నర్సింగ్ యాదవ్‌ పై నాలుగేళ్ల నిషేధం | Rio Games: Narsingh Yadav's Olympic dream over after 4-year doping suspension | Sakshi
Sakshi News home page

నర్సింగ్ యాదవ్‌ పై నాలుగేళ్ల నిషేధం

Published Fri, Aug 19 2016 8:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

నర్సింగ్ యాదవ్‌ పై నాలుగేళ్ల నిషేధం

నర్సింగ్ యాదవ్‌ పై నాలుగేళ్ల నిషేధం

రియో డి జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ ఒలింపిక్స్ ఆశలపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నీళ్లు చల్లింది. అతడిపై నాలుగేళ్లు నిషేధం విధించింది. దీంతో చివరి నిమిషంలో ఒలింపిక్స్ నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. ఈ రోజు జరగనున్న పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్లో అతడు బరిలో దిగాల్సివుంది. డోపింగ్‌లో 'నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో 'వాడా'  సవాల్ చేసింది. కుట్ర కారణంగానే అతడు డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను సీఏఎస్ అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు సీఏఎస్ పేర్కొంది.

రియో ఒలింపిక్స తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ రెజ్లర్ జలీమ్ ఖాన్‌తో నర్సింగ్ పోటీపడాల్సివుంది. సీఏఎస్ తీర్పు దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆటగాడిపై చివరి నిమిషంలో నిషేధం విధించడం పట్ల డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బీబీ శరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement