వినేశ్ కేసు మరోసారి వాయిదా
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకం కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు పతకం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మంగళవారం రావాల్సిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మరోసారి వాయిదా పడింది. దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 16న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వస్తుంది.
50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైన వినేశ్ తాను అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరాను కాబట్టి తనకు సంయుక్తంగా రజత పతకం అందించాలని సీఏఎస్‌ను ఆశ్రయించింది. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం వరకు పారిస్ క్రీడాగ్రామంలోనే ఉన్న వినేశ్ అక్కడి నుంచి బయలుదేరి మంగళవారమే భారత్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment