Judgment Postpone
-
Supreme Court: బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వడమంటే హైకోర్టును తక్కువ చేయడం కాదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిలు పిటిషన్‌పై విచారణలో భాగంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వి, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. తొలుత ఎస్వీ రాజు వాదనలు ప్రారంభిస్తూ... ఈ అంశాన్ని తొలుత ట్రయల్ కోర్టు విచారించాలని కోరారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల బెయిల్ ప్రస్తావన తీసుకొస్తూ....బెయిల్ మంజూరుకు ట్రయల్ కోర్టుకు వెళ్లమనడం సరికాదని సింఘ్వి పేర్కొన్నారు. బెయిల్ కోసం మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడం వైకుంఠపాళి ఆటలా ఉంటుందని సిసోడియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై ఎస్వీ రాజు అభ్యంతరం చెబుతూ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారని కేజ్రీవాల్ కూడా పద్ధతి ప్రకారం వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టును బైపాస్ చేయడం కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరుగుతుందని ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం తప్ప ఇంకేం లేదని రాజు తెలిపారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ నేరుగా హైకోర్టుకు వెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, సీబీఐ వైకుంఠపాళి ఆట ఆడాలని చూస్తోందని సింఘ్వి ఆరోపించారు. సుప్రీంకోర్టు ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు నైతికస్థైర్యాన్ని అది దెబ్బతీస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అన్నారు. ‘అలా అనకండి. బెయిల్ ఇస్తే హైకోర్టును తక్కువ చేసినట్లు కాదు. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా హైకోర్టుకు భంగం కలగనివ్వం’ అని ధర్మాసనం రాజుకు హామీ ఇచ్చింది. అనంతరం తీర్పు రిజర్వుచేస్తున్నట్లు ప్రకటించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
మూడు రోజుల తర్వాత... సీఏఎస్ తీర్పు మళ్లీ వాయిదా
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకం కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు పతకం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మంగళవారం రావాల్సిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మరోసారి వాయిదా పడింది. దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 16న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వస్తుంది. 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైన వినేశ్ తాను అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరాను కాబట్టి తనకు సంయుక్తంగా రజత పతకం అందించాలని సీఏఎస్‌ను ఆశ్రయించింది. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం వరకు పారిస్ క్రీడాగ్రామంలోనే ఉన్న వినేశ్ అక్కడి నుంచి బయలుదేరి మంగళవారమే భారత్‌కు చేరుకుంది. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. -
వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: గర్భ విచ్చిత్తికి సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్ బుధవారం భిన్న తీర్పుల్ని వెలువరించింది ఒక వివాహిత గర్భం దాలి్చన 26 వారాలకు గర్భవిచ్చిత్తి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్ ఇచి్చన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్ హిమ కొహ్లి పిండం గుండె ఆపేయాలని ఏ కోర్టు అయినా ఎందుకు చెబుతుందని ప్రశి్నస్తూ గర్భవిచ్ఛిత్తికి నిరాకరించారు. సుప్రీం బెంచ్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న దాంతో విభేదించారు. మహిళ నిర్ణయాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. వివరాల్లోకి వెళితే........ ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత మూడోసారి గర్భం దాల్చింది. అప్పటికే కుంగుబాటు సమస్యతో బాధపడుతున్న ఆమె మానసికంగా, ఆర్థికంగా తాను మరో పిల్లని పెంచడానికి సంసిద్ధంగా లేనని, అందుకే గర్భవిచ్చిత్తికి అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గర్భం దాల్చి 26 వారాల కావడంతో ఎయిమ్స్‌లో వైద్యులు ఆమెని పరీక్షించి అబార్షన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అక్టోబర్ 6న నివేదిక కూడా ఇచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ అక్టోబర్ 9న తీర్పు చెప్పింది.ఆ మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ వైద్యాధికారుల్ని ఆదేశించింది. అబార్షన్‌కు ముందు ఎయిమ్స్ డాక్టర్లు ఆమెని పరీక్షించి గర్భవిచ్చిన్నం చేసినా శిశువు సజీవంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరో నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గర్భవిచ్చిత్తి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అక్టోబర్ 10న మరో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా బుధవారం ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ తొలుత ఎయిమ్స్‌లో మరో వైద్య బృందం గర్భవిచ్చిత్తి వల్ల వచ్చే ప్రమాదేమేమీ లేదని ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబర్ 6 న అబార్షన్‌కు ప్రమాదం లేదని వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు ? ఎందుకు ఆ దాపరికం ? నాలుగు రోజుల్లోనే ఎలా పరిస్థితి మారింది ? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గర్భ విచ్చిన్నం చేసినా శిశువు బతికే ఉంటుందని అంటే ఏ కోర్టు అయినా పిండం గుండె ఆపేయమని ఎందుకు చెబుతుంది ? అంటూ జస్టిస్ హిమాకొహ్లీ ప్రశ్నించారు. నా వరకు నేనైతే అలాంటి పని చేయలేనన్న జస్టిస్ హిమ గర్భవిచ్చిత్తికి నిరాకరించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుని ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ మహిళ గర్భం తీసివేయడం పట్ల సుముఖంగా ఉన్నందున ఆమె నిర్ణయాన్ని గౌరవించాలంటూ గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ తీర్పు చెప్పారు. ఆ మహిళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు ఆమె శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా గర్భవిచ్చిత్తి చేయడమే సరైనదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు పరిశీలనకు సిఫారసు చేశారు. -
బాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీవల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. పలు కేసులు ఒకే పోలీస్టేషన్లో నమోదై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్ (అన్నీ కేసుల్లో అరెస్ట్ అయినట్లు) అరెస్ట్ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్ అరెస్ట్ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్ అరెస్ట్ అయితే పీటీ వారెంట్‌తో పనేముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగిందన్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని ఆయన కోరారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్ పిటిషన్ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైందని చెప్పారు. -
మెడికల్ సీట్ల కేటాయింపు వివాదంపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు వివాదంపై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు కానున్నాయి. ఈ మేరకు జూలై 3న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకుముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. అన్ రిజర్వుడులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీపడేవారు. ప్రభుత్వ తాజా జీవోతో అన్ రిజర్వుడు అనేది ఉండదు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో నంబర్ 72 చట్టవిరుద్ధమని, దానిని కొట్టివేయడంతో పాటు కౌన్సెలింగ్‌లో పాత విధానాన్నే అనుసరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, వర్సిటీ తరఫు న్యాయవాది ప్రభాకర్‌రా వు వాదనలు వినిపించారు. పునర్వ్యవస్థీకరణ చట్టానికి, రాజ్యాంగానికి ప్రభుత్వ నిర్ణ యం వ్యతిరేకం కాదని చెప్పారు. విభజనకు ముందు ఉన్న కాలేజీల్లో ఏపీ విద్యార్థుల కు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. కొత్త కాలేజీల్లోని సీట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
సామాజిక న్యాయమే పరమావధి
సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని కంటే కూడా పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. తమది సామాజిక న్యాయమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా, గత ప్రభుత్వం మాత్రం ధనికుల కోసం ని ర్మిస్తున్న రాజధానిలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమలు చేయలేదని తెలిపింది. కేవలం 44 ఎకరాలను మాత్రమే పేదల కోసం కేటాయించిందని, అలాంటి తప్పిదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఆర్డీఏ చట్టాన్ని సవరించి.. మాస్టర్ ప్లాన్‌లో ఆర్ 5 జోన్‌ను సృష్టించామని చెప్పింది. ‘ఈ జోన్లో పేదలకు 1,134 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ భూమిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచాలని నిర్ణయించాం. ఇది ఓర్వలేని గత ప్రభుత్వ పెద్దలు హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపమన్నట్లు ప్రభుత్వ తీరును అమరావతి రైతుల పేరుతో తప్పు పడుతున్నారు. సీఆర్డీఏ నుంచి ఈ 1,134 ఎకరాలను రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల సీఆర్డీఏకు రూ.1,100 కోట్లపైగా మొత్తం సమకూరుతుంది. సీఆర్డీఏకు డబ్బు వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు. అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలివ్వొద్దు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 45 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు రకరకాల ఎత్తుగడలతో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ అనుబంధ వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పేదలకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమీ లేదు.. పిటిషనర్ల తరఫున తొలుత దేవ్‌దత్ కామత్ వాదనలు వినిపిస్తూ.. పేదలకు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మిన్ను విరిగి మీద పడదన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ వద్ద ల్యాండ్ బ్యాంక్ ఉందని, అందులో నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. మరో సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ, మాస్టర్ ప్లాన్‌లో చాలా మార్పులు చేశారన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. సీఆర్డీఏ ప్రతిపాదనలను రైతులు గ్రామ సభల్లో తిరస్కరించారని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అనుమోలు జ్యోతిరత్న వివరించారు. అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాండవుల కోసం శ్రీకృష్ణుడు ఉన్నట్లు పేదల కోసం జగన్ ఉన్నారన్నారు. పేదల నివాసానికి కనీసం 5 శాతం భూములు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా ఉండగా, మాస్టర్ ప్లాన్‌లో మాత్రం దానికి స్థానం కల్పించలేదన్నారు. ఈ తప్పును సరిదిద్ది చట్ట ప్రకారం పేదల నివాసం కోసం 5 శాతం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్ధిష్టంగా ఫలానా చోటే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేక హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు, మళ్లీ హైకోర్టు.. అడ్డుకునేందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకెళ్లగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందంటూ రైతులను నిలదీసిందని, దీంతో వాళ్లు అక్కడ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిందని, అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి చేయకుంటే చేయలేదంటున్నారని, చేస్తుంటే ఎలా చేస్తారంటూ కోర్టులకెక్కుతున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. నవ్వుల పువ్వులు హైకోర్టులో న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు లేవని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఓ పెద్ద మనిషి తనపై క్రిమినల్ కేసు నమోదు కాగానే భయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి మార్చారని తెలిపారు. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వదులుకుని అందరూ హడావుడిగా అమరావతికి వచ్చారన్నారు. దాని పర్యవసానమే సౌకర్యాల కొరత అని వివరించారు. ‘ఆ కోట్ల రూపాయల కోసమే అందరూ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళుతున్నారా? అంటూ ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. -
హిజాబ్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టులో నమోదైన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. విద్యాసంస్థల్లో నిర్దేశిత యూనిఫాం మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గత 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించి శుక్రవారం పూర్తి చేసింది. తుది తీర్పును వాయిదా(రిజర్వ్) వేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. హిజాబ్‌ను నిరాకరించేందుకు కాలేజీ అభివృద్ధి మండలికి(సీడీసీ) ఎలాంటి అధికారం లేదని అన్నారు. ప్రభుత్వం తన అధికారాలను సీడీసీకి అప్పగించడం సబబు కాదని తెలిపారు. వందల ఏళ్లుగా హిజాబ్ ధారణ కొనసాగుతోందని ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను పూర్తి చేసి, తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఇకపై ఏ న్యాయవాది అయినా అవసరమైతే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. -
‘వైద్య సీట్ల’ వివాదంపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల రిజర్వేషన్లకు చెందిన జీవో 550పై హైకోర్టులో వాదనలు ముగియడంతో తీర్పును తర్వా త వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. దీనిపై మంగళవారం వాదప్రతివాదనలు జరిగాయి. వాదనల సమయంలో చెప్పిన అంశాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికపై ఓపెన్ కేటగిరీ సీటు పొంది, ఆ తర్వాత ఆ సీటును వదిలేసుకుని రిజర్వుడ్ కోటా కింద మరో కాలేజీలో సీటు పొందినప్పుడు.. తొలుత వదులుకున్న సీటును రిజర్వుడ్ కేటగిరీ సామాజిక వర్గం అభ్యర్థితోనే భర్తీకి వీలుగా 2001 జూలై 30న అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 550 జారీ చేసింది. ఆ జీవోలోని క్లాజ్–2 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చి ంది. దాంతో ఇరు రాష్ట్రాల్లో ఖాళీ అయ్యే ఓపెన్ కేటగిరీ సీట్లను కాలేజీలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేస్తున్నాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయిం చారు. ఖాళీ అయిన సీటును రిజర్వుడ్ కేటగిరీ సామాజికవర్గం అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్లు 50 శాతానికి మించి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ఉల్లంఘన అవుతుందని, ఇది రాజ్యాంగంలోని 14, 15(1) అధికరణాలకు వ్యతిరేకమంటూ ఇతరులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులు స్పష్టం చేయలేదు.. ఉద్యోగాలను భర్తీ చేసేప్పుడు పాటించే రోస్టర్ విధానం ఈ సీట్ల భర్తీలో వర్తించదని ధర్మాసనం అభిప్రాయపడింది. పార్కులో పిల్లలు జారుడు బల్లపై జారిన పిల్ల వాడి గుర్తింపు ఆధారంగా ఆ తర్వాత ఎవరు జారుడు బల్లపై జారాలో నిర్ణయిస్తే ఎలాగని ప్రశ్నించింది. రిజర్వుడ్ అభ్యర్థి వదిలిన సీటును ఎవరితో భర్తీ చేయాలో ఇంతవరకూ కోర్టులు స్పష్టం చేయలేదని ధర్మాసనం పేర్కొంది. ఖాళీ అయిన సీటును తిరిగి అదే సామాజిక వర్గం అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయని వాదిస్తున్న వారు ఆధారాలు చూపడం లేదని ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. స్లైడింగ్ విధానంలో మెరిట్ సీటును రిజర్వుడ్ సామాజికవర్గం అభ్యర్థి వదిలితే తిరిగి అదే సామాజికవర్గంతో భర్తీ చేయాలని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. -
ఆశారాం కేసులో తీర్పు రిజర్వు
జోధ్‌పూర్: రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంపై తీర్పును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ కేసులో గత 5 నెలలుగా సాగుతున్న వాదనలు శనివారంతో ముగియగా జడ్జి తీర్పును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. రాజస్తాన్‌లోని మనాయి గ్రామం సమీపంలో ఆశారాం ఆశ్రమం ఉంది. ఆశారాం తనను రేప్ చేశారని అదే ఆశ్రమంలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 2012లో పోలీసులకు ఫిర్యాదుచేయడంతో 2013లో ఆశారాంను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉంటున్న ఆయనకు నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది. -
మోపిదేవి బెయిల్‌పై తీర్పు వాయిదా
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్‌పై నాంపల్లి సిబిఐ కోర్టులోవాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్నానని వైద్యం కోసం ఆరు నెలలు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెన్నెముక సమస్యతో తాను బాధపడుతున్నట్లు మోపిదేవి తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు పరీక్షించి ప్రత్యేక వైద్యం చేయించుకోవాలని సూచించారని తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు సూచించినట్లు కోర్టుకు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బెయిల్ ఇవ్వాలని కోరారు.