CAS
-
వినేశ్‌కు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకుంది. స్వర్ణపతక పోరుకు ముందు అనర్హతకు గురై అప్పీల్‌కు వెళ్లిన ఆమె ఇన్నాళ్లూ పారిస్‌లోనే ఉండిపోయింది. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. ఫైనల్లో ఓడినా కనీసం రజతం ఖాయం అనుకోగా, అదీ చేజారిపోయింది. సంయుక్త రజతం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో వినేశ్ అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మద్దతుతో నిష్ణాతులైన లాయర్ల బృందం ఆమె కేసును వాదించింది. విచారణ తదుపరి వాయిదాల అనంతరం చివరకు భారత రెజ్లర్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో భారత్‌కు పయనమైన వినేశ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డోలు బాజాలు, భాంగ్రా నృత్యాల మధ్య ఆమె బయటకు వచ్చింది. వినేశ్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా ఆమె వెంట ఉన్నాడు. ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, పోటెత్తిన అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది గమనించిన సాక్షి, బజరంగ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అనంతరం తేరుకొని వినమ్రంగా చేతులు జోడించి ‘యావత్ దేశానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది. పెద్ద సంఖ్యలో అభిమానులంతా తమ వాహనాల్లో వినేశ్‌ను ఆమె స్వగ్రామం బలాలి (హరియాణా) చేరే వరకు అనుసరించారు. దీంతో ఈ 135 కిలో మీటర్ల మార్గమంతా వీఐపీ కాన్వాయ్‌ని తలపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన మాజీ షూటర్ గగన్ నారంగ్ కూడా శనివారం ఆమెతో పాటు స్వదేశం చేరుకున్నారు. ఆమెతో పారిస్‌లో దిగిన ఫొటోని ‘ఎక్స్’లో షేర్ చేస్తూ వినేశ్ నిజమైన చాంపియన్‌గా అభివర్ణించారు.‘క్రీడా గ్రామంలో తొలి రోజే ఆమె చాంపియన్‌గా అడుగుపెట్టింది. అనర్హతకు గురైనా ఇప్పటికీ ఆమెనే చాంపియన్. పతకాలు, విజయాలే కాదు... కొన్నిసార్లు పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినేశ్ కనబరిచింది కూడా అదే! యువతరానికి ప్రేరణగా నిలిచిన ఆమెకు నా సెల్యూట్’ అని నారంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వినేశ్ కోసం ఢిల్లీలో, తమ స్వగ్రామంలో ఎదురు చూసిన అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారని సోదరుడు హర్విందర్ ఫొగాట్ చెప్పాడు. ‘ఒలింపిక్స్ నిర్వాహకులు నాకు పతకం ఇవ్వకపోతేనేమి. ఇక్కడి ప్రజలంత ఎంతో ప్రేమ, గౌరవం అందించారు. నాకు ఇది 1000 ఒలింపిక్ పతకాలతో సమానం’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. -
వినేశ్‌కు చుక్కెదురు
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో అసమాన పోరాటంతో ఫైనల్‌కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది. పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్‌ను సీఏఎస్ అడ్హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్‌కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా? కష్ట కాలంలో వినేశ్‌కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు. -
మూడు రోజుల తర్వాత... సీఏఎస్ తీర్పు మళ్లీ వాయిదా
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకం కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు పతకం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మంగళవారం రావాల్సిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మరోసారి వాయిదా పడింది. దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 16న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వస్తుంది. 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైన వినేశ్ తాను అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరాను కాబట్టి తనకు సంయుక్తంగా రజత పతకం అందించాలని సీఏఎస్‌ను ఆశ్రయించింది. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం వరకు పారిస్ క్రీడాగ్రామంలోనే ఉన్న వినేశ్ అక్కడి నుంచి బయలుదేరి మంగళవారమే భారత్‌కు చేరుకుంది. -
నేను అలసిపోయాను!
‘‘అమ్మలాంటి రెజ్లింగ్ నా మీద గెలిచింది. నేనేమో ఓడిపోయాను. దయచేసి... మీరంతా నన్ను క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి. ఇకపై నాకు పోరాడే శక్తి లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001–2024. నన్ను అభిమానించిన, మద్దతు తెలిపిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడే ఉంటాను’’... కుస్తీనే లోకంగా, ఒలింపిక్స్ పతకమే ధ్యేయంగా ఎదిగి... ఇంటా బయటా క్రీడ, క్రీడేతర శక్తులతో పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో మళ్లీ మన గుండెల్ని బరువెక్కించింది. పారిస్: సెమీస్‌లో గెలిచి... ఫైనల్‌కు ముందు 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ మ్యాట్‌పైకి దిగే ఉద్దేశం లేదని ప్రకటించింది. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని గురువారం 29 ఏళ్ల వినేశ్ వెల్లడించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) అప్పీలుకు సైతం వెళ్లిన ఆమె తీర్పు వెలువడక ముందే అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలసిపోయిన తనకు ఇకపై కుస్తీలో ప్రత్యర్థులను పట్టుపట్టే బలం లేదంటూ గురువారం సోషల్ మీడియా వేదికగా గుడ్‌బై చెప్పింది. ఊహించని ఆమె నిర్ణయానికి భారత క్రీడాలోకం నిర్ఘాంతపోయింది. ఆమెను పోరాట యోధురాలిగా చూసిన క్రీడాకారులంతా వారిస్తున్నారు. ఆమెను అభిమానించే వారంతా రెజ్లర్ అధైర్యపడొద్దని వేడుకొంటున్నారు. తల్లిలాంటి రెజ్లింగ్‌పై తన ఉక్కు సంకల్పం సడలించవద్దని అదేపనిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వినేశ్ పెదనాన్న ద్రోణాచార్య అవార్డీ, కోచ్ మహావీర్ ఫొగాట్ మాట్లాడుతూ భారత్‌కు చేరగానే తనతో మాట్లాడి వీడ్కోలు నిర్ణయాన్ని విరమించుకునేలా చేస్తానని తెలిపారు. ‘నేను బజరంగ్ పూనియా, గీత కలిసి కూర్చొని అమెతో మాట్లాడతాం. అంతా కలిసి ఆమెకు నచ్చజెబుతాం. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం లక్ష్య నిర్దేశం చేస్తాం’ అని మహావీర్ అన్నారు. వినేశ్ పోటీపడ్డ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సారా హిల్డర్బ్రంట్ (అమెరికా) మాట్లాడుతూ ‘వినేశ్ అనర్హతకు గురవడం బాధాకరం. బరువు తగ్గడం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అమె కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని పేర్కొంది. కల కాదు... ఆమెకు ఒలింపిక్స్ ఓ పీడకల! ప్రపంచ చాంపియన్íÙప్లు, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మంచి రికార్డే ఉన్న వినేశ్‌కు ఏ ఒలింపిక్స్ కూడా అచ్చి రాలేదు. అందుకే ఆమె కెరీర్లో ఒలింపిక్స్ కల కాదు ఓ పీడకలగా మిగిలిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కీలకమైన క్వార్టర్ ఫైనల్ బౌట్లో గాయం వల్ల ముందంజ వేయలేకపోయింది. మళ్లీ ఐదేళ్ల (కోవిడ్ వల్ల 2021లో) తర్వాత టోక్యో విశ్వక్రీడల్లో క్వార్టర్స్‌లోనే ఓటమితో ని్రష్కమించింది. ఇప్పుడు మూడేళ్లకే జరిగిన పారిస్ ఈవెంట్లో కనీసం ఖాయమనుకున్న రజతాన్ని అనర్హత వేటు అవహేళన చేసింది. క్రీడ అనేది మానవ సంకల్పానికి వేడుకలాంటింది. నా కెరీర్లో ఇలాంటి సందర్భాల్ని, వేడుకల్ని చాలాసార్లు చవిచూశాను. వినేశ్ సంకల్పానికి దేశం ఒక్కటై పలికిన జేజేలను మాత్రం ఎప్పుడూ చూడలేదు. పట్టు సడలించని ఆమె సంకల్పాన్ని జాతి యావత్తు వేడుక చేసుకుంటోంది. –అభినవ్ బింద్రా, షూటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత క్రీడాకారులు జీవితమంతా సవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. కలను నెరవేర్చుకునే రోజు నైపుణ్యంతో రాణిస్తే విజయం చేకూరుతుంది. కానీ ఊహకందని ఈ పొరపాట్లు (స్వల్ప బరువుతో అనర్హత) జరిగితే మాత్రం ఎవరికైనా గుండె బద్దలవుతుంది. –కేంద్ర క్రీడల మాజీ మంత్రి, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్ మేమంతా వినేశ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. కఠోర సాధనతో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో స్వర్ణం గెలిచి మా పిన్ని (వినేశ్ తల్లి), మా నాన్న మహావీర్ కలల్ని సాకారం చేసుకుంటుంది. ఇంటికొచ్చాక నాన్న ఆమెతో మాట్లాడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. –మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ వినేశ్... అంతపని (రిటైర్మెంట్) చేయొద్దు. బాధలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తగదు. నేను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తరఫున ఆమె వీడ్కోలుకు బై చెప్పి ఎప్పట్లాగే బౌట్లో సత్తాచాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. –డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వినేశ్ ప్రొఫైల్ -
భారత అథ్లెట్ గోమతి అప్పీల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ గోమతి మరిముత్తుకు చుక్కెదురైంది. డోపింగ్‌కు పాల్పడినందుకు గోమతిపై 2019లో నాలుగేళ్ల నిషేధం పడింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె సీఏఎస్‌ను ఆశ్రయించింది. 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగులో గోమతి స్వర్ణం గెలవగా... ఆ తర్వాత ఆమె డోపింగ్‌లో పట్టుబడటంతో వరల్డ్ అథ్లెటిక్స్ డిసిప్లినరీ ట్రిబ్యునల్ నాలుగేళ్ల నిషేధం విధించింది. తాను పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడుతుండటంతో పాటు గర్భస్రావం జరిగిన కారణంగా శరీరంలో 19–నోరాన్డ్రోస్టిరోన్ ఎక్కువగా కనిపించిందని, సరైన రీతిలో పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆమె తన అప్పీల్లో పేర్కొనగా... ఆర్బిట్రేటర్ జాన్ పాల్సన్ దానిని త్రోసి పుచ్చి నిషేధం కొనసాగుతుందని తీర్పునిచ్చారు. -
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు ఊరట
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఉమర్ అక్మల్‌కు ఊరట లభించింది. పీసీబీ అతనిపై విధించిన బ్యాన్‌ను కోర్ట్ ఆప్ ఆర్బిర్టేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) 12 నెలలకు తగ్గించడంతో పాటు రూ. 42 లక్షల జరిమానా విధించింది. అయితే పీసీబీ యాంటీ కరప్షన్ కోడ్ నిర్వహించే రీహాబిటేషన్ సెషన్లో పాల్గొన్న తర్వాతే ఉమర్ అక్మల్‌ను క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇస్తామని పీసీబీ తెలిపింది. తాజాగా విధించిన 12 నెలల నిషేధం ఉమర్ అక్మల్ ఇప్పటికే పూర్తి చేసి ఉండడంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. కాగా ఉమర్ అక్మల్ 2019 అక్టోబర్‌లో పాక్ తరపున చివరి వన్డే ఆడాడు. ఇప్పటివరకు పాక్ తరపున అక్మల్ 121 వన్డేల్లో 3194 పరుగులు, 84 టీ20ల్లో 1690 పరుగులు సాధించాడు. అక్మల్ ప్రస్తుతం 30ఏళ్ల వయసులో ఉన్న అక్మల్ తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తే మరో 5నుంచి 6ఏళ్ల పాటు ఆడే అవకాశం ఉంది. 2019లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్‌పై ఏప్రిల్‌లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ జూలై 2020లో సీఏఎస్కు అప్పీల్ చేయగా.. అప్పట్లో కోర్టు 18 నెలలకు కుదించింది. తాజాగా అక్మల్ అభ్యర్థనను మరోసారి పరిగణలోకి తీసుకొన్న సీఏఎస్ నిషేధాన్ని 12 నెలలకు తగ్గించడంతో పాటు జరిమానా విధించింది. చదవండి: పాస్‌పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్ దూరం? స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
తెలంగాణ, ఏపీలో ‘పోషకాహార పర్యవేక్షణ’
న్యూఢిల్లీ: ‘చిన్నారులకు అంగన్వాడీలు అందజేస్తున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంచేందుకు ఏర్పాటు చేసిన కొత్త సాఫ్ట్వేర్ 7 రాష్ట్రాల్లో అమలవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా దాన్ని విస్తరిస్తాం. దీంతో 10 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్–కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (ఐసీడీఎస్–సీఏఎస్) మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్‌లోని 57 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా నూట్రిషన్ ప్రొఫైల్ తయారు చేసేందుకు, శాశ్వత ప్రాతిపాదికన పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు ఈ సాఫ్ట్వేర్ సాయపడుతుంది. చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని అంగన్వాడీలు ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. -
నల్లధనం వెలికితీతకూ GST
-
సీఏఎస్కు 11 ప్రాజెక్టులు సిద్ధం
ఒంగోలు టౌన్: జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఏప్రిల్ 1 నుంచి కామన్ అప్లికేషన్ స్టాఫ్‌వేర్ (సీఏఎస్) విధానాన్ని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 2155 మంది అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా తయారుచేశారు. సీఏఎస్ విధానం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షణాల్లో తెలుసుకునే వీలుంటుంది. సీడీపీఓ మొదలుకొని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలోని ఉన్నతాధికారులు సైతం ఆ అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులను తెలుసుకొని మానిటరింగ్ చేయనున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు పరిధిలో తొలి విడతగా ఒంగోలు అర్బన్, కొండపి, కందుకూరు అర్బన్, మార్కాపురం అర్బన్, వేటపాలెం, పరుచూరు, కొరిశపాడు, సంతమాగులూరు, కనిగిరి, పొదిలి, గిద్దలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో సీఏఎస్ విధానాన్ని అమలు చేయనున్నారు. 10 రకాల రిజిస్టర్లకు ఫుల్స్టాప్: అంగన్వాడీ కేంద్రాల్లో సంబంధిత కార్యకర్తలు పదకొండు రకాల రిజిస్టర్లు నిర్వహిస్తుంటారు. చిన్నారుల హాజరు శాతం దగ్గర నుంచి లబ్ధిదారులకు అందించే పోషకాహారం వరకు ప్రతిదానికి సంబంధించి ఒక రిజిస్టర్ నిర్వహిస్తుంటారు. ఆ రిజిస్టర్లో రోజువారీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తూ ఉంటారు. అయితే నూతనంగా 11 ప్రాజెక్టుల్లో అమలు చేయనున్న సీఏఎస్ విధానంతో పదిరకాల రిజిస్టర్లకు ఫుల్స్టాప్ పెట్టనున్నారు. లబ్ధిదారులకు అందించే పోషకాహార రిజిస్టర్‌ను మాత్రం యధావిధిగా కొనసాగిస్తుంటారు. రాష్ట్రాల వారీగా రకరకాల పోషకాహారం అందిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క రిజిస్టర్‌ను మాత్రం ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు యధావిధిగా నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమశాఖ కేంద్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికే.. సీఏఎస్ విధానం అమలులోకి వచ్చిన తరువాత అంగన్వాడీలు నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పర్యవేక్షణను సెక్టార్ సూపర్వైజర్ మొదలుకొని ప్రాజెక్టు డైరెక్టర్ వరకు చూస్తూ వచ్చారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తూ ఎక్కడైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే వారికి హెచ్చరికలు జారీ చేయడం, అప్పటికీ మాట వినకుంటే మెమోలు జారీ చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి. సీఏఎస్ విధానం అమలులోకి వచ్చిన తరువాత సంబంధిత కేంద్రాలను రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఎన్ని గంటలకు తెరుస్తున్నారు. ఆ కేంద్రంలో మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు ఎంతమంది నమోదై ఉన్నారు? రోజువారీగా ఎంతమంది హాజరవుతున్నారు? గర్భిణులు, బాలింతలు ఎంతమంది ఉన్నారు? వారిలో ఎంతమందికి పోషకాహారం అందిస్తున్నారు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌కు జీపీఎస్‌ను అనుసంధానం చేస్తుండటంతో వాటికి సంబంధించిన యాప్‌ను తెరిచిన వెంటనే క్షణాల్లో డేటా వివరాలు ప్రత్యక్షం అవుతాయి. నేడు బ్లాక్ కో ఆర్డినేటర్లకు శిక్షణ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్న సీఏఎస్ విధానంపై ఇటీవల నూతనంగా నియమితులైన బ్లాక్ కో ఆర్డినేటర్లకు మంగళవారం రాష్ట్ర డైరెక్టరేట్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు శిక్షణ ఇచ్చారు. సీఏఎస్ విధానం గురించి బ్లాక్ కో ఆర్డినేటర్లు శిక్షణ పొందిన అనంతరం జిల్లాలోని 2155 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి స్మార్ట్ ఫోన్లను కూడా వారికి అందించ నున్నారు. శిక్షణ పొందిన బ్లాక్ కో ఆర్డినేటర్లు ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ కార్యకర్తలకు సీఏఎస్ విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను నెలాఖరుకల్లా పూర్తిచేసి ఏప్రిల్ 1 నుంచి సీఏఎస్‌ను అమలు చేయనున్నారు. -
సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లేనా?
జ్యూరిచ్:అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిపా)లో భారీ అవినీతికి పాల్పడి ఆరేళ్ల పాటు నిషేధానికి గురైన మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కథ ముగిసినట్లే కనబడుతోంది. తన ఆరేళ్ల నిషేధాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై బ్లాటర్‌కు చుక్కెదురైంది. ఆ పిటిషన్‌ను కోర్టు సోమవారం తిరస్కరించడంతో బ్లాటర్ ఇక మళ్లీ ఫిఫాలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఈ మేరకు సోమవారం విచారించిన కోర్టు..బాట్లర్ నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టిపారేసింది. దాదాపు 12 కోట్ల రూపాయిలను(2 మిలియన్ డాలర్లు)ను యూఈఎఫ్ఏ అధ్యక్షుడు ప్లాటినీ ఖాతాలోకి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని చర్యగా కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా, ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని బ్లాటర్ స్పష్టం చేశాడు. కాగా, ఆ తీర్పును స్విస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఉద్దేశం కూడా లేదని తెలిపాడు. దాంతోపాటు తాను ఏ తప్పు చేయలేదనే వాదనకు బ్లాటర్ కట్టుబడ్డాడు. సుమారు 41 ఏళ్ల ఫిఫా అనుభవం తన సొంతమని బ్లాటర్ పేర్కొన్నాడు.సాకర్ గేమ్‌లో అనేక విజయాలను చూసిన తనకు, అపజయాలను కూడా చూశానంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. పదిహేడు సంవత్సరాలకు పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసించిన ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ను ఇటీవల ఫిఫా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎనిమిదేళ్ల పాటు అతనిపై నిషేధం విధిస్తూ ఫిఫా నిర్ణయం తీసుకుంది. దాన్ని కోర్టులో సవాల్ చేయడంతో బ్లాట్లర్ నిషేధం ఆరేళ్లకు తగ్గింది. మరోసారి తన నిషేధాన్ని సవాల్ చేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించినా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. ప్రస్తుతం బ్లాటర్ లేటు వయసులో ఉండటం ఒక కారణమైతే, ఆరేళ్ల తరువాత పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. దీంతో బ్లాటర్ కు ఫిఫాతో ఉన్న బంధం-అనుబంధం ముగిసిందనే చెప్పొచ్చు. -
నా కెరీర్ ముగిసిపోయినట్లే!
న్యూఢిల్లీ: తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని మరొకసారి సమీక్షించకపోతే ఇక కెరీర్ ముగిసిపోయినట్లేనని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భారత దేశం జోక్యం చేసుకోవాలని నర్సింగ్ పేర్కొన్నాడు. 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పును పునఃసమీక్షించకపోతే నా కెరీర్ ముగిసినట్లే. ఈ నిషేధం అనేది కేవలం నా ఒక్కడికే పరిమితం కాదు.. యావత్ దేశానికే సంబంధించింది. నా కేసును సమీక్షించడానికి దేశంలోని పెద్దలు చొరవచూపకపోతే ఒక అమాయకుడు బలవుతాడు' అని నర్సింగ్ తెలిపాడు. ఈ డోపింగ్ ఉదంతంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని నర్సింగ్ మరోసారి పునరుద్ఘాటించాడు. జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు. కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా సవాల్ చేయడం, ఆపై నర్సింగ్ పై నిషేధం పడటంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
'ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ తీసుకున్నాడు'
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువసార్లు నిషేధిత డ్రగ్స్ టాబ్లెట్ రూపంలో నోటి ద్వారా తీసుకున్నాడని వెల్లడించింది. తనపై కుట్ర జరిగిందని ఆరోపించిన నర్సింగ్ ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యాడని తెలిపింది. అతడి నుంచి సేకరించిన అన్ని నమూనాలను క్షుణ్ణంగా పరిక్షించినట్టు వెల్లడించింది. అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్టు జూన్ 25 నిర్వహించిన డోపింగ్ టెస్టులో వెల్లడైందని గుర్తు చేసింది. ఒకటి లేదా రెండు మెథాన్డీనోన్ టాబ్లెట్లు నోటి తీసుకున్నట్టు తేలిందని, దీన్ని నీటిలో కలిపి తీసుకున్నట్టు నిర్థారణ కాలేదన్నారు. అయితే తన మంచినీళ్ల సీసాలో ఎవరో నిషేధిత పదార్థాలు కలిపారని, తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని నర్సింగ్ యాదవ్ అంతకుముందుకు అన్నాడు. దీనికి ఆధారాలు సమర్పించడంలో విఫలమవడంతో అతడిపై సీఏఎస్ నాలుగేళ్ల నిషేధం విధించింది. దీంతో అతడు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. -
'నా కలను క్రూరంగా చిదిమేశారు'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలను క్రూరంగా చిదిమేశారని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తనపై నాలుగేళ్ల నిషేధం విధించడం పట్ల అతడు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు. 'ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు రెండు నెలలుగా ఎంతో శ్రమించాను. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశ గౌరవాన్ని నిలబెట్టాలని నిరంతరం తపించాను. రియో ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించి పెట్టాలన్నది నా కల. బౌట్ లో దిగడానికి 12 గంటల ముందు నాపై నిషేధం విధించి నా కలను దారుణంగా చిదిమేశార'ని నర్సింగ్ వాపోయాడు. తన నిర్దోషత్వం నిరూపించుకోవడానికి చేయాల్సిదంతా చేస్తానని, పోరాటం కొనసాగిస్తానని ఒక ప్రకటనలో తెలిపాడు. నర్సింగ్ అమాయకుడని, అతడి న్యాయ పోరాటానికి అండగా ఉంటామని స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్ తెలిపింది. -
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
-
నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం
రియో డి జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ రోజు జరగనున్న పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో 'వాడా' సవాల్ చేసింది. కుట్ర కారణంగానే అతడు డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది. రియో ఒలింపిక్స తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. సీఏఎస్ తీర్పు దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆటగాడిపై చివరి నిమిషంలో నిషేధం విధించడం పట్ల డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బీబీ శరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కోర్టులో రష్యా స్విమ్మర్లు సవాల్
మాస్కో:రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో ఇద్దరు రష్యా స్మిమ్లర్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్)లో అప్పీల్ చేశారు. ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ (ఫినా) తమను తగిన కారణాలు లేకుండా రియో ఒలింపిక్స్ నిషేధం విధించిందని పేర్కొంటూ వ్లాదిమిర్ మొరొజోవ్, నిఖిత లోబింట్సెవ్లు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సీఏఎస్ లో పిటిషన్ దాఖలు చేసినట్లు వారి న్యాయవాది అర్టోమ్ పాత్సేవ్ స్పష్టం చేశారు. రష్యా స్మిమర్ల జట్టులో భాగంగా రియోకు వెళ్లే వారిలో వ్లాదిమిర్, నిఖితలకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నివేదిక ఆధారంగా వీరిపై నిషేధం విధిస్తూ ఫినా నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేసిన ఆ ఇద్దరు స్విమ్మర్లు .. తమపై నిషేధం అన్యాయమంటూ వారు కోర్టుకు వెళ్లారు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్, తొమ్మిది సార్లు యూరోపియన్ చాంపియన్ అయిన వ్లాదిమిర్.. గత లండన్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ లో కాంస్య పతకం గెలిచాడు. మరోవైపు లోబింట్సెవ్ 2012 లండన్ ఒలింపిక్స్ లో 4x100 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకోగా, 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 4x200 మీటర్ల ఫ్రీ స్టయిల్ లో రజతం సాధించాడు. ఈనెల 24వ తేదీన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశంలో రష్యా కు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుపై పూర్తిగా నిషేధించకుండా క్రీడాకారులు డోపింగ్ రికార్డు ఆధారంగా రియో భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఐఓసీ సిద్ధమైంది. అయితే ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల వద్ద నుంచి రష్యా అథ్లెట్లు క్లియరెన్స్ తెచ్చుకున్న తరువాతే వారు అర్హత పొందుతారని పేర్కొంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ 117 రష్యన్ అథ్లెట్లపై నిషేధం పడింది. వీరిలో 67 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉండటం గమనార్హం.