Women and Child Welfare Department
-
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
నారీ అదాలత్ ఏం చెబుతోంది?
భారతీయ న్యాయ సంహిత తాజాగా అమలులోకి వచ్చింది. అలాగే స్త్రీలకు సత్వర న్యాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నారీ అదాలత్’ పేరుతో ప్రత్యేక పంచాయతీ వ్యవస్థను పరిచయం చేయబోతోంది. పైలట్‌ప్రాజెక్ట్‌గా అసోం, జమ్ము–కశ్మీర్‌లలో ప్రవేశపెట్టనున్నారు. ఇది కోర్టులా న్యాయం చేస్తుందా? లేదా ‘ఖాప్ పంచాయతీ’లా పంచాయతీ పెడుతుందా? అసలు ‘నారీ అదాలత్’ ఏంటి?నళిని ప్రైవేట్ టీచర్. తమ ఊళ్లోనే ఉన్న కాన్వెంట్లో పని చేస్తోంది. వృత్తి అంటేప్రాణం. వాళ్లది గ్రామ పంచాయతీ. వ్యవసాయ కుటుంబం. ఇంట్లోనే పాడి. భార్యగా, ఇంటి కోడలిగా ఆ బాధ్యతలన్నీ నళినే చూసుకోవాలని ఆమె మీద ఒత్తిడి.. భర్త, అత్తగారి నుంచి! ఆఖరికి వాకిలి ఊడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసే పనినీ నౌకరుతో చేయిస్తోందని భర్త కంప్లయింట్. ఆ ఒత్తిడి హింసగా మారి నళిని మానసిక ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుడంటంతో ఆమె గృహ హింస చట్టాన్ని ఆశ్రయించక తప్పలేదు. ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో భర్త మీద ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలిద్దరికీ రెండుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా నళిని భర్తది ఒకటే మాట.. ఆమె ఉద్యోగం మానేయాలని! దానికి నళిని ససేమిరా అన్నది. దాంతో ‘విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్’(తాము కౌన్సెలింగ్ చేసిన విధానం, అయినా ఫలితం రాని వైనాన్ని రాసిన నివేదిక) ను కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా గృహ హింస చట్టం కింద కోర్ట్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. గృహ హింస చట్టంలో ఆరోపణ రుజువైతే బాధితులకు ఆర్థిక భద్రత కల్పించాలి. వాళ్లకున్నప్రాథమిక హక్కుని గౌరవించాలి. ఇది మహిళలకు ఆ యాక్ట్ ద్వారా కోర్టులు అందించే న్యాయం. నళిని ఉండే ఊర్లో ‘నారీ అదాలత్’ అమలయితే ఆ పంచాయతీ ఎలా ఉండొచ్చు?‘నారీ అదాలత్’లోని సభ్యుల్లో సగం మంది గ్రామ పంచాయత్ నుంచి ఉంటారు. మిగిలిన సగంలో టీచర్లు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారుంటారు. వీళ్లను గ్రామస్థులే నామినేట్ చేస్తారు. ఈ కమిటీ అంతా మహిళలతోనే ఉంటుందా? లేక స్త్రీ, పురుషులతో కలసి ఉంటుందా అనేదాని మీద ఎక్కడా పూర్తి వివరం లేదు. సరే.. నళినీ కేసు నారీ అదాలత్ స్వీకరించినప్పుడు అదాలత్ సభ్యులపై నళిని అత్తగారి కుటుంబం పలుకుబడి ప్రభావం చూపదా? అలాగే పురుషస్వామ్య సంస్కృతి ప్రభావం వల్ల అదాలత్‌లోని సభ్యులకు కుటుంబం, స్త్రీ, ఆమె విధుల పట్ల సంప్రదాయ ఆలోచనలు, కచ్చితమైన అభి్రపాయాలు ఉండొచ్చు.ఈ నేపథ్యంలో నళిని విషయంలో ఎలాంటి తీర్పు వెలువడవచ్చు? ఆమె హక్కులు, వ్యక్తిత్వాన్ని గుర్తించే, గౌరవం లభించే అవకాశం ఎంత వరకు ఉంటుంది? దీనివల్ల దళిత, గిరిజన మహిళల మీద వేధింపులు పెరగవచ్చు, రాజకీయ ప్రయోజనాలూ మిళితమవచ్చు. కరప్షన్‌కి చాన్స్ ఉండొచ్చు. అసలు ఇది ఊళ్లల్లో పెద్ద మనుషుల పంచాయతీకి ఏ రకంగా భిన్నమైనది? దాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.. ఈ అదాలత్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తోంది అనే భేదం తప్ప! దీన్ని ఆసరాగా చేసుకుని నారీ అదాలత్ సభ్యులు నిందితుల లేదా వాళ్ల తరఫు పెద్ద మనుషుల ప్రలోభాలకు లొంగి బాధితురాలిని ఇబ్బంది పెట్టే ప్రమాదం మెండు.స్థానిక పోలీసులూ రెచ్చిపోయే అవకాశమూ అంతే అధికం. రే΄÷్పద్దున లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్ లాంటి సమస్యలను తీసుకుని మహిళలు పోలీస్ స్టేషన్‌కి వెళితే నిందితుల ప్రలోభాలకు తలొగ్గి స్టేషన్‌కి ఎందుకు వచ్చారు? నారీ అదాలత్లున్నాయి కదా అక్కడే తేల్చుకు΄పొండి అనే చాన్సూ ఉంటుంది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది? ఈ క్రమంలో మహిళల కోసం వచ్చిన ప్రత్యేక చట్టాల ఉనికే దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఏదేమైనా ఇలాంటి ప్రయోగాలు లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలతో, ఒక నిర్దిష్ట రూపం దాల్చాకే అమల్లోకి వస్తే మంచిది అని అభి్రపాయపడుతున్నారు పలువురు న్యాయప్రముఖులు, సామాజిక కార్యకర్తలు! – సరస్వతి రమట్రయల్ అండ్ ఎర్రర్గానే... కోర్టులకు పనిభారం తగ్గించేందుకే కేంద్రం ఖాప్ పంచాయత్‌లను పోలిన నారీ అదాలత్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది ఏ రకంగానూ విమెన్ ఫ్రెండ్లీ కాదు. ఇప్పటివరకు విన్న, చదివిన దాన్ని బట్టి ఇదో ట్రయల్ అండ్ ఎర్రర్‌గా మిగిలిపోనున్నది. ఎందుకంటే గ్రామస్థాయిలో న్యాయవాదులచే శిక్షణ ΄పొందిన లీగల్ వలంటీర్ వ్యవస్థ ఉంది.మండల, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్రాలు, సఖీ సెంటర్లున్నాయి. ఇప్పటికే ప్రతి పోలీస్‌స్టేషన్‌కి అనుబంధంగా ఉన్న కౌన్సెలింగ్ సెంటర్స్ వల్ల పోలీసులు ఫిర్యాదులే తీసుకోవట్లేదు. ఎంత తీవ్రమైన సమస్యలనైనా కౌన్సెలింగ్ సెంటర్స్‌కే రిఫర్ చేస్తున్నారు. అక్కడ కొన్ని పరిష్కారం అయ్యి కొన్ని కాక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది రచ్చబండను పోలిన ఈ నారీ అదాలత్‌లు ఏం న్యాయం చేయగలవు! – ఇ. పార్వతి, ఫ్యామిలీ కౌన్సెలర్అసంబద్ధమైన ఆలోచన‘నారీ అదాలత్’ లాంటి అఫీషియల్ ఖాప్ పంచాయత్‌లు మహిళల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతాయి. వీటివల్ల మహిళల ప్రైవసీ, డిగ్నిటీ, మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. అంతేకాదు పరువు పేరుతో వాళ్లప్రాణాలకూ ముప్పు ఉండొచ్చు. ఇదొక అసంబద్ధమైన ఆలోచన. జూన్ 30 వరకు అమలులో ఉన్న క్రిమినల్ చట్టాల ప్రకారం.. కుటుంబ వివాదాలకు సంబంధించిన అన్ని కేసులు ఇంకా చె΄్పాలంటే ఏడేళ్లలోపు శిక్షలు పడ్డ అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. అంటే బాధితులకు న్యాయాన్ని అందించడంతో పాటు నిందితుల హక్కులనూ గుర్తిస్తుందన్నమాట. కుటుంబ కలహాలు, గృహ హింస కేసుల్లో కౌన్సెలింగ్ ఫెయిలైతే సదరు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిపోర్ట్ పంపిస్తారు. దాని ప్రకారం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఇలాంటి కేసుల్లో కొత్త శిక్షాస్మృతీ దాన్నే ఫాలో కావాలి. కానీ కొత్త క్రిమినల్ చట్టాలు, ముఖ్యంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్నెస్సెస్) లోని కొన్ని రూల్స్ వల్ల అలా జరగకపోవచ్చు. సాధారణంగా ఏ ఫిర్యాదు అందినా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అయితే కుటుంబ కలహాల కేసులు, ఆర్థిక నేరాలు వంటి కొన్ని ఆరోపణలలో ఏడు రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చు. కానీ అది నిజనిర్ధారణకు కాదు. కాగ్నిజబుల్ కేసు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాలి. కానీ బీఎన్నెస్సెస్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ పవర్ పోలీసులకు వచ్చింది. కాబట్టే వాళ్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఆస్కారం తక్కువుంటుంది. ఇదివరకైతే పోలీసులు సహకరించకపోతే ఎఫ్ఐఆర్ వేయమని జిల్లా మేజిస్ట్రేట్ దగ్గర పిటిషన్ దాఖలు చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు బీఎన్నెఎస్సెస్లోని సెక్షన్ 223 (1) ప్రకారం నిందితుడి పక్షం వినకుండా మెజిస్ట్రేట్.. ఎఫ్ఐఆర్ కోసం పోలీసులకు ఆదేశాలిచ్చే అవకాశం లేదు. దాంతో బలవంతులైన పురుషులకు బయటపడే మార్గాలను వెదుక్కునే చాన్స్ దొరుకుతోంది. వీటివల్ల 498 వంటి కేసుల్లోనూ ఎఫ్ఐఆర్ ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇలా కోర్టు పరిధిని తగ్గించే ఇలాంటి ప్రయత్నాలేవీ సమాజానికి మంచివి కావు. – శ్రీకాంత్ చింతల, తెలంగాణ హైకోర్టు న్యాయవాది -
అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలన్న సీఎం.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ప్రక్షాళన.. 14 మంది అధికారులపై వేటు -
సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రై రేషన్ పంపిణీపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని చెప్పారు. అందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ బుధవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలని పేర్కొన్నారు. వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని.. పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు గర్భిణీలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అన్నదానిపై పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతినెలా కూడా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని, జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులపై క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఉషాశ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: చంద్రబాబు ప్లాన్ రివర్స్.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్! -
ఊరంతా మా కుటుంబమే!
విధుల్లో ఉత్తమసేవలు అందించినందుకుగాను జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం, రేగట్టె వెంకట రమణ ఎంపికయ్యారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా రేగట్టె వెంకటరమణను పలకరిస్తే తన ఇరవై మూడేళ్ల్ల కృషిని వివరించారు. ‘‘పై అధికారులు చెప్పిన పనిని సమయానుకూలంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తూ రావడం వల్లే ఈ రోజు ఈ పురస్కారం లభించింది. ఎనిమిదవ తరగతి పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఇరవై మూడేళ్ల్ల క్రితం అత్తింటిలో అడుగుపెడుతూనే అంగన్వాడీ టీచర్‌గానూ చేరాను. ఆ తర్వాత మా వారు భద్రయ్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. మా ఇంటినే కాదు ఊరు బాగోగులు చూసుకునే అవకాశం కూడా దక్కడం అదృష్టంగా భావిస్తాను. అందుకే, నాకు మా ఊరే కుటుంబం అయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అందరూ అందరి కోసం అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలను జరుపుతుంటాం. ఇవన్నీ ఊళ్లో అందరినీ సంఘటితం చేస్తున్నాయి. ప్రీ స్కూల్, ఆరోగ్యలక్ష్మి, ఇంటింటి అంగన్వాడీ హోమ్ విజిట్స్, పౌష్టికాహార, తల్లిపాల వారోత్సవాలు, మిల్లెట్స్ మాసం, పిల్లల చదువుకు సంబంధించి.. ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఏ కార్యక్రమం చేసినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఇంటింటి ప్రోగ్రామ్.. గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం.. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటాం. మేం మా డైరీలో సక్సెస్ స్టోరీలు కూడా నోట్ చేస్తాం. ఒకసారి ఒక గర్భిణి పౌష్టికాహారం గురించి, తీసుకోవలసిన ఇతర జాగ్రత్తల గురించీ మేం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోలేదు. ఆమెకు డెలివరీ అయి బరువు తక్కువతో పాప పుట్టి, చనిపోయింది. అయినా ఆమెను మళ్ళీ మళ్లీ కలుస్తూనే, విషయాలన్నీ చెబుతూ ఆమె తిరిగి కోలుకునేలా చేశాం. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మేం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించింది. ఈసారి ఆరోగ్యకరమైన పాపకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమెనే ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా తనలా అశ్రద్ధ చేయద్దని సూచనలు చేస్తుంటుంది. చంటిపిల్లల విషయంలోనూ తల్లులు ఒకరిద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. అందరూ మా వాళ్లే.. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలకు గ్రామపెద్దలు డబ్బులు పోగేసి మరీ చేస్తుంటారు. ర్యాలీలు, వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గ్రామపెద్దలను కలిసి చెబుతాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తాను. వాళ్లూ మిగతా అందరినీ కూడగట్టుకొని, మాకు మద్దతు ఇస్తారు. దీంతో ఊరంతా ఆరోగ్యంగా ఉండేలా సరైన కృషి జరుగుతోంది. కార్యక్రమాల్లో ఊరంతా ఒక్కటవుతుంది. ఆ రోజు ఎవరూ పనులకు కూడా వెళ్లరు. కార్యక్రమాలను ఓ పండగలా జరుపుతుంటారు. నేను చెప్పిన విషయాలను వినడంలోనూ, ఆచరించడంలోనూ మా ఊరంతా నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సమయంలోనూ తీసుకున్న జాగ్రత్తలకు రాష్ట్రస్థాయి అ«ధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. బెస్ట్ అవార్డీగా... మండల, ప్రాజెక్ట్, జిల్లా స్థాయుల్లోనూ.. బెస్ట్ అంగన్వాడీ టీచర్‌గా అవార్డులు అందుకున్నాను. ఈ యేడాది జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిల్లెట్స్‌తో ఐటమ్స్ తయారుచేసి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాం. వాటి ప్రయోజనాలను వివరిస్తాం. దీనివల్ల ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. మా అంగన్వాడీ టీచర్స్‌కి నెలలో రెండు సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో ఊళ్లలో చేపట్టే కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందస్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం, నిర్ణయాల అమలుకు కృషి చేయడం మాకున్న పెద్ద బాధ్యత. దీనిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ రోజు మీ అందరి ముందు నిలిపింది’’ అని ఆనందంగా వివరించింది వెంకటరమణ. – నిర్మలా రెడ్డి -
ఐసీడీఎస్ వారి పెళ్లిపిలుపు
సాక్షి, కామారెడ్డి: ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలికను మహిళా శిశు సంక్షేమ శాఖ అక్కున చేర్చుకుంది. కామారెడ్డిలోని బాలసదనంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆమెకు యుక్త వయసు రావడంతో అన్నీ పరిశీలించి, సంబంధం కుదిర్చారు. జిల్లా అధికారులే పెళ్లి పెద్దలుగా మారి ఆమెను పెళ్లిపీటలు ఎక్కించబోతున్నారు. ఈ అపురూప సన్నివేశం సోమవారం సదాశివనగర్ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో సోమవారం ఆవిష్కృతం కాబోతోంది. అలా జత కలిసింది.. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయిన రూప, ఆమె చెల్లెలిని ఐసీడీఎస్ అధికారులు చేరదీసి, బాలసదనంలో చేర్పించారు. రూప పదో తరగతి పూర్తి చేశాక మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చదివించారు. ఇటీవలే కోర్సు పూర్తి చేసింది. రూప చెల్లెలు ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సు చదువుతోంది. ఇదే సమయంలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన అనిల్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలసదనంలో పెరుగుతున్న రూప గురించి ఎవరో చెప్పడంతో అధికారులతో మాట్లాడాడు. రూప, అనిల్ ఇరువురూ పరస్పరం ఇష్టపడడంతో అధికారులు పెళ్లి చేయడానికి నిర్ణయించారు. వరుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక.. డాక్యుమెంటేషన్ ప్రక్రియనంతా పూర్తి చేశారు. ఆహ్వానించేది అధికారులే.. రూప, అనిల్‌ల వివాహం కోసం ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించారు. పత్రికలో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి పేర్లు, వివరాలు, వివాహం జరుగు స్థలం పొందుపరిచారు. అధికారులే పెళ్లి పెద్దలుగా మారారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా సంక్షేమ అధికారి పి.రమ్య, డీసీపీవో జె.స్రవంతి, బాలసదనం సూపరింటెండెంట్ కే.సంగమేశ్వరి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. నేడు వివాహం..: రూప, అనిల్‌ల వివాహం సోమవారం జరగనుంది. సదాశివనగర్ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలోగల రెడ్డి సంఘ భవనం ఈ వివాహానికి వేదిక అవుతోంది. రూప పెళ్లికి జిల్లా స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వివాహ ఖర్చును పెళ్లి కొడుకే భరిస్తుండగా.. కావలసిన సామగ్రి, బంగారం, దుస్తులను అధికారులు సమకూరుస్తున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ తదితరులు హాజరవుతారని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. -
క్వాలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం విజయ సునీత, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అండ్ వీసీ జి వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ►వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఇచ్చే టేక్ హోం రేషన్ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశం ►ఈ సరుకుల పంపిణీపై మంచి ఎస్ఓపీ పాటించాలని అధికారులకు ఆదేశం ►క్వాలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలన్న సీఎం ►పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన వారందరికీ అందేలా ఎస్ఓపీ పాటించాలని, దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న సీఎం ►ఈ కార్యక్రమంపై బలమైన పర్యవేక్షణ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ►సీఎం ఆదేశాల మేరకు గ్రామంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహార రోజుగా నెలలో రెండుసార్లు పాటించేలా చర్యలు తీసుకున్నామన్న అధికారులు ►ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారాల్లో ఈ కార్యక్రమాలు జరగాలన్న సీఎం ►ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలన్న సీఎం ►పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారం, చక్కటి ఆరోగ్యపు అలవాట్లు తదితర వాటిపై ఈ కార్యక్రమం ద్వారా పర్యవేక్షణ చేయాలన్న సీఎం ►ఇందులో భాగంగా చికిత్సకు అవసరమైన వారిని రిఫరెల్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్న సీఎం. ►ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు అంగన్వాడీల సూపర్వైజర్ కూడా ఉండి.. ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్న సీఎం ►గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పిల్లల ఎదుగలను పర్యవేక్షించేందుకు స్టాడీ మీటర్, ఇన్ఫాంటో మీటర్, సాల్టర్ స్కేల్, బరువును తూచే యంత్రాలన్నింటినీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన అధికారులు. ►పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్యప్రణాళికపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ►ఇంగ్లిషు భాషపై పునాదులు పిల్లలకు అదే దశలో ఏర్పాటు కావాలన్న సీఎం ►పదాలు పలికేతీరు, ఫొనిటెక్స్ తదితర అంశాలపై శ్రద్ధపెట్టాలన్న సీఎం ►పిల్లలు త్వరగా నేర్చుకునే వయసు కాబట్టి వారికి అత్యుత్తమ బోధన అందించాలన్న సీఎం ►అంగన్వాడీ టీచర్ల డివైజ్‌లో స్పోకెన్ ఇంగ్లిషుకు సంబంధించి పాఠ్యాంశాలను లోడ్ చేయడం ద్వారా వివిధ పదాలను ఎలా ఉచ్ఛరించాలన్న దానిపై తగిన శిక్షణ పిల్లలకు ఇచ్చినట్టు అవుతుందన్న సీఎం ►దీనిపై మంచి ఆలోచనలు చేసి.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్న సీఎం ►తద్వారా ఇప్పుడున్న బోధనా పద్ధతులను మరింత బలోపేతం చేయాలన్న సీఎం ►అంగన్వాడీల్లోని 3–6 ఏళ్ల వయస్సున్న పిల్లలకు 19 వస్తువులతో కిట్లు ఇస్తున్నామన్న అధికారులు. ►ఈనెలాఖరు కల్లా ఈ పంపిణీ పూర్తవుతుందన్న అధికారులు. అంగన్వాడీ సెంటర్లలో నాడు – నేడు పనులపైనా సీఎం సమీక్ష. ►గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాలమేరకు అంగన్వాడీల్లో నాడు–నేడు పనులపై ముందుకెళ్తున్నామన్న సీఎం ►సచివాలయల్లోని సిబ్బంది ప్రతి అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించి ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలన్న దానిపై పూర్తిగా వివరాలు సేకరించారని తెలిపిన అధికారులు. ►తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్ ఇలా అన్నిరకాలుగా కనీస సదుపాయాలతో అంగన్వాడీలను అభివృద్ధి చేయాలన్న సీఎం ►నాడు–నేడు ఫేజ్–2లో భాగంగానే ఈ పనులను పూర్తిచేయాలన్న సీఎం ►ఆగస్టు 15 కల్లా ఈ పనులు ప్రారంభం కావాలని, ఫేజ్ –2 కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో చేపడుతున్న పనులతో పాటు ఇవి పూర్తి కావాలన్న సీఎం ►బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం ►ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్ చదవాలన్న నిబంధన కూడా పెట్టామన్న సీఎం ►ఒక్కసారి టెన్త్ చదివాక తర్వాత ఇంటర్మీడియట్‌కు అమ్మ ఒడి, ఆపై చదువులకు విద్యాదీవెన, వసతి దీవెన అమలవుతున్నాయన్న సీఎం ►దీనివల్ల బాగా చదువుకునేలా ఈ పథకాలు తగిన ప్రోత్సాహాన్ని కలిగిస్తాయన్న సీఎం ►కళ్యాణమస్తు, షాదీ తోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు, విద్యారంగంలో, బాల్య వివాహాలను అడ్డుకట్టవేడయంలో ఎంత కీలకమనే విషయంపై చైతన్యం కలిగించాలన్న సీఎం ►మండలానికి ఒక జూనియర్ కళాశాల అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు. ►టెన్త్ తర్వాత చదువులు ఆపేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక జూనియర్ కళాశాలలు బాగా తోడ్పడతాయన్న సీఎం. ►చిల్డ్రన్ హోమ్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్న సీఎం ►ఈ హోమ్స్ నిర్వహణలో సిబ్బందికి తర్పీదు ఇవ్వాలన్న సీఎం ►చిల్డ్రన్ హోమ్స్‌లో పిల్లలకు మంచి శిక్షణ, బోధనాంశాలు ఉండేలా చూడాలన్న సీఎం ►ఈ హోమ్స్‌లో పరిస్థితులు మెరుగుపడలా చూడాలన్న సీఎం -
మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
సకల సౌకర్యాలతో అంగన్వాడీలు
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలి. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాల (గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్)ను ప్రతి కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలి. ఫలానా సదుపాయం లేదనిపించుకోకుండా పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. చేపట్టాల్సిన పనుల గురించి వివరిస్తూ ఒక నివేదిక రూపొందించి అందజేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, వాటిని సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనుల పురోగతిపై ఆరా తీశారు. ఫౌండేషన్ స్కూళ్లుగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన సుమారు 45 వేల అంగన్వాడీల్లో కూడా వచ్చే మూడేళ్లలో ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అయితే అప్పటిలోగా వీటిలో ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలన్నారు. ప్రస్తుతం వాటిలో ఏయే సౌకర్యాలున్నాయి.. ఇంకా ఏయే సదుపాయాలు కావాలనే పూర్తి సమాచారాన్ని గ్రామ సచివాలయాల ద్వారా తెప్పించుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, టాయిలెట్ల వంటి సౌకర్యాల గురించి వాకబు చేయాలన్నారు. పూర్తి సమాచారంతో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలతో తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమర్థవంతంగా నిర్వహణ అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పోషణ పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన నిర్వహణ పద్దతి(ఎస్ఓపీ) రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో ‘సంపూర్ణ పోషణ’ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. ఇందుకోసం అంగన్వాడీలపై పర్యవేక్షణ పెరగాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులు మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ చూడాల్సిన సూపర్వైజర్లపై కూడా పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సంచాలకులు ఎం.విజయ సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీర పాండియన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు పాల్గొన్నారు. -
బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో రాష్ట్రంలోను, ఉమ్మడి రాష్ట్రంలోను బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల్లో 68.18 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. అదే టీడీపీ హయాంలో శాసనమండలిలో టీడీపీ సభ్యుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 37.5 శాతమే. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన బీసీలను తోకలు కత్తిరిస్తానని అవహేళన చేసిన చంద్రబాబు.. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభకు అవకాశం కల్పించకుండా.. ఓడిపోతారని తెలిసినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల పట్ల తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో బయటపెట్టుకున్నారు. సామాజిక సాధికారత కోసం నిబద్ధతతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో కురుబ సామాజికవర్గానికి చెందిన నాకు మంత్రి పదవి ఇవ్వడమే అందుకు నిదర్శనం. మా సామాజికవర్గంలో నేనే మొదటి మహిళా మంత్రిని. జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని ఆమె అన్నారు. -
అంగన్వాడీలను తీర్చిదిద్దాలి
పిల్లలు చిన్న వయసులోనే ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. అందువల్ల అంగన్వాడీల నుంచే వారికి భాషపై గట్టి పునాది అందించాలి. అంటే అభ్యాస సామర్థ్యం (లర్నింగ్ ఎబిలిటీ) పొంపొందించుకునేలా మాంటిస్సోరీ విధానంతో కూడిన కరికులమ్ (బోధనాంశం) అందుబాటులోకి తేవాలి. అప్పుడే వారి మెదడు పరిణతి చెందుతుంది. చాలా విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. ఈ మార్పుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు పనుల పురోగతి వంటి అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిలో మార్పు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సిబ్బంది నియామకాలతోపాటు ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్వైజర్స్ సక్రమంగా పనిచేస్తే అంగన్వాడీల పనితీరు మెరుగు పడటంతోపాటు నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సూపర్వైజర్ల పనితీరుపైనా తనిఖీలు ఉండాలని చెప్పారు. అంగన్వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం అన్నారు. సార్టెక్స్ బియ్యం సరఫరా చేయాలని, న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దని ఆదేశించారు. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిలోనూ నాణ్యత పెరగాలని, ఆ ఫలితాలు కనిపించాలని చెప్పారు. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలని, ఇందు కోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖాళీలు భర్తీ చేయండి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా సీడీపీఓ నియామకాలు చేపడతామని అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నాణ్యతలో రాజీ పడొద్దు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం అధికారులు వివరించారు. అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల వివరాలను సీఎంకు అందించారు. ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల భర్తీకీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వాటి నియామకాలు ఎపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సీడీపీఓ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వాటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అంగన్వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలన్న సీఎం.. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, పిల్లలు వికాసం చెందేలా మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..: ♦అంగన్వాడీలలో సార్టెక్స్ రైస్ సరఫరా చేయాలి ♦న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు ♦పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ నాణ్యత కచ్చితంగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి ♦అంగన్వాడీలలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలలో అన్నింటా క్వాలిటీ పెరగాలి. ఆ ఫలితాలు కనబడాలి. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలి ♦అందుకోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలి ♦అంగన్వాడీల్లో కరికులమ్ (బోధనాంశం) కూడా మారాలి. ఎందుకంటే పిల్లలకు చిన్న వయసులోనే మెదడు తొందరగా పరిణతి చెందుతుంది. ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. ఇంకా వారికి మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది ♦కరికులమ్ మార్పు కోసం అవసరం అయితే ప్రత్యేక అధికారిని నియమించాలి ♦కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్న సీఎం ♦తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు ఈ మూడు అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలన్న సీఎం ♦అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ♦వీటిలో మార్పుల కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి ♦సిబ్బంది నియామకాలు సహా... ఏ రకమైన అవసరం ఉన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది ♦అయితే ఆ మేరకు కచ్చితమైన ఫలితాలు కూడా రావాల్సి ఉందన్న సీఎం ♦సూపర్వైజర్స్ సక్రమంగా పని చేయాలి. వీరి పనితీరుపైనా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ♦సూపర్వైజర్స్ వ్యవస్ధ ద్వారా అంగన్వాడీలలో పనితీరు మెరుగవడంతో పాటు నాణ్యత కూడా పెరుగుతుందన్న సీఎం ♦అంగన్వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది అందించాలన్న సీఎం ♦పిల్లలకు ఉత్తమ అభ్యాసాలు ఉండాలన్న ముఖ్యమంత్రి మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, సీఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యాశాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. -
అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు
సాక్షి, అమరావతి: మహిళా, శిశుసంక్షేమశాఖలో అంగన్వాడీ వర్కర్లను గ్రేడ్–2 సూపర్వైజర్లుగా నియమించేందుకు ఉద్దేశించిన ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. సూపర్ వైజర్ల నియామక ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ విషయంలో గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తేసింది. అంగన్వాడీ వర్కర్లను సూపర్వైజర్లుగా నియమించేందుకు వీలుగా జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగన్వాడీ వర్కర్లను గ్రేడ్–2 సూపర్వైజర్లుగా నియమించేందుకు వీలుగా 560 పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 45 మార్కులు, ఇంగ్లిషులో ప్రావీణ్యానికి 5 మార్కులు నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు తమకు రాతపరీక్ష మాత్రమే నిర్వహించి, ఇంగ్లిషు ప్రావీణ్యపరీక్షను నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇంగ్లిష్ ప్రావీణ్యపరీక్ష నిర్వహించకుండానే తుది మెరిట్ లిస్ట్ ప్రకటించేందుకు అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. నియామక ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది శశిభూషణ్‌రావు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్‌కు అనుగుణంగానే పోస్టుల భర్తీప్రక్రియ చేపట్టామన్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికే ఇంగ్లిష్ ప్రావీణ్యపరీక్ష నిర్వహిస్తామని, ఈ విషయాన్ని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. మెమో ద్వారా కూడా స్పష్టతనిచ్చామన్నారు. స్టే వల్ల భర్తీప్రక్రియ మొత్తం నిలిచిపోయిందని, దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ గతంలో విధించిన స్టే ఎత్తేశారు. పిటిషన్లను కొట్టేశారు. -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా హాస్టళ్ల కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. సమీక్షలోని ముఖ్యాంశాలు.. ►అంగన్వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేసిన అధికారులు. ►అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించిన అధికారులు. ►అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్న అధికారులు. ►డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్వాడీల్లో అమలు చేస్తామన్న అధికారులు. ►మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీలలో నాడు – నేడు కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ►అంగన్వాడీల నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశం. ►మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్వాడీలలో ఉండాలన్న సీఎం. ►అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న సీఎం. ►ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సీఎం సమీక్ష ►మొత్తం మూడు దశల్లో నాడు – నేడు కార్యక్రమం. ►హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ►హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదు. ►చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. ►వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. ►సమాజంలో అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదు. ►హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్.. తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలి. ►భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలి. ►గురుకుల పాఠశాలలు– హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►మొదటి ఫేజ్‌లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు – నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశం. ►మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు – నేడు కోసం ఖర్చు అవుతుందని అంచనా. ►తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశం ►హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలని సీఎం ఆదేశం. ►కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్ కిచెన్ కోసం కొనుగోలు చేయాలని నిర్ణయం. ►హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలని సీఎం ఆదేశం. ►పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని సీఎం ఆదేశం. ►హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న సీఎం. ►మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం. ►హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని సీఎం ఆదేశం. ►ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీచేయాలన్న సీఎం. ►ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్. ►పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని ఆదేశం. ►ప్రతి హాస్టల్‌ను పరిశీలించి... కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్న సీఎం. ►హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ►అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ఈ సమావేశానికి మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఏ బాబు, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారుగా పద్మజ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నారమల్లి పద్మజను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఓ జీవోను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో సలహాదారుగా ఆమె నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఓ జీవో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏఆర్ అనురాధ పేరిట ఆ జీవో విడుదల అయ్యింది. -
మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట
తిరుచానూరు: మహిళా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషాశ్రీచరణ్ తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీ ఇన్చార్జి సూపర్వైజర్లకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం నాల్గో రోజు మంత్రి ఉషాశ్రీచరణ్ హాజరై ప్రసంగించారు. సమగ్ర ప్రణాళికతో పౌష్టికాహారం అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఐసీడీసీ పీడీ జయశ్రీ, మహిళా ప్రాంగణ అధికారి వాసంతి, సీడీపీవోలు సుధారాణి, పద్మజ పాల్గొన్నారు. -
దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలవాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్కూళ్లు, అంగన్వాడీలకు సరఫరా చేసే ఆహారంలో మంచి నాణ్యత, పరిమాణం, పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించడంతోపాటు నాణ్యతపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అంగన్వాడీల ద్వారా అందించే నాణ్యమైన ఆహారాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్ చేపట్టనుందని, దీన్ని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణలో ఏపీ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచేలా కృషి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. తద్వారా సుస్ధిర ప్రగతి లక్ష్యాలను సాధించాలని దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించి గతంలో రూ.500 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండగా ఇప్పుడు రూ.1,900 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. మనం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే సుస్ధిర ప్రగతి లక్ష్యాల సాధనలో నంబర్ వన్‌గా ఉంటామని, లేదంటే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. క్వాలిటీ, క్వాంటిటీ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యతతోపాటు కచ్చితమైన పరిమాణంలో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పాలు, గుడ్లలో క్వాలిటీ, క్వాంటింటీ ఉండి తీరాలని, వీటిపై పర్యవేక్షణ తప్పనిసరన్నారు. రోజూ నిర్దేశిత మేరకు ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన ఆహారం పిల్లలకు అందేలా పూర్తి స్థాయిలో నూరు శాతం పర్యవేక్షణ మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించగా దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే యత్నం చేశారని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు – నేడుతో సదుపాయాలు అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లోనూ సదుపాయాలు కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు లాంటివి పాడైపోతే వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. నిర్వహణను పట్టించుకోకపోతే మళ్లీ అలాగే ఉంటాయని, అంగన్వాడీలను సిబ్బంది తమవిగా భావించాలన్నారు. వెంటనే ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. నాడు – నేడుతో అంగన్వాడీలను సమగ్రాభివృద్ధి చేసేలా పాఠశాల విద్యాశాఖతో కలసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి? ఎలా తీర్చిదిద్దాలి? తదితర అంశాలతో ప్రణాళిక రూపొందించి విడతలవారీగా పనులు చేపట్టి ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. అంగన్వాడీలకు ఫ్రిడ్జ్‌లు పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా, పాలు, గుడ్లు లాంటివి నిల్వ చేసే విధానాలపై కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలన్నారు. తొలిదశలోనే అరికట్టేలా.. అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు సమగ్రంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామి కావాలని స్పష్టం చేశారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సాయం, పౌష్టికాహారం అందించడం ద్వారా రుగ్మతలను తొలిదశలోనే నివారించే అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. నాడు రూ.500 కోట్లు.. నేడు రూ.1,900 కోట్లు గతంలో పిల్లల భోజనానికి ఏడాదికి సుమారు రూ.500 కోట్లు మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఏటా సుమారు రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తల్లులు, చిన్నారుల బాగోగుల కోసం ఎంతో కృషి చేస్తున్నామని, ఈ కేటగిరీ ఎస్‌డీజీల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలవాలని స్పష్టం చేశారు. ఇంత చేసినా ఆ వివరాలను (డేటా) అప్డేట్ చేయకపోతే మన కృషి ఎస్డీజీలో ప్రతిబింబించదని, ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళ, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలిపారు చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేలా.. ఇంగ్లీషు మీడియాన్ని చిన్ననాటి నుంచే అలవాటు చేసేందుకు ఫౌండేషన్ స్కూళ్లు, శాటిలైట్ పౌండేషన్ స్కూళ్లు తెచ్చామని సీఎం జగన్ చెప్పారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చినా సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వంద శాతం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారంపై అధికారులు సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే అరణ్య రోదనే అవుతుందని స్పష్టం చేశారు. 57 వేల సెల్ఫోన్ల పంపిణీకి శ్రీకారం అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు దాదాపు 57 వేల సెల్ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం సరఫరా, ఇతర సేవలను సమర్ధంగా అమలు చేయడంతో పాటు సమగ్ర పర్యవేక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు, వర్కింగ్ సూపర్వైజర్లకు ప్రభుత్వం వీటిని అందచేస్తోంది. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఏ. బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం మీడియాతోమాట్లాడారు. 2013లో చేపట్టిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అప్పట్లో పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాటి భర్తీకి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 560 పోస్టుల భర్తీకి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా భర్తీచేసేలా పటిష్ట మైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 560 పోస్టులకు 21 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని, వారికి ఈ నెల 18న నాలుగు జోన్లలో మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాతపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాతపరీక్ష 45 మార్కులతోపాటు.. మరో ఐదు మార్కులకు ఇంగ్లిష్ పై పట్టు ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు వీడియో చేసి పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరి(క్వాలిఫైడ్ లిస్ట్)ని ఎంపిక చేసి వారికి సమాచారం అందించినట్టు తెలిపారు. పో స్టుల భర్తీలో రోస్టర్ విధానం, దివ్యాంగుల కోటా వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలు వెల్లడిస్తామన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం ఎటువంటి అనుమానం ఉన్నా తమ ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తించేలా అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలు తగదని ఆమె సూచించారు. -
Andhra Pradesh: పసందైన భోజనం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలని, ఇందులో ఏమాత్రం అలక్ష్యం వహించరాదని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని అందించాలని సూచించారు. మహిళా–శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి. నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్ఎంఎఫ్ తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి. దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు.. రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది. మనో వైకల్య బాధితులకు పెన్షన్లు మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్లో పెన్షన్లు మంజూరు కానున్నాయి. పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సూపర్ వైజర్ల పర్యవేక్షణతోపాటు అంగన్వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా అంగన్వాడీల్లో పాలు, ఆహారం సరఫరా మెరుగైన రీతిలో పర్యవేక్షించనున్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం వైఎస్ జగన్
-
బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఎస్ఎంఎఫ్ తరహాలో అంగన్వాడీల నిర్వహణ జరగాలన్నారు. పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలకు కూడా ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. అంగన్వాడీ పిల్లలకు ఇప్పటినుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ► పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. ►అన్నీకూడా బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఉండాలి. ►అన్ని అంగన్వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పంపిణీచేయాలి. అంగన్వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో చర్చ. ►ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సీఎం సమగ్రంగా సమీక్షించారు ►పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశం ►పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలి. ► నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలి. ►మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్‌ప్రాజెక్ట్ కింద చేపట్టాలని సూత్రప్రాయ నిర్ణయం. ► పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలలి. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్ ► కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ►అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టాం. ఎస్డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ► ఈ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలి. ►అంగన్వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌తో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్వాడీలో ఉంచాలి. ►పోస్టర్లు కచ్చితంగా ఉంచే బాధ్యతలను అంగన్వాడీలకు అప్పగించాలి. ►సెప్టెంబరు 30 కల్లా అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు. ►సీఎం ఆదేశాలమేరకు అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తాం. ►పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉంది. ►పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం. ► దివ్యాంగులకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం ఆదేశం. ► దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ►జువైనల్ హోమ్స్ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం ఆదేశం. ►జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. ఈ సమావేశానికి మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ. ఉషాశ్రీచరణ్, స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్.అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్. ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు) -
అంగన్వాడీ వర్కర్లకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అర్హులైన అంగన్వాడీ, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..? ఆదాయ పరిమితిలోపు గౌరవ వేతనం పొందుతున్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లకు వైఎస్సార్ పెన్షన్ కానుకతో పాటు అమ్మ ఒడి, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలకు సాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను వర్తింపజేయాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల శాఖతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు, జిల్లా కలెక్టర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు మహిళా శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్ ఇచ్చింది. -
బాలల్లో సంకల్పబలం ఉండాలి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): సమాజానికి మంచి చేయాలన్న సంకల్పబలం బాలల్లో ఉండాలని, అందుకోసం కష్టపడి చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్ ఆకాంక్షించారు. మంగళవారం ఆమె ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహాన్ని (జువెనైల్ హోం) సందర్శించారు. గృహంలో ఉన్న బాలలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశాలమైన ప్రపంచంలో అనేక అవకాశాలున్నాయని, బెయిల్‌పై బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాలలు పెరిగిన వాతావరణం, అక్కడి పరిస్థితుల ప్రభావంతో జరిగిన చిన్నచిన్న ఘటనల కారణంగా ఇక్కడికి వచ్చారని అన్నారు. వారికి ఇక్కడ ఇస్తున్న కౌన్సెలింగ్‌తో చాలా మార్పు వచ్చిందన్నారు. బెయిల్ పూచీకత్తు అంశాన్ని జేజేసీ దృష్టికి తీసుకెళ్తా తమకు బెయిల్ మంజూరు అయినప్పటికీ పూచీకత్తు, నగదు జమ చేయలేని పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులున్న కారణంగా ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందని పలువురు బాలలు మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో చలించిపోయిన ఆమె.. ఈ అంశాన్ని తాను జువెనైల్ జస్టిస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు. వారిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైల్డ్ లైన్ 1098 ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. బాలల సంస్కరణల సేవలు జాయింట్ డైరెక్టర్ బీడీవీ ప్రసాదమూర్తి, పరిశీలనా గృహం సూపరింటెండెంట్ టి.మధుసూధనరావు, మహిళా శిశు సంక్షేమ పీడీ ఉమాదేవి పాల్గొన్నారు. -
గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మ రం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. -
వివక్ష కాదు వైద్యం కావాలి
భారతదేశంలో ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరు క్షయ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా. పురుషుడికి ఆ వ్యాధి వస్తే వైద్యం దొరుకుతుంది. కాని స్త్రీకి వస్తే దానిని గుర్తించడంలో ఆలస్యం. వైద్యంలో నిర్లక్ష్యం. వ్యాధి వచ్చిందని తెలిస్తే వివక్ష. దానిని సాకుగా తీసుకుని వదిలిపెట్టే భర్తలు, గదిలో పెట్టే కుటుంబాలు ఉన్నాయి. స్త్రీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. ఆమె దగ్గుతూ వుంటే అది పోపు వల్ల వచ్చిన దగ్గు అనుకోకండి. వెంటనే వైద్యం చేయించండి. ఇది జరిగింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. మరో పదిరోజుల్లో పెళ్లి అనగా ఆ అమ్మాయికి టీబీ బయటపడింది. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెట్టాలని, ఆరునెలలు తప్పనిసరిగా నాగా పడకుండా మందులు వాడాలని చెప్పారు. దాంతో ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికి గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ఆమెకు టి.బి. అని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లయినా ఆ మందులు అందరి ముందు వాడితే జబ్బు సంగతి బయటపడుతుంది. పెళ్లి ఆగడానికి లేదు. అలాగని ముందుకు వెళ్లడానికీ లేదు. డాక్టర్లు చెప్పింది ఏమిటంటే– మందులు సక్రమంగా వాడితే హాయిగా మునుపటి జీవితం గడపవచ్చు అని. అమ్మాయి ధైర్యం చేసింది. పెళ్లి చేసుకుంది. కాని ఆరు నెలల పాటు ఏదో వ్రతం చేసినట్టుగా ఎంతో జాగ్రత్తగా అత్తమామల దృష్టి భర్త దృష్టి పడకుండా మందులు వాడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యవంతురాలైంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇదే పని అత్తమామల ఆదరంతో కూడా చేయవచ్చు. అలాంటి ఆదరం మగవాడికి దొరికినట్టుగా స్త్రీకి దొరకదు. అదే ఈ జబ్బులో ఉన్న అనాది వివక్ష. 2020లో మన దేశంలో పదిహేను లక్షల మంది టీబీతో మరణించారు. వీరిలో 5 శాతం మంది స్త్రీలు. వీరంతా 30 నుంచి 69 మధ్య వయసు ఉన్నవారు. అంతే దాదాపుగా గృహిణులు, తల్లులు, అమ్మమ్మలు, అవ్వలు. వీరు ఈ మరణాలకు ఎలా చేరుకుని ఉంటారు. తెలియనితనం వల్ల, కుటుంబ నిర్లక్ష్యం వల్ల, ఒకవేళ జబ్బు సంగతి తెలిస్తే సక్రమంగా మందులు తెచ్చివ్వకపోవడం వల్ల, కసురుకుంటూ చిన్నబుచ్చుతూ వారిని మానసికంగా కుంగదీయడం వల్ల, అందరికీ దూరం చేయడం వల్ల... ఇలా అన్నీ ముప్పిరిగొని ప్రాణాలు పోయే స్థితికి వచ్చి ఉంటారు. టీబీ పై స్త్రీ విజయం సాధించాలంటే 2021 డిసెంబర్లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ‘విమెన్ విన్నింగ్ ఎగనెస్ట్ టీబీ’ అనే పేరుతో ఒక పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. స్త్రీలు టీబీపై విజయం సాధించడానికి కలుగుతున్న ఆటంకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానం ఆమెకు తన జబ్బు మీద పోరాడటానికి తగినంత శక్తి, సమయం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వెల్లడైంది. స్త్రీలు టిబిపై విజయం సాధించాలంటే ముందు ప్రజా ప్రతినిధులు, పాలనా వ్యవస్థ ఎడతెగని ప్రచార, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఒకసారి టీబీ బయటపడ్డాక అలాంటి మహిళా పేషెంట్లు ఉన్న ఇళ్లను గుర్తించి వారికి వైద్య సహాయం మాత్రమే కాదు మానసిక నిబ్బరం కలిగించే కౌన్సిలింగ్ వ్యవస్థ బలపడాలి. ఈ వ్యవస్థ ఆ మహిళలకే కాదు కుటుంబానికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరొకటి– పౌష్టికాహారం. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే టీబీ సులభంగా నయం అయిపోతుంది. కాని భారతీయ కుటుంబాలలో ఇంటి చాకిరీ అంతా స్త్రీలే చేయాలి. విశ్రాంతి అనేది దొరకదు. ఇక అందరూ తిన్నాక ఆమె తినాలి. మరీ విషాదం ఏమిటంటే స్త్రీకి ప్రత్యేకంగా పౌష్టికాహారం ఇవ్వడం ఆమెను గొప్ప చేయడంగా కూడా భావిస్తారు. కాని ఇవన్నీ తప్పు. ఇలాంటి అవివేక ఆలోచనల వల్లే స్త్రీలు టీబీ కోరల నుంచి సులభంగా బయటకు రాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద టీబీ సోకిన పేషెంట్స్‌కు పౌష్టికాహారం కోసం నెలకు 500 ఇస్తుందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సమాజం బాధ్యత కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజాన్ని ఏర్పరుస్తాయి. టీబీని సాకుగా చేసుకుని స్త్రీలను ఇబ్బంది పెట్టడాన్ని సమాజం అంగీకరించరాదు. కుటుంబంకాని, సమాజం కాని వెలి, వివక్షను పాటించక టీబీ ఉన్న స్త్రీల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది సులభంగా తగ్గిపోయే జబ్బు అన్న అవగాహన కలిగించి పేషెంట్స్‌కు ధైర్యం చెప్పాలి. వారు మందులు తీసుకునేలా చూడాలి. అలాంటి స్త్రీలను ఇదే సాకుగా వదిలించుకోవాలని చూసే మగాళ్లకు బుద్ధి చెప్పాలి. దగ్గు మొదలైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని, చూపించుకోవడానికి డబ్బులివ్వని మగవారిని మందలించాలి. ఆర్థికంగా ఆధారపడే స్త్రీకి తండ్రి, భర్త, కుమారుడి నుంచి సరైన వైద్యం ఇప్పించడానికి ఇరుగు పొరుగు చొరవ చూపాలి. స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సందర్భంగా ప్రతి కుటుంబం అక్కర చూపుతుందని ఆశిద్దాం. -
చిన్నారికి అట్లకాడతో వాతలు
జంగారెడ్డిగూడెం: కాల్చిన అట్ల కాడతో చిన్నారికి వాతలు పెట్టిన పెంపుడు తల్లి కటకటాల పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. యనమదల నాగ వెంకటలక్ష్మి (7) పట్టణంలోని బాలాజీ నగర్ మండల పరిషత్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని యనమదల లక్ష్మి అనే మహిళ పెంచుకుంటోంది. చిన్నారి తల్లి దుర్గ భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. తల్లి దుర్గకు, పెంపుడు తల్లి లక్ష్మికి అక్కడ పరిచయం ఏర్పడింది. లక్ష్మికి అప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉండగా, ఆడపిల్ల కావాలి పెంచుకుంటానని దుర్గని అడగడంతో చిన్నారి నాగవెంకటలక్ష్మిని రెండేళ్ల వయసులోనే లక్ష్మికి పెంచుకోవడానికి ఇచ్చింది. కాగా, కొంతకాలంగా చిన్నారి నాగవెంకటలక్ష్మిని పెంపుడు తల్లి లక్ష్మి చిత్రహింసలు పెడుతోంది. ఇంటి పనులు చేయించడం, కర్రలతో కొట్టడం, అట్ల కాడతో కాల్చడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. ఇటీవల చిన్నారి శరీరంపై అట్ల కాడతో తీవ్రంగా కాల్చింది. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయించలేదు. ఆ గాయాలతోనే నాగవెంకటలక్ష్మి పాఠశాలకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా చిన్నారి నాగవెంకటలక్ష్మిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి పాఠశాలకు వెళ్లింది. ఆడుకుంటూ పడిపోవడంతో బాలిక ఒంటిపై కాలిన గాయాలను తోటి విద్యార్థులు గమనించి ప్రధానోపాధ్యాయిని గణేష్ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమె జంగారెడ్డిగూడెం ఎస్సై ఎం.సాగర్‌బాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో యూఎన్ స్వర్ణకుమారి, సూపర్వైజర్ పి.బ్యూలా పాఠశాలకు వచ్చి చిన్నారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం చిన్నారిని ఏలూరు సీడీపీవో కార్యాలయానికి తరలించి పూర్తి వైద్యం చేయిస్తామని, అనంతరం చిల్డ్రన్ హోమ్‌కు తరలిస్తామని సీడీపీవో స్వర్ణకుమారి చెప్పారు. చిత్రహింసలు పెట్టిన పెంపుడు తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.సాగర్‌బాబు చెప్పారు. స్పందించిన ప్రభుత్వం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకుని ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బాలికను దెందులూరులోని బాలసదన్‌కు తరలించి సంరక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. -
మోసగాడి చెర నుంచి 22 మందికి విముక్తి
నక్కపల్లి/పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరిట సంస్థను నిర్వహిస్తూ యువతీ, యువకుల్ని బందీలుగా మార్చుకున్న మోసగాడి ఆట కట్టింది. అతని చెరలో ఉన్న వారందరికీ విముక్తి కల్పించిన అధికారులు అతడి భవంతికి శనివారం తాళం వేశారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులు, నలుగురు యువకులు అతడి భవంతిలో బందీలుగా ఉన్నట్టు గుర్తించారు. తమ ఇళ్లకు పంపమని కోరిన 8 మందిని శుక్రవారమే ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య వారి స్వస్థలాలకు పంపించారు. మిగతా 14 మంది తాము భవనం ఖాళీ చేసే ప్రసక్తి లేదని, ఇక్కడే ఉంటామని మొండికేయడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చి శనివారం వారిని కూడా విశాఖ కేజీహెచ్‌లోని దిశ షెల్టర్ హోమ్‌కు తరలించారు. వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధార్ హోమ్‌కు తరలిస్తామని, మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు చెప్పారు. సంస్థ నిర్వాహకుడైన అనిల్‌కుమార్ అలియాస్ ప్రేమదాసు, అతనికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి కొన్ని ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమదాస్‌కు సహకరించిన రాజేశ్వరి అలియాస్ లిల్లీ పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు. -
Women's Legal Marriage Age: పెళ్లి వయసు పెంచితే సరిపోతుందా?
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్మాయిల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణను తీసుకురానుంది. అయితే ఈ నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది బాలికల ఉన్నత విద్యకు దోహదపడుతుందని, మహిళల ఆరోగ్యానికి, సంక్షేమానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా మరికొంతమంది కూడా వాదిస్తున్నారు. భారతదేశంలో, చట్టబద్ధమైన వివాహ వయస్సు ప్రస్తుతం బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ఉంది. అయితే చాలామంది అమ్మాయిలకు 18 ఏళ్ల కంటే ముందే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. చిన్న తనంలోనే గర్భం దాల్చడం, అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వెంటనే లేదా అంతకుముందే ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే చిన్నతనంలోనే బరువు బాధ్యతలను భుజాన కెత్తుకోవడంతో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుందనీ, తల్లి పిల్లల ఆరోగ్యానికి ఇదొక వరం అని పేర్కొంది. అలాగే తమ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం వలన ఉన్నత చదువులు చదువు కోవాలన్న తమ కల సాకారం కావడంలేదని వాపోతున్న బాలికలు చాలామందే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-19 సంవత్సరాల వయస్సు బాలికల మరణాలకు చిన్న వయసులోనే గర్భం, ప్రసవ సమస్యలు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. 20-24 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కంటే 10-19 సంవత్సరాల వయస్సు గల తల్లులు ఎక్లాంప్సియా, ప్రసవ ఎండోమెట్రిటిస్, ఇతర ఇన్ఫెక్షన్ల లాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు. వివాహం ఆలస్యం చేయడం వల్ల పిల్లలకు కూడా మేలు జరుగుతుందని, తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టడం, తీవ్రమైన నియోనాటల్ ప్రమాదం తగ్గుతుందని చెబుతోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు. 21 ఏళ్ల లోపు అన్ని వివాహాలను చెల్లుబాటుకావు అని ప్రకటిస్తే మరింత ముప్పే అంటున్నారు. ఆడపిల్లల చదువుకు, అనారోగ్యానికి అసలు సమస్యల్ని గుర్తించి, వాటికి సరైన పరిష్కారాల్ని అన్వేషించకుండా చట్టబద్ధంగా పెళ్లిని వాయిదా వేయడంపై ఫెమినిస్టులు, ఇతర మహిళా ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇది మార్గం కాదని వాదిస్తున్నారు. సీపీఎం నాయకురాలు కవితా కృష్ణన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది మహిళల స్వయంప్రతిపత్తిని మరింత దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సంరక్షణ, విద్యకు సరైన ప్రాప్యత లేని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ-ఆదాయ కుటుంబాలలో ముందస్తు వివాహాలు ఎక్కువగా జరుగుతాయని సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ పరిశోధకురాలు మేరీ ఇ. జాన్ చెప్పారు. పట్టణాలతో పోలిస్తే , గ్రామీణ స్త్రీలు, యువతులు ఎక్కువ పోషకాహార లోపంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ కీలక అంశం పేదరికమే తప్ప, వయస్సు కాదన్నారు. సంపద, విద్య వంటి సామాజిక-పర్యావరణ కారకాలు నియంత్రించ గలిగినపుడు కౌమారదశలోని తల్లులు మరణాల రేటు కూడా నియంత్రణలో ఉంటుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. 18 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతి రక్తహీనతతో బాధపడితే, సరైన చికిత్స లేకపోతే, 21 సంవత్సరాల వయస్సులో కూడా అదే రక్తహీనతతో బాధపడతారన్నారు. పేదరికం, ఆరోగ్య రక్షణ లేనపుడు వివాహ వయస్సును కొన్ని సంవత్సరాలు పెంచడంవల్ల ప్రయోజనం అంతంతమాత్రమే అనేది వారి వాదన. అంతేకాదు ఈ నిర్ణయం కొత్త సమస్యలను సృష్టించవచ్చు. యువకులు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడంలో మరిన్ని ఇబ్బందులు, యువతుల వ్యక్తిగత జీవితాల్లో తల్లిదండ్రుల పట్టును మరింత పెరుగుందనే మరో అభిప్రాయం. ముఖ్యంగా ప్రేమ కోసం వివాహం చేసుకునే కులాంతర, మతాంతర జంటలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, కుటుంబ సభ్యుల నుండి హింస బెదిరింపులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి వేధింపులు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వివాహం చేసుకోవడానికి 18 ఏళ్లు నిండకముందే ఇంటి నుండి పారిపోయే జంటలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దారి తీస్తుంది. పెళ్ళి వయసు పెంచినంత మాత్రాన బాల్య వివాహాలు ఆగిపోతాయనేది భ్రమ మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా సమాజంలో, కుటుంబంలో మహిళల పట్ల చులకన భావం పోవాలి. బాలికల మీద వివక్ష, ఆడ,మగ బిడ్డలమధ్య తారతమ్యాలు పూర్తిగా సమసిపోయేలా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అలాగే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఆర్థిక స్వాతంత్ర్యంతో ఎదిగేలా తల్లితండ్రులు ప్రోత్సాహాన్నందించాలి. రెండవ తరగతి పౌరురాలిగా కాకుండా మహిళలకు, యువతులకు చట్టబద్ధమైన అన్ని హక్కులు అమలు అయినపుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యం అనేది పలువురి వాదన. -
బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: అభాగ్యులైన చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇటీవలే బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లు ఏర్పాటయ్యాయి. బాలల సంక్షేమం, సంరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన వీటిలో అన్ని జిల్లాల నుంచి 85 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వీరందరికీ విజయవాడలోని హరిత బెరంపార్కులో నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారి పరిధిని వివరించడంతోపాటు పోక్సో, జువెనైల్ యాక్ట్, బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ వంటి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. కమిటీలు, బోర్డుల ఏర్పాటు ఇలా.. జువెనైల్ జస్టిస్–2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఈ నియామకాలను పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు ఒక బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), ఒక జువెనైల్ జస్టిస్ బోర్డును ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీలో చైర్పర్సన్, నలుగురు సభ్యులు, జువెనైల్ జస్టిస్ బోర్డులో ఒక ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సంఘ సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. 18 ఏళ్లలోపు బాలల హక్కులు, సమస్యలు, సంక్షేమం, సంస్కరణ కోసం సీడబ్ల్యూసీ, జేజేబీలు పని చేస్తాయి. అభాగ్యులకు అండగా.. వీధి, అనాథ బాలలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని సంరక్షణ కేంద్రాలకు అప్పగించడం.. వారికి విద్య, వైద్యం, వసతి కల్పించడం వంటి చర్యలను సీడబ్ల్యూసీ, జువెనైల్ జస్టిస్ బోర్డు పర్యవేక్షిస్తుంటాయి. వివిధ కారణాలతో ఇంటికి దూరమైన బాలలను గుర్తించి.. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తాయి. అక్రమ రవాణాకు గురైన బాలలకు ప్రభుత్వపరంగా సాయమందించేలా కృషి చేస్తాయి. నిర్బంధపు బాల కార్మికులు, వేధింపులకు గురైన వారికి చట్టపరంగా అండగా నిలుస్తాయి. బాల నేరస్తుల్లో పరివర్తన తెచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. అన్యాయానికి గురైతే అండదండలు అందించడం వంటి చర్యలు చేపడతాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదుకునే విధంగా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఇలా అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి చిన్నారికి సీడబ్ల్యూసీ, జేజేబీ భరోసా ఇవ్వనున్నాయి. బాలల సంక్షేమం, సంస్కరణకు ప్రాధాన్యం బాలల సంక్షేమంతోపాటు వారి సంస్కరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ, జేజేబీలను ఏర్పాటు చేశాం. ఆ కమిటీలు, బోర్డు సభ్యులు ఎలా పని చేయాలి, ఏం చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నాం. –కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు -
బాల్య వివాహాలపై నిఘా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలకు చెల్లుచీటి రాసేలా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే పక్కా కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా స్థాయి పిల్లల సంరక్షణ అధికారుల సమన్వయంతో ఇప్పటికే రంగంలోకి దిగింది. బాల్య వివాహాలపై అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం సేకరించి జిల్లా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేస్తోంది. బాల్య వివాహాలకు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ సమాచారాన్ని స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు అందించేలా ప్రజల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ 1098, మహిళా సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ 181తోపాటు స్థానిక పోలీసులు, జిల్లా కేంద్రాల్లోని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్య వివాహాలతో దుష్పరిణామాలెన్నో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బాల్య వివాహాల్లో 40 శాతం మన దేశంలోనే జరుగుతున్నట్టు గుర్తించారు. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మత, కులపరమైన కట్టుబాట్ల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వివాహం చేయటం వల్ల వారిలో మానసిక పరిపక్వత లోపించటం, ఆరోగ్యపరమైన సమస్యలకు దారి తీస్తోంది. దేశంలో 15 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు ఏటా దాదాపు 70 వేల మంది ప్రసవ సమయంలో మరణిస్తున్నట్టు అంచనా. మైనర్ బాలికలకు తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో పిల్లలు పుడుతున్నారు. వారికి పుట్టే శిశువులు మరణిస్తున్న ఘటనలూ నమోదవుతున్నాయి. ఏడాదిలో 1,235 బాల్య వివాహాలకు అడ్డుకట్ట రాష్ట్రంలో గడచిన ఏడాది కాలంలో 1,235 బాల్య వివాహాలను అధికారులు నిరోధించారు. బాల్య వివాహాలపై జిల్లాల వారీగా వచ్చిన సమాచారం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన అధికారులు వాటిని అడ్డుకుని తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు బాల్య వివాహాలు చేసే వారిపైన, వాటిని ప్రోత్సహించే వారిపైన బాల్య వివాహా నిషేధ చట్టం–2006 ప్రకారం చర్యలు తప్పవు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. గతేడాది కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే 165 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. ఇకపై బాల్య వివాహాలు చేస్తున్నట్టు సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు, ఉపాధి కల్పన ఏర్పాట్లు చేస్తాం. – కృతికా శుక్లా, డైరెక్టర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ -
మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని అమలు చేస్తోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, బాలికల పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఈనెల నుంచి ఉచితంగా న్యాప్కిన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.31.48 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాల్లో చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు న్యాప్కిన్లను అందిస్తున్నామన్నారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి పదేసి న్యాప్కిన్లను అందిస్తామన్నారు. దీని వల్ల రుతుక్రమం సమయంలో పాఠశాల, కాలేజీ మానేసే వారి సంఖ్యను తగ్గించడంతో పాటు వారి పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందన్నారు. న్యాప్కిన్ల పంపిణీ కోసం ఆయా విద్యా సంస్థల్లో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని, అధ్యాపకురాలిని నోడల్ అధికారిగా నియమించినట్టు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వైఎస్సార్ చేయూత స్టోర్స్‌లో నాణ్యమైన న్యాప్కిన్లను తక్కువ ధరకు విక్రయించేలా నిర్ణయం తీసుకున్నట్టు కృతికా శుక్లా తెలిపారు. -
ముస్లిం యువతి కేసు.. ‘దిశ’ డీఎస్పీ దర్యాప్తు
సాక్షి, అమరావతి/గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గతేడాది ఆగస్టు 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముస్లిం యువతి కేసును ‘దిశ’ డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయిస్తామని దిశ ప్రత్యేక అధికారి, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతిక శుక్లా చెప్పారు. పొలానికి వెళ్తుండగా ఆమెను కొందరు అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారుల బృందం శనివారం ఆ గ్రామానికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలను కృతిక శుక్లా మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎర్రబాడు గ్రామంలో బాధిత ముస్లిం కుటుంబాన్ని కలిసి మాట్లాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నందున వెంటనే ఇల్లు మంజూరు చేసి.. నిర్మించి ఇవ్వాలని ఆర్డీవో అధికారులకు కృతికా శుక్లా ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ íసీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలానీసామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు తదితరులున్నారు. -
కరోనా బాధిత బాలలను కాపాడుకుందాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూచించింది. కరోనా బాధిత బాలల రక్షణపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు శాఖ, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్నారని, వీరిలో 1,700 మంది బాలలు ఇద్దరినీ కోల్పోయారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు ► కోవిడ్‌తో ప్రభావితులైన చిన్నారులను సర్వేల ద్వారా గుర్తించాలి. ప్రతి ఒక్క చిన్నారి సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. ఆ అవసరాలను ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడితే వారి పిల్లలను తాత్కాలికంగా శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించాలి. ఆలనాపాలనా చూసేవారు లేకపోతే సాయం అందజేయాలి. ► శిశు సంరక్షణ పథకాల కింద బాధిత పిల్లల పునరావాసం కోసం వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి. ► శిశు సంరక్షణ కేంద్రాల్లో కరోనా సోకిన చిన్నారులకు అక్కడే ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలి. ► పిల్లలో మానసిక సమస్యలు తలెత్తకుండా సైకాలజిస్టుల కౌన్సెలింగ్ ఇప్పించాలి. ► కరోనా వల్ల అనాథలుగా మారిన బాలలలకు జిల్లా కలెక్టర్లు సంరక్షకులుగా వ్యవహరించాలి. ► బాధిత బాలల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చేందుకు, ప్రభుత్వం అందజేసే ప్రయోజనాలను వారికి చేరవేసేందుకు కలెక్టర్లు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► కరోనా వల్ల తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన పిల్లల ఆస్తులు పరులపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే. ఇందుకోసం రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగం సేవలు ఉపయోగించుకోవాలి. ► బాధిత పిల్లలపై వేధింపులు, వారి అక్రమ రవాణా, అక్రమ దత్తత, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మారడంపై పోలీసు శాఖ నిరంతరం దృష్టి పెట్టాలి. -
మహిళా వర్తకుల ఉత్పత్తులకు ప్రాధాన్యం
ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా దేశంలోని మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారులకు, వారు తయారు చేసే ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మహిళా సాధికారిత కోసం పనిచేసే సంస్థ యూఎన్ ఉమెన్‌తో భాగస్వామ్యమైంది. ఇప్పటికే 450 మందికి పైగా మహిళ వ్యాపారస్తులు ఉత్పత్తి చేసిన సుమారు 80 వేలకు పైగా ప్రత్యేక స్టోర్ ఫ్రంట్ ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ మీద రూ.25లను దేశంలోని నిరుపేద బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఎన్జీఓ ‘నన్హీ కలీ’కు తమ వంతు బాధ్యతగా విరాళం కింద అందజేస్తున్నామని పేర్కొంది. కరోనా మహమ్మారితో కలిగిన ఆర్ధిక విఘాతంతో మహిళల ఆదిపత్య రంగాలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసిందని, మహిళలు జీవనోపాధి కోల్పోయే దశకు చేరిందని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. మహిళల్లో వ్యవస్థాపకత మెరుగైన ఆర్ధిక ఫలితాలను చూపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అమిత్ అగర్వాల్ చెప్పారు. -
బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ల్యాప్‌టాప్‌ల సహకారంతో వారికి కోచింగ్ ఇవ్వాలి. ఇందు కోసం ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలి. తద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్కిన్స్ను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8 (మహిళా దినోత్సవం)న ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ ఆఖరుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా.. ఎంఓయూలు కుదుర్చుకుంటాయని సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు జూలై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్స్ ఇస్తామని, ఇందు కోసం సుమారు రూ.41.4 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఆసరా, చేయూత కిరాణా స్టోర్స్‌లో తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన, బయోడీగ్రేడబుల్ (త్వరగా భూమిలో కలిసిపోయే) శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందు కోసం శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ చేసుకుంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థల సహకారం విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందు కోసం లాప్టాప్లను వాడుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థలు, కోచింగ్ సెంటర్ల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు లాప్టాప్లను ఇచ్చే సమయానికి, దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువకుంటున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినిలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్థినిలకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. మార్చి 8 (మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీ పథకం ప్రారంభం కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాగా నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్స్ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీని కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనుంది. చదవండి: ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్ తక్కువ ధరకే శానిటరీ నేప్కిన్స్ గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్ ద్వారాతక్కువ ధరకే శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. చేయూత స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్కిన్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం శానిటరీ నాప్కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ ఏకం కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిలకు అత్యుత్తమ శిక్షణ విద్యార్థినిలకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దీనికోసం లాప్టాప్లను వాడుకోవాలన్నారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9 తరగతి ఆపైన విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్‌తో పాటు రెప్యూటెడ్ సంస్ధలు (కోచింగ్ ఇనిస్టిట్యూషన్స్) సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ల్యాప్‌టాప్‌ల సహకారంతో కోచింగ్ ఇవ్వాలన్నారు. ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. లాప్టాప్లను విద్యార్థినిలకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఉన్నత విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆర్థికశాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి, ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
1న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ 1న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ.1,863 కోట్లతో 30లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి రేషన్‌ను ఇంటికే పంపిణీ చేస్తామని తెలిపారు. 50 శాతం మంది మహిళల్లో రక్త హీనత ఉందని.. గర్భిణీలు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత నివారించేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని.. 55 వేల అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ల తరహాలో విద్య అందిస్తామని అనురాధ పేర్కొన్నారు. (చదవండి: అమరావతి రైతులు: రూ. 158 కోట్లు విడుదల) -
మాతృత్వానికే మచ్చ.. ప్రియుడి కోసం కూతుర్ని..
సాక్షి, గుంటూరు : మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. ప్రియుడి కోసం అభంశుభం ఎరుగని కుమార్తెను మాయపుచ్చి.. ఓ అపరిచిత మహిళకు అప్పగించి పలాయనం చిత్తగించింది. తల్లిలా అక్కున చేర్చుకున్న ఆ మహిళ కొంతకాలానికి అనారోగ్యం బారిన పడడంతో..ఆ చిన్నారిని ఆదుకోవాలని కోరుతూ పోలీసుల చెంతకు చేర్చింది. దీంతో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి బాలికకు ధైర్యం చెప్పి, ఓదార్చి మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బందికి అప్పగించిన ఘటన అందరి మనస్సులను కట్టిపడేసింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఓ మహిళ భర్త మరణించడంతో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ గుంటూరులోని పట్టాభిపురంలో ఓ అపార్టుమెంట్లో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తోంది. అక్కడ పనిమనిషితో స్నేహంగా మెలిగింది. కొంత కాలానికి తాము అత్యవసర పనిమీద హైదరాబాదు వెళ్తున్నామని, పాపను చూస్తుండమని చెప్పి కుమార్తెను పనిమనిషికి అప్పగించి వెళ్లిపోయింది. (పెళ్లి పేరుతో శారీరకంగా ఒక్కటై.. ఆపై..) అనంతరం వారి ఫోన్లు పనిచేయలేదు. వారి ఆచూకీ తెలియలేదు. మానవత్వంతో ఆ మహిళ తన పిల్లలతో పాటే సొంత కూతురిలా చూసుకుంది. అయితే కొద్దిరోజులుగా ఆ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తన పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి పంపించింది. భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న ఆమె తాను చనిపోతే ఈ బాలిక గతేమిటి అని ఆలోచించి గురువారం పట్టాభిపురం పోలీసుల చెంతకు ఆ చిన్నారిని చేర్చింది. విషయం తెలిసిన అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి బాలికను తన కార్యాలయానికి పిలిపించుకుని అల్పాహారమిచ్చి ధైర్యం చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సుగుణాల రాణి, అర్బన్ స్పెషల్ ఉవెనైల్ పోలీస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ డి.గంగాధరం, డబ్ల్యూఎస్‌లో బేబిరాణి, ఎలిజిబెత్ రాణి పర్యవేక్షణలో బాలికను సంరక్షణాలయానికి పంపించారు. (డ్యూటీకి అని చెప్పి మొదటి భార్య ఇంటికి..) -
పండుటాకుల పాట్లు..!
సాక్షి, హైదరాబాద్: వృద్ధాశ్రమాల నిర్వహణ కంటతడి పెట్టించేలా ఉందని, పట్టించుకో వాల్సిన ఉన్నతాధికారులను అక్కడ మూడు రోజులు బస చేయిస్తే ఎంత ఘోరంగా అవి ఉన్నాయో అనుభవంలో తెలుస్తుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగరిక సమాజంలో అనాగరిక పరిస్థితుల ను నగరాల్లోనే చూస్తున్నామని, నాగరికత లేదని చాలా మంది భావించే గ్రామాల్లోనే అమ్మానాన్నలను బాగా చూసుకుంటున్నారని అభిప్రాయపడింది. పండుటాకుల పట్ల ప్రేమ చూపని నేటి తరం.. రేపటి వృద్ధ తరమని మరిచిపోవద్దని హెచ్చరించింది. జంట నగరాల పరిసర ప్రాంతాల్లోని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల నిర్వహణపై అమికస్‌క్యూరీ (ఈ కేసులో కోర్టుకు సహాయకారి)గా నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ ఇచ్చిన నివేది కను పరిశీలించిన ధర్మాసనం వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని వ్యాఖ్యా నించింది. వృద్ధాశ్రమాల నిర్వహణ ఎలా ఉందో చూడాల్సిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఓ మూడు రోజులు అ లాంటి ఆశ్రమాల్లో బస చేయమంటే పరిస్థితులు అనుభవపూర్వకంగా తెలిసివస్తాయం ది. నివేదికపై ప్రభుత్వ వాదనను తెలియ జేస్తూ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆ ఇద్దరు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగ రంలోని మమత వృద్ధాశ్రమంలో దుర్లభ పరిస్థితులపై న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు మరో సారి విచారణ జరిపింది. వారికీ హక్కులు ఉన్నాయన్నది మరవద్దు.. వృద్ధాశ్రమాల్లో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో నివేదిక చూస్తే అర్ధమవుతోందని, నిరుపేదలు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేరని అనుకోవద్దని హెచ్చరించింది. వారికి రాజ్యాంగం హక్కులు కల్పించిందనే విషయాన్ని అధికారులు మరిచిపోకూడదని, చట్ట ప్రకారం.. సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు తనిఖీలు చేయాలనే బాధ్యతను నిర్వహించకపోతే వారిని ఏమనాలని ప్రశ్నించింది. ‘ఒకచోట మదర్స్ నెస్ట్ అనే వృద్ధాశ్రమంలో మూడు గదుల్లో ఏకంగా 24 మంది ఉన్నారు. గదులకు కిటికీలు ఊడిపోయాయి. మరుగుదొడ్లు కూడా లేవు. ‘ది సెకండ్ చాన్స్’లో మంచాల మధ్య నడిచే ఖాళీ కూడా లేదు. ఎప్పుడో ఉతికిన దుప్పట్లు.. దుమ్ము ధూళితో ఉన్నాయి. దాతల చేయూతతోనే ఎన్జీవోలు వీటిని నిర్వహిస్తున్నాయి. రూ.25–30 వేల వరకూ చెల్లించి ఉండే కొన్ని చోట్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇంకొన్ని అంతకంటే ఎక్కువే వసూ లు చేస్తున్నాయి. అధికారులు ఏడాదికోసారి తనిఖీ చేసినట్లుగా చెబుతున్నారు. పలుచోట్ల అయితే వృద్ధాశ్రమం రిజిస్టర్ చేసినప్పుడే తనిఖీ జరిగింది’అని నివేదికలోని విషయాలను ధర్మాసనం ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదనను వెలిబుచ్చింది. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయండి... ‘జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో అధికారికంగా రిజిస్ట్రర్ చేసినవి ఎన్ని ఆ శ్రమాలున్నాయి. రిజిస్ట్రర్ చేయనివి ఎన్ని ఉన్నా యి. ఇప్పటివరకూ ఎన్నిసార్లు తనిఖీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు. వృద్ధాశ్రమాల్లోని వారి కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేయా లి. హెల్ప్లైన్లకు వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. వృద్ధాశ్రమాలను ఆదుకునేందుకు కార్పొరేట్ కంపెనీల సాయం పొందే చర్యలు తీసుకోవాలి. మేము జారీ చేసే ఉత్తర్వుల ప్రతులను అన్ని వృద్ధాశ్రమాల నిర్వాహకులకు అధికారులు అందజేయాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు’
సాక్షి, విశాఖపట్నం: పౌష్టికాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు డైరెక్టర్ కృత్తికా శుక్లా, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ.. 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణను పైలట్ ప్రాజెక్ట్‌గా తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి... త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాలను మొదలు పెడతామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, లోపాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బంది రాత పూర్వకంగా సమస్యలు తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట ఇక సీఎం జగన్ కూడా తమ శాఖకి అవసరమైన బడ్జెట్‌ను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. అంతేగాక అదనంగా అడిగిన రూ.129 కోట్లు తమ శాఖకు సీఎం జగన్ కేటాయించినట్లు వెల్లడించారు. తమ తరపున తొలిసారి ఉద్యోగులకు గ్రీవెన్స్ నిర్వహించామని, ఉద్యోగుల సమస్యలను గత కొన్నేళ్లుగా పట్టించుకోకపోవడం వల్లే ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ, ఇతరత్రా కారణాల వల్ల సస్పెండ్ అయిన కొంతమంది ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని తెలిపారు. ఇక గ్రీవెన్స్ ద్వారా ప్రతీ ఉద్యోగి సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే సత్వర పరిష్కారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
మహిళా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, విశాఖపట్నం: మహిళా, శిశు సంక్షేమంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె విశాఖపట్నంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్నారులకి పౌష్టికాహార లోపం లేకుండా మెరుగైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు మరింత జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. ఏపీలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. పౌష్టికాహారం ద్వారా రక్తహీనత, మతా శిశు మరణాలు తగ్గాయని మంత్రి తానేటి వనిత చెప్పారు. -
చట్టం 'దిశ'గా!
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల రక్షణతోపాటు బాధితులకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ చట్టంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేపట్టింది. దిశ బిల్లుకు చట్టరూపం కల్పించే చర్యలను ప్రారంభించింది. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందచేసింది. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. న్యాయ కోవిదులతో సంప్రదింపులు ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడి, వేధింపులను తీవ్ర నేరాలుగా పరిగణిస్తూ ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. నిర్భయ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం రుజువైతే దోషులకు ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు విధించేలా చట్టాల్లో కేంద్రం మార్పులు తెచ్చింది. ఈ కేసుల దర్యాప్తు, విచారణ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 ద్వారా 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించేలా ప్రతిపాదించింది. అత్యాచారానికి పాల్పడే నిందితులకు ఉరిశిక్ష విధించేలా మార్పులు చేసింది. ఈ క్రమంలో త్వరితగతిన విచారణ, శిక్ష అమలులో వెసులుబాటు, ప్రత్యేక కోర్టులు, యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని కేంద్ర హోంశాఖ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దిశ బిల్లు, కేంద్ర హోంశాఖ ప్రస్తావించిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది. దిశ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలను చట్టపరంగా, న్యాయపరంగా ఎలా పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కేంద్ర హోంశాఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో మార్పులు, కొత్తవి రూపకల్పన, అమలు తీరు తదితర అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరుతూ కేంద్రం గత నెలలో అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఐపీసీ 1860, ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) 1973 చట్టాల్లో మార్పులు తెచ్చి కేసుల దర్యాప్తు, విచారణ, తీర్పు వేగంగా పూర్తయ్యేలా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే చట్టరూపం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును చట్ట రూపంలోకి తేవటంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు ప్రతిపాదించే సవరణలకు కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం. ఇప్పటికే ఈ బిల్లును పరిశీలించి న్యాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపింది. బిల్లును ఏ సబ్జెక్ట్ ప్రకారం ప్రతిపాదించారు? ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లకు సంబంధించి ఏ మార్పులు చేశారు? అనే కొన్ని ప్రాథమిక అంశాలపై కేంద్ర హోంశాఖ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. దిశ బిల్లు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని ఆశిస్తున్నాం. – దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
మహిళల ప్రగతి.. శిశువుల వికాసం
న్యూఢిల్లీ: మహిళల అభ్యున్నతి, శిశువుల వికాసానికి 2020–21 బడ్జెట్లో కేంద్రం నిధుల కేటాయింపులను పెంచింది. గత ఏడాది కంటే ఈ పెంపు ఏకంగా 14 శాతం అధికం. 2019–20లో కేటాయింపులు రూ.26,184.50 కోట్లు కాగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.30,007.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో రూ.20,532.38 కోట్లను అంగన్వాడీ సేవలకే వినియోగించనున్నారు. ►నేషనల్ న్యూట్రిషన్ మిషన్‌కు(పోషణ్ అభియాన్) కేటాయింపులను రూ.3,400 కోట్ల నుంచి రూ.3,700 కోట్లకు పెంచారు. పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా.. ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న ఆరేళ్ల లోపు చిన్నారుల సంఖ్యను 2022 నాటికి 38.4 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ►సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో(ఐసీడీఎస్) భాగంగా శిశువుల రక్షణకు నిధుల కేటాయింపులను రూ.1,350 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచారు. ►వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల పథకానికి నిధుల కేటాయింపులను రూ.45 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు పెంచేశారు. మహిళల అక్రమ రవాణా నియంత్రణ, సహాయ పునరావాసానికి ఉద్దేశించిన ఉజ్వల పథకానికి కేటాయింపులను రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెంచారు. ►నేషనల్ క్రెష్ స్కీమ్‌కు కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద.. ఉద్యోగులైన మహిళలు పని వేళల్లో తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించవచ్చు. ►లైంగిక వేధింపులు, హింస బారినపడే బాధిత మహిళలకు వైద్య సహాయం, న్యాయ, పోలీసు సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు ఉద్దేశించిన ‘వన్ స్టాప్ సెంటర్’కు కేటాయింపులను రూ.204 కోట్ల నుంచి రూ.385 కోట్లకు పెంచారు. ►ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) పథకానికి 2019–20లో రూ.2,300 కోట్లు కేటాయించగా, 2020–21లో రూ.2,500 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద గర్భిణికి/పాలిచ్చే తల్లికి రూ.6,000 అందజేస్తారు. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో.. బేటీ పడావో’కార్యక్రమానికి రూ.220 కోట్లు కేటాయించారు. ►మహిళా శక్తి కేంద్రాలకు రూ.100 కోట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చింది రూ.50 కోట్లే. అంటే కేటాయింపులను ఈసారి రెట్టింపు చేశారు. ►మహిళ రక్షణ, సాధికారత మిషన్‌కు గత ఏడాది రూ.961 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,163 కోట్లు కేటాయించారు. -
ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టు
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ–2019’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ చట్టం పరిరక్షణ ప్రత్యేకాధికారి కృతికా శుక్లా తెలిపారు. ఇందుకోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు, ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్, బోధనాస్పత్రుల్లో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఆస్పత్రుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. చట్టం అమలుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనతోపాటు సిబ్బంది నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చేరిన ఆరు గంటల్లోనే వైద్య నివేదికలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఈనెల 7 నుంచి ‘దిశ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కాల్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జనవరి నెలను ‘దిశ’ మాసంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు నాటికల్లా దిశ చట్టం అమలులోకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్భయ చట్టం కంటే ఈ దిశ చట్టం ఎంతో పటిష్టమైనదని చెప్పారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించాల్సి ఉందని చెప్పారు. వైఎస్సార్ కిశోరి వికాస పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే వ్యక్తిగత రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్)పై అవగాహన కల్పిస్తామని కృతికా శుక్లా తెలిపారు. -
మంచికి ఆద్యులు
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ‘మానవతావాది’ అని పేరు. ట్విట్టర్లో ఏదైనా సమస్యను పెడితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆమె తన యంత్రాంగాన్ని ఆమె పరుగులు తీయించేవారు. ఇప్పుడు ఆమె లేరు. ఆమె స్ఫూర్తి మిగిలే ఉంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి మేనకా గాంధీకి సోమవారం ఒక ట్వీట్ వచ్చింది. ‘‘ఈ వానరం గాయపడింది. దాని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా ఎన్జీవోలు కానీ, యానిమల్ యాక్టివిస్టులు కానీ వచ్చి ఈ మర్కటాన్ని కాపాడండి. ఇది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, రైసీనా రోడ్డు, న్యూఢిల్లీ సమీపంలో ఉంది’ అని ట్వీట్ చేస్తూ ఎవరో మేనకా గాంధీని కూడా ట్యాగ్ చేశారు. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ, ఆ ట్వీట్‌కు కేవలం గంటలోపే స్పందిస్తూ, ‘నన్ను ట్యాగ్ చేసినందుకు చాలా సంతోషం, నేను ఇప్పుడే కారు పంపిస్తున్నాను. ఆ మూగప్రాణిని వారు సంజయ్‌గాంధీ యానిమల్ సెంటర్‌కి చికిత్స కోసం తీసుకువెళ్తారు. కొద్ది నిమిషాలలోనే కారు అక్కడకు వస్తుంది’ అని రిప్లయ్ పోస్టు చేశారు. అన్నట్లే కారు వచ్చింది. వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ వానరం వైద్యుల సంరక్షణలో ఉంది. దాని ఆరోగ్యం బాగుంది. మంచి ఏదైనా మార్పు మహిళలతోనే మొదలౌతుంది. ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు తక్షణం స్పందించడం అనేది సుష్మతో మొదలైంది. ఆమె తర్వాత మిగతా కేంద్ర మంత్రులు ఆమెను అనుసరిస్తున్నారు. మేనక కూడా సుష్మ బాటలోనే నడుస్తున్నారు. ఇప్పుడీ వానరం గురించి సమాచారం ఇచ్చింది కూడా ఒక మహిళే కావడం విశేషం. -
అక్రమాలకు పాల్పడితే సహించం: మంత్రి వనిత
సాక్షి, అనంతపురం: అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు, కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తప్పవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. శనివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై మంత్రి వనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు. అంగన్వాడీలకు చేరాల్సిన సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీగా దోపిడీ చేశారని.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వనిత స్పష్టం చేశారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
కష్టం చెప్పుకోవాలని వస్తే.. గెంటేశారు!
కాకినాడ రూరల్: ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో నిర్వహించిన ర్యాలీ సందర్భంగానే ఓ విద్యార్థినిపట్ల పోలీసులు నిర్దయగా వ్యవహరించిన ఘటన సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ప్రారంభమవుతుండగా.. తనను ఓ వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకొనేందుకు తూరంగికి చెందిన విద్యార్థిని విమల కలెక్టరేట్‌కు వచ్చింది. ఈ నెల 4న ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జేసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. గమనించిన పోలీసులు ఆమెను నిర్దయగా బయటకు గెంటేశారు. అక్కడే ఉన్న ఐద్వా నాయకురాలు కె.సుభాషిణి విషయం తెలుసుకుని, ఆ అమ్మాయి కష్టాన్ని అధికారులకు తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, ఇంద్రపాలెం స్టేషన్‌కు తరలించారు. ఒకపక్క ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. మరోపక్క తమకు న్యాయం చేయాలని కోరేందుకు వెళ్తుంటే నిర్బంధించడాన్ని సీపీఎం నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చివరకు వారి సమక్షంలోనే బాధిత విద్యార్థిని ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. -
మా సంక్షేమం కోసం ఏమీ చేయడం లేదు
సాక్షి, హైదరాబాద్: బాల్య వివాహాల బాధితులుగా మారుతున్న బాలికలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు బాల్య వివాహాల బాధిత యువతులు హైకోర్టుకు లేఖ రాశారు. బి.మహాలత, 10 మంది బాధిత యువతులు ఈ లేఖ రాశారు. హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆ యువతులు లేఖలో పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో, బలహీనంగా పుడుతున్నారని, చాలా సందర్భాల్లో పిల్లల మరణాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు వివరించారు. బాధిత యువతులకు విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బాల్య వివాహాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎస్సీ ఎస్టీ నిధికి ప్రత్యేక కసరత్తు
- మహిళా శిశు సంక్షేమ శాఖతో ప్రారంభం - 30 లక్షల మందిలో ఎస్సీ, ఎస్టీల వడపోత - శాఖలవారీగా అన్ని పథకాలకూ ఇదే నమూనా - వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది. ప్రతి శాఖలో పథకాలను కొత్త చట్టానికి అనుగుణంగా విశ్లేషించే ప్రక్రియను ప్రారంభించింది. కొత్త చట్టం ప్రకారం ఈ నిధికి సంబంధించిన ఖర్చులను శాసనసభకు లెక్క చెప్పాల్సి ఉంది. అందుకే నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసే ప్రతి పద్దులోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వెచ్చించే ప్రతి పైసానూ విడిగా లెక్కగట్టే విధానం అవలంబిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ఆద్వర్యంలో అన్ని శాఖలతో సమీక్షలు మొదలయ్యాయి. తొలుత మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలో కీలకమైన ఐసీడీఎస్ ప్రాజెక్టులు, అంగన్వాడీలు, వీటి పరిధిలో అమలవుతున్న పథకాలను సమీక్షించారు. బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆరోగ్యలక్ష్మి పథకాలు అమల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన డేటా ఈ విభాగంలో సిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో మొత్తం 30 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వారిలో ఎస్సీ ఎస్టీలెందరు అనేది కేటగిరీలవారీగా వడపోసిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను సంబంధితశాఖ అధికారులు ఆర్థిక శాఖకు సమర్పించారు. వాటి ఆధారంగా మహిళా శిశుసంక్షేమ శాఖకు ప్రభుత్వం ఈ ఏడాది కేటా యించిన బడ్జెట్... అందులో ఎస్సీ, ఎస్టీల వాటా ఎంత... అనేది లెక్కతీస్తారు. ఈ ఏడాదిలో అయ్యే ఖర్చును సైతం అదే దామాషా ప్రకా రం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో ఖర్చు చేసినట్లు పరిగణిస్తారు. అన్ని శాఖల వివరాలు కోరిన సర్కారు... ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్, బియ్యం పంపిణీలోనూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వాటాను విడివిడిగా అంచనా వేస్తున్నారు. అన్ని శాఖలు సైతం ఇదే తీరుగా సమాచారాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అధ్వర్యంలో శాఖలవారీగా సమీక్షలు జరిపే బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మకు అప్పగించింది. ముందస్తు కసరత్తులో భాగంగానే ప్రత్యేక నిధికి సంబంధించిన వ్యయాన్ని ఆర్థిక శాఖ నాలుగు రకాలుగా వర్గీకరించింది. కొన్ని పథకాలను లబ్ధిదారులవారీగా, కుటుంబాలవారీగా, సంఘాలవారీగా, ఆవాసాలవారీగా వ్యయాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మొత్తం ఖర్చు... చట్ట ప్రకారం ఎస్సీ లేదా ఎస్టీ జనాభా 40 శాతమున్న ఆవాసాలు, గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, కార్యక్రమాలన్నీ ఈ నిధిలో ఖర్చు చేసినట్లుగా పరిగణిస్తారు. గతంలో అమలు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించటమే తప్ప ఖర్చు కావటం లేదని, ఇతర పథకాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే కొత్త చట్టంలో ప్రభుత్వం నిధుల క్యారీ ఫార్వర్డ్ పద్ధతిని పొందుపరిచింది. దీని ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు చేసిన నిధుల దామాషా ప్రకారం.. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధికి కేటాయించిన నిధులను ఖర్చు చేయాలి. లేనిపక్షంలో ఖర్చు కాని మేరకు నిధులను తదుపరి ఏడాది బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధికి అదనంగా చేర్చాల్సి ఉంటుంది. ఈసారి బడ్జెట్లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.14,375 కోట్లు, ఎస్టీ నిధికి రూ.8,165 కోట్లు కేటాయించారు. వాటిని పక్కాగా ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఆ రెండు వర్గాలకు ఖర్చు చేసే కోటాను అన్ని శాఖల్లోనూ విడిగా లెక్కిస్తే ప్రత్యేక నిధి ఖర్చును పారదర్శకంగా వెల్లడించే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
అప్పుడే మహిళా సాధికారత: అమ్రపాలి
వరంగల్: మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే మహిళా సాధికారత సాకార మవుతుందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్‌శాఖల సం యుక్త ఆధ్వర్యంలో జరిగిన మహిళల కలల సాకారం ‘నడక’ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమస్యలు, వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమ్రపాలి ‘వియ్ శుడ్ ఆల్ బి ఫెమినిస్ట్ (మేమంతా స్త్రీ వాదులం)’ పేరున్న టీషర్ట్ ధరించి ఆకట్టుకున్నారు. మహిళా దినోత్సవాన బతుకమ్మ ఆటలు - పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్ వర్షిణి పెద్దపల్లి రూరల్: ‘తంగెడు పూలో.. తడి తామెర పూలో.. ఎంగిలి పూలో.. ఎద పొంగును సూడో..’ అంటూ బతుకమ్మల చుట్టూ మహిళలతో కలసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి ఉత్సాహంగా చిందులేసి ఆకట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ మహిళలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఐకేపీ మహిళా సంఘాలతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆటలాడి మహిళా దినోత్సవాలకు మరింత ఉత్సాహాన్ని నింపారు. -
ప్రసవ వేదన
లక్ష్యాన్ని చేరుకోని ప్రభుత్వాసుపత్రులు వేధిస్తున్న వైద్య సిబ్బంది, మందుల కొరత పీహెచ్సీలలో కరువైన కనీస వసతులు అత్యవసర కేసులు పెద్దాస్పత్రులకు రెఫర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కలిసి నడిస్తేనే ఫలితం.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రులు ప్రసవాల విషయంలో నిర్ధేశించినలక్ష్యాలను అధిగమించలేకపోతున్నాయి. అవసరమైన మేరకు వైద్యులు లేకపోవడం, మత్తు డాక్టర్లు అసలే లేకపోవడం, జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా నిధుల విడుదలలో జాప్యం... ఇలా పలు సమస్యలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్తున్నా... ఆ మేరకు ఫలితాలు రావడం లేదు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న నాటి పరిస్థితుల నుంచి బయట పడలేకపోతున్నారు. అరకొర వసతుల మధ్యన ‘ప్రసవ వేదన’ తప్పదన్న భావన ఇంకా తొలగిపోవడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలంటే ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల పరిస్థితి, డాక్టర్లు, సిబ్బంది కొరత, ల్యాబ్‌ల్లో అసౌకర్యాలు తదితర అంశాలపై ‘సాక్షి నెట్వర్క్’ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం... – సాక్షి, కరీంనగర్ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచండి. ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వాసుపత్రిలోనే పురుడు పోసుకునే విధంగా కృషి చేయండి.. ఇది అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కరీంనగర్/నెట్వర్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 20 క్లస్టర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 571 ఉప కేంద్రాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 37,76,269 మంది జనాభా ఉంటే... ఇందులో 18,95,469 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 13 మండలాలు ఇతర జిల్లాలకు వెళ్లగా... కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 883 రెవెన్యూ గ్రామాలు, 33,38,497 జనాభా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా విడుదల చేసిన ఆయా జిల్లాల సమాచారంలో ఈ నాలుగు జిల్లాల్లో 1372 పడకల ఆసుపత్రులుంటే... 192 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి తదితర ఆసుపత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగితే రూ.1900 వరకు పారితోషికం కూడా అందిస్తారు. అయితే గత కొద్దిరోజులు జననీ శిశు సురక్ష కింద విడుదలయ్యే నిధులకు గ్రహణం పట్టింది. ఇందుకు తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, కనీస సౌకర్యాల లేమి, రవాణా సౌకర్యం కల్పించకపోవడం ప్రతిబంధకాలుగా చెప్తున్నారు. చాలాచోట్ల రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలకు సకాలంలో రక్తం అందడం లేదంటున్నారు. అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామ గ్రామాన తిరిగి గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యలపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపోను మహిళా వైద్యనిపుణులు లేకపోవడంతో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతుండగా, వైద్య, స్త్రీ,శిశు సంక్షేమ, ఐకేపీ శాఖలు సంయుక్తంగా పనిచేస్తే కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో... జిల్లాలోని పదమూడు మండలాల గర్భిణులకు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి ఒక్కటే శరణ్యం. ఆస్పత్రిలో ఒక సివిల్‌సర్జన్, ఒక్క అనెస్థీషియ డాక్టర్ ఉన్నారు. రెండు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఒక అనెస్థీషియ, ఆర్సీహెచ్, సివిల్ సర్జన్, రెండు గైనకాలజిస్టు పోస్టులు ఖాళీ ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రితోపాటు మండలానికొకటి చొప్పున 13 పీహెచ్‌సీలు ఉన్నాయి. సిరిసిల్లలో తప్ప మరెక్కడా ప్రసవాలు జరిపే వీలు లేదు. జిల్లాలో ౖవైద్యాధికారులు 3, డీసీఎస్ 1, సీహెచ్ఓ 1, ఏపీఎంవోలు 5, హెచ్‌ఈలు 2, స్టాఫ్‌నర్స్ 7, రేడియోగ్రాఫర్స్ 2, ఫార్మాసిస్టులు 3, ఎంపీహెచ్ఏలు మొత్తం 48, రెండో ఏఎన్ఎం 2, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో 21, మొత్తంగా 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు నామమాత్రంగా ఉన్నాయి. మూడు నెలలుగా జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2046 కాన్పులు జరుగగా..899 సాధారణ, 1147 సిజేరియన్ కాన్పులు జరిగాయి. సర్కారు దవాఖానాలో వసతులు లేవు. చీకటి గదులు, ఇరుకైన ప్రదేశాల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఇరుకైన గదుల్లోనే గర్భవతులు, బాలింతలు ఉండాల్సిన పరిస్థితి. ఆపరేషన్ థియేటర్లో సదుపాయాలు లేవు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 127 ప్రసవాలు జరిగినట్లు రికార్డులున్నాయి. డిసెంబర్ మాసంలోనే 25 ప్రసవాలు జరిగాయి. -
లోపపోషణ పిల్లలకు పౌష్టికాహారం
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ అంగన్వాడీ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇందూరు : లోపపోషణకు గురైన పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్య వంతులుగా చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు లోప పోషణకు గురైన 0–6 లోపు పిల్లలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల నుంచి ఒక్కో సూపర్వైజర్కు రాష్ట్ర ఐసీడీఎస్ డైరెక్టరేట్ అధికారులు డిసెంబర్ 23 న శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్న సూపర్వైజర్లు జిల్లాలోని మిగతా సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. లోప పోషణ పిల్లలను గుర్తించడానికి అంగన్వాడీ కేంద్రాల్లో ఎత్తు కొలతలు కొలిచే చార్టులు, బరువు కొలిచే మెషిన్లు అందుబాటులో ఉంచుకోవాలని ఐసీడీఎస్ అధికారులు సెక్టార్ సూపర్ వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. లోప పోషణ పిల్లలను గుర్తించి వారి వివరాలను ఎప్పటికప్పుడు డైరెక్టరేట్‌కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1500 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఆరేళ్లలోపు పిల్లలు 79, 275 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారు కాకుండా ప్రయివేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలను కూడా బరువు చూడాలని ఆదేశాలున్నాయి. లోప పోషణకు కారణాలు. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన ప్రతి పిల్లవాడికి గుడ్డు, పాలు, భోజనం అందించాలి. అయితే కొన్ని కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడం, అందినా ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడంతో వారు లోప పోషణతో బాధపడుతున్నారు. పుట్టినప్పుడే తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా శరీరం ఎదుగుదల ఉండదు. అలాంటి వారిని ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఇంటింటికీ తిరిగి బయట పిల్లల్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలు బరువు తీస్తారు. అతి తక్కువ, తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించిన వెంటనే మెడికల్ ఆఫీసర్ వద్దకు పంపించి వైద్య పరీక్షలు చేయిస్తారు. వైద్య పరీక్షల అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పర్యవేక్షణతో కూడిన పౌష్టికాహారం ఫీడింగ్ ఇస్తారు. రెగ్యులర్ ఇచ్చే పౌష్టికాహారంతో, అదనంగా పౌష్టికాహారం ఇస్తూ వారానికి ఒక సారి బరువు తీసి ఎంత బరువు పెరిగారో రికార్డులో నమోదు చేస్తారు. ఒక వేళ పెరుగుదల లేకపోతే మెడికల్ ఆఫీసర్ పరీక్షించిన తరువాత అక్షయ కేంద్రానికి రిఫర్ చేస్తారు. వీరికి ప్రత్యేకంగా ఆరు నెలల వరకు ఫీడింగ్ ఇస్తారు. -
ఆ బాలికను మాకే ఇవ్వాలి..
కోర్టులో రూపేశ్ తల్లి, కాంగో రాయబారి వేర్వేరు పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: అమ్మ హతమై... నాన్న జైలుపాలై... చివరకు ఒంటరై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాపను తమకు ఇవ్వాలని రూపేశ్‌కుమార్ తల్లి లలిత... తమ దేశస్తురాలైన సింథియా కూతుర్ని తమకే అప్పగించాలని కాంగో రాయబారి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి 8వ మెట్రోపాలిటన్ కోర్టులో వారు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను స్వీకరించిన న్యాయమూర్తి రాధిక జైస్వాల్ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ‘దయతలచి మా మనవరాలిని మాకు అప్పగించండి. హైదరాబాద్‌లో చదివిస్తా. ఇతర మనుమలు, మనవరాళ్లతో సమానంగా పోషిస్తా. ఆర్థికంగా మాకు ఎలాంటి లోటూ లేదు’ అంటూ నానమ్మ లలిత పిటిషన్లో అభ్యర్థించారు. ‘సింథియా వెచెల్, రూపేశ్కుమార్లకు కాంగోలో నివసిస్తుండగానే ఈ బాలిక జన్మించింది. పాస్‌పోర్టు కూడా కాంగోదే. కనుక చిన్నారి కాంగో దేశానికే చెందుతుంది. ఆమెపై మాకే హక్కులున్నాయి’ అని కాంగో రాయబారి తన పిటిషన్లో పేర్కొన్నారు. కాంగోకు చెందిన సింథియాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రూపేశ్‌కుమార్ ఆమెను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రూపేశ్ 3 రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. మరోవైపు పోలీసులు చిన్నారికి డీఎన్ఏ పరీక్షలు చేయించారు. బాలిక ఫొటోలు వాడవద్దు: సీపీ మహేశ్ అమ్మానాన్నల సంతోషానికి దూరమై ఇప్పటికే మానసికంగా బాధపడుతున్న చిన్నారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించేలా ఎవరూ వ్యవహరించకుండా రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రూపేశ్ కుమార్తె పేరు కానీ, ఆమెకు సంబంధించిన ఫొటోలు కానీ ప్రచురించడం, టీవీల్లో వీడియోలు ప్రసారం చేయడం తగదని సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ గురువారం ఆదేశాలిచ్చారు. దీన్ని అతిక్రమిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా చర్యలు తప్పవన్నారు. -
హ్యాట్సాఫ్.. స్టేట్‌హోం
నేడు అనాథ మహిళకు వివాహం వెంగళరావునగర్: అ అమ్మాయి ఒక అనాథ.. నగరంలోని మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాంగణంలోని అనాధ ఆశ్రమానికి (స్టేట్‌హోం)లో చేరింది. ఐదేళ్ళపాటు స్టేట్‌హోంలోనే గడిపింది.. గత ఏడాది మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు ఆమెకు స్టేట్‌హోం ప్రాంగణంలో ఉన్న శిశువిహార్‌లో కేర్ టేకర్‌గా (కాంట్రాక్ట్ బేసిక్‌మీద) ఉద్యోగం ఇచ్చారు. అంతేగాకుండా ప్రస్తుతం ఆమెకు పెళ్ళి కూడా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరులో నిశ్చితార్థం, రేపు పెళ్ళి... తల్లిదండ్రులను కోల్పోయి స్టేట్‌హోంలో చిరుద్యోగం చేస్తున్న అనాధ యువతికి గత ఏడాది డిసెంబరు 17నస్టేట్హోం అధికారులు నిశ్చితార్థం జరిపించారు. ఈనెల 26న వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. వివరాలు.. ఒంగోలు ప్రాంతానికి చెందిన నాగలక్ష్మికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతిచెందారు. తోడబుట్టిన అక్కకూడా మృతిచెందింది, సోదరుడు మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో నాగలక్ష్మి బంధువులు 2008లో నగరానికి తీసుకువచ్చి వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు అదే ప్రాంగణంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ చిరుద్యోగిగా చేస్తూ జీవిస్తుంది. మూడు నెలల కిందట గుడి మల్కాపూర్‌లో నివాసం ఉండే ప్రతాప్ తాను ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు తెలియజేశాడు. అతని నిర్ణయాన్ని వారు స్వాగతిస్తూస్థానిక యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయానికి వచ్చారు. అధికారులు ప్రతాప్ కుటుంబ పరిస్థితిని, పూర్తి వివరాలను సేకరించి అతనికి తమ వద్ద కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి వివరాలను తెలియజేశారు. అనంతరం అమ్మాయిని, అబ్బాయిని తమ ఇష్టాయిష్టాలను తెలుసుకుని వివాహం చేయడానికి నిర్ణయించారు. ఒకరికొకరు నచ్చడంతో గత ఏడాది డిసెంబరు 17న ఉన్నతాధికారుల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం జరిపించారు. కాగా ఇరువురి వివాహం ఈనెల 26వ తేదీనాడు మద్యాహ్నం 12.36 గంటలకు స్టేట్‌హోంలోనే జరుపనున్నట్టు అధికారులు తెలియజేశారు. -
రోడ్లు, భవనాల శాఖకు రూ.5500కోట్ల బడ్జెట్!
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు వచ్చే బడ్జెట్లో రూ.5500 కోట్ల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రోడ్లు, వంతెనల నిర్మాణం ముమ్మరంగా జరగాల్సి ఉన్నందున నిధుల అవసరం ఎక్కువగానే ఉంటుందని, ఆ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మేడారం జాతర, కృష్ణా పుష్కరాల పనులపై ఆరా తీశారు. రూ.1,730 కోట్లు ఇవ్వండి... మహిళా శిశుసంక్షేమశాఖ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,730కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాదికంటే ఇది రూ.170 కోట్లు అదనం. బడ్జెట్ ప్రతిపాదనలపై మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిం చారు. ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలగించాలని, శిశు సంక్షేమశాఖ పరిధిలోని విద్యకు సంబంధించిన యూనిట్లను విద్యాశాఖకు బదలాయించాలని ఆయన ఆదేశించారు. -
అంగన్వాడీల వేతనాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు(వర్కర్లు), మినీ అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు(హెల్పర్లు) వేతనాలను ప్రభుత్వం పెంచింది. పెంచిన వేతనాలను ఏప్రిల్ 1 నుంచి చెల్లించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్వాడీల వేతనాలను కార్యకర్తలకు రూ.4,500 నుంచి రూ.7 వేలకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు రూ.2,950 నుంచి రూ.4,500లకు, సహాయకులకు రూ.2,200 నుంచి రూ.4,500లకు ప్రభుత్వం పెంచింది. -
తగ్గుతున్న పిల్లల దత్తత!
♦ శిశువుల అక్రమ అమ్మకాలే ప్రధాన కారణం ♦ రోజు రోజుకు పెరుగుతున్న దరఖాస్తులు ♦ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద 12 వేల అప్లికేషన్స్ సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల్ని కేంద్రానికి అప్పగించే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం దగ్గరికి చేరే అనాథపిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా 2010లో కేంద్రం అన్ని రాష్ట్రాల్లో దాదాపు 6,321 మంది అనాథపిల్లలను దత్తతకు ఇచ్చింది. గతేడాది ఆ సంఖ్య 4,362కు పడిపోయింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,720 మంది పిల్లలను మాత్రమే దత్తతకు ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రులు, నిర్మానుష్య ప్రదేశాల్లో శిశువులను వదిలిపోతున్న సంఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే శిశువుల అక్రమ అమ్మకాల వల్లే ప్రభుత్వానికి చేరే అనాథపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇదీ పరిస్థితి.. ప్రస్తుతం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 235 మంది అనాథ పిల్లలున్నారు. మన రాష్ట్రం నుంచి దత్తత తీసుకునేందుకు 888 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది 225 మంది పిల్లలను దత్తతకు ఇచ్చారు. ఈ సంఖ్య గతంతో పోలిస్తే కాస్త పెరిగింది. అయితే శిశు గృహాలకు చేరే శిశువుల సంఖ్య మాత్రం తగ్గుతోందని అధికారులు వాపోతున్నారు. కాగా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా)కు అన్ని రాష్ట్రాల నుంచి 12 వేలకు పైగా దత్తత దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులకు తగ్గట్లు శిశు గృహాల్లో అనాథ పిల్లలు లేరు. పిల్లలు ఏ శిశు గృహంలో అందుబాటులో ఉన్నా దేశవ్యాప్తంగా ఎవరైనా ఆన్లైన్లో కానీ నేరుగా కానీ దరఖాస్తు చేసుకునేలా ఈ ఏడాది ఆగస్టులో అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. -
ప్రతి జిల్లాలో ‘వన్‌స్టాప్ క్రైసిస్’ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అత్యాచారానికి గురైన మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘వన్‌స్టాప్ క్రైసిస్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లాలో రెండు కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహిస్తారు. బాధితులకు సత్వర సేవలందించేందుకుగాను ఈ కేంద్రాల్లో ఒక డాక్టర్, నర్సు, న్యాయవాది, మహిళా పోలీసులను ప్రభుత్వం నియమించనుంది. అత్యాచారానికి గురైన మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ‘నిర్భయ’ చట్టం తెచ్చినా, పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో బాధిత మహిళలకు ఈ ‘వన్‌స్టాప్ క్రైసిస్’ సెంటర్ల ద్వారా అవసరమైన అన్ని సేవలను అందించాలని ప్రభుత్వం భావించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే గాంధీ ఆసుపత్రి, పేట్ల బురుజులోని ప్రభుత్వాసుపత్రిలో ఈ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఈ కేంద్రం ఏర్పాటుకు 300 చ.మీ. స్థలాన్ని కూడా కేటాయించారు. వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వనుందని మహిళా సంక్షేమ విభాగం అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. అనాథ బాలికలు, ఒంటరి మహిళలు ఉంటున్న ప్రాంతాల్లో అనుచిత సంఘటనలు జరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, రెస్క్యూ హోంలు, స్టేట్‌హోంలు, బాలసదన్లు తదితర ప్రాంగణాల్లో సీసీ కె మెరాలను ఏర్పాటు చేయనున్నారు. మహిళా ప్రాంగణాల్లో ఏర్పాటు చేసేందుకు 1,000 సీసీ కెమెరాలు కావాలని తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ విభాగానికి మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు లేఖ కూడా రాశారు. -
ఆధారాలుంటే విచారణకు సిద్ధం
- మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే స్పష్టీకరణ - ప్రతిపక్షాలది రాజకీయ ప్రేరేపిత కుట్ర.. తిప్పికొడతాను - ఏం లేకున్నా ఏదో ఒకటి చూపించాలని ప్రయత్నిస్తున్నాయి - తప్పు చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా - ఏసీబీ దర్యాప్తునకు సహకరిస్తా ముంబై: ప్రతిపక్షాలు తన పై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని, ఆధారాలు చూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే స్పష్టం చేశారు. రూ.206 కోట్ల ‘కొనుగోళ్ల’ కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, తాజాగా ఓ డ్యాం నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చే విషయంలో మంత్రి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన పంకజ ముండే ప్రతిపక్షాలు చెబుతున్నవి ‘మాటల కుంభకోణాల’ని, రుజువు చూపించి మాట్లాడాలని సవాలు విసిరారు. గతవారం రోజులుగా లండన్‌లో ఉన్న మంత్రి మంగళవారం ముంబైకి చేరుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాలు రాజకీయ ప్రేరేపిత కుట్ర చేస్తున్నాయి. నేను వ్యక్తిగత కారణాలతో లండన్ వెళ్లాను. ఆరోపణలకు స్పందించేందుకు భౌతికంగా ఇక్కడ లేను కాబట్టి ప్రతిపక్షాలు ఇలా రాద్ధాతం చేస్తున్నాయి. నిరాధార ఆరోపణలు చేస్తే వాటికి బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఏ కుంభకోణం జరగకున్నా ఏదో ఒకటి జరిగిందని చూపించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి’ అని విమర్శించారు. తప్పు చేసినట్లు రుజువైతే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఫొటో దిగితే ఏదో సాయం చేసినట్లేనా..? గోపీనాథ్ ముండేకు సన్నిహితుడు, బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్ఎస్పీ) నేత రత్నాకర్ గుట్టేకు చెందిన ప్రైవేటు కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టు ఇచ్చారని తాజాగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన పంకజ..‘రత్నాకర్ గుట్టేతో కలసి ఉన్న ఫొటోలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. గత కొన్ని నెలల క్రితమే గుట్టే ఆర్ఎస్పీలో చేరారు. ఓ కార్యక్రమంలో ఆయనను కలిశాను. ఆ ఫొటోలు అప్పటివే. ఆయనతో కలసి ఫొటో దిగాను అంటే దాని అర్థం.. నేను ఆయనకేదో ఉపకారం చేసినట్లు కాదు. ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి సర్వ హక్కులను జిల్లా కలెక్టర్లకు అప్పగించాం. నేను ఎలాంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదు’ అని వివరించారు. ఈ సందర్భంగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్‌తో కలసి గుటే ్ట దిగిన ఫొటోలను ఆమె మీడియా ముందుంచారు. కొత్త కాంట్రాక్టు పద్ధతి తేలేదని, ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలోనే కొనుగోలు చేశామని ఆమె స్పష్టం చేశారు. పార్టీ అండగా ఉంది విద్యాశాఖ మంత్రి వినోద్ తావడే మినహా మిగతా ఎవరూ ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండించడానికి ప్రయత్నించలేదు. ఇదే విషయాన్ని విలేకరులు పంకజను వివరణ కోరగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనకు అండగా నిలిచారని, మొత్తం పార్టీ అంతా తన వెంట ఉందని ఆమె తెలిపారు. పంకజ విలేకరులతో మాట్లాడుతుండగానే హౌసింగ్ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా వచ్చారు. ‘ఈ విలేకరుల సమావేశానికి ముందే ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునగంటివార్, సహకార శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌తో మాట్లాడాను. పని ఉండటంతో వారు రాలేకపోయారు. వారి షెడ్యూల్‌ను చె డ గొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక్కదానినే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. నాకు పార్టీ, కోట్ల మంది ప్రజల అండ ఉంది’ అని ఆమె చె ప్పారు. తాను, మహిళాశిశు మంత్రిత్వ శాఖ ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధంగా ఉందని, ఏసీబీ తాము సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఆ శాఖ నుంచి ఏసీబీ కోరిన విషయం తెలిసిందే. సమావేశంలో రాష్ట్రీయ సమాజ్ పక్ష్ నేత మహదేవ్ జన్కార్, పంకజ సోదరి, బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే పాల్గొన్నారు. మీరు చేస్తే కొనుగోళ్లు.. మేం చేస్తే కుంభకోణమా..? ‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్లు జరపి రూ.206 కోట్ల కుంభకోణం చేశారని ఎన్సీపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. మరి 2010- 2015 వరకు దాదాపు రూ.408 కోట్ల విలువైన కొనుగోళ్లు రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారానే జరిగాయి. వారు (కాంగ్రెస్, ఎన్సీపీ) చేస్తే కొనుగోళ్లు, అదే మేము చేస్తే కుంభకోణమా’ అని పంకజ ఎద్దేవా చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గకుండా చూసుకోవడం, చిన్నారులకు అవసరమైన మేరకు పౌష్టికాహారం అందించడం కోసమే తన తపన అని ఆమె పేర్కొన్నారు. -
ఉత్సాహంగా బాలల పండుగ
బళ్లారి టౌన్: నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో బుధవారం ధార్వాడ కర్ణాటక బాలవికాస అకాడమీ, బళ్లారి జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మక్కళ హబ్బ(బాలల పం డుగ) కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లాలోని తాలూకాకు రెండు బృందాల చొప్పున ఏడు తాలూకాల్లో ఆయా పాఠశాలల వి ద్యార్థులు జానపద కళలకు నృత్యం చేశారు. బాలికలు, బా లుర డోలు నృత్యం, చెవిటి మూగ విద్యార్థుల నృత్యం, లం బాడీ నృత్యం, జానపద నృత్యాలు అలరించాయి. అంతకు ముందు ఈ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షురాలు మమత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కలాదగి, తూర్పు బ్లాక్ బీఈఓ వృషభేంద్రయ్య మాట్లాడారు. ఈ రాష్ట్రం జానపద సంస్కృతి, గ్రామీణ క్రీడలకు నిలయమని తెలిపారు. వీటిని ఉత్తేజపరిచి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలల పండుగ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు వారి వారి తల్లిదండ్రులు ఈ కళలను నేర్పించి, ప్రోత్సహించాలన్నారు. విదేశీ సంస్కృతిపై మోజుతో మనదేశ సంస్కృతిని మరిచి పోకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహ్మద్ సలా ఉద్దీన్, జెడ్పీ సామాజిక న్యాయ సమితి అధ్యక్షుడు అన్నదానరెడ్డి, నగర డీఎస్పీ మురుగణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాల అమృతం బహుదూరం !
నరసన్నపేట రూరల్ : పిల్లలు పౌష్టికాహారానికి దూరమయ్యూరు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బాల అమృతం ప్యాకెట్ల పంపిణీ నిలి చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా వీటిని పంపిణీ చేయకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు నవంబర్‌లో నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుకు బాల అమృతం రావాల్సి ఉండగా ఇప్పటికీ రాలేదు. జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థతి. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోనే ఈ పరిస్థతి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. ఏడు నెలల పిల్లల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నెలకు ఒక ప్యాకెట్ (రెండున్న కేజీలు) చొప్పున్న బాలామృతం పథకం పేరుతో పౌష్టికాహారాన్ని పంపణీ చేసేవారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సజావుగా సాగే ఈ పంపిణీ ప్రక్రియ టీడీపీ సర్కార్ వచ్చిన తరువాత నిలిచిపోవడంపై పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒక్క నరసన్నపేట ప్రాజెక్టులోనే 225 అంగన్వాడీ కేం ద్రాల్లో ఆరువేల మంది పిల్లలు ఉన్నా రు. వీరికి పౌష్టికాహరం అందడం లేదు. అరుుతే ఈ విషయం తెలియని పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తలను ప్రశ్నిస్తుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికి బాలామృతం వస్తుందో అధికారులు కూడా చెప్పలేక పోతున్నారు. మంచి ఆహారం బాల అమృతం పథకంలో భాగంగా మంచి బలాన్ని ఇచ్చే పౌష్టికాహారాన్ని అందజేసేవారు. గోధుమలు, శనగలు, పంచదార, రిఫైండ్ పామాయిల్ నూనె, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఇనుము, విటమిన్ ఏ,బీ వన్, బీ టు, ఫోలిక్ యాసిడ్, నియాసిన్‌లతో తయూరు చేసే రెండున్నర కేజీల పౌడరుతో కూడిన ప్యాకెట్‌ను సరఫరా చేసేవారు. ఇది రుచిగా ఉండటంతో పిల్లలు బాగా తినే వారు. పేద పిల్లలకు ఇది ఎంతో ఉపకరించేది. బాలామృతం సరఫరా నిలిచి పోవడంతో నిరశన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాల్లో రెండు నెలలుగా గుడ్లు సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం బాలామృతం కూడా నిలిపోవడంతో కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయూన్ని నరసన్నపేట ఐడీసీఎస్ పీవో అనంతలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం నుంచే సరఫరా లేదన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసునని చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేస్తే తాము అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు. -
డోంట్ కేర్‌గా డే కేర్ సెంటర్లు
ఐసీడీఎస్‌కు బదలాయించేందుకు నిర్ణయం మంజూరై ప్రారంభంకాని 19 సెంటర్లు ఒంగోలు సెంట్రల్: జిల్లాలో ఎన్డీసీ (న్యూట్రిషన్ డే కేర్ సెంటర్లు)లు ఎక్కడున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలు, రెండేళ్లలోపు వయసున్న చిన్నారుల కోసం ఇందిరాక్రాంతిపథం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా న్యూట్రిషన్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాలు ఎక్కడ నడుస్తున్నాయో, ఎంత మందికి లబ్ధి చేకూరుతుందో తెలియని పరిస్థితి. దీంతో వీటిని మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయం కొద్ది రోజుల్లో వెలువడనుంది. 2006లో 16 సెంటర్లను రూ.40 లక్షలతో జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎన్డీసీసీ సెంటర్లలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలను చేర్చుకుని వారికి రక్తహీనత లేకుండా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. అనంతరం మూడు దఫాలుగా జిల్లావ్యాప్తంగా 139 గ్రామాలను ఎంపిక చేసి అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు అయిన ఖర్చు రూ.3.48 లక్షలు. కానీ చాలా చోట్ల పుస్తకాల్లో లెక్కలే కానీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్డీసీసీ సెంటర్లలో చిన్నారులను లాలించడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వారికి పోషకారం అందించడం చేయాలి. చాలా సెంటర్లలో ఇవేవీ అమలు కావడం లేదు. గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, మూడు పూటలా భోజనం అందించాలి. చిన్నారులకు పాలు ఇవ్వాలి. సెంటర్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరోగ్య కార్యకర్త విధుల్లో ఉండాలి. అధికారులు సూచించిన ఆహార పదార్థాలను తయారుచేసి ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఆహారం తయారు చేసేందుకు గ్యాస్ స్టవ్‌లు లేవు. కట్టెల పొయ్యితోనే ఆహారాన్ని వండి వారుస్తున్నారు. దీంతో ఏ లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారో అది నెరవేరడం లేదు. కొన్ని సెంటర్లలో ఆహార పదార్థాల సరుకులను గర్భిణులు, బాలింతలకు ఇచ్చి ఇంటి దగ్గరే వండుకు తినండని సెంటర్ల నిర్వాహకులు సలహా ఇస్తున్నారు. ఎన్డీసీసీ కేంద్రాల కోసం విడుదలైన నిధులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ప్రారంభంలో రూ.3.48 కోట్లు, మరో రూ.47 లక్షలకు సబ్‌ప్లాన్ నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సబ్‌ప్లాన్ నిధులతో మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా నివసించే 19 గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాలని డీఆర్డీఏ, ఐకేపీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇది గడచి ఏడాది కావస్తున్నా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. పైగా వీటిని కూడా ప్రభుత్వం రద్దు చేసినట్లు సమాచారం. -
అంగన్వాడీల వైపు చూడని చిన్నారులు !
నరసన్నపేట రూరల్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల వైపు పిల్లలు చూడడం లేదు. లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులోపు పిల్ల లు కరువవుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ అధికారులు ఆశించిన మేరకు పిల్లల నమోదు ఉండటంలేదు. కొన్ని కేంద్రాల్లో రిజిష్టర్‌కు పిల్లల సంఖ్యకు భారీగా తేడా ఉంటుంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ లకు వస్తున్నారంటే పిల్లల సేకరణకు కార్యకర్తలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకే జీ చదువలే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. దీన్ని గమనించిన అధికారులు ఫ్రీ స్కూల్ పిల్లల సంఖ్య పెంచాలని ఒత్తిడి చేస్తు న్నా కార్యకర్తలకు సాధ్యం కావడంలేదు. దీనికి ఉదాహరణగా నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలోని పిల్లల సంఖ్యను చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పరిధిలో నరసన్నపేట మేజరు పంచాయతీతో పాటు నరసన్నపేట, పోలాకి మండలాలు ఉన్నాయి. వీటిలో మెరుున్ కేంద్రాలు 187, మినీ కేంద్రాలు 38 ఉన్నాయి. ప్రస్తుతం 225 కేంద్రాల్లో గర్భిణులు 1275 మంది, బాలింత లు 1492 మంది, సున్నా నుంచి ఆరు నెలల వరకూ 1495 మంది పిల్లలు, అలాగే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 9,414 మంది ఉన్నారు. మార్చి 2014 నాటికి గర్భిణులు 1495, బాలింతలు 1568, సున్నా నుంచి 6 నెలల పిల్లలు 1568, ఐదేళ్లలోపు వారు 10515 మంది ఉండేవారు. అరుుతే తొమ్మిది నెలలకే పిల్లల సంఖ్యలో 1100 మంది తగ్గుదల కన్పిస్తుంది. ఇంత భారీగా తగ్గుదల ఉండటంతో కార్యకర్తలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడ ఉందా అని ఆరా తీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు పంపడం లేదని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే.. మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు రికార్డుల్లో ఉంటున్నారే తప్పా కేంద్రాలకు హాజరు అంతంతగానే ఉంటుంద నే విమర్శలు వస్తున్నారుు. గ్రామీణ ప్రాంతా ల్లో కూడా కాన్మెంట్ చదువుల సంస్కృతి పెరుగుతుండడంతో అంగన్వాడీ కేంద్రాలకు ఆదరణ తగ్గుతోందని పలువురు భావిస్తున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో కార్యకర్తల పనితీరు సరిగ్గా లేదనే ఆరోపణలు ఉన్నారుు. వీరి పనితీరును సరిచేయాల్సిన అధికారులు కూ డా బాధ్యతగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నరసన్నపేట మండలం కొల్లవానిపేట కార్యకర్త రెండేళ్లుగా విధులకు రాకపోయినా ఆ స్థానంలో ఇప్పటికీ కొత్త వారిని నియమించడంలేదు. కనీసం ఈ స్థానం ఖాళీ గా ఉన్నట్టు కూడా చెప్పడం లేదు. అలాగే మాకివలస, మడపాం, కంబకాయల్లో కార్యకర్తల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. మరో పక్క పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే పారిశుద్ధ్యం క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమౌతారోననే భయంతో కేంద్రాలకు పంపడం లేదు. -
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
కలెక్టరేట్లో ఘనంగా నానబియ్యం బతుకమ్మ సంబరాలు సంగారెడ్డి అర్బన్: జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ మహిళా కార్యకర్తలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ ఉద్యోగినులు, అందంగా పేర్చిన బతుకమ్మలతో సంగారెడ్డి కలెక్టరేట్ శోభాయమానంగా వెలిగిపోయింది. ఉద్యోగినులు బతుకమ్మ పాటలు పాడుతూ తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాన్ని 3 గంటల పాటు ఆనందోత్సాహాల మధ్యన జరుపుకున్నారు. తంగెడు, గుమ్మడి, కట్లపూలు, గునుగుపూలు, బంతి ఇలా తీరొక్కపూలను పళ్లెంలో గోపురంగా పేర్చి తమ కళాత్మకతను ప్రదర్శించారు. నాల్గవరోజు నాన బియ్యం బతుకమ్మగా పిలిచే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వ్యవసాయ శాఖ మహిళా ఉద్యోగులు , ఐసీడీఎస్ ఉద్యోగులు మధ్యాహ్నం నుంచే బతుకమ్మలను తయారుచేశారు. ఐసీడీఎస్, వ్యవసాయ శాఖ కార్యాలయాల ఎదుట పెద్దఎత్తున రంగురంగుల ముగ్గులు వేశారు. బతుకమ్మలపై జై తెలంగాణతో పాటు తమ శాఖల పేర్లను ప్రదర్శించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఏపీడీ ఉమారాణి , డీసీపీఓ రత్నం, ఐసీడీఎస్ సూపరింటెండెంట్ జయరాం నాయక్ , ప్రవీణ్‌కుమార్, నిర్మల, పద్మలత, బాలచందర్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ల మధ్యన ఊరేగింపుగా కలెక్టరేట్ వెలుపల ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద ఉంచారు. జిల్లా ఖజానా అధికారి ఉదయలక్ష్మి ఉత్సవాలను పర్యవేక్షించగా , వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్ తెలంగాణ తల్లికి పూలమాల వేసి బతుకమ్మ పండగను ప్రారంభించారు. మహిళా ఉద్యోగినులు వలయాకారంగా ఏర్పడి మనోహరమైన లయ నృత్యంతో ఆడిన బతుకమ్మ చూపరులకు ఆహ్లాదం కల్గించింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో.. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నాల్గవరోజు నానబియ్యం బతుకమ్మగా పిలిచే ఉత్సవంలో భాగంగా బతుకమ్మ సంబురాలను ఆస్పత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్ టీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, హరికిషన్ , రాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘నిర్భయ’కు చోటేదీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడుతున్నట్టుగా ఉంది’ జిల్లా అధికారుల తీరు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో జిల్లా కేంద్రాల్లో నిర్భయ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సెంటర్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర వెచ్చింపుల ఆర్థిక సంఘం ఆమోదం కూడా తెలిపింది. దీనిలో న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ, ఆరోగ్య శాఖ, సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖల నుంచి సూచనలు కోరారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు ఈ సెంటర్లో కౌన్సెలింగ్‌తోపాటు న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదులను, రిటైర్డ్ పోలీసు అధికారిని నియమిస్తారు. దీని ద్వారా లైంగిక వేధింపులకు గురైన వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. మహిళలకు ఇన్ని ఉపయోగాలున్న ఈ సెంటర్ విషయంలో ‘నిర్భయ’కు చోటేదీ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 50 నిర్భయ సెంటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని మొదట ముందుకు వచ్చిన వారికే కేటాయిం చాలని ప్రభుత్వం భావించింది. దీం తో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు లో నిర్భయ సెంటర్‌ను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. స్థలం చూపిస్తే సెంటర్ కేటాయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఆయన 20 రోజుల క్రితం కలెక్టర్‌ను కలిసి సెంటర్‌కు ఐదు సెంట్ల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడతోపాటు పలు నగరాలు ముందుకు వచ్చినా తొలుత ఒంగోలుకు కేటాయించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా కేంద్రం అంగీకరించినా జిల్లా అధికారులు మాత్రం స్థలం చూపించకపోవడం పట్ల జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
మూడు ముళ్ల బంధం
పెళ్లి పేరిట బాల్యం బందీ రాష్ట్రంలో ఏడాదికేడాది పెరుగుతున్న బాల్యవివాహాలు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో బాల్యం పెళ్లి పేరిట బందీ అవుతోంది. పట్టుమని పదిహేనేళ్లు కూడా దాటకుండానే బాలికలు అత్తారింటికి వెళ్లిపోతున్నారు. బాల్యవివాహ నిషేధ చట్టం గురించి రేడియోల్లో, టీవీల్లో, వార్తాపత్రికల్లో ప్రచారానికే ప్రభుత్వం పరిమితమవుతోందంటూ సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతులకు 18 ఏళ్లు, యువకులకు 21 ఏళ్లు వచ్చేంత వరకూ వివాహం చేయడం బాల్య వివాహ నిషేధ చట్టం -06ను అనుసరించి నిషేధం. అయితే రాష్ట్రంలో ఈ చట్టం అమలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ మూడేళ్లలో 1,018 బాల్య విహాలు జరిగినట్లు రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదరికం, వెనుకబాటుతనం కారణంగా బాగల్కోటె, బళ్లారి, కొప్పళ, రాయచూరు, ధార్వాడ, మండ్య, బెల్గాం, గదగ్, దావణగెరె, బీజాపుర, చిత్రదుర్గా, చామరాజనగర జిల్లాల్లో బాల్య వివాహలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. ఇక హక్కిబిక్కి, బుడగ, జంగమ వంటి తెగల్లో ఇప్పటికీ యుక్తవయసు రాకుండానే ఆడపిల్లలకు వివాహం చేసి పంపించే సంప్రదాయం ఉంది. వివాహనంతరం చిన్నవయసులోనే గర్భం దాల్చి, ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తడంతో మాతాశిశుమరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇంత జరగుతున్నా ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మెరుగుపరిచేలా చర్యలు చేపట్టినప్పుడే బాల్య వివాహాలు ఆపగలమని బాలల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఆర్‌వై (క్రై) సంస్థ ప్రతినిధి రమేష్ బాటియా తెలిపారు. రాష్ట్ర శిశుసంక్షేమశాఖ వద్ద నమోదైన గణాంకాలకు దాదాపు మూడురె ట్లు ఎక్కువగా బాల్యవివాహాలు జరిగినట్లు తమ సంస్థ పరిశీలనలో తేలిందని ఆయన పేర్కొన్నారు. -
‘జువెనైల్’ మీమాంస!
రెండేళ్లక్రితం ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిపి ఆమెను హతమార్చిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ ఉదం తానికి కారకులైన ఆరుగురిలోనూ నలుగురికి ఉరిశిక్ష పడగా, ఒక నిందితుడు అంతక్రితమే జైల్లో అనుమానస్పద స్థితిలో మరణిం చాడు. ఒకరిని బాలుడిగా పరిగణించిన కారణంగా జువెనైల్ బోర్డు విచారించి మూడేళ్ల శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు ఏమాత్రం తీసిపోని క్రౌర్యాన్ని ప్రదర్శించినా ఇలా స్వల్ప శిక్షతో సరిపెట్టడమే మిటని అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన నిందితులను జువెనైల్‌గా పరిగణించరాదన్న డిమాండు ఆనాటినుంచీ ముందుకొచ్చింది. ఇలాంటి నేరగాళ్లు కూడా కఠిన శిక్షల పరిధిలోకి వచ్చేలా వయోపరిమితిని ఇప్పుడున్న 18 ఏళ్ల నుంచి 16కు తగ్గించాలని అనేకులు సూచించారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్న పదహారేళ్ల వయసుకు పైబడినవారి విషయంలో ఏంచేయాలో నిర్ణయించే అధికారాన్ని జువె నైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం తీర్మానిం చింది. ఆ రకంగా మధ్యేమార్గాన్ని అనుసరించింది. ఇప్పుడున్న బాల నేరస్తుల చట్టం ప్రకారం మైనర్ నిందితులు వారెంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడినా సాధారణ కోర్టులు విచారించకూడదు. జువెనైల్ జస్టిస్ బోర్డు విచారించి, గరిష్టంగా మూడేళ్ల శిక్ష విధిస్తుంది. నేర తీవ్రతనుబట్టి నేరంలో పాలుపంచుకున్నవారిపై సమా జంలో ఆగ్రహావేశాలు రగులుతాయి. అలాంటివారిని బహిరంగంగా ఉరితీయాలనో, కాల్చిచంపాలనో డిమాండ్లు వెల్లువెత్తుతాయి. ఇలా డిమాండు చేసేవారిని తప్పుబట్టనవసరం లేదు. సమాజంలో నానా టికీ క్రౌర్యం పెరిగిపోతున్నదని, నేరాలు అంతకంతకూ విస్తరిస్తున్నా యని అలాంటివారి ఆదుర్దా, ఆందోళన. నేరానికి తగిన విధంగా కఠి నమైన శిక్షలుంటే ఇవి అంతరిస్తాయని వారి విశ్వాసం. అలాగే తమ వారిని అత్యంత దారుణంగా హింసించి హతమార్చినవారిని అదే మోతాదులో శిక్షించాలని సంబంధీకులు కోరడం వెనకున్న ఆవేదనను అర్ధం చేసు కోవచ్చు. కానీ, ప్రభుత్వం ఇంత కన్నా పరిణతితో ఆలోచించాలి. జువెనైల్ చట్టంకింద కాకుండా సాధారణ చట్టంకింద అలాంటివారిని విచారించి శిక్షిస్తే ఏమవుతుంది? ఆ శిక్ష పడిన మైనర్లు కరుడుగట్టిన హంతకులతోనూ, దోపిడీదొంగలతోనూ శిక్షాకాలమంతా గడపవలసివస్తుంది. చట్టం దృష్టిలో వారు ‘మేజర్’ లే కావొచ్చుగానీ అలాంటి నేరస్తులనుంచి తమను తాము కాపాడు కునే అవకాశం లేనివారు. ఈ క్రమంలో ఆ మైనర్లు మరింత కరుడుగ ట్టిన నేరస్తులుగా రాటుదేలడం తప్ప దీనివల్ల సాధించే ప్రయోజనం శూన్యం. పైగా ఒక వ్యక్తిని బాల నేరస్తుడిగా పరిగణించాలా లేక సాధారణ నేరస్తుడిగా చూడాలన్న విషయంలో అతను చేసిన నేరం ప్రాతిపదిక కావడం సబబనిపించుకోదు. ఒక నేరానికి పథకం వేయ డం, ఆ నేరానికి ఎలాంటి పర్యవసానాలుండగలవో తెలిసివుండటం వంటివి ఒక వ్యక్తిని నేరస్తుడిగా నిర్ధారించడంలో కీలకపాత్ర పోషి స్తాయి. కౌమార దశలో ఉండేవారిలో విపరీతమైన ఒత్తిళ్లుంటాయని, వెనకాముందూ చూడకుండా ఎలాంటి నిర్ణయాన్న యినా తీసుకునే దూకుడు స్వభావం ఉంటుందని... స్థిరంగా ఉండి ఆలోచించడానికి వీలుకల్పించే మెదడులోని ఒక భాగం నిర్మాణ క్రమం 18 ఏళ్ల వయసు వరకూ కొనసాగడమే ఇందుకు కారణమని మనస్తత్వ శాస్త్ర వేత్తలు చెబుతారు. 18 ఏళ్లలోపువారిని బాలనేరస్తు లుగా పరిగణిం చాలని నిర్ణయించింది ఇందుకే. 1992లో కుదిరిన ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక వెనకున్న ఉద్దేశమూ ఇదే. ఈ ఒడంబ డికపై మన దేశం కూడా సంతకం చేసింది. దానికి అనుగుణంగానే బాలనేరస్తుల చట్టం, 2000 అమల్లోకి వచ్చింది. అంతక్రితం ఉన్న 1986నాటి చట్టప్రకారం 16ఏళ్లు పైబడిన బాలురనూ, 18 ఏళ్లు పైబడిన బాలికలను మాత్రమే బాలనేరస్తులుగా పరిగణించేవారు. హేయమైన నేరాలకు పాల్పడిన సందర్భాల్లో నేరస్తుల వయోప రిమితిని 16 ఏళ్లుగా పరిగణించాలని యూపీఏ హయాంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. కొత్తగా ఆ శాఖను చేప ట్టిన మంత్రి మనేకా గాంధీ కూడా ఇలాంటి సూచనే చేశారు. మహి ళలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా నిర్ణయిం చడం అవసరమని ఆమె వాదించారు. మహిళల హక్కుల సంరక్ష ణను బాలల హక్కుల సంరక్షణతో పోటీపెట్టే స్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరమైనదే. వాస్తవానికి బాలల నేరాలు ప్రచారం జరుగుతున్న స్థాయిలో ఏమీ పెరగలేదు. బాలనేరస్తుల చట్టం పెట్టిన నాటినుంచీ మొత్తం నేరాల్లో బాల నేరస్తుల ప్రమేయం ఉన్న నేరాలు దాదాపు 2 శాతంగానే ఉన్నాయి. ఈ 2 శాతంలోనూ హింసాత్మకమైన నేరాలు 7 శాతం. గత ఏడాది బాల నేరస్తులకు సంబంధించిన నేరాలు మొత్తం 38,765 అని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాం కాలు తెలియజెబుతున్నాయి. ఇందులో అత్యాచారాల సంఖ్య 2,074. ఈ నేరాల్లో 16-18 ఏళ్ల మధ్యవయస్కులు 66.6 శాతమని ఆ గణాం కాలు చెబుతున్నాయి. నేర తీవ్రతనుబట్టి ఒక నిందితుణ్ణి జవెనైల్గా పరిగణించాలో, పెద్దవాడిగా చూడాలో జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ణయి స్తుందని కేబినెట్ ఆమోదించిన సవరణ చెబుతున్నది. ప్రతిదీ సంచ లనాత్మకం అవుతున్న ప్రస్తుత తరుణంలో జువెనైల్ జస్టిస్ బోర్డు అంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉం టుందా అన్నది అనుమానమే. కేబినెట్ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకొచ్చినప్పుడైనా ఈ విషయంలో సమగ్రమైన చర్చ జరగా లని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకో వాలని ఆశిద్దాం. -
కోడిగుడ్ల టెండర్లలో గోల్మాల్
తక్కువ రేటుకు ఇస్తామన్న వారికి మొండిచేయి అధిక రేటుకు టెండర్ ఖరారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి చిత్తూరు(టౌన్): స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలోని అంగన్వాడీ కేం ద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఖరారు చేసిన టెండర్లలో గోల్మాల్ చోటుచేసుకుంది. తక్కువ ధరకు గుడ్లు సరఫరా చేస్తామని ముందుకొచ్చిన వారికి కాదని అధిక ధర వసూలు చేసే వారికే కాంట్రాక్ట్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అధికారుల నిర్ణ యంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్ల లో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమ లు చేస్తోంది. జిల్లాలోని21 సీడీపీవో (చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్)ల పరిధిలోని 4,768 అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు మంగళవారం టెం డర్లు పిలిచారు. అదేరోజు రాత్రి పది గంటల తర్వాత వాటిని ఖరారు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు సీల్డ్ కవర్లలో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర స్థాయి లో ఎవరైనా టెండర్లలో పాల్గొనవచ్చని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు నెక్ (నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ) రేటుపై అదనంగా 20 పైసలకు గుడ్లు సరఫరా చేస్తామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చి న వారు 24 పైసలు అదనంగా సరఫరా చేస్తామన్నారు. స్థానిక కాంట్రాక్టర్లు వారిని అడ్డుకోవడంతో తిరుగుముఖం పట్టారు. అనంతరం స్థానిక కాంట్రాక్టర్లు సిండికేట్ అయి నెక్ రేటుకున్నా అదనంగా 55 పైసలు కోడ్ చేసినా వారికే టెండర్లను ఖరారు చేస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు గండి.. జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధిపొందుతున్న వారు 4,44,057 మంది ఉన్నారు. వీరిలో 0- 6 ఏళ్లలోపు పిల్లలు 2,87,500 మంది, కిశోర బాలికలు 87,757 మంది, సూపర్ వైజరీ ఫీడింగ్ కింద 6 వేల మంది, గర్భిణులు 62,800 మంది ఉన్నారు. వీరికి నెలకు 59,30,712 కోడిగుడ్లు అందివ్వా ల్సి ఉంది. గుడ్డు ధరకన్నా అదనంగా 37 పైసల చొప్పున మదనపల్లె డివిజ న్కు, 55 పైసల చొప్పున తిరుపతి, చిత్తూరు డివిజన్ల పరిధిలోని అంగన్వాడీలకు సరఫరా చేసేందుకు టెండర్లను ఖరారు చేశారు. అనంతపురం వారు ఇస్తామన్న 20పైసలకు తీసుకోకపోవడం వల్ల నెలకు రూ.20.76 లక్షలు, ఏడాదికి రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. నాణ్యతపైనా అనుమానాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండరుదారులు సరఫరా చేయాల్సిన కోడిగుడ్డు బరువు 45 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. ఇప్పటివరకు ఏ కాంట్రాక్టరూ అలా సరఫరా చేయలేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మూడు నాలుగు మండలాలకు నిర్దేశించిన కాలవ్యవధిలో గుడ్లను సరఫరా చేయలేని కాంట్రాక్టర్లు నేడు ఏడేసి సీడీపీవోల పరిధిలోని అంగన్వాడీలకు ఎలా సరఫరా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ కాంట్రాక్టరు సరఫరా చేయకపోతే మన పరిస్థితేంటనే ఆందోళన సీడీపీవోలను వెంటాడుతోంది. గత ఏడాదికంటే తక్కువ రేటుకే టెండర్లు ఖరారు చేశాం గత ఏడాది టెండర్లతో పోల్చుకుంటే ఈసారి తక్కువ ధరకే ఖరారు చేశాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చిన విషయం నాకు తెలియదు. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. నాణ్యత విషయం లో రాజీలేకుండా చర్యలు తీసుకుంటాం. - ఉషాఫణికర్, ఐసీడీఎస్ పీడీ -
బాలలకు అమృతం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులపై మహిళా శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రత్యేక దృష్టి సారించింది. వయసుకు తగిన బరువు లేకుండా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఎంటీఎఫ్ స్థానంలో ‘బాలామృతం’ పేరుతో అధిక పోషక విలువలు గల పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లను ఈ ఏడాది మే ఒకటి నుంచి అందజేస్తోంది. జిల్లాలోని 21 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 4,094 అంగన్వాడీ కేంద్రాల్లో రెండున్నర నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ఎంటీఎఫ్‌ను అందిస్తూ వస్తున్నారు. అయితే చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఎంటీఎఫ్ స్థానంలో బాలామృతం పేరుతో అధిక పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని చేర్చారు. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడే విధంగా వేరుశనగ పప్పు, వేయించిన గోదుమలు, పంచదార, పాలపొడి మిశ్రమాలతో కూడిన రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్‌ను చిన్నారుల తల్లులకు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్కేళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో స్కేళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వీటిని నామ్‌కే వాస్తేగా వినియోగిస్తూ వచ్చారు. బాలామృతం పథకం రాకతో స్కేళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రాల పరిధిలోని చిన్నారులు ఎంత ఎత్తు ఉన్నారో వారం రోజులకు ఒకసారి చూడటం, వారు ఎంత బరువు ఉన్నారో పరిశీలించడం తప్పనిసరి చేశారు. వయసుకు తగిన బరువు లేకుంటే అలాంటి చిన్నారుల విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బాలామృతం ద్వారా తక్కువ బరువు కలిగిన చిన్నారుల్లో రాకుంటే వైద్యులకు చూపించి ఆ చిన్నారి ఆరోగ్యపరమైన సమస్యలు ముందుగానే తెలుసుకునే విధంగా తల్లులను చైతన్యపరిచేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తల్లులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తక్కువ బరువు గల చిన్నారుల్లో మార్పు వచ్చే అవకాశాలున్నాయి. -
అంగన్వాడీలు విధులకు హాజరయ్యేలా చూడాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్వాడీలంతా విధులకు హాజరయ్యేలా చూడాలని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని ఆదేశించారు. కమిషనర్ చిరంజీచౌదరితో కలిసి అన్ని జిల్లాల రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లు, ప్రాజెక్టు డెరైక్టర్లు, సీడీపీఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సహాని మాట్లాడుతూ 12 రోజుల నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మెకు దిగడంతో కార్యకలాపాలు కుంటుపడ్డాయన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. వారి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా పోయింద ని, రాష్ట్రంలో ప్రభుత్వం లేని విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు మంజూరయ్యాయి, వాటిలో ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, మిగిలినవి ఏ దిశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థలకు కేటాయించే బడ్జెట్లో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఎంత మిగులు ఉంది, ఎప్పటిలోపు ఖర్చు చేస్తారో నీలం సహాని తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ, ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి, జిల్లాకు చెందిన సీడీపీఓలు పాల్గొన్నారు. పీడీ సమీక్ష : జిల్లాలోని సీడీపీఓలతో ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి తన చాంబర్లో సమీక్షించారు. రెండు ప్రాజెక్టులు మినహా మిగిలిన ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలన్నీ మూతపడిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ఆమె సీడీపీఓలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలను పిలిపించి కేంద్రాల నిర్వహించే విధంగా చూడాలన్నారు. -
ఐసీడీఎస్‌లో న్యూ ఇయర్ ‘గిఫ్ట్’
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నూతన సంవత్సరం వచ్చిందంటే అంగన్వాడీ కార్యకర్తలు హడలిపోతారు. మిగిలిన వారంతా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకుంటుంటే వారు మాత్రం ఆందోళనకు గురవుతుంటారు. అందుకు కారణం ఆ శాఖలో కీలకమైన స్థానాల్లో ఉన్నవారికి గిఫ్ట్ రూపంలో నజరానాలు సమర్పించాల్సి ఉండటమే. గతంలో తక్కువ మొత్తంలో సమర్పిస్తుండటంతో వారికి పెద్ద భారంగా ఉండేది కాదు. ఈ సారి మాత్రం పెద్ద టార్గెట్లే ఇచ్చారు. కొన్ని ప్రాజెక్టులకు చెందిన సీడీపీఓలు, సూపర్వైజర్ల నుంచి ఆదేశాలు వెళ్లాయి. నూతన సంవత్సర వేడుకలను అన్ని శాఖల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సిబ్బంది తమ స్థోమతను బట్టి అధికారులను కలిసి యాపిల్ పండ్లు లేదా స్వీట్ బాక్స్‌లు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు యాపిల్ పండ్లు, స్వీట్ బాక్స్‌లతో వస్తే సరిపోదు. న్యూ ఇయర్ ‘గిఫ్ట్*’ భారీగా ఉండేలా ముందుగా ప్లాన్ చేసుకుంటారు. పెపైచ్చు కొంతమంది సీడీపీఓలు, సూపర్వైజర్లు తమపై అధికారులకు నజరానా ఇవ్వాల్సి ఉంటుందని, దానికి తాము కూడా కొంత నగదు జమ చేస్తున్నామని చెప్పి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్న’ చందంగా ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకొని కొంతమంది సీడీపీఓలు, సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం వారు సెక్టార్ల వారీగా తమకు అనుకూలమైన కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 4244 అంగన్వాడీ కేంద్రాలు, 235 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు అంతే సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నుంచి కొంతమంది తమపై అధికారుల పేర్లు చెప్పుకొని భారీ నజరానా పొందినట్లు తెలిసింది. అంగన్వాడీ కార్యకర్త నుంచి వసూలు చేసిన 350 రూపాయల్లో 100 రూపాయలు సూపర్వైజర్, 250 రూపాయలు సీడీపీఓల పర్సుల్లోకి వెళ్లినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ మొత్తానికి తాము మరికొంత జోడించి తమపై వారికి గిఫ్ట్ ఇస్తున్నామని కొందరు సూపర్వైజర్లు అంగన్వాడీలకు చెప్పి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. సహకరించకుంటే చుక్కలు చూపిస్తారు న్యూ ఇయర్ గిఫ్ట్‌కు అంగన్వాడీలు సహకరించకుంటే వారికి చుక్కలు చూపించినంత పనిచేస్తారు. తరచూ ఆ కేంద్రాలను తనిఖీలు చేయడం, ఉన్నది లేనిదీ చూసి హడావుడి చేయడం, చివరకు ‘కొండను తవ్వి ఎలుకను’ పట్టుకున్న చందంగా చిన్నపాటి కారణాలను పెద్దవిగా చూపించి నోటీసులు ఇస్తుంటారు. మూడుసార్లు నోటీసులు అందుకున్నవారిపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. దీనికి భయపడి ఎక్కువ మంది అంగన్వాడీ కార్యకర్తలు వారు చెప్పినట్లుగా నజరానాలు ముట్టచెబుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతో గుట్టుచప్పుడు కాకుండా అడిగినంత మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు. ఈ విషయమై మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మను వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ఫోన్ ద్వారా సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదు. -
అమృతం కాదు.. విషం
జోగిపేట, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేది నుంచి చిన్నారుల కోసం ‘బాలామృతం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా చిన్నారులకు నెల రోజులు పాటు సరిపోయేలా అనుబంధ పౌష్టికాహరంతో కూడిన ప్యాకెట్‌ను ఒక్కొక్కరికి ఒక్క ప్యాకెట్ చొప్పున అందజేయాలి. ప్రతి రోజు 100 గ్రాముల చొప్పున 7-36 నెలల పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో 7 వేల మంది చిన్నారులను గుర్తించి రెండు, మూడు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రాలకు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే జోగిపేటకు చెందిన రెండు కేంద్రాల్లో శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకెట్లను పంపిణీ చేయగా, అందులో నుంచి తెల్లటి పురుగులు బయటపడడంతో ప్యాకెట్లు తీసుకున్న వారు తిరిగి తీసుకువచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చేశారు. సర్కార్ పంపిణీ చేసిన ప్యాకెట్లోని పొడి తాగిన స్థానిన ఎస్సీ కాలనీలోని చిన్నారి వాంతులు చేసుకుంది. మరో కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త తన బిడ్డకు ఈ పొడిని కలిపి తాగించిన వెంటనే ఆ చిన్నారి వాంతులు చేసుకున్నట్లు సమాచారం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం వారిని అనారోగ్యానికి గురి చేస్తుండడంతో వాటిని పిల్లలకు పంపిణీ చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. మరోవైపు ‘బాలామృతం’ ప్యాకెట్లలో పురుగులు వస్తున్న విషయం తెలుసుకున్న తల్లులు ఈ ప్యాకెట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.