నరసన్నపేట రూరల్ : పిల్లలు పౌష్టికాహారానికి దూరమయ్యూరు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బాల అమృతం ప్యాకెట్ల పంపిణీ నిలి చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా వీటిని పంపిణీ చేయకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు నవంబర్‌లో నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుకు బాల అమృతం రావాల్సి ఉండగా ఇప్పటికీ రాలేదు. జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థతి. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోనే ఈ పరిస్థతి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి.
ఏడు నెలల పిల్లల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నెలకు ఒక ప్యాకెట్ (రెండున్న కేజీలు) చొప్పున్న బాలామృతం పథకం పేరుతో పౌష్టికాహారాన్ని పంపణీ చేసేవారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సజావుగా సాగే ఈ పంపిణీ ప్రక్రియ టీడీపీ సర్కార్ వచ్చిన తరువాత నిలిచిపోవడంపై పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒక్క నరసన్నపేట ప్రాజెక్టులోనే 225 అంగన్‌వాడీ కేం ద్రాల్లో ఆరువేల మంది పిల్లలు ఉన్నా రు. వీరికి పౌష్టికాహరం అందడం లేదు. అరుుతే ఈ విషయం తెలియని పిల్లల తల్లిదండ్రులు అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రశ్నిస్తుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికి బాలామృతం వస్తుందో అధికారులు కూడా చెప్పలేక పోతున్నారు.
మంచి ఆహారం
బాల అమృతం పథకంలో భాగంగా మంచి బలాన్ని ఇచ్చే పౌష్టికాహారాన్ని అందజేసేవారు. గోధుమలు, శనగలు, పంచదార, రిఫైండ్ పామాయిల్ నూనె, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఇనుము, విటమిన్ ఏ,బీ వన్, బీ టు, ఫోలిక్ యాసిడ్, నియాసిన్‌లతో తయూరు చేసే రెండున్నర కేజీల పౌడరుతో కూడిన ప్యాకెట్‌ను సరఫరా చేసేవారు. ఇది రుచిగా ఉండటంతో పిల్లలు బాగా తినే వారు. పేద పిల్లలకు ఇది ఎంతో ఉపకరించేది. బాలామృతం సరఫరా నిలిచి పోవడంతో నిరశన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాల్లో రెండు నెలలుగా గుడ్లు సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం బాలామృతం కూడా నిలిపోవడంతో కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయూన్ని నరసన్నపేట ఐడీసీఎస్ పీవో అనంతలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం నుంచే సరఫరా లేదన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసునని చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేస్తే తాము అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు.
బాల అమృతం బహుదూరం !
Published Fri, Jan 9 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement
Advertisement