగారు మొదట్లో నాతో మంచిగా ఉండేవారు. తర్వాత ఎందుకో మారిపోయారు. విజయ్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం అతడి ఫ్రెండ్స్ కూడా తెలుసు. అతడు చనిపోయాడన్న సానుభూతితో వారు నోరు విప్పడం లేదు. విజయ్ ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా సేకరించే పనిలో ఉన్నాను. పాప చూపించకుండా విజయ్ను మానసిక క్షోభకు గురిచేశానడటం వాస్తవం కాదు. నిజనిజాలు తెలుసుకోకుండా నాపై నిందలు వేయడం కరెక్ట్ కాదు. అతడి కేరెక్టర్ ఏంటో తెలుసుకోండి. పాప ఎదురుగానే నన్ను అసభ్య పదజాలంతో తిట్టేవాడు. సైకోలా ప్రవర్తించేవాడు. రెండుసార్లు నాపై దాడి చేశాడు. దీనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాను. విజయ్ ఆత్మహత్య చేసుకోవడంతో అతడిపై సానుభూతి చూపిస్తూ అందరూ నాపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధారాలన్నీ సేకరించిన తర్వాత పోలీసులకు లొంగిపోతాన’ని వనిత చెప్పారు. -
విజయ్ సూసైడ్: పరారీలోనే వనితారెడ్డి!
సాక్షి, హైదరాబాద్: సినీ హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావల్సిందిగా విజయ్‌సాయి భార్య వనితారెడ్డి, అడ్వకేట్ శ్రీనివాస్‌లకు పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే, ఈ నోటీసులను బేఖాతరు చేస్తూ వనితారెడ్డి, శ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మహిళతో విజయ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను వనితారెడ్డి ఇప్పటికే మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని ఆమె వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది. 'విజయ్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఆడపిల్లను ఎలా బతుకుతాను. నాకు ఒక బిడ్డ ఉంది.. నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి? మా అత్తమామ నన్ను ఏదైనా చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమిటి? నా భర్త ఎలాంటి వాడో అన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతాను. అన్ని రూమర్లకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎంతసేపు వారు తమ కొడుకు చనిపోయాడని ఆలోచిస్తున్నారు గానీ మనవరాలు భవిష్యత్ ఏమిటని ఎవరూ ఆలోచించడం లేదు. కార్లు, బంగ్లాలు, ఉన్నాయని నేను కోర్టులో కేసులు వేశానంటున్నారు.. నేను ఎలాంటి కేసులు వేశానో చూస్తే మీకే తెలుస్తుంది. నా బిడ్డకు తండ్రిని లేకుండా చేశారు. తండ్రిలేని బిడ్డను ఎలా చూసుకోవాలో ఆలోచించుకోవాలి. నేను ఎక్కడికీ పారిపోలేదు' అని వనిత పలు విషయాలు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ట్రాకింగ్ చేసిన ప్రకారం ఆమె కాకినాడలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది ఇంకా తెలియరాలేదు. -
విజయ్ కేసులో కొత్త సంచలనం
సాక్షి, హైదరాబాద్ : ఆత్మహత్యకు పాల్పడిన కమెడియన్ విజయ్ సాయి కేసులో మరో సంచలన అంశం బయటకొచ్చింది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనిత మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది. ఇంకా సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారంటే.. 'విజయ్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మూడేళ్లుగా విజయ్‌కి దూరంగా ఉంటున్నాను. అలాంటిది నేను ఆయన ఆత్మహత్యకు కారణం అంటే ఎలా కుదురుతుంది. అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కడికీ పారిపోలేదు. త్వరలోనే పోలీసుల ఎదుట లొంగిపోతాను. విజయ్ తల్లిదండ్రులు నాపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఆడపిల్లను ఎలా బతుకుతాను. నాకు ఒక బిడ్డ ఉంది.. నా బిడ్డ భవిష్యత్తు ఏం కావాలి? మా అత్తమామ నన్ను ఏదైనా చేస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమిటి? నా భర్త ఎలాంటి వాడో అన్ని వీడియోలు, ఆడియోలు, ఫొటోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతాను. అన్ని రూమర్లకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎంతసేపు వారు తమ కొడుకు చనిపోయాడని ఆలోచిస్తున్నారు గానీ మనవరాలు భవిష్యత్ ఏమిటని ఎవరూ ఆలోచించడం లేదు. కార్లు, బంగ్లాలు, ఉన్నాయని నేను కోర్టులో కేసులు వేశానంటున్నారు.. నేను ఎలాంటి కేసులు వేశానో చూస్తే మీకే తెలుస్తుంది. నా బిడ్డకు తండ్రిని లేకుండా చేశారు. తండ్రిలేని బిడ్డను ఎలా చూసుకోవాలో ఆలోచించుకోవాలి. నేను ఎక్కడికీ పారిపోలేదు' అని వనిత పలు విషయాలు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ట్రాకింగ్ చేసిన ప్రకారం ఆమె కాకినాడలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది ఇంకా తెలియరాలేదు. -
విజయ్ కేసులో కొత్త సంచలనం
-
పరారీలో వనిత ...?
బంజారాహిల్స్: హాస్యనటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత కోసం జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులుగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల వద్ద పోలీసుల నిఘా ఉంచారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఆరోపణలపై నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న వనితకు నోటీసులు జారీ చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులను ప్రశ్నించారు. అయితే తన కుమార్తె సూర్యాపేటలో ఉందని ఆమె తల్లి చెప్పింది. వనిత ఫోన్ సిగ్నల్స్ పరిశీలించగా రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను విచారిస్తే ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. రెండు బృందా లుగా ఏర్పడ్డ పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. -
‘నాకు చాలా ఈగో ఎక్కువ’
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయ్‌కు అతడి భార్య వనిత పంపిన ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘నాకు ఎంత ఈగో రేజ్ అవ్వాలి. విజయ్ నీకు అలాంటివేమి ఉండవనుకుంటాను. నాకు చాలా ఎక్కువ. ఒక్కసారి నా ఈగో రెచ్చగొడితే అది లైఫ్ లాంగ్ బ్లడ్‌లో ఉండిపోతుందంతే. నీకు తెలియదు కదా నా గురించి చూడు రివేంజ్ ఎలా ఉంటుందో. రివేంజ్ తీర్చుకోకుండా ఉండను. ఎందుకంటే నేను సైలెంట్‌గా ఉండను. నేను ఇంతవరకు ఎంత దిగజారానో నాకు తెలుసు. అర్థమైందా? నేను మళ్లీ ఎలా బతుకుతానో నువ్వు చూద్దువు కానీ. బాధ పడకు, కంగారు పడకు సరేనా?’ అంటూ వనిత మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి. కాగా, తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని పేర్కొంటూ ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి సెల్ఫీ వీడియోలో పేర్కొన్న సంగతి తెలిసింది. అజ్ఞాతంలోకి వనిత..? వనితను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వనిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. తన కొడుకు మృతికి కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని విజయ్ తండ్రి సుబ్బారావు ప్రశ్నిస్తున్నారు. -
విజయ్ గురించి మామ - కోడలు ఫోన్ సంభాషణ
-
‘విజయ్ మృతిపై అనుమానాలు’
సాక్షి, హైదరాబాద్: తన భర్త మృతిపై అనుమానాలున్నాయని సినీ నటుడు విజయ్ సాయి భార్య వనిత అన్నారు. ఆస్తి తగాదాలే అతడి మరణానికి కారణమైవుండొచ్చని ఓ వార్తా చానల్‌తో చెప్పారు. తండ్రితో విజయ్‌కు ఆస్తి తగాదాలున్నాయన్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. విజయ్ను తాను బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. తాను ఎవరితోనూ కలిసి తన భర్తను బెదిరించలేదని చెప్పారు. విజయ్ వేధింపులు తట్టుకోలేక తానే చనిపోవాలనుకున్నానని వెల్లడించారు. ఓ అమ్మాయితో అతడికి వివాహేతర సంబంధం ఉందని, రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వదిలేశాడని వెల్లడించారు. అక్రమ సంబంధాల గురించి ప్రశ్నించినందుకే నడిరోడ్డుపై తనను కొట్టాడని వాపోయారు. పిల్లలు వద్దంటూ చిత్రహింసలు పెట్టాడని, మూడుసార్లు తనకు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ అంటే తనకు ప్రాణమని, అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. శశిధర్‌తో తనకు అక్రమసంబంధం అంటగట్టడం దారుణమని వనిత అన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త మృతదేహాన్ని చూసి ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. వనిత దొంగ: విజయ్ తండ్రి తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని ఆమె మామ కెవి సుబ్బారావు ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. రేపు పోస్ట్‌మార్టం పూర్తి చేసిన తర్వాత విజయ్ సాయి భౌతికకాయానికి అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం: డీసీపీ విజయ్ సాయి ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు తన సెల్ఫోన్లో విజయ్ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు చెప్పారు. తన మరణానికి భార్య వనిత, శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ కారణమని వీడియోలో అతడు పేర్కొన్నాడని వెల్లడించారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. కాగా, వనిత, శశిధర్, న్యాయవాది శ్రీనివాస్‌లపై ఐపీసీ సెక్షన్ 306 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నటుడు విజయ్ సాయి భార్య ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తానెప్పడు తన భర్తను ఇబ్బంది పెట్టలేదని సినీ నటుడు విజయ్ సాయి భార్య వనిత చెప్పారు. రెండేళ్లుగా తమ విడాకుల కేసు కోర్టులో ఉందని వెల్లడించారు. శశిధర్ ఎవరో తనకు తెలియదని, తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణవార్త తెలుసుకుని సోమవారం మధ్యాహ్నం ఆమె ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘విజయ్‌కు వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆ విషయం నేను కళ్లారా చూశాకే విడాకులు అడిగాను. సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడు. అమ్మాయిలతో పరిచయాలు వద్దని చాలాసార్లు చెప్పాను. ఇలాంటి వద్దని మనిద్దరం సంతోషంగా ఉందామని చెప్పిచూసినా అతడు వినలేదు. విజయ్ ప్రవర్తన గురించి అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదు. విజయ్ నన్నెప్పుడూ మంచిగా చూసుకోలేదు. నన్ను చిత్రహింసలు పెట్టాడు. నేనెప్పుడూ బయటకు వచ్చి చెప్పుకోలేదు. విజయ్ను నేను డబ్బులు డిమాండ్ చేయలేదు. నా కూతురు వారంలో 2 రోజులు తండ్రి దగ్గర ఉండాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నా కూతుర్ని తీసుకెళ్లాడు. పాపను తీసుకునేందుకు వెళ్లినప్పుడు నన్ను కొట్టాడు. నావైపు నుంచి ఎలాంటి తప్పులేదు. విజయ్ ఇప్పటికిప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియద’ని వనిత అన్నారు. -
చందాలు దండుకునేందుకే మినీ మహానాడ
కొవ్వూరు : కొవ్వూరులో నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడు పేరుతో మంత్రి, నాయకులు భారీగా వ్యాపారుల నుంచి చందాలు దండుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం దుకాణాల నుంచి కిరాణా వర్తకుల వరకు చందాలు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం మూలంగానే కొవ్వూరులో పెట్టిన జిల్లా మినీమహానాడు పూర్తిగా విఫలమైందన్నారు. నసమీకరణ కోసం ఉపాధి హామీ కూలీలకు మస్తర్ వేసి సభకు తరలించడం ఎంతవరకు సమజసం అని ప్రశ్నించారు. జిల్లాలో సమస్యలను గాలికి వదిలేసి మహానాడులో కేవలం ప్రతిపక్షంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చాగల్లు మండల పార్టీ అధ్యక్షుడు కోఠారు అశోక్‌బాబా, దళిత విభాగం రాష్ట్ర విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు, మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాల మురళీకృష్ణ (చిన్నారి), నాయకులు గారపాటి వెంకటకృష్ణ, ఉప్పులూరి సూరిబాబు, కొఠారు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
నా కుమార్తెను అప్పగించండి
♦ నటులు విజయ్‌కుమార్, మంజుల మాజీ అల్లుడి ఫిర్యాదు ♦ కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్: తన కుమార్తెను అప్పగించం డంటూ సినీనటుడు విజయ్‌కుమార్ మాజీ అల్లుడు ఆనంద్‌రాజన్ గురువారం హైదరా బాద్‌లోని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను చెన్నై, కోయంబత్తూర్‌లకు పంపారు. ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె వనితకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆనంద్ రాజన్‌తో 2007లో వివాహం జరిగింది. వీరికి జైనిక (8) అనే పాప ఉంది. 2012లో విభేదాలు రావడంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. తండ్రి సంరక్షణలో జైనిక ఉండాలని కోర్టు వారికి సూచించింది. కూతురిని చూసుకునే అవకాశం తల్లికి కల్పించింది. అయితే, ఆనంద్ రాజన్ అల్వాల్‌లో నివాసముం టున్నారు. కొంతకాలంగా వనిత తరచూ ఆనంద్‌రాజన్ వద్దకు వచ్చి పాపను చూసు కునేది. వనితకు వేరే వ్యక్తితో వివాహం కావడంతో కొంత కాలంగా పాపను చూడటానికి ఇక్కడికి రాలేదు. గత నెల 18న ఆనంద్‌రాజన్ వద్దకు వచ్చిన వనిత పాపను తీసుకెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా వనిత ఆచూకీ లభించకపోవడంతో ఆనంద రాజన్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వనితపై కిడ్నాప్, చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆనంద్‌రెడ్డి వెల్లడించారు. -
సీఐ హత్య కేసులో ప్రియురాలికి యావజ్జీవం
కేకే.నగర్ : సబ్ ఇన్స్పెక్టర్ను కత్తితో పొడిచి హత్య చేసిన ప్రియురాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చిదంబరం కోర్టు తీర్పు ఇచ్చింది. విళ్లుపురం జిల్లా ఉళుందూరు పేటకు చెందిన పావాడై కుమారుడు గణేశన్ (32). ఇతడు 2011వ సంవత్సరం కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో బ్రాంచ్ పోలీసుస్టేషన్లో సీఐ. అదే పోలీసుస్టేషన్ కు అంబలత్తాడి కుప్పం గ్రామానికి చెందిన కలైమణి అను, అతని భార్య వనిత (25) ఒక కేసు విషయమై తరచూ వచ్చి వెళ్లేది. ఆ సమయంలో గణేశన్‌కు, వనితకు మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వనిత తన భర్త కలైమణికి విడాకులు ఇచ్చి గణేశన్‌ను వివాహం చేసుకోవడానికి నిర్ణయించింది. అయితే గణేశన్ కొన్ని కారణాల వలన వనితతో వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గణేశన్‌కు అతని తల్లిదండ్రులు కుదిర్చిన మరో యువతితో 2014లో వివాహం జరిగింది. ఈ విషయం తెలిసి వనిత తనను కూడా పెళ్లి చేసుకోవాలని కోరుతూ గణేశన్పై వత్తిడి తెచ్చింది. అతను అంగీకరించకపోవడంతో 2014 జూలై 21వ తేదీ అన్నామలైనగర్‌లో ఉన్న గణేశన్ ఇంటికి వెళ్లిన వనిత అతన్ని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ కేసుపై విచారణ చిదంబరం జిల్లా అదనపు బెంచ్ న్యాయస్థానంలో జరిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి కింగ్స్లీ క్రిస్టోఫర్ బుధవారం తీర్పులో వనితకు యావజ్జీవ కారాగారశిక్ష రూ.1000 జరిమానా విధించారు. అనంతరం వనితను పోలీసు వ్యాన్‌లో వేలూరు జైలుకు తరలించారు. -
చిక్కుల్లో వనిత, రాబర్ట్
నటి వనిత, నృత్య దర్శకుడు రాబర్ట్‌లు పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తామింకా పెళ్లి చేసుకోలేదని కలిసి చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు వీరిద్దరు ఇటీవల సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వనిత నటుడు విజయకుమార్, మంజుల దంపతుల కూతురన్న విషయం తెలిసిందే. ఈమె ఇంతకు ముందే రెండు సార్లు పెళ్లి చేసుకుని మనస్పర్థల కారణంగా ఆ భర్తల నుంచి విడిపోయారు. బుల్లితెర నటుడు ఆకాష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి శ్రీహరి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరి కొడుకు శ్రీహరి తన తండ్రితోనే ఉంటాననడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. చివరికి శ్రీహరి తండ్రితో ఉండడాన్ని కోర్టు సమర్థించింది. అనంతరం ఆనందరాజ్ అనే వ్యాపార వేత్తను వనిత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టింది. తరువాత ఆనందరాజ్‌తో కూడా విడాకులు తీసుకుంది. మళ్లీ మొదటి భర్త ఆకాష్‌కు దగ్గరయ్యారు. కొడుకు శ్రీహరి కోసమే వీరిద్దరు కలిసి జీవించాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో నృత్య దర్శకుడు, నటి అల్ఫోన్సా తమ్ముడు రాబర్ట్‌ను వనిత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రేమ జంట మాత్రం తమ పెళ్లి ఇప్పుడుకాదంటూ ప్రకటించారు. వనిత, రాబర్ట్‌ల వివాహాన్ని విజయకుమార్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి పెళ్లికి చిక్కులేర్పడినట్లు తెలిసింది.