!['Nutrition monitoring software helping in monitoring anganwadi staff's work' - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/26/icds.jpg.webp?itok=0eEFW0Tx)
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్‌వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్‌వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్‌వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్‌వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment