అంగన్‌వాడీల వైపు చూడని చిన్నారులు !
నరసన్నపేట రూరల్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల వైపు పిల్లలు చూడడం లేదు. లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులోపు పిల్ల లు కరువవుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ అధికారులు ఆశించిన మేరకు పిల్లల నమోదు ఉండటంలేదు. కొన్ని కేంద్రాల్లో రిజిష్టర్‌కు పిల్లల సంఖ్యకు భారీగా తేడా ఉంటుంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ లకు వస్తున్నారంటే పిల్లల సేకరణకు కార్యకర్తలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకే జీ చదువలే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. దీన్ని గమనించిన అధికారులు ఫ్రీ స్కూల్ పిల్లల సంఖ్య పెంచాలని ఒత్తిడి చేస్తు న్నా కార్యకర్తలకు సాధ్యం కావడంలేదు. దీనికి ఉదాహరణగా నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలోని పిల్లల సంఖ్యను చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పరిధిలో నరసన్నపేట మేజరు పంచాయతీతో పాటు నరసన్నపేట, పోలాకి మండలాలు ఉన్నాయి.
వీటిలో మెరుున్ కేంద్రాలు 187, మినీ కేంద్రాలు 38 ఉన్నాయి. ప్రస్తుతం 225 కేంద్రాల్లో గర్భిణులు 1275 మంది, బాలింత లు 1492 మంది, సున్నా నుంచి ఆరు నెలల వరకూ 1495 మంది పిల్లలు, అలాగే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 9,414 మంది ఉన్నారు. మార్చి 2014 నాటికి గర్భిణులు 1495, బాలింతలు 1568, సున్నా నుంచి 6 నెలల పిల్లలు 1568, ఐదేళ్లలోపు వారు 10515 మంది ఉండేవారు. అరుుతే తొమ్మిది నెలలకే పిల్లల సంఖ్యలో 1100 మంది తగ్గుదల కన్పిస్తుంది. ఇంత భారీగా తగ్గుదల ఉండటంతో కార్యకర్తలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడ ఉందా అని ఆరా తీస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు పంపడం లేదని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే.. మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు రికార్డుల్లో ఉంటున్నారే తప్పా కేంద్రాలకు హాజరు అంతంతగానే ఉంటుంద నే విమర్శలు వస్తున్నారుు.
గ్రామీణ ప్రాంతా ల్లో కూడా కాన్మెంట్ చదువుల సంస్కృతి పెరుగుతుండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఆదరణ తగ్గుతోందని పలువురు భావిస్తున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో కార్యకర్తల పనితీరు సరిగ్గా లేదనే ఆరోపణలు ఉన్నారుు. వీరి పనితీరును సరిచేయాల్సిన అధికారులు కూ డా బాధ్యతగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నరసన్నపేట మండలం కొల్లవానిపేట కార్యకర్త రెండేళ్లుగా విధులకు రాకపోయినా ఆ స్థానంలో ఇప్పటికీ కొత్త వారిని నియమించడంలేదు. కనీసం ఈ స్థానం ఖాళీ గా ఉన్నట్టు కూడా చెప్పడం లేదు. అలాగే మాకివలస, మడపాం, కంబకాయల్లో కార్యకర్తల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. మరో పక్క పలు గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే పారిశుద్ధ్యం క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమౌతారోననే భయంతో కేంద్రాలకు పంపడం లేదు.