
సాక్షి, అనంతపురం: అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు, కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తప్పవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. శనివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై మంత్రి వనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు. అంగన్‌వాడీలకు చేరాల్సిన సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీగా దోపిడీ చేశారని.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వనిత స్పష్టం చేశారు.