Narasannapeta
-
పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా మాది చేనేత కుటుంబం. మా ఆయన అశ్వర్థ నారాయణ ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. మాకు ముగ్గురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మగ్గం నేతతోపాటు నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఒంట్లో సత్తువ తగ్గి బయట పనులకు వెళ్లలేకపోతున్నా. గతంలో కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ వచ్చేది. 2019లో జగన్ సీఎం అయ్యాక పెన్షన్ పెరిగింది. ఇపుడు రూ.3 వేలు వస్తోంది. చేనేత వృత్తిలో ఉండటంతో వలంటీరే ఇంటికొచ్చి మరీ వైఎస్సార్ నేతన్న నేస్తంలో నా పేరు నమోదు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కూడా వర్తించింది. రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు అందుకున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాకు కొండంత భరోసానిచ్చాయి. నాలాంటి ఒంటరి మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా, సంతోషంగా బతికే ధైర్యాన్నిస్తున్నాయి. – శిరివెల్ల లక్ష్మీదేవి, జమ్మలమడుగు (నాయబ్ అబ్దుల్ బషీర్, విలేకరి, జమ్మలమడుగు) 30 ఏళ్ల కల నెరవేరింది కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం నుంచి నరసన్నపేట మండలం ఉర్లాంకు 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. కొన్నాళ్లకు మా ఆయన కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకుని చదివిస్తూ, షాపుల్లో పని చేస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించాను. గతంలో ఉన్న ప్రభుత్వాలకు పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనే స్తోమత లేక అద్దెలు చెల్లిస్తూ జీవనం కొనసాగించాం. జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా కోరిక తీరింది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా రుణం ఇప్పించారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సొంత ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు సొంత ఇల్లు లేదని ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్న మా అబ్బాయి వైకుంఠరావుకు పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. ఈ వేసవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదంతా ముఖ్యమంత్రి చలువే. ఆయన సీఎం కాకపోతే మా కల నెరవేరేదికాదు. అలాగే ఈ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో మంచి జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీనే వితంతు పింఛన్ వస్తోంది. డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వచ్చింది. సీఎం జగన్ రుణం తీర్చుకోలేం. – పైడిశెట్టి సత్యవతి, ఉర్లాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) పింఛన్ మా ఇంటికే వస్తోంది మాది నిరుపేద కుటుంబం. మేము పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉంటున్నాం. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. పుట్టుకతోనే నా రెండు కాళ్లు చచ్చుబడటంతో దివ్యాంగుడినయ్యాను. సెంటు భూమి కూడా లేని నన్ను మా అమ్మ కూలి పనులు చేసి బతికించింది. దివ్యాంగుడిని కావడంతో నన్ను ఎవరూ పనులకు పిలిచేవారు కాదు. అమ్మ కష్టాన్ని చూడలేకపోయాను. పెళ్లి మండపాల డేకరేషన్ పనులు నేర్చుకొని అప్పుడప్పుడు ఆ పనులకు వెళ్తున్నాను. ఎనిమిదేళ్ల క్రితం సలోమి అనే దివ్యాంగురాలితో నాకు వివాహమైంది. మాకు రాకేష్, సతీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా పనులకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇద్దరికీ వచ్చే పింఛనే జీవనాధారంగా మారింది. గతంలో పింఛను తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించేవాళ్లం. ట్రై సైకిల్ పై రోజూ అక్కడకు వెళ్లి రోజుల తరబడి తిరిగితే గాని పింఛను డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు, నా భార్యకు మొత్తం రూ.6 వేలు మా వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారు. మా అమ్మకు వితంతు పింఛను కింద రూ.3 వేలు వస్తున్నాయి. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వస్తోంది. మా బాబు ఈ ఏడాదే ఒకటో తరగతిలో చేరాడు. విద్యాకానుక కింద బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు వస్తున్న పింఛను డబ్బులతోనే మేము బతుకుతున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వ పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న సాయం ఎప్పటికీ మరచిపోలేం. – మేడి నాగరాజు, దాచేపల్లి(వినుకొండ అజయ్‌కుమార్, విలేకరి, దాచేపల్లి) -
నరసన్నపేటలో కొనసాగనున్న సామాజిక సాధికార యాత్ర
-
నాలుగు రోజులుగా ఉరికి వేలాడుతూ..
నరసన్నపేట: నాలుగు రోజులుగా ఆ ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. న్యూస్ పేపర్లు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. ఎవరు పిలిచినా లోపల నుంచి సమాధానం రావడం లేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఇంటికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు ఫ్యాన్ హుక్కు ఓ మహిళ మృతదేహం వేలాడుతూ కనిపించింది. నాలుగు రోజులుగా ఆ మృతదేహం అలాగే ఉన్నట్లు వారు గుర్తించారు. నరసన్నపేట శ్రీరామనగర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు బమ్మిడి శాంతకుమారి(39) అని, ఆమెది శ్రీకాకుళంలోని ప్రశాంతి నగర్ అని పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీరామనగర్‌లో బమ్మిడి జయకుమార్, భార్య శాంతకుమారి నివాసం ఉంటున్నారు. నా లుగు రోజులుగా ఆ ఇంటికి ఎవరూ రాకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యా దు మేరకు ఎస్ఐ వై.సింహాచలం శుక్రవారం ఉద యం ఇంటిని పరిశీలించారు. తలుపులకు లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆ కుటుంబం వివరాలు సేకరించారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బమ్మిడి జయకుమార్ తన భార్య శాంత కుమారితో అక్కడ నివశిస్తున్నట్లు తెలుసుకున్నారు. జయకుమార్ ఆచూకీ తెలుసుకొని ఆయనను ఇంటికి రప్పించారు. అలాగే శాంతకుమారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వా రు వచ్చిన తర్వాత గడియ విరగ్గొట్టి లోపలకు వెళ్లి చూస్తే వంట గదిలో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని శాంతకుమారి కనిపించింది. సంఘటన జరిగి నాలు గు రోజులు కావడంతో మృతదేహం నుంచి దుర్వాసన అధికంగా వచ్చింది. ఆమె మృతదేహాన్ని చూసి న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పటికే సిద్ధంగా ఉన్న క్లూస్ టీమ్ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. శాంత కుమారి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 23వ తేదీ వేకువజామున ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు రోజు భార్యతో గొడవపడిన జయకుమార్ తన స్వగ్రామం నందిగాం మండలం శ్రీపురం వెళ్లిపోయి అక్కడే ఉన్నారు. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, తహసీల్దార్ ఎ.సింహాచలంలు పరిశీలించారు. మృతురాలి తండ్రి చిగులపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట సీఐ డి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘వేధింపులు తాళలేకే..’ ‘నా కుమార్తె శాంతకుమారి అల్లుడు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడింది’ అని తల్లిదండ్రులు చిగులపల్లి లక్ష్మణరావు, కనకరత్నం సోదరి ధనలక్ష్మిలు ఆరోపించారు. వివాహమైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. అవి భరించలేకే తమ కుమార్తె చనిపోయిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2018లో వివాహమైందని, సంతానం లేదని అన్నారు. భర్త జయకుమార్ మాట్లాడుతూ ఆమె తనను వేధించేదని, పలుమార్లు కొట్టిందని, ఆ బాధలకు భయపడి 22న సొంతూరు వెళ్లిపోయానని, ఆ తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అన్నారు. -
ఇంద్రజను ఆదుకుంటానని పేరెంట్స్ కు మాటిచ్చిన సీఎం జగన్
-
రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
భూ రికార్డులు సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూస్తున్నాం. 80–90 శాతం సివిల్ కేసులన్నీ కేవలం భూ వివాదాలవే. మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని మన పిల్లలకు ఇవ్వాలనుకుంటాం. తీరా మన పిల్లలకు ఇచ్చే సమయానికి గద్దల్లా వేరెవరో తస్కరిస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా మార్చేందుకే సమగ్ర భూ సర్వే దిశగా వేగంగా అడుగులు వేశాం. తద్వారా ఎలాంటి సివిల్ వివాదాలకు, లంచాలకు, కబ్జాలకు తావు లేకుండా చేస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రైతుల భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలుపెరగకుండా, ఖర్చుకు వెనకాడకుండా, అత్యంత సాంకేతికంగా, శాస్త్రీయ పద్ధతిలో భూముల రీసర్వే చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భూముల రీ సర్వేను 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని, సర్వే పూర్తయితే తమ భూముల విషయంలో రైతులు ధైర్యంగా ఉండవచ్చని, అక్రమాలకు అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుందని, గత మూడున్నరేళ్ల కాలంలో విప్లవాత్మక మార్పులు ఎన్నో తీసుకొచ్చామని చెప్పారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపట్టారు. అక్కడే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైందన్నారు. రాష్ట్రంలో 17,584 రెవెన్యూ గ్రామాలుంటే.. అందులో తొలి దశలో 2 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయడమే కాకుండా 7,92,238 మంది రైతుల భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి, భూ హక్కు పత్రాలను అందజేసే భారీ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరో 15 రోజుల్లో మొదటి దశలోని 2 వేల గ్రామాల రైతులందరికీ భూ హక్కు పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నరసన్నపేట బహిరంగ సభకు హాజరైన జనసందోహంలోని ఓ భాగం దశల వారీగా భూ హక్కు పత్రాలు ► 2023 ఫిబ్రవరి నాటికి రెండో దశ పూర్తి చేస్తాం. అంటే మరో నాలుగు నెలల్లో ఇంకో నాలుగు వేల గ్రామాలకు సంబంధించిన రైతులందరికీ వాళ్ల భూ హక్కు పత్రాలు వాళ్ల చేతుల్లో పెడతాం. ఆ తర్వాత మరో నాలుగు నెలల్లో మూడో దశలో ఆరు వేల గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే పూర్తి చేసి, భూ యజమానులకు 2023 మే నాటికి భూ హక్కు పత్రాలు అందజేస్తాం. ► 2023 ఆగస్టు నాటికి మరో 9 వేల గ్రామాలు, పట్టణాలకు సంబంధించి సర్వే పూర్తి చేస్తాం. ఐదో దశలో మిగతా గ్రామాలు, పట్టణాలతో కలిపి మొత్తంగా 17,584 రెవెన్యూ గ్రామాల్లో, పట్టణాల్లో భూములన్నింటినీ సమగ్ర సర్వే చేసి, రికార్డులను ప్రక్షాళన చేసి.. 2023 డిసెంబర్ నాటికి భూ హక్కు పత్రాలను అందజేస్తాం. ప్రతి కమతానికి యూనిక్ నంబర్ ► ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నింటినీ పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడుందో.. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేయడమే కాకుండా ప్రతి ఒక కమతానికి ఒక నిర్దిష్టమైన యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ఈ సర్వే ద్వారా ఇస్తారు. ప్రతి కమతానికి డిజిటల్‌గా, ఫిజికల్‌గా దాన్ని నిర్ణయించి, క్యూ ఆర్ కోడ్‌తో ల్యాండ్ మ్యాపింగ్ చేస్తాం. ► ఆ భూమికి సరిహద్దు రాళ్లు కూడా పెడుతున్నాం. ఆ తర్వాత రైతుకు ప్రభుత్వ పరంగా సర్వ హక్కులతో కూడిన భూ హక్కు పత్రాలను ప్రక్షాళన చేసి వారి చేతికి ఇవ్వబోతున్నాం. దీంతో తమ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటారనే భయం పూర్తిగా తొలగిపోతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. లంచాలకు అవకాశం లేకుండా పూర్తిగా ప్రక్షాళన జరుగుతుంది. ఇదంతా మహా యజ్ఞంలా సాగుతోంది. ► భూ కమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమంలో విభజన జరిగినా.. మారినా కూడా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడం వల్ల వస్తున్న వివాదాలన్నింటికి పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా.. ► జానెడు భూమిలో కూడా తప్పు జరగకుండా సర్వే చేయిస్తున్నాం. 10,185 మంది గ్రామ సర్వేయర్లు (గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి 13,849 మంది), 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, రూ.1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, 80 డ్రోన్లు, 2 వేల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అంటే జీఎన్ఎస్ఎస్ రోవర్లను వినియోగిస్తున్నాం. వీటితో పాటు ప్రత్యేకంగా 75 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ బేస్‌లు అంటే కోర్స్ బేస్‌లు ఏర్పాటు చేశాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులు, 2.47 కోట్ల సర్వే నంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే జరుగుతుంది. మరో 13,371 గ్రామ కమతాల్లో 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కూడా సర్వే జరుగుతుంది. ► సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించిన సబ్ డివిజన్లు, మ్యుటేషన్లు, ఇతర సమస్యల పరిష్కారం, యాజమాన్య పత్రాల జారీ వంటి కార్యక్రమాలన్నీ గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగని విధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా మార్పులు తీసుకొస్తున్నాం. ► ఇక మీదట సరిహద్దులు మార్కింగ్ చేసి, ఫీల్డ్ లైన్ దరఖాస్తులన్నీ 15 రోజుల టైమ్ ఇచ్చి కచ్చితంగా పూర్తి చేయాలి. పట్టా సబ్‌డివిజన్, మ్యుటేషన్ దరఖాస్తులన్నీ 30 రోజుల్లో పరిష్కారమయ్యేలా ఎల్‌ఓపీలు తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరూ లంచాలడిగే పరిస్థితి ఉండదు. మ్యుటేషన్ సేవలను ఉచితంగా అందిస్తాం. ఇప్పటిదాకా సర్వే జరిగిందిలా.. ► 100 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో 17వేలకు పై చిలుకు రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో 47,276 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ పూర్తయ్యింది. ఈ రోజు (బుధవారం) వరకు 2 వేల గ్రామాల్లో సమగ్ర రీసర్వేతో పాటు భూ పట్టాల ప్రక్షాళన, మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మేరకు రైతులకు 7,92,238 భూ హక్కు పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు ఈ 2 వేల గ్రామాల్లో వీటి పంపిణీ జరుగుతుంది. ► రీ సర్వే వల్ల ఈ 9 నెలల్లోనే 4 వేల గ్రామాల్లో 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లకు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. గతంలో సంవత్సరానికి 35 వేల సబ్ డివిజన్ల దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. కేవలం 21 వేలు మాత్రమే సబ్ డివిజన్ జరిగేవి. ఈ లెక్కన ఏటా 21 వేలు మాత్రమే సబ్ డివిజన్లు జరిగే పరిస్థితి నుంచి.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం 9 నెలల్లోనే 4.3 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు పూర్తి చేసుకున్న మెరుగైన స్థితికి వచ్చాం. ఈ ప్రక్రియలో రూ.30 కోట్ల విలువైన సేవలను వారి చేతిలో ఉచితంగా పెట్టినట్టు అవుతోంది. ఈ మార్పులను ప్రజలు ఒక్కసారి గమనించాలి. మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ► అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున 2 లక్షల 60 వేల మందిని నియమించాం. వలంటీర్లు ప్రతి ఒక్కరినీ చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ► 13 నుంచి 26 జిల్లాలు చేశాం. కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో రాజధాని ఉండటం వల్ల జరిగే మంచికన్నా.. మూడు ప్రాంతాలు కూడా బాగుపడే విధంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తున్నాం. ► రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, పాఠశాలల్లో, హాస్టళ్లలో నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ లైబ్రరీలు, మహిళలకు భద్రత కల్పించేలా ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్లు ఇలా ఎన్నో అమలు చేస్తున్నాం. ► ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రజలు మన కళ్లెదుటే కన్పించేవారు. పాలకులు, వారితో పాటు దత్తపుత్రుడి వేషంలో సినిమా యాక్టరూ వచ్చేవారు. ఐదేళ్లు పరిపాలన చేశారు. అయినా ఇచ్ఛాపురం, పలాసలో ఉన్న కిడ్నీ పేషెంట్లు వారికి గుర్తుకు రాలేదు. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంతాల్లో రూ.765 కోట్లతో సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి, కిడ్నీ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపించేలా అడుగులు వేశాడు. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.50 కోట్లతో రీసెర్చ్ ఆస్పత్రిని కడుతున్నాం. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కిడ్నీ పేషెంట్లకు రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్నాం. ► ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 295 మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మార్చే ప్రక్రియకు మన ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ శాఖ పరంగా గ్రేడ్–3 విలేజ్ సర్వేయర్లను గ్రేడ్–2గా రీ డిజిగ్నేట్ చేయనున్నాం. ► ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంతోనే సిక్కోలు ప్రగతి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసింది వైఎస్ కుటుంబమే. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి.. వందేళ్ల నుంచి ఉన్న భూ సంబంధిత సమస్యలకు రీ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం జిల్లాకు ఏమీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 23 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదు. సీఎం జగన్ వంశధార రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల నిధులిచ్చి, ఉద్దానం ప్రాంతంలో తాగునీరు అందించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కిడ్నీ రోగులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్.. ఒడిశా వెళ్లి అక్కడి సీఎంను కలిశారు. గత 15 ఏళ్లలో ఈ పని ఎవరూ చేయలేదు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు విశాఖ పాలన రాజధాని కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఇక్కడకు వచ్చి అదే మాట చెబితే ప్రజలే తగిన సమాధానమిస్తారు. – ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి ఆనందంగా ఉంది మా గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయ్యింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ హక్కు పత్రాలు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎప్పుడూ మేం ఇలాంటివి చూడలేదు. ఈ సర్వేతో భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. – రౌతు పోలయ్య, సంతలక్ష్మీపురం, పోలాకి మండలం నా చేతికి హక్కు పత్రం నాకు కరగాం పంచాయతీలో 40 సెంట్ల భూమి ఉంది. నోషనల్ ఖాతాలో ఉండిపోవడంతో ఇన్నాళ్లూ పాస్ బుక్ రాలేదు. ఎలాంటి హక్కులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు గ్రామంలో రీ సర్వే పూర్తయింది. నోషనల్ ఖాతాల్లో ఉన్న భూమిని నా పేరున మార్చి భూ హక్కు పత్రం ఇచ్చారు. ఇది ఈ రోజు సీఎం చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది. – పాగోటి దమయంతి, కంబకాయ, నరసన్నపేట మండలం వేగంగా రిజిస్ట్రేషన్ నా ఇంటి స్థలాన్ని కరగాం సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాను. ఇతరుల వద్ద కొనుగోలు చేసిన ఈ స్థలం రిజిస్ట్రేషన్ నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించేందుకు ప్రయత్నించాను. అయితే గ్రామ సచివాలయంలో కూడా చేస్తారని తెలియడంతో అక్కడికే వెళ్లి చేయించుకున్నాను. వివరాలన్నీ తెలుసుకుని శ్రమ లేకుండా, అదనపు ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ పత్రాలు సీఎం చేతుల మీదుగా ఈ రోజు తీసుకున్నాను. ఆనందంగా ఉంది. – వెలమల శ్రీదేవి, నారాయణవలస, నరసన్నపేట మండలం -
మహాయజ్ఞంలా భూరికార్డుల ప్రక్షాళన చేపడుతున్నాం: సీఎం జగన్
-
అలాంటి వాళ్లను చంద్రబాబు అంటాం: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం జగన్ కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతందిని సీఎం జగన్ తెలిపారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ ఇస్తాం. ప్రతి కమతానికి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తాం. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లోనే దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ సర్వే చేస్తున్నాం. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించాం. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టాం. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతుల చేతుల్లో పెడతాం. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. మన గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నాం. లంచాలకు ఎక్కడా తావులేదు అని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. కుప్పం సహా 25 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలుంటే ప్రస్తుతం మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. రైతన్నల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ దుష్టచతుష్టయాన్ని ఏమనాలి? తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటాం. ఎన్నికలపుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమనాలి?. మోసం చేసే చంద్రబాబులాంటి వారికి మళ్లీ అధికారం ఇవ్వొద్దు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడు అంటారు. పరాయి స్త్రీమీద కన్ను వేసి ఎత్తుకుపోతే రావణుడు అంటారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడిని సమర్థించిన వారిని దుష్టచతుష్టయం అంటాం. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కుని, ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని సమర్థిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, పవన్‌ను మరి ఏమనాలి? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ మాటలకు చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టింది
-
వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్
-
దేశంలో మొదటిసారి జరుగుతున్న కార్యక్రమం ఇది
-
సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ@శ్రీకాకుళం
-
జగనన్న శాశ్వత భూ హక్కుదారులతో సీఎం జగన్..
-
భూ రీ సర్వే స్టాల్స్‌ను పరిశీలిస్తున్న సీఎం జగన్
-
నరసన్నపేటలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
-
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్
-
భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతాం: సీఎం జగన్
12:56 PM పత్రాల పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్ సభలో ప్రసంగం అనంతరం.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ►ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్.. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. 12:50 PM ►తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్ ఎన్టీఆర్ జగన్ అంటారు ►కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారు ►ఎన్నికలప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేది చంద్రబాబు ►అలాంటి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దుష్టచతుష్టయాన్ని ఏమన్నాలి? 12:32 PM ►అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి నెంబర్ ఇస్తాం: సీఎం జగన్ ►హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నాం ►సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు ►ఆ పరిస్థితులు మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నాం ►భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతాం 12:25 PM ►ఆగస్ట్ 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి: సీఎం జగన్ ►వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తి ►80 శాతం నుంచి 90 శాతం సివిల్ కేసులు భూములకు సంబంధించినవే ►రికార్డులు సరిగా లేకపోవడం, మ్యూటేషన్ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు ►ఎలాంటి సివిల్ వివాదాలు తావుండకూడదని అడుగులు ముందుకేస్తున్నాం. 12:19 PM ►రెండేళ్ల కిందట గొప్ప కార్యక్రమం ప్రారంభించాం: సీఎం జగన్ ►2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన ►7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు ►ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే ►మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు 12:14 PM రైతులందరికీ భూ హక్కు పత్రాలు: సీఎం జగన్ భూ సర్వే రికార్డుల ప్రక్షాళన రెండేళ్ల కిందట మొదలైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలు అందిస్తామన్నారు. 11:57 AM రైతులకు ఎంతో మేలు: ధర్మాన ప్రసాదరావు వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. జిల్లాకు చంద్రబాబు ఒక్క ప్రయోజనకరమైన పనిచేయలేదని మంత్రి ధర్మాన అన్నారు. 11:20 AM స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం ► జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు సభా వేదిక వద్ద సర్వే స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం.. లబ్ధిదారులు, సర్వేయర్లతో ముచ్చటించారు. కాసేపట్లో తొలి విడత లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నారు. 11:05 AM ►సభా వేదిక వద్ద సర్వే స్టాల్స్‌ను సీఎం జగన్ పరిశీలించారు. అధికారులతో వివరాలడిగి తెలుసుకున్నారు. 10:35 AM ►శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట చేరుకున్న సీఎం జగన్ 10:05 AM ►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా నరసన్నపేట బయలుదేరిన సీఎం ►విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ 09:10 AM ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►శ్రీకాకుళం పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం 08:43 AM ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బయల్దేరారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ఆయన ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి: అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ సర్వే పూర్తైన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేయనుంది. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ జారీ చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ తరహాలో ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నెంబర్), క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. రీ సర్వే తర్వాత జారీ చేసే డిజిటల్ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్ రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉండదు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కానుంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డు తయారవుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతాయి. భూ అక్రమాలకు తావుండదు. ఉచితంగా.. రికార్డు వేగంతో తొలిదశ కింద రీ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు చేశారు. 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సాధారణంగా పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం పట్టే సమయం, తిప్పలు అందరికీ తెలిసిందే. అయితే రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పట్టా సబ్ డివిజన్ కోసం సచివాలయం, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.600 చెల్లించాలి. మ్యుటేషన్ కోసం అయితే రూ.100 కట్టాలి. ఈ లెక్కన 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లను రైతులు సొంతంగా చేసుకోవాలంటే రూ.37.57 కోట్లు ఖర్చవుతుంది. రీసర్వే ద్వారా ప్రభుత్వమే ఉచితంగా ఈ పనుల్ని చేపట్టి రైతులకు డబ్బులు మిగల్చడంతోపాటు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించింది. 2 వేల గ్రామాల్లో రీ సర్వేను కేవలం 8–9 నెలల్లోనే పూర్తి చేయడం రికార్డు. మరో 15 రోజుల్లో ఈ గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్), జీఎన్ఎస్ఎస్ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహిస్తున్నారు. భూహక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడం రీ సర్వే ప్రధాన లక్ష్యం. ప్రతి భూమికీ జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు ఏర్పరచడం, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో నవ శకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాంది పలికింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయం 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక రీ సర్వే నిర్వహణకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూముల హద్దులను నిర్థారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా భూములకు సంబంధించిన అన్ని సేవలను సింగిల్ డెస్క్ విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తెచ్చారు. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నరసన్నపేట పర్యటనకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం(నరసన్నపేట): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న నరసన్నపేటకు రానున్నారని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్‌లు తెలిపారు. తొలుత 25న వస్తారని అనుకున్నా రెండు రోజులు ముందుగానే పర్యటన ఖ రారైందని వీరు తెలిపారు. ఈ మేరకు గురువారం హెలీప్యాడ్, సభాస్థలి కోసం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ జీఆర్ రాధికలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణదాస్ స్థల పరిశీలన చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 23 ఉదయం 10గంటలకు జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష (రీసర్వే) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జమ్ము వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జమ్ము కూడలి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కళాశాల మైదానం వరకూ సీఎం రోడ్ షో ఉంటుందని అన్నారు. సభా ఏర్పాట్లను గురువారం రాత్రి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఆర్డీఓ బి.శాంతి, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ పాల్గొన్నారు. చదవండి: (హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ) -
CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఏదో ఒక చోట జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (రీ సర్వే) రెండో విడత పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి సీసీఎల్ఏ నుంచి కలెక్టర్ శ్రీ కేష్ బి.లాఠకర్‌కు ప్రాథమిక సమాచారం చేరింది. ఇదే అంశంపై శనివారం సాయంత్రం నరసన్నపేట ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌తో కలెక్టర్ లాఠకర్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల విషయాన్ని ఈ సందర్భంగా చర్చించారు. తామరాపల్లిలో సభ నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, హెలీ పాడ్, తదితర అంశాలను సోమవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరులో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన, ఉద్దానం మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా కలెక్టర్‌తో కలిసి చర్చించారు. ఈ భేటీలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, రాజాపు అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, చింతు రామారావు, కణితి కృష్ణారావు, త్రినాథ్ తదితరులు ఉన్నారు. చదవండి: (పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్) -
ఉత్తరాంధ్ర గర్జన.. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమన్నారు. చదవండి: పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ -
పసికందు ఏం నేరం చేసిందని..?
నరసన్నపేట: ఆ లేలేత కళ్లతో తల్లిని చూసిందో లేదో..? ఆ చిట్టి చేతులతో తండ్రిని తాకిందో లేదో..? పుట్టాక చనుబాలైనా తాగిందో లేదో..? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తుప్పల్లోకి చేరిందో పసిపాప. అప్పుడే పుట్టింది కదా.. అమ్మను విసిగించి ఉండదు. తొమ్మిది నెలలు గర్భంలోనే ఉంది కదా.. నాన్న మనసు కష్టపెట్టే ప్రసక్తే లేదు. అసలు తాను ఆడపిల్లనని కూడా తనకు తెలిసి ఉండదు. మరేం నేరం చేసిందని.. పాపకు ఇంత శిక్ష విధించారు ఆ తల్లిదండ్రులు...? నరసన్నపేట–జలుమూరు మండలాల బోర్డర్ కంబకాయ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన బుధవారం ఓ పసిపాప తుప్పల్లో స్థానికులకు దొరికింది. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం స్థానికులు సూర్యనారాయణ, బసివాడకు చెందిన యూత్ స్టార్ సభ్యులు సాయిమణికంఠ, తేజ, కృష్ణలు రన్నింగ్ చేస్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ పసి బిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్త కారుతూ కనిపించింది. వెంటనే వారు బిడ్డను బయటకు తీసి అదే రోడ్డుపై వెళ్తున్న మహిళల సాయంతో సపర్యలు చేశారు. వేకువజామున ఎవరో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు సపర్యలు చేశాక వెంటనే ఆటోలో నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్ఐ వి.సత్యనారాయణ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు వచ్చి బిడ్డను పరిశీలించారు. ఊపిరి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది బాలరాజు తెలిపారు. -
మా అమ్మకు నేనంటే ప్రాణం, నా కళ్ల ముందే..
సాక్షి, నరసన్నపేట( శ్రీకాకుళం): మండల కేంద్రం నరసన్నపేటలోని హనుమాన్ కూడలి సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. మృతురాలు బారువ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న వాడవలస అప్ప లనాయుడు భార్య వసంతకుమారి (48)గా గుర్తించారు. అరసవల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఈమె స్వగ్రామం పాతపట్నం మండలం పెద్ద సరియాపల్లికి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సర్వీస్ రోడ్డుపై ఉన్న స్పీడ్ బేకర్ల వద్దకు వచ్చేసరికి బైకుపై వెనుక కూర్చొ న్న వసంతలక్ష్మి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయా రు. అదే సమయంలో వెనుకనుంచి ఐరెన్ ప్లేట్స్‌తో వస్తున్న కంటైనర్ లారీ వసంతకుమారి పైనుంచి వెళ్లడంతో నడుము భాగం నుజ్జవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వసంతకుమారిని తప్పించేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమారుడు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కుమారుడి కళ్ల ముందే... ‘నేనంటే అమ్మకు ఎంతో ప్రేమ. నా కళ్ల ముందే అమ్మ చనిపోయింది. వెనుక వస్తున్న లారీ కొన్ని సెకెన్లు ఆలస్యంగా వచ్చినా అమ్మ బతికేది. బయటకు వెళ్లే ప్రమాదాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెప్పేది. ఎప్పుడూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేది. ఇప్పుడిలా విగత జీవిగా మారింది. అదీ నా కళ్ల ముందే ఇలా జరిగిందేంటి దేవుడా.. ’ అని కుమారుడు గౌతమ్ రోదించడం అక్కడివారికి కంటతడి పెట్టించింది. వసంతకుమారికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్తంభించిన ట్రాఫిక్.. ప్రమాదానికి కారణమైన లారీ రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో శ్రీకాకు ళం నుంచి టెక్కలి పైపుకు వెళ్లే మార్గంలో వాహనాలు రెండు కిలోమీటర్ల మేర గంటన్నర పాటు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో వచ్చి లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోర్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని తెలిపారు. -
ప్రతి నియోజకవర్గంలో జాబ్‌మేళాలు
సాక్షి, నరసన్నపేట: డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మేళాలో 30 కంపెనీ ప్రతినిధులు పాల్గొనగా, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. 4,723 మంది నిరుద్యోగులు తమ అభ్యరి్థత్వాన్ని నమోదు చేసుకోగా, వీరిలో 1,653 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 432 మంది విశాఖపట్నంలో శిక్షణకు పంపారు. ముందుగా ఈ మేళాను ప్రారంభించిన ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో దేశ చరిత్రలోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రుజువైందన్నారు. అదేవిధంగా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రతీ నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి వందలాది మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులు ఉపాధి జ్యోతిని వినియోగించుకోండి.. ఆగస్టు 23న ప్రారంభించిన ఉపాధి జ్యోతి పథకాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. ఈ వెబ్సైట్లో జిల్లా నుంచి 30 వేల మంది, నరసన్నపేట నియోజకవర్గం నుంచి 5,300 మంది నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి జాబ్‌మేళాలో ప్రాధాన్యమిస్తామన్నారు. పార్టీ యువజన విభాగం ప్రతినిధి ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రతీ ఆర్నెల్లకోసారి నరసన్నపేటలో జాబ్‌మేళా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పరిశీలించిన కలెక్టర్.. జాబ్‌మేళా నిర్వహణ తీరును కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు. ఇక్కడ నిరుద్యోగులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అధిక మంది నిరుద్యోగులను ఎంపిక చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ గోవిందరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కరిమి రాజేశ్వరి, సీడాప్ మేనేజర్ రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు చింతు రామారావు, ఆరంగి మురళి, మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాలుడి మరణానికి కారణమేంటి?
సాక్షి, నరసన్నపేట : మండలంలోని మడపాం గ్రామానికి చెందిన సింగారపు రోహిత్(3) శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన ఘటనపై శ్రీకాకుళం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సీఐ శంకరరావు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం విచారణ ప్రారంభించారు. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 20వ తేదీన మడపాంకు చెందిన సింగారపు ఈశ్వరమ్మ తన మూడేళ్ల కుమారునికి జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని విజయహర్ష ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు సాయంత్రం వరకు డాక్టర్లు జ్వరం కోసం వైద్యం చేశారు. అయితే రాత్రికి బాలుడికి కడుపు నొప్పి రావడంతో తల్లి వైద్యులకు చెప్పగా కడుపు నొప్పి తగ్గేందుకు డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే ఇంజెక్షన్లు వికటించడంతో 30 నిమిషాల్లో బాలుడు మృతి చెందాడని తల్లి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు బాలుడు ఇబ్బంది పడుతున్నా వైద్యులు పట్టించుకోకుండా, తన కుమారుడిని అన్యాయంగా చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో 23వ తేదీన ఫిర్యాదు చేశామని, 25వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. మడపాంలో పంచనామా ఈ సంఘటనపై మడపాంలో శ్రీకాకుళం సీఐ శంకరరావు ఆధ్వర్యంలో బుధవారం పంచనామా నిర్వహించారు. గ్రామ పెద్దలు, బాలుడి తల్లిదండ్రుల నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి వైద్యులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. విచారణలో సీఐతో పాటు డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌కుమార్, వీఆర్వో శ్యామ్, గ్రామ పెద్దలు సుందరరావు, రుప్ప సీతారాం, ప్రగడ గోపి తదితరులు పాల్గొన్నారు. మా బాబుని అన్యాయంగా చంపేశారు నేను చూస్తుండగానే తన బాబు మృతి చెందాడని, దానికి ఆస్పత్రి వైద్యులే కారణమని సింగారపు ఈశ్వరమ్మ విలపించారు. సిబ్బందిని నిలదీస్తే రూ.60 వేలు ఇచ్చారని, వైద్యానికి కూడా డబ్బులు తీసుకోలేదన్నారు. ఇలా ఎంతమందిని చంపేసి డబ్బులు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై సక్రమంగా దర్యాప్తు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘బెల్ట్’ తీసేశారు
సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): పచ్చటి సంసారాల్లో చిచ్చురేపిన మద్యం మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మద్యం మహమ్మారి నిర్మూలను చికిత్స ప్రారంభించారు. ఒక్కసారిగా ఈ వ్యాధిని నిర్మూలించడం వీలుకాదని ముందే గ్రహించిన ఆయన విడతల వారీగా తుదముట్టిద్దామని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా బెల్ట్‌షాపుల నిర్మూలనకు ఇచ్చిన ఆదేశాలు నరసన్నపేట నియోజకవర్గంలో విజయవంతమయ్యాయి. గ్రామాల్లో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల క్రితం గ్రామాల్లో పరిస్థుతులు ఒకలా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థులు పూర్తిగా మారాయి. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమంటూ మహిళా లోకం పొగడ్తలతో ముంచెత్తుతుంది. బెల్ట్‌షాపుల మూతకు గ్రామాల్లో పెద్దలు కూడా సహకరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపుతో నాలుగు మండలాల్లో ఉన్న బెల్ట్ షాపులన్నీ దాదాపుగా మూతపడ్డాయి. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి కూడా ఎన్నికల సమయంలో బెల్ట్ షాపులను మూతవేస్తామని హమీ ఇచ్చారు. ఆ హామీ తుంగలోకి తొక్కడంతో.. బెల్ట్ షాపులు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి. మద్యం అమ్మకాలపై నెలవారీ టార్గెట్లు ఇవ్వడంతో ఎక్సైజ్ సిబ్బంది కూడా ఎంత తాగిస్తే అంతగా లక్ష్యం సాధిస్తామని బెల్ట్ షాపులను అప్పట్లో ప్రోత్సహించారు. 2014కు ముందు గ్రామాల్లో వీధికో బెల్ట్ షాపు ఉంటే గత ప్రభుత్వ అధినేత పుణ్యమా అని వీధికి నాలుగైదు వెలిశాయి. నరసన్నపేట పట్టణంలో అయితే సందు, సందులో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బయటకు ఒకలా ప్రకటనలు చేయడం, లోపల ఆదేశాలు మరోలా ఇవ్వడంతో బెల్ట్ షాపులు మూత అనేది కేవలం ప్రకటలనకే పరిమితం అయింది. నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల వివరాలు.. మండలం బెల్ట్ షాపులు ప్రస్తుతం నడుస్తున్నవి నరసన్నపేట 310 0 పోలాకి 160 0 జలుమూరు 110 0 సారవకోట 90 0 మాటే శాసనం.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘నా మాటే శాసనం’ అన్న తీరులో జగన్మోహన్రెడ్డి ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేయడంతో వారం రోజుల్లో బెల్ట్ షాపులు మూతపడ్డాయి. సీఎం ఆదేశాలను విధిగా నరసన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానిక ఎక్సైజ్ అధికారులకు గట్టిగా చెప్పారు. బెల్ట్ షాపులకు మద్యం ఇస్తే లైసెన్స్ ఉన్న షాపులపై కేసులు పెట్టాలని, గ్రామాల్లో గొలుసు దుకాణాలు మూత పడాల్సిందేనని, గ్రామాల్లో మద్యం లభిస్తున్నట్లు తెలిస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్థానిక సీఐ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఎక్సైజ్ సిబ్బంది జూలు విదిల్చారు. దీంతో గ్రామాల్లోని బెల్ట్ షాపులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం మద్యం కేవలం లైసెన్స్ ఉన్న షాపుల్లోనే లభిస్తుంది. ఈ షాపుల్లో కూడా రెండు బాటిళ్ల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. నరసన్నపేట ఎక్సైజ్(సీఐ) స్టేషన్ పరిధిలో ఉన్న జలుమూరు, పోలాకి, నరసన్నపేట మండలాల్లో దాదాపుగా అన్ని బెల్ట్ షాపులు మూసివేశారు. వీటిని నడిపిన వారు ప్రత్యామ్నాయ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మద్యం మహమ్మారి నిషేధానికి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న మొదటి ప్రయత్నం విజయవంతం అయింది. కోటబొమ్మాళి సర్కిల్ సీఐ పరిధిలో ఉన్న సారవకోట మండలంలో కూడా మద్యం అనధికార షాపులు మూతపడ్డాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 21 లైసెన్స్డ్ షాపులున్నాయి. ప్రస్తుతం వీటిల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. గత పది రోజుల్లో మద్యం అమ్మకాలు 40 శాతం మేరకు తగ్గాయి. ఎక్సైజ్ సిబ్బందికి గ్రామాల దత్తత.. నరసన్నపేట సర్కిల్ స్టేషన్ పరిధిలో ఉన్న 12 మంది పోలీసులు, ముగ్గురు ఎస్ఐలు రెవెన్యూ గ్రామాల వారీగా దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలను వీరి నుంచి ఏ రోజు నివేదికలు ఆరోజు సీఐ తీసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించే వారికి సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు, పెద్దల నుంచి బెల్ట్‌షాపుల మూతకు ప్రోత్సాహం లభించిందని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. అక్రమ మద్యం ఉంటే కేసులు నిబంధనలకు మించి మద్యం బాటిళ్లు అధికంగా ఉన్నా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనధికార మద్యం ఉంటే కేసులు నమోదు చేస్తాం. బెయిల్ రాకుండా సెక్షన్లు వేస్తాం. ప్రస్తుతం కేవలం లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మద్యం అమ్మకాలకు పరిమితం చేశాం. ఎవరైనా లైసెన్స్డ్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు చేస్తే వారి లైసెన్స్‌లు పూర్తిగా రద్దు చేస్తాం. –శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట గ్రామాల్లో ప్రశాంతత గత ప్రభుత్వ కాలంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉండటంతో ప్రధానంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. వై.ఎస్.జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యం బెల్ట్ షాపులు నిర్మూలకు చర్యలు తీసుకోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు కనిపించడం లేదు. వారం రోజులుగా గ్రామాల్లో ప్రశాంతత కనిపిస్తుంది. మహిళలు సంతోషంగా ఉన్నారు. – పుట్టా ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్, వీఎన్‌పురం, నరసన్నపేట -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): పరోక్ష రాజకీయల్లో చిన్నతనం నుంచి చురుకుతనం. 17 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయ అనుభవం. పదేళ్లు శాసన సభ్యునిగా పనిచేయడంతో నియోజకవర్గంపై పూర్తి అవగాహన. జనం కోసం నిలబడగలిగే సత్తా, ధైర్యం ఉన్న వ్యక్తి. ప్రతి కార్యకర్త, పార్టీ అభిమాని ఇంట్లో కష్టసుఖాల్లో తానూ ఒకరై ఉన్న వ్యక్తి ధర్మాన కృష్ణదాస్. ఎవరైనా దాసన్నా నాకు ఈ కష్టం వచ్చిందని అంటే వెంటనే స్పందించే గుణం ఆయనకే సొంతం. 2004లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కృష్ణదాస్ వరుసగా 2009 సార్వత్రిక, 2012 ఉప ఎన్నికల్లోనూ సునాయాసంగా విజయం సాధించారు. 2014లో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ప్రజల ముందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా, జగనన్నకు మంచి ఆప్తమిత్రుడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజలు మరోసారి అవకాశమిస్తే వారి అభిప్రాయాలు, ఆశలకు వీలుగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. పలు దీర్ఘకాలిక సమస్యలు నరసన్నపేటను పట్టి పీడిస్తున్నాయి. వాటిని నేను ఎమ్మెల్యే అయితే అనతి కాలంలో పరిష్కారం చేయగలనని అంటున్నారు. ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేస్తారో అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రశ్న: నియోజకవర్గంలో ప్రజలతో ఎలా మమేకం అయ్యారు? జవాబు: ప్రధానంగా నేను రైతు కుటంబానికి చెందిన వాడిని. ప్రజలు, రైతుల కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూశాను. 1985లో తమ్ముడు ప్రసాదరావు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినçప్పటి నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాను. 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యాను. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనికి వచ్చిన తర్వాత ప్రజలతో మరింతగా మమేకం అయ్యాను. ఆయన పెట్టిన ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యాను. ప్రశ్న: సాగునీటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? జవాబు: గతంలో ఓపెన్ హెడ్ చానళ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు సకాలంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయింది. ప్రస్తుతం వీటిపై దృష్టి పెట్టి ఈ పనులు పూర్తి చేయించడంతోపాటు శివారు గ్రామాలకు సాగునీరు అందించేందుకు వీలుగా మడపాం, తలతరియా, రావిపాడులతోపాటు పలుగ్రామాల్లో ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు పంపి వాటిని సకాలంలో పూర్తి చేయిస్తాను. ప్రశ్న: చెరుకు రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు? జవాబు: అవును బాగా నష్టాలకు గురి అవుతున్నారు. వీరి కష్టాలు తీరాలంటే ఆమదాలవలసలో సహకార రంగంలో చెరుకు ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావాలి. అప్పుడే ఇక్కడి చెరుకు రైతులకు కొంత ప్రయోజనం కలుగుతుంది. చెరుకు పండించే రైతులకు ప్రత్యేక బోనస్ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దృష్టికి చెరుకు రైతుల కష్టాలు తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తా. ప్రశ్న: టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: చాలా పక్షపాతంగా వారు వ్యవహరించారు. ప్రజాస్వామ్యనికే మచ్చ తెచ్చేలా టీడీపీ పాలన సాగింది. రాజన్న రాజ్యం వచ్చిన వెంటనే ఆయన పాలనలో అందించినట్లే ప్రతి అర్హుడికీ పథకాలు అందించి ప్రజలకు న్యాయం చేస్తాం. రాజకీయ కక్షతో ఇబ్బందులకు గురైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాను. పేదరికమే ప్రామాణికంగా పథకాలు ప్రజలకు అందేలా చూస్తాను. ప్రశ్న: ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహం ఏమిటి? జవాబు: ప్రత్యేక వ్యూహం అంటూ ఏమీ లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మాజీ అయినా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నా. వారి కష్టసుఖాల్లో ఒకడినయ్యాను. నేను ఎంటో అందరికీ తెలుసు. నేను ఓడిపోయిన రోజున నాకంటే నియోజకవర్గ ప్రజలే ఎక్కువ బాధపడ్డారు. ఇప్పుడు నాకంటే వారే కష్టపడుతున్నారు. అలాగే బూత్ కమిటీలు పటిష్టంగా ఉన్నాయి. ప్రతీ గ్రామంలో బలమైన కేడర్ ఉంది. వారే నాకు బలం. వారి ఆలోచనలే నా వ్యూహం. ప్రశ్న: నిరుద్యోగ సమస్యపై మీ స్పందన? జవాబు: ఇతర నియోజకవర్గాలతో పోల్చితే నరసన్నపేటలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య కూడా అధికంగానే ఉంది. నరసన్నపేటలోని నాలుగు మండలాలు వ్యవసాయకంగా ప్రధాన్యం ఉన్నవి. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు అండగా ఉండాలని భావిస్తున్నా. ప్రశ్న: నరసన్నపేట మేజర్ పంచాయతీలో సమస్యలపై ఏం చేస్తారు? జవాబు: పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఉంది. మురుగు కాలవులు, ఖాళీ స్థలాల్లో నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు. శివారు వీధులకు రోడ్డు సమస్యలున్నాయి. వీటిని గుర్తించాను. రానున్న ఐదేళ్లో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. పాత జాతీయ రహదారిపై సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా.. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా నరసన్నపేట అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటా. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏమిటి? జవాబు: పదేళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నాను. దీంట్లో ప్రధానమైనవి సాగునీరు, తాగు నీరు. వరద కట్టలు నిర్మాణం. అలాగే వంశధార నధికి ఆనుకుని ఉన్న గ్రామాలు నీటి ఉధృతికి కోతకు గురి అవుతున్నాయి. ఇవి ప్రధాన సమస్యలు. వీటి పరిష్కారానికి గతంలో నా వంతు ప్రయత్నం చేశాను. నిధులు కూడా తీసుకువచ్చాను. గడిచిన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. ఇండోర్ స్టేడియం ఈసారి ఎలాగైనా పూర్తి చేయాలి. -
నరసన్నపేట బహిరంగ సభలో వైఎస్ జగన్
-
వీఆర్వో ఆత్మహత్య..?
నరసన్నపేట: నరసన్నపేట మండలంలోని పది పంచా యతీలు, మూడు రెవెన్యూ క్లస్టర్లకు పదేళ్లుగా వీఆర్ఓగా పనిచేస్తున్న ముద్దాడ నర్సింగరావు (59) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఎంతో నిబద్ధతతో పని చేసే నర్సింగరావు ఇలా అనుమానాస్పద రీతిలో కన్ను మూయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సింగరావు మంగళవారం ఉదయం ముషిడిగట్టు పంచాయతీ పరిధిలోని ఉప్పరిపేట సమీపంలో ఉన్న జీడితోటల్లో విగతజీవిగా కనిపించారు. మృతదేహానికి సమీపంలో ఓ పురుగు మందు సీసాను పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రమే ఆయన చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మృతదేహం తల వెనుక భాగంలో రక్తం ఉండడం, పురుగు మందు తాగినా అక్కడ గింజుకున్న ఆనవాళ్లు లేకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఆయన ఎప్పుడు రాలేదని స్థానికులంటున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే.. సోమవారం ఉదయం రోజూ మారిదిగానే లుకలాం చేసుకున్న వీఆర్వో మధ్యాహ్నం వరకు ఉర్లాం పరిసరాల్లోనే ఉన్నారు. అయితే సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్ఓల సమావేశానికి హాజరు కాలేదు. ఆర్ఐ కోటేశ్వరరావు, తహసీల్దార్ రామారావులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో అమ్మ ఫోన్ చేసిందని, అప్పుడు కూడా కాల్ వెళ్లలేదని కుమారుడు కిరణ్‌కుమార్ తెలిపారు. ఉదయం ఈ వార్త విని అవాక్కయ్యాయని ఆయన విలేకరుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. అనుమానాలెన్నో.. నర్సింగరావు ఇంటిలో ఎలాంటి వివాదాలు లేవు. విధి నిర్వహణలోనూ పక్కాగా ఉండేవారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కచ్చితంగా ఎవరో చం పేసి పడేసి ఉంటారని అన్నదమ్ములు రామ్మోహన్, సింహాచలం, ఆటకేశంలు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారని, ఉదయానికే డ్యూటీకి వెళ్లిపోయేవారని వారు తెలి పారు. ఇసుక తవ్వకాలపై అధికారులు, నాయకుల మధ్య నలిగిపోయేవాడని చెప్పారు. పని చేయలేకపోతున్నానంటూ లేఖ.. ఘటనా స్థలంలో మృతుని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి అధికంగా ఉంది. ఆరోగ్యం సహకరించడం లేదు. తనను విధుల నుంచి తప్పించాలని అందులో ఉన్నట్లు సమాచారం. తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరం ఈ నెల 6వ తేదీన రాసినట్లు ఉంది. అధికారుల వేధింపులు కూడా మరణానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ పనసారెడ్డి, ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎస్పీ వీ.భీమారావు, నరసన్నపేట సీఐ జీ. శ్రీనివాసరావు, ఎస్ఐ జి. నారాయణ స్వామి, తహసీల్దార్ జల్లేపల్లి రామారావు తదితర అధికారులు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానాస్పద కేసుగానే నమోదు నరసన్నపేట: చోడవరం వీఆర్వో ముద్దాడ నర్సింగరావు మృతిని అనుమానాస్పద కేసుగానే నమోదు చేశామని నరసన్నపేట సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యిందని, రిపోర్టు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. ప్రాథమికంగా తమకు లభించిన ఆధారాల ప్రకారం ఆత్మహత్యగానే భావిస్తున్నామని, పూర్తి వివరాలు అందాక ఓ నిర్ధారణకు వస్తామని చెప్పారు. సింగుపురంలో విషాద ఛాయలు శ్రీకాకుళం రూరల్: మండలంలోని స్థానిక సింగుపురంలో నివాసం ఉంటున్న ముద్దాడ నర్సింగరావు (58) మృతి చెందడంతో సింగుపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీఆర్ఓగా పనిచేస్తున్న నర్సింగరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరితో మంచిగా మెలిగేవారు. పదిహేనేళ్లుగా శ్రీకాకుళం మండలంలోనే వీఆర్వోగా పని చేసిన అనుభవం ఉంది. ఈయనకు ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దన్నయ్య ముద్దాడ రామ్మోహన్ సింగుపురంలోనే ఓ స్కూల్ నిర్వహిస్తుండగా, మరో తమ్ముడు సింహాచలం శ్రీకాకుళంలోనే వైద్యునిగా పనిచేస్తున్నట్లు సమాచారం. పని ఒత్తిడి అధికంగా ఉంది మంచి వీఆర్వో చనిపోయాడు. ఈయన మృతికి కేవలం పని ఒత్తిడే కారణం. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మాలాంటి వారికి ఎంతగానో ధైర్యం చెప్పేవాడు. ఏళ్ల తరబడి వీఆర్వోగానే ఉండిపోయాను, ప్రమోషన్ రాలేని బాధ పడేవారు. ఓ వీఆర్వో ఇలా చనిపోతాడని అనుకోలేదు. మూడు రోజుల కిందటే రెండు ఇసుక లారీలు పట్టుకున్నాడు. – ప్రగడ వేణుగోపాల్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు -
దర్జాగా కబ్జా!
నరసన్నపేటలో అధికార పార్టీ నాయకులు, వారి అనుయాయులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులే లక్ష్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. నయానో.. భయానో అధికారులకు చెప్పి తమ పనులు కానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వ ఆస్తులు తాజాగా కబ్జాకు గురవుతున్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందామన్న చందంగా... అధికారం ఉన్నప్పుడే భూములను ఆక్రమించేసేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విలువైన స్థలాలు కబ్జాకారుల చేతుల్లోకి చేరిపోయాయి. అయినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. నరసన్నపేట : వాణిజ్య కేంద్రమైన నరసన్నపేటలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే..పాగా వేయడానికి కొంతమంది అక్రమార్కులు కాచుకుకూర్చున్నారు. ఇప్పటికే విలువైన భూములను కొల్లగొట్టారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుల అండతోనే ఆక్రమణలు అధికమైనట్టు పట్టణవాసులు చెప్పుకుంటున్నారు. నరసన్నపేట నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాలు పలు కుల సంఘాలకు అనధికారికంగా అధికారులు అప్పజెప్పారు. దీంతో మరింతగా ఆక్రమణలు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నరసన్నపేటలో సెంటు స్థలం రూ. నాలుగు లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ ఉంది. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు, వారి అనుయూయులు అంతా తమ ఇష్టం అని అంటూ ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. ‘వంశధార’ కాలువను కప్పేస్తున్నారు! ఆక్రమణదారులు ఎంతకైనా బరితెగిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే కాలువలను సైతం ఆక్రమించేందుకు వెనుకంజ వేయడం లేదు. తాజాగా జాతీయ రహదారి నుంచి కంబకాయకు వెళ్లే మార్గంలో ఉన్న వంశధార కాలువను కప్పేస్తున్నారు. ఇక్కడ సెంటు రూ. 4 లక్షలు పలుకుతోంది. 30 సెంట్లకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేయడానికి కొంతమంది స్కెచ్ వేశారు. కాలువను కప్పేసే క్రమంలో మట్టి వేస్తున్నారు. ఈ కాల్వ ఆక్రమణ జరిగితే నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న వర్షం పడినా నీరు రోడ్డు మీదకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆక్రమణను అడ్డుకొని కాలువను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ, వంశధార అధికారులు సమన్వయంతో వ్యవహరించి కాల్వకు పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జలగల చెరువులోనూ ఆక్రమణలు.. కంబకాయ రోడ్డుకు ఆనుకొని జాతీయ రహదారికి రెండు వైపులా జలగల చెరువు విస్తరించి ఉంది. 10 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ చెరువును అన్ని వైపుల నుంచి కబ్జాకారులు కప్పేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని కంబకాయ వైపు ఉన్న స్థలంలో మట్టి, గ్రావెల్ వేశారు. గతంలో నరసన్నపేట తహసీల్దార్‌గా దేవీమణి ఉన్నప్పుడు ఇక్కడ ఆక్రమణలకు కొందరు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై కూడా అధి కారులు దృష్టి పెట్టి ప్రభుత్వ చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీరామనగర్‌లో రోడ్డు మార్గం ఆక్రమణ స్థానిక లక్ష్మీనగర్ పరిధిలో ఉన్న రెవెన్యూ గోర్జిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణకు పాల్పడుతున్నారు. శ్రీరామనగర్–లక్ష్మీనగర్లకు మధ్య రహదారిగా ఈ గోర్జి వినియోగిస్తుండగా ఇది తమదంటూ అని కొందరు ఆక్రమించేస్తున్నారు. దీనిపై దృష్టిసారించి ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీరామనగర్– లక్ష్మీ నగర్‌లకు రహదారిగా దీనిని వినియోగించేందుకు అవకాశం ఇవ్వాలని విన్నవిస్తున్నారు. దీనిపై స్థానికులు నరసన్నపేట తహసీల్దార్ రామారావుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 11 ఆర్ కిళ్లాం చానల్ పరిస్థితి దారుణం నరసన్నపేట పట్టణం మధ్య ఉన్న 11 ఆర్ కిళ్లాం చానల్ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. కాలువ ఆధునికీకరణలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అధికార పార్టీ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఏం చేయలేక మిన్నుకుండిపోతున్నారు. హడ్కో కాలనీ, దేశవానిపేట, వజ్రంపేట, శివనగర్ కాలనీల పరిధిల్లో భూ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. –కామేశ్వర భుక్త చెరువు వద్ద.. సత్యవరం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 338/1లో ఉన్న ఈ చెరువు వద్ద ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతోంది. అయితే ఆక్రమణలకు అవకాశం ఇవ్వమని అధికారులు హెచ్చరిస్తున్నారు. చెరువులో ఆక్రమణలు గుర్తించి ట్రెంచ్ కొట్టారు. పనులు ఆగినట్లే కనిపించినా ప్రస్తుతం ఆక్రమణలు దారులు వారు అనుకున్నట్లే లేఅవుట్లు వేసి ప్రభుత్వం చెరువును అమ్ముకుంటున్నారు. చెరువుకు ఆనుకొని కొందరు తమ జిరాయితీ పొలాల్లో ఇళ్ల ప్లాట్లు వేయగా దీనికి రోడ్డు మార్గం కామేశ్వర భుక్త చెరువు స్థలంలో వేశారు. ఈ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి మొదట్లో అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు స్టేడియం నరసన్న చెరువులో నిర్మిస్తుండటంతో విలువైన ఈ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. ఆక్రమణలకు తావివ్వం.. నరసన్నపేట మేజరు పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు ఆవకాశం ఇవ్వమని తహసీల్దద్ జల్లేపల్లి రామారావు స్పష్టం చేశారు. సమాచారం వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమణలపై ప్రత్యేక దృష్టిపెట్టి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఇందిరాగనర్‌లో కాలువలో ఆక్రమణలు స్థానిక ఇందిరా నగర్లో విలువైన వంశధార కాలువ ఆక్రమణలకు గురైంది. గతేడాదిలో ఇది వెలుగు చూసినా రెవెన్యూ, వంశధార అధికారులు పట్టించుకోవడంలేదు. దీనికి కారణం ఆక్రమణదారులంతా అధికార పార్టీ అనుయూయులు కావడమే. ఆక్రమణలపై రైతులు ఫిర్యాదు చేయగా హడావుడిగా వంశధార ఇంజినీర్లు పరిశీలించినా తరువాత వదిలేశారు. దీంతో ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు. కాలువ ఆనవాళ్లు లేకుండా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వంశధార కాలువపై పక్కా భవనాలు నిర్మించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం 10 అడుగులకు పైగా విస్తీర్ణంలో కాల్వ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కాల్వ ఆనవాళ్లే లేవు. -
కలత చెంది.. కన్నీరు మిగిల్చావా!
► నవ వధువు అనుమానాస్పద మృతి ► సారె తక్కువని అత్తింటివారు రాద్ధాంతం ► కలత చెంది ఆత్మహత్య? తలపై పెట్టిన జీలకర్ర, బెల్లం గురుతులు చెదిరిపోనేలేదు.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో హాయిగా జీవించాలని పెద్దల ఆశీర్వచనాల అక్షింతలూ అలానే ఉన్నాయి. చేతికి అంటుకున్న పసుపు.. కాలికి పెట్టిన పారాణి వదలనే లేదు. ఆ ఇంట పెళ్లిసందడికి శుభసూచికగా ముందర వేసిన పందిరి ఇంకా పచ్చగానే ఉంది. ఇంతలోనే విషాదం. ఎన్నో ఆశలతో.. భవిష్యత్‌పై కలలతో అత్తారింట అడుగుపెట్టిన నవ వధువు.. పెళ్లి ముచ్చట తీరకముందనే కట్టెగా మారింది. అత్తింటి వారి కట్నం దాహానికి కలత చెందిన ఆ బంగారు తల్లి.. తన నిండు జీవితాన్నే త్యాగం చేసింది. నరసన్నపేట: ఈ నెల 17వ తేదీన పెళ్లి పీటలెక్కిన వధువు.. ఒక్క రోజైనా గడవక ముందే శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన నరసన్నపేట మండలం ముషిడిగట్టు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముషిడిగట్టు గ్రామానికి చెందిన రమణ, గన్నెమ్మల కుమార్తె వానపల్లి కుమారి (24) బీఎస్సీ, బీఈడీ చదివింది. అదే గ్రామానికి చెందిన రాజాపు ఉపేంద్రతో ఈ నెల 17న నరసన్నపేట సీతారామ కల్యాణ మండపంలో ఆమెకు వివాహం చేశారు. వరుడికి లక్ష రూపాయల విలువ కలిగిన సారె, కట్నంగా 50 సెంట్ల భూమి ఇచ్చేందుకు పెళ్లికి ముందు పెద్దమనుషుల మధ్య ఒప్పందం కుదిరింది. కుమారి తల్లిదండ్రులు నిరుపేదలు. తమ తాహతకు మించినా.. కుమార్తె సంతోషం కోసం అడిగినంత ఇచ్చేందుకు అంగీకరించారు. ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చారు. పెళ్లిని ఘనంగా చేశారు. వధువు కుమారి అత్తవారింట్లోనే గురువారం ఉంది. పెళ్లికి ఇవ్వాల్సిన సారె సామగ్రి ఇచ్చి, కుమార్తెను తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు శుక్రవారం ఉదయం కుమారి తల్లిదండ్రులు వరుడు ఇంటికి వచ్చారు. వారికి గడపలోనే చేదు అనుభవం ఎదురైంది. సారె సామగ్రి తక్కువగా తీసుకువచ్చారు.. అవి తేలేదు, ఇవి తేలేదంటూ పెళ్లి కుమారుడు అన్న, వదినలైన మురళి, అనూష ఘర్షణకు దిగారు. ‘వీలున్నంత వరకూ అన్నీ తెచ్చాం. ఇంకా ఇవ్వాల్సినవి ఉంటే కొద్ది రోజుల్లో సమకూర్చుతాం.’ అని వధువు తల్లిదండ్రులు నచ్చజెప్పిందుకే ప్రయత్నించినా ఎవరూ వినలేదు. ఈ నేపథ్యంలో గొడవ పెరిగింది. దీనిని ఇంట్లో నుంచి గమనిస్తున్న కుమారి ఆందోళనకు గురైంది. కలత చెంది పై అంతస్తుకు వెళ్లిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో పెళ్లి కుమార్తె కోసం వరుడు పై అంతస్తుకు వెళ్లాడు. అక్కడ అచేతనంగా పడి ఉన్న కుమారి కనిపించింది. పక్కన పురుగు మందు డబ్బా పడి ఉంది. దీంతో హుటాహుటిన ఆమెను నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పురుగు మందు సేవించి, ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, ఆమె శరీరంపై పురుగు మందు పడిన ఆనవాలు ఏమీ కనిపించలేదు. దీంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న బంధువుల ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నా చెల్లిని చంపేశారు.. తన చెల్లి కుమారి బాగా చదువుకుందని, ఉపాధ్యాయినిగా పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఆమె ఎంతో ఇష్టమని, అందుకే బీఈడీ చేసిందని మృతురాలి సోదరి హేమలత వాపోయింది. పెళ్లయి రెండు రోజులూ కాలేదని, అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారే ఆమెను చంపేశారని ఆరోపించింది. ముఖ్యంగా పెళ్లికుమారుడు అన్న మురళి, భార్య అ నూషలే ఇందుకు కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని కంటతడి పెట్టి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. మృతురాలి తల్లి గన్నెమ్మ, తండ్రి రమణలు కూడా ఇదే విధంగా పెళ్లి కుమారుడు, ఇతర బంధువులపై ఆరోపణలు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సై సమాచారం తెలుసుకున్న నరసన్నపేట సీఐ పైడిపునాయుడు, ఎస్సై ఎన్.లక్ష్మణలు ముషిడిగట్టులోని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. పెళ్లి కుమారుడితోపాటు, అనుమానితులను అదుపులోకి విచారణ జరుపుతున్నారు. డీఎస్పీ పరిశీలన నవవధువు అనుమానాస్పద మృతి సంఘటనపై శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు కట్నం వేధింపుల కేసుగా నమోదు చేయడంతో నరసన్నపేట తహసీల్దార్ జల్లేపల్లి రామారావు ఆధ్వర్యంలో ఎస్సై ఎన్.లక్ష్మణ పంచనామా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. -
నవవధువు ప్రాణం తీసిన ‘సారె’ వివాదం
నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా): కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ముషిడిగట్టులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వానపల్లి కుమారి బీఎస్సీ, బీఈడీ చదివింది. ఆమెకు ఇదే గ్రామానికి చెందిన రాజాపు ఉపేంద్రతో ఈ నెల 17న వివాహం జరిగింది. రూ.లక్ష విలువ కలిగిన సారె, కట్నంగా 50 సెంట్లు భూమి ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు రమణ, గన్నెమ్మ దంపతులు ఒప్పుకున్నారు. ఆ ప్రకారం భూమిని ఇచ్చారు. సారె తీసుకొని వరుడి ఇంటికి శుక్రవారం ఉదయం కుమారి కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే, సారె సామాన్లు తక్కువగా తీసుకువచ్చారని వరుడి తల్లి రమణమ్మ , అన్నావదిన ఘర్షణకు దిగారు. అన్ని సామాన్లు తీసుకొచ్చామని.. ఇంకా ఇవ్వాల్సి ఉంటే ఇస్తామని వధువు కుటుంబ సభ్యులు చెబుతున్నా వారు ససేమిరా అన్నారు. దీన్ని ఇంట్లో నుంచి గమనిస్తున్న నవవధువు కుమారి ఆందోళనకు గురైంది. ఇంటి మొదటి అంతస్తుకు వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది. రైతు కుటుంబం కావడంతో పంటలకు వేసేందుకు తీసుకొచ్చి ఉంచిన పురుగు మందు తాగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే కుమారి కుటుంబీకులు మాత్రం అత్తింటివారే చంపేశారని ఆరోపిస్తున్నారు. పెళ్లి కుమారుడు అన్న మురళి, భార్య అనూష కలిసి ఆమెను చంపేశారని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవవధువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నరసన్నపేట సీఐ పైడపునాయుడు తెలిపారు. -
విజయ్‌ది హత్య
డీల్ రూ.5లక్షలు స్నేహితులే నిందితులు ఏడుగురు అరెస్టు, మరో వ్యక్తి పరారీ నరసన్నపేట : జిల్లాలో సంచలనం సృష్టించిన నరసన్నపేట యువకుడు విజయ్ హత్య కేసు చిక్కుముడిని పోలీసులు విప్పేశారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించి కేసును కొలిక్కి తెచ్చారు. దీనికి సంబంధించి ఎస్పీ బ్రహ్మారెడ్డి శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నరసన్నపేటకు చెందిన డాక్టర్ పొన్నాడ సోమేశ్వరరావు భార్య స్థానిక హడ్కో కాలనీకి చెందిన మల్లా విజయ్ అలియాస్ గవాస్కర్‌తో సన్నిహితంగా ఉండడం తట్టుకోలేని డాక్టర్ తన అన్నయ్య పొన్నాన రామచంద్రరావు, మేనత్త కుమారుడు జమ్ముకు చెందిన రెడ్డి బాబుతో కలసి విజయ్ హత్యకు పథకం వేశారు. ఈ మేరకు పట్టణానికి చెందిన కారింగుల వెంకటేష్, మగ్గూరు రమణబాబుతో మాట్లాడి రూ.5లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న బుధవారం రాత్రి 7.30–8 గంటల మధ్య నరసన్నపేట ఎంపీడీవో క్వార్టర్స్ వద్ద ఉన్న శిథిల భవనంలో రమణబాబు, వెంకటేష్‌లు విజయ్ను తీసుకువచ్చి గొంతు నులిమి చంపినట్టు తెలిపారు. తరువాత వెంకటేష్ జమ్ముకు చెందిన కొత్తరెడ్డి రామకృష్ణ, రెడ్డి బుచ్చిబాబు తీసుకువచ్చిన ఇండికా కారులో మృతదేహాన్ని శ్రీముఖలింగం తీసుకువెళ్లి ముళ్లపొదల్లో వేశారు. కారుతో పాటు రెడ్డి బుచ్చిబాబు, పొన్నాన రామచంద్రరావు మోటారుసైకిల్‌పై వెళ్లి మృతదేహం తరలింపునకు సహకరించారని ఎస్పీ చెప్పారు. అలాగే సోమేశ్వరరావు ఆసుపత్రిలో పని చేస్తున్న కాంపౌండర్లు సంతోష్, బమ్మిడి అప్పన్న కూడా సహకరించారని తెలిపారు. నగదు, బంగారు గొలుసు స్వాధీనం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సోమేశ్వరరావు హంతకులకు చెల్లించిన రూ.1.5 లక్షలు, ఒక బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగించిన మెబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్య రోజు, ముందు రోజు, తరువాత హంతకులు చేసిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఏడుగురు అరెస్టు, పరారీలో రామచంద్రరావు కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. వీరిలో డాక్టర్ పొన్నాడ సోమేశ్వరరావు, కారింగుల వెంకటేష్, ఎం రమణబాబు, రెడ్డి బుచ్చిబాబు, కొత్తరెడ్డి రామకృష్ణ, బమ్మిడి అప్పన్న, తోణంగి సంతోష్‌లను అరెస్టు చేశామని తెలిపారు. రామచంద్రరావు కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా హతుడు తల్లిదండ్రుల నుంచి, డాక్టర్ భార్య నుంచి పోలీసులు వేర్వేరుగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ కేసులో వెంటనే స్పందించి పూర్తి వివరాలు సేకరించి నిందితులను సకాలంలో గుర్తించి సమాచారం రాబట్టిన నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు వినోద్‌బాబు, లక్ష్మణ, నర్శింహా మూర్తి, హెచ్‌సీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ సింహాచలం, శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. మరికొంత సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతితో తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్పీతో శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడుతో పాటు జిల్లా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డీఎస్పీలు ఆదినారాయణ, శ్రీనివాసరావు, పెంటారావు ఉన్నారు. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా
నరసన్నపేట : వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ శ్రీకాకుళం’ పేరిట శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాకు పలు వ రాలు కురిపించారు. ప్రధానం గా భావనపాడు, కళింగపట్నం పోర్టుల అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లాలో మత్య్సకార గ్రామాలు అధికంగా ఉన్నాయని.. తీర ప్రాంతం 130 కిలో మీటర్ల వరకూ ఉన్నందున కోస్టల్ కారిడార్ పేరిట దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.దీనికి కోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. మత్య్సకారుల కోసం 7,500 ఇళ్లు నిర్మిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్ పేరున అనేక పరిశ్రమలను జిల్లాకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే పైడిభీమవరంలో ఫార్మా కంపెనీలు అధికంగా ఉన్నాయని, మరో రూ. 2,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నాలుగు కంపెనీలు ముందుకు వచ్చినట్టు తెలిపారు. దీంతో 10 వేల మందికి ఉపాధి కలుగుతోందన్నారు. శ్రీకాకుళానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, రాష్ట్రంలో 13వ స్థానంలో ఉందని.. దీన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా నుంచి వలసలను తగ్గిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శిశుమరణాలు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు. వెయ్యి మందికి 49 మంది పిల్లలు చనిపోతున్నట్టు రికార్డులు చెబుతున్నాయన్నారు. అలాగే లక్ష మంది బాలింతలకు 110 మంది మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జిల్లాలో 2.44 లక్షల మంది రైతులకు రుణ మాఫీ అమలు చేశామన్నారు. రెండో విడతగా మరో 31 వేలమందికి రుణమాఫీ వచ్చే అవకాాశం ఉందన్నారు. జిల్లాలో 1098 పంచాయతీలకు గాను 304 పంచాయతీలను, 187 వార్డుల్లో 37 వార్డులను దత్తత తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యే బెందాలం అశోక్, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, మాజీ ఎమ్మెల్యే కావలి ప్రతిబా భారతి, నరసన్నపేట ఎంపీపీ శిమ్మ పార్వతమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చింతు శకుంతల తదితరులు పాల్గొన్నారు. -
బాల అమృతం బహుదూరం !
నరసన్నపేట రూరల్ : పిల్లలు పౌష్టికాహారానికి దూరమయ్యూరు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బాల అమృతం ప్యాకెట్ల పంపిణీ నిలి చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా వీటిని పంపిణీ చేయకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు నవంబర్‌లో నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుకు బాల అమృతం రావాల్సి ఉండగా ఇప్పటికీ రాలేదు. జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థతి. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోనే ఈ పరిస్థతి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. ఏడు నెలల పిల్లల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నెలకు ఒక ప్యాకెట్ (రెండున్న కేజీలు) చొప్పున్న బాలామృతం పథకం పేరుతో పౌష్టికాహారాన్ని పంపణీ చేసేవారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సజావుగా సాగే ఈ పంపిణీ ప్రక్రియ టీడీపీ సర్కార్ వచ్చిన తరువాత నిలిచిపోవడంపై పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒక్క నరసన్నపేట ప్రాజెక్టులోనే 225 అంగన్వాడీ కేం ద్రాల్లో ఆరువేల మంది పిల్లలు ఉన్నా రు. వీరికి పౌష్టికాహరం అందడం లేదు. అరుుతే ఈ విషయం తెలియని పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తలను ప్రశ్నిస్తుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికి బాలామృతం వస్తుందో అధికారులు కూడా చెప్పలేక పోతున్నారు. మంచి ఆహారం బాల అమృతం పథకంలో భాగంగా మంచి బలాన్ని ఇచ్చే పౌష్టికాహారాన్ని అందజేసేవారు. గోధుమలు, శనగలు, పంచదార, రిఫైండ్ పామాయిల్ నూనె, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఇనుము, విటమిన్ ఏ,బీ వన్, బీ టు, ఫోలిక్ యాసిడ్, నియాసిన్‌లతో తయూరు చేసే రెండున్నర కేజీల పౌడరుతో కూడిన ప్యాకెట్‌ను సరఫరా చేసేవారు. ఇది రుచిగా ఉండటంతో పిల్లలు బాగా తినే వారు. పేద పిల్లలకు ఇది ఎంతో ఉపకరించేది. బాలామృతం సరఫరా నిలిచి పోవడంతో నిరశన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అంగన్ వాడీ కేంద్రాల్లో రెండు నెలలుగా గుడ్లు సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం బాలామృతం కూడా నిలిపోవడంతో కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయూన్ని నరసన్నపేట ఐడీసీఎస్ పీవో అనంతలక్ష్మి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వం నుంచే సరఫరా లేదన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసునని చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేస్తే తాము అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు. -
అత్తింటి వేధింపులపై కోడల ఆగ్రహం
నరసన్నపేట: అత్తింటి వేధింపులపై ఓ కోడలు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మెట్టింటి ముందు బిడ్డతో సహా ఆందోళనకు దిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నరసన్నపేట మారుతీనగర్‌కి చెందిన వి.సింహాచలం కుమారుడు మధుసురేష్‌తో చోడవరం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసరావు కుమార్తె రామతులసీకు 2013 జూన్‌లో వివాహం జరిగింది. వివాహం తర్వాత అత్తింటి వేధింపులు పెరిగాయని, గర్భం దాల్చి పుట్టింటికి వెళ్లగా అత్తింటి నుంచి స్పందన లేదని రామతులసీ తన అత్త చిట్టిలక్ష్మీ, భర్త సురేష్‌లపై చోడవరం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సురేష్‌ను అరెస్టు చేశారు. ఈ వివాదం తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మనోవర్తి కోరుతూ రామతులసీ మరో కేసు పెట్టారు. కేసు కొనసాగుతుండగా భర్తతో జీవిద్దామనే భావంతో బుధవారం నరసన్నపేటలోని అత్తవారింటికి బంధువులతో కలసి వచ్చారు. అయితే తమ కుమారుడు లేడని.. వివాదం కూడా కోర్టులో ఉన్న దృష్ట్యా ఇంటిలోకి రావద్దంటూ రామతులసీని అత్తమామలు అంగీకరించలేదు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. రామతులసీ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారొచ్చి ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కేవలం తాను ఆడ బిడ్డకు జన్మనిచ్చిన కారణంగానే తనను వేధిస్తూ ఇంటికి రాకుండా నెట్టివేశారని రామతులసీ ఆరోపించారు. కాగా.. తనపై రామతులసీ చోడవరం పోలీస్టేషన్లో మూడు కేసులు పెట్టారని.. తీర్పు వచ్చే వరకు తానేమి చేయలేనని ఆమె భర్త మధుసురేష్ పోలీసులకు తెలిపారు. -
అంగన్వాడీల వైపు చూడని చిన్నారులు !
నరసన్నపేట రూరల్ : స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల వైపు పిల్లలు చూడడం లేదు. లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసులోపు పిల్ల లు కరువవుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ అధికారులు ఆశించిన మేరకు పిల్లల నమోదు ఉండటంలేదు. కొన్ని కేంద్రాల్లో రిజిష్టర్‌కు పిల్లల సంఖ్యకు భారీగా తేడా ఉంటుంది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీ లకు వస్తున్నారంటే పిల్లల సేకరణకు కార్యకర్తలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకే జీ చదువలే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. దీన్ని గమనించిన అధికారులు ఫ్రీ స్కూల్ పిల్లల సంఖ్య పెంచాలని ఒత్తిడి చేస్తు న్నా కార్యకర్తలకు సాధ్యం కావడంలేదు. దీనికి ఉదాహరణగా నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలోని పిల్లల సంఖ్యను చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పరిధిలో నరసన్నపేట మేజరు పంచాయతీతో పాటు నరసన్నపేట, పోలాకి మండలాలు ఉన్నాయి. వీటిలో మెరుున్ కేంద్రాలు 187, మినీ కేంద్రాలు 38 ఉన్నాయి. ప్రస్తుతం 225 కేంద్రాల్లో గర్భిణులు 1275 మంది, బాలింత లు 1492 మంది, సున్నా నుంచి ఆరు నెలల వరకూ 1495 మంది పిల్లలు, అలాగే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 9,414 మంది ఉన్నారు. మార్చి 2014 నాటికి గర్భిణులు 1495, బాలింతలు 1568, సున్నా నుంచి 6 నెలల పిల్లలు 1568, ఐదేళ్లలోపు వారు 10515 మంది ఉండేవారు. అరుుతే తొమ్మిది నెలలకే పిల్లల సంఖ్యలో 1100 మంది తగ్గుదల కన్పిస్తుంది. ఇంత భారీగా తగ్గుదల ఉండటంతో కార్యకర్తలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడ ఉందా అని ఆరా తీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు పంపడం లేదని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇదిలాఉంటే.. మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు రికార్డుల్లో ఉంటున్నారే తప్పా కేంద్రాలకు హాజరు అంతంతగానే ఉంటుంద నే విమర్శలు వస్తున్నారుు. గ్రామీణ ప్రాంతా ల్లో కూడా కాన్మెంట్ చదువుల సంస్కృతి పెరుగుతుండడంతో అంగన్వాడీ కేంద్రాలకు ఆదరణ తగ్గుతోందని పలువురు భావిస్తున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో కార్యకర్తల పనితీరు సరిగ్గా లేదనే ఆరోపణలు ఉన్నారుు. వీరి పనితీరును సరిచేయాల్సిన అధికారులు కూ డా బాధ్యతగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నరసన్నపేట మండలం కొల్లవానిపేట కార్యకర్త రెండేళ్లుగా విధులకు రాకపోయినా ఆ స్థానంలో ఇప్పటికీ కొత్త వారిని నియమించడంలేదు. కనీసం ఈ స్థానం ఖాళీ గా ఉన్నట్టు కూడా చెప్పడం లేదు. అలాగే మాకివలస, మడపాం, కంబకాయల్లో కార్యకర్తల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. మరో పక్క పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతులకు నోచుకోలేదు. అలాగే పారిశుద్ధ్యం క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమౌతారోననే భయంతో కేంద్రాలకు పంపడం లేదు. -
ఎన్నాళ్లీ కారు చీకట్లు?
నరసన్నపేట:పెను తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ అతలాకుతలమై నాలుగు రోజులు గడిచినా జిల్లా ఇంకా అంధకారంలోనే ఉంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పాత రోజులను గుర్తుకుతెచ్చుకుంటూ హాహాకారాలు చేస్తున్నారు. నరసన్నపేట నియోకవర్గంతో పాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో విద్యుత్ కసం ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టిసారించారు. ఇన్వర్టర్లు కూడా చార్జింగ్ అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బహుళ అంతస్తుల్లో ఉన్న, అవకాశం ఉన్న వారు జనరేటర్లు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా ఉపసమనం పొందుతున్నారు. అయితే ఎక్కువగా వీటిని నీటిని తోడడానికే వినియోగిస్తున్నారు. ఒక్కసారిగా జనరేటర్లకు గిరాకీ పెరగడంతో రోజు అద్దె రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో నేలకూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంటర్నెట్, ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్యాంకుల్లో పాత పద్ధతిలోనే పనిచేస్తున్నాయి. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఆమదాలవలస: నేల కూలిన విద్యుత్ స్తంభాలను సరిచేసే పని కొనసాగుతోంది. నియోజకవర్గం పరిధిలో సుమారు 800 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు అంచనా వేశారు. నిరంతరాయంగా పనులు చేస్తున్నా ఇంకా పూర్తికావడంలేదు. వీలయినంత త్వరలోనే పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముమ్మరంగా విద్యుత్ పనులు వీరఘట్టం: విద్యుత్ పునరుద్ధరణ పనులు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో 80 విద్యుత్ స్తంభాలు, 16 ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. వీటిని సరిచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాలకొండ-వీరఘట్టం 33/11 కేవీ ప్రధాన లైను బాగు చేయడం పూర్తయింది. రెండు రోజుల్లోగా అన్ని గ్రామాల్లో స్తంభాలు సరిచేస్తామని ఏఈ కృష్ణారావు చెప్పారు. ఏజెన్సీలో పునరుద్ధరణకు అష్టకష్టాలు సీతంపేట: ఏజెన్సీలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం కిరప, సోమగండి, గొయిది పంచాయతీల పరిధిలోని స్తంభాలు సరిచేసే పనిలో సిబ్బంది ఉన్నారు. అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేయడానికి మూడు రోజులు పడుతుందని తెలిపారు. మరో రెండు రోజులు అంధకారమే! పాలకొండ: మరో రెండు రోజులు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 32, గ్రామీణ ప్రాంతాల్లో 23 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 8 ట్రాన్స్ఫార్మర్లు కుప్పకూలాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని ట్రాన్స్‌కో ఏఈ కె.హరికృష్ణ తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్డీవో సాల్మన్ రాజు చెప్పారు. ఫోన్లు మూగబోవడం, సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో ఎప్పటికప్పుడు నష్టాల సమాచారం అందడం లేదని అన్నారు. భామినిలోనూ విద్యుత్ కష్టాలు భామిని: మండలంలో కరెంట్ కష్టాలు కొనసాగుతున్నాయి. నేల కూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టడానికి ట్రాన్స్‌కో సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. సీతంపేట నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చూసే పనిలో ఏఈఈ ఒ.భీమరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. -
పునరావాస కేంద్రాలకు ససేమిరా..!
నరసన్నపేట రూరల్( పోలాకి) : పోలాకి మండలంలోని పలు తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు అంగీకరించడం లేదు. మేం గ్రామాల్లోనే ఉంటామంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల ఎదుట స్పష్టం చేసిన సంఘటన శనివారం సంభవించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో తీరగ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎంతటి తుపాను వచ్చినా మేం గ్రామాలను కదలమని, ఇళ్లలోనే ఉంటామని మత్య్సకారులు అంటుండటంతో అధికారులకు ఏమీ పాలు పోవడం లేదు. మండలంలోని రేవు అంప్లాం,కొత్తరేవు, కోడూరుల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోడూరు కేంద్రానికి రావాలని గుప్పడిపేట, గుల్లవానిపేట,రాజపురం గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గ్రామాలను వదిలిరామని చెప్పడంతో అధికారులు నిరాశతో వెనుదిరిగారు. గతంలో పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు పడ్డామని ఇళ్లలోనే బాగుంటుందని వాదిస్తున్నారు. తుపాను తీవ్ర అధికంగా ఉన్నందున అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. శనివారం ఆయన తీర గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. రాత్రి నుంచి తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని, చాలా ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరించారు. నరసన్నపేట సీఐ చంద్ర శేఖర్ తదితరులు కూడా ప్రజలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తహశీల్దార్ రామారావు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో పాల ప్యాకెట్లు, కిరోసిన్, తాగు నీరు, బియ్యం, పప్పులు, గ్యాస్‌లతో పాటు అవసరమైన సరుకులు సిద్ధం చేశామన్నారు. పునరావాస కేంద్రాలకు రాని ప్రజలు పూండి: వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులు చేరుకోవడం లేదు. అధికారులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ శనివారం రాత్రి 7 గంటల వరకు ఇళ్లను వదిలి వచ్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు, పీఎంపురం, పాతటెక్కలి, గరుడభద్ర, గోవిందపురం పునరావాస కేంద్రాల్లో 500 బందికి వంటలు సిద్ధం చేశారు. రాత్రికి పరిస్థితి మారితే బలవంతంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తుపాను ప్రత్యేకాధికారులు డీఆర్డీఏ ఏపీడీ, పంచాయితీరాజ్ ఈఈ ఆర్. వరప్రసాద్ బాబు టి.సరోజ చెప్పారు. పునరావాస కేంద్రాల్లో 5 వేల లీలర్ల మంచి నీటి ట్యాంక్‌లు సిద్ధం చేశామని ఆర్‌డబ్ల్యూస్ డీఈఈ డి. సూర్యనారాయణ, ఏఈఈ టి.గౌతమి చెప్పారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ కె.రవికిషోర్ పూడి లంక వాసులును పీఎంపురం పునరావాస కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. కేంద్రాలకు వచ్చేందుకు ససేమిరా..! ఎచ్చెర్ల: తుపాను పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు మండలంలోని పలు తీరప్రాంత గ్రామాల ప్రజలు ఇష్టపడడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంత నచ్చజెప్పినా ఇళ్లు విడిచి వచ్చేందుకు ముందుకు రావ డం లేదు. ప్రత్యేకాధికారి కె.మనో రమ, తహశీల్దార్ బందర వెంకటరావు, ఎస్ఐ ఉదయ్ కుమార్ శనివారం రాత్రి వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజ లను పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయినా వారు అంగీకరించక పోవడంతో వాహనాలను గ్రామాల్లో మొహ రించారు. అత్యవసర పరిస్థితి వస్తే అర్థరాత్రయినా తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బొంతల కోడూరు పంచాయతీ లావేటి పేట, రుప్ప పేట, పాత దిబ్బలపాలేం, డిమత్స్య లేశం, బడివానిపేట, బుడగుట్లపాలేం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో 1400 మంది ప్రజలకు సరిపడా భోజనాన్ని వండారు. ఎమ్మెల్యే కళావెంకటరావు బడివాని పేట సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. సగం మందే పునరావాస కేంద్రాలకు.. ఇచ్ఛాపురం: తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు శనివారం సాయంత్రం తరలించారు. అయితే మొత్తం 5 గ్రామాలకు సంబంధించి సుమారు 4,500 మందికి గాను 2 వేల మంది కూడా తరలి వెళ్లలేదు. చిన్నలక్ష్మీపురం,పెద్ద లక్ష్మీపురం, శివకృష్ణాపురం గ్రామాల నుంచి ప్రజలను ఈదుపురం పునరావాస కేంద్రాలకు తరలించారు. పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రానికి మరికొందరిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ముందు వచ్చేందుకు నిరాకరించిన తరువాత అధికారుల విజ్ఞప్తి మేరకు పునరావాస కేంద్రాలకు బయలుదేరారు. డొంకూరు గ్రామ ప్రజలు మాత్రం వచ్చేందుకు నిరాకరించారు. దాంతో అత్యవసరమైతే వారిని తరలించేందుకు బస్సులను అక్కడ సిద్ధంగా ఉంచారు. వాటితో పాటు సుమారు పది స్విమ్మింగ్ బోట్లు కూడా సిద్ధం చేశారు. -
ఉండేనా..ఊడేనా..?!
నరసన్నపేట: ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధి ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలందిస్తున్న ఉద్యోగుల భవితవ్యం అంధకారంలో పడింది. రెన్యువల్ ఉత్తర్వులు అందక..వేతనాలు లేక కుటుంబాలతో సహా అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం..వారి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తుందో..లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది. జిల్లాలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో సేవలను దృష్టిలో ఉంచుకుని..ఆస్పత్రుల అభివృద్ధి సంఘాల సిఫార్సుల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించారు. పతి ఆరు నెలలకు వీరి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రాకముందు..గత ప్రభుత్వం జూన్ నెల వరకు వీరి ఉద్యోగాలను రెన్యువల్ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరంతా..తమ అమ్యూలమైన సేవలందించారు. జూలై నెల నుంచి రెన్యువల్ కావాల్సి ఉన్నా..వీరికి ఇప్పటి వరకు అటువంటి ఉత్తర్వులేవీ అందలేదు. జూలైతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు వేతనాలు కూడా అందలేదు. అయితే..యథావిదిగా అక్టోబర్‌లో కూడా కొనసాగుతున్నారు. అయితే..ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగాలు..ఉంటాయా..ఊడిపోతాయా? అన్న సందేహం వీరిని వెంటాడుతోంది. స్పందించని ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు దీరినా..వీరి కొనసాగింపు ఉత్తర్వులకు మాత్రం ఆమోదం తెలపలేదు. భవిష్యత్తులో రెన్యువల్‌కు కూడా అంగీకరించే పరిస్థితి లేదని వీరింతా భావిస్తూ..బయపడుతున్నారు. ఇప్పటికే..నాలుగు నెలల పాటు ఉచితంగా సేవలంఇంచిన దృష్ట్యాల ఒక వేళ ఆరు నెలలకు అనుమతించినా..భవిష్యత్తు ఎలా ఉంటోందోనని మథన పడుతున్నారు. చాలీచాలని వేతనాలు అప్పుడప్పుడూ చెల్లించే..వేతనాలు సైతం థర్డ్ పార్టీ ద్వారా చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు ఎందుకూ సరిపోవడం లేదని..అయినా..సేవలందిస్తున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు ఊడిపోతే..కుటుంబాలతో సహా..రోడ్డున పడతామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మానవతా వాదంతో ఆలోచించి..న్యాయం చేయాలని వేడుకుం టున్నారు. -
సుజలధార పది గ్రామాలకే!
నరసన్నపేట రూరల్/పీఎన్‌కాలనీ : అక్టోబర్ రెండో తేదీ నుంచి స్వచ్ఛమైన మంచి నీరు అందుతోందని భావించిన జిల్లా ప్రజల ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. గాంధీ జయంతి నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందజేయూలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ లక్ష్యం నెరవేరని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం దాతల సహకారంతో ఈ పథకాన్ని ముడిపెట్టడం.. వారు అనుకున్నంత స్థాయిలో ఆర్థిక సా యం చేయకపోవడమే. సుజల స్రవంతి పథకానికి జిల్లా వ్యాప్తంగా 544 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో తొలి విడతలో 485, రెండో విడతలో 59 గ్రామాల్లో నీటి సరఫరాకు వీలుగా ప్లాంటులు ప్రారంభించాలనుకున్నారు. అరుుతే ఆర్థికసాయం చేసేందుకు దాతలు ముం దుకు రాకపోవడంతో గాంధీ జయంతి నుంచి కేవలం 10 గ్రామాల్లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుద్ధి చేసిన నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందని ప్రజ లు సంబర పడ్డారు. ప్రధానంగా నీటి కొరత ఉన్న గ్రామస్తులు తమ కష్టాలు తీరుతాయని ఆశించారు. రెండు రూపాయలకే మంచి నీరు లభ్యమవుతోందనుకున్నారు. అయితే ఆచరణ దగ్గరకి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. మండలంలో ఒక్క గ్రామంలోనైనా అక్టోబర్ రెండో తేదీ నుంచి ఈ పథకం ద్వారా మంచి నీరు అందిస్తారనే నమ్మకం లేకుండా పోరుుంది. ఆశించినంతగా దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామంలోనే వచ్చే నెల రెండో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో కోమర్తి, తామరాపల్లిలో ఒక గ్రామంలోనే నీటిని సరఫరా చేయూలని భావించిన అర్డబ్ల్యూఎస్ అధికారులు చివరికి తామరాపల్లిలో పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొరవడిన దాతల సహకారం! ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే అప్పగించింది. సర్కార్ పైసా ఇవ్వదు. దాతలను కూడా అధికారులే చూసుకోవాలి. దీంతో అనుకున్న విధంగా సిబ్బంది లక్ష్యాలు సాధించ లేక పోతున్నారు. ప్రధానంగా దీని అమలుకు ఎంపిక చేసిన గ్రామా ల్లో పని చేస్తున్న బోరు ఉండాలి. ఇది అంగన్వాడీ, పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవనం ఉన్న చోటే ఉండాలి. ఆయా గ్రామంలో ఈ పథకం ద్వారా గ్రామస్తులకు మంచి నీరు అందించేందుకు దాతలు ముందుకు రావాలి. ఈ పథకం ఎలా నిర్వహించాలి, ఏమేమి సమకూర్చాలో అధికారులు వివరిస్తారు. దాతల సొమ్ముతో బోరుకు మోటారు, ఫిల్టర్, మంచినీరు సుద్ధి చేసే ఇతర పరికరాలు సమకూర్చాలి. దీనికి ఒక్కో గ్రామంలో దాతలు సుమారు రూ. 4 లక్షలు వరకూ వెచ్చించాల్సి ఉంది. అంతా అయిన తరువాత గ్రామంలో ఉత్సాహం కలిగిన వారికి, లేదా స్వయం శక్తి సంఘాల వారికి నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. గ్రామంలో 20 లీటర్ల నీటిని కేవలం రెండు రూపాయలకే విక్రయించి ఆ మొత్తంతో నిర్వహణ చేసుకోవాలి. ఇదంతా చెప్పడానికి బాగున్నా ఆచరణ వద్దకు వచ్చే సరికి ఎలా ఉంటుందో అనే అనుమానం అంతటా వ్యక్తం అవుతోంది. సమావేశానికే పరిశ్రమల యజమానుల గైర్హాజర్ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై చర్చిందుకు గత నెల 30వ తేదీన కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పరిశ్రమల యజమానులు గైర్హాజరయ్యూరు. సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని అధికారులు ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని పరిశ్రమల నుంచి కిందిస్థారుు సిబ్బంది మాత్రమే హాజరయ్యూరు. ఆ తరువాత అధికారులు కూడా పెద్దగా దీనిపై దృష్టిసారించిన సందర్భం లేదు. దీంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఫలితంగా తొలి విడతలో కేవలం పది గ్రామాలకే ఈ పథకం పరిమితమయ్యే అవకాశం ఉంది. -
ఆదర్శం అవుట్
నరసన్నపేట రూరల్: టీడీపీ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అధికారం చేపట్టక ముందు నుంచే అదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన తెలుగుదేశం నేతలు అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత తామనుకున్నది చేసేశారు. ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న సాకు చూపిస్తూ.. దీని స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పేరుతో జీవో నెం. 43 జారీ అయ్యింది. ఈ జీవో ఫలితంగా ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు కాగా.. జిల్లాలో 1652 మంది ఆదర్శ రైతులు ఇంటికే పరిమితం కానున్నారు. వ్యయసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణించే వరకూ ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగం చాలా బలోపేతమైంది. ఆదర్శ రైతుల ద్వారానే గ్రామాల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ సమాచారాన్ని గ్రామస్థాయిలో రైతులకు చేరవేయడంతోపాటు.. ఏ తెగులుకు ఏ మందు వాడాలి, ఏ సమయంలో ఏ ఎరువు వాడితే దిగుబడి బాగుంటుందన్న సూచనలు ఇచ్చేవారు. వైఎస్ఆర్ మరణాంతరం ఈ వ్యవస్థ గాడి తప్పింది. దీంతో అనర్హులను తొలగించాలన్న ఉద్దేశంతో 2012 జూన్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆదర్శ రైతులకు పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ పరీక్షల్లో తప్పినవారిని తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని చెప్పినా అది అమలు కాలేదు. మొదట్లో 2800 ఆదర్శ రైతులు ఉండగా పరీక్షల సమయానికి 2400 మంది ఉండేవారు. పరీక్షల్లో తప్పిన 400 మందిని తొలగించగా, మరికొంత మంది మానివేశారు. దీంతో ప్రస్తుతం 1652 మంది మిగిలారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు. వ్యవసాయశాఖ ఇచ్చిన పనులను చేస్తూ రైతులకు ఉపయుక్తంగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే ఆదర్శ రైతులుగా ఉన్నారని ఆరోపిస్తున్న టీడీపీ, అధికారంలోకి రావడంతో ఆ వ్యవస్థనే రూపుమాపేసింది. తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శ రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పనిచేయని వారిని తొలగిస్తే బాగుం డేది. అలాగే ఉన్న వారితో పని చేయించుకోవాలే గానీ తొలగించడం అన్యాయమంటున్నారు. చాలా మంది ఇదే పనిని నమ్ముకొని ఉండిపోయారని, ప్రభుత్వ ఉత్తర్వులతో తామంతా వీధిన పడ్డామని వాపోతున్నారు. 18 నెలలుగా నెలవారీ తమకివ్వాల్సిన వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వడంలేదని, దాని సంగతి ఏమటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా జీవోలతో తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకు వెళతాం ఎటువంటి సమీక్షలు, పరిశీలనలు లేకుండా అందరినీ మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం. దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం. జీవో కాపీని పూర్తిగా పరిశీలించన తర్వాత కోర్టులో పిటిషన్ వేస్తాం. మాకు రావాల్సిన 18 నెలల వేతన బకాయిల కోసం ఆందోళనలు నిర్వహిస్తాం. -శ్రీనివాసరావు, జిల్లా సంఘం అధ్యక్షుడు -
వంద రోజుల పాలనలో ఒరిగిందేమిటి?
నరసన్నపేట : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిందేమిట ని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. మంగళవారం నరసన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం రోజు..అట్టహాసంగా సంతకాలు చేసిన వాటిని సైతం..సీఎం అమలు చేయలేకపోయార ని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి.. వంశధార రెండో దశకు, కరకట్టల నిర్మాణానికి, ఎత్తపోతల పథకాలకు, రుణమాఫీకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. నరసన్నపేటలో.. అప్పట్లో చంద్రబాబు ప్రారంభించిన ఆస్పత్రి ప్రమాదకర స్థితికి చేరుకుందన్నారు. జిల్లా మంత్రి కక్ష సాధింపు చర్యలకు పరిమితమవుతున్నారు తప్ప.. అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ఆక్రమణల తొలగింపు ముసుగు లో ఒక వర్గం మనుషుల కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో స్పష్టత లేకపోవడంతో.. పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. రుణమాఫీ ఫైల్ సంతకానికి పరిమితమైందని..వడ్డీ భారం ఎవరు చెల్లిస్తారని..నిలదీశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, పార్టీ నాయకులు ఆరంగి మురళీధర్, సాసుపల్లి కృష్ణబాబు, రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేశారు..
నరసన్నపేట: రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు మండి పడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రైతులు, డ్వాక్రా మహిళల తరఫున చేపట్టే ఆందోళనల్లో భాగంగా శనివారం సాయంత్రం నరసన్నపేటలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజలను మోసగించి కేవలం రెండుశాతం ఓట్లతో గెలిచిన విషయూన్ని గుర్తించుకోవాలన్నారు. తక్షణమే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయూలని డిమాండ్ చేశారు. అవగాహన లోపంతో అసెంబ్లీలో కూడా మంత్రుల మాటతీరు అధ్వానంగా ఉందన్నారు. పదే పదే జగన్ అవినీతి కోసం ప్రస్తావిస్తున్న నాయకులు వాస్తవాన్ని గ్రహించడం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై గతంలో జగన్‌ను అకారణంగా జైల్లో పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్ష సభ్యులుగా సంపూర్ణ సహకారం అందిస్తామని, అధికారం మాదే అని దూకుడుగా వ్యవహరిస్తే ప్రతిపక్షనేతలుగా సహించేది లేదని హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కష్టమన్నారు. రుణ మాఫీ మాదిరిగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు సగంసగం అమలుచేస్తే ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడతారని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి నర్తు రామారావు, జిల్లా నాయకులు పైడి ఉమామహేశ్వరరావు, రొక్కం మాధవరావు, స్థానిక పార్టీ నాయకులు చింతు రామారావు, కరిమి రాజేశ్వరరావు, సురంగి నర్సింగరావు, పి.దాలినాయుడు, కణితి కృష్ణారావు, కణుసు సీతారాం, సాసుపల్లి కృష్ణబాబు, ఆరంగి మురళీ, మొజ్జాడ శ్యామలరావు, మెండ రాంబాబు, కోరాడ చంద్రభూషణగుప్త, తంగుడు జోగారావు,రాజాపు అప్పన్న, రఘుపాత్రుని శ్రీధర్, పి.గిరీశ్వరరావు సతివాడ రామినాయుడు, మూకల్ల కృష్ణారావు, ధర్మాన జగన్మోహనరావు, ముద్దాడ బాలభూపాల్నాయుడు, ఇట్రాజు రామారావు, ఇట్రాజు చంద్రభూషణ, దండి జయప్రకాష్, పంగ రామారావు, మార్పు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి తగ్గించండి రుణమాఫీ చేసేశామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబుకు అభినందనలు చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నా అసలు రుణాలు ఎప్పుడు మాఫీ చెస్తారో చెప్పండి? ఓ వైపు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారుు. పాత రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారుు. ఈ పరిస్థితి నుంచి ముందు గట్టెక్కించకుండా సంబరాలా? -పొట్నూరు అప్పలనాయుడు, రైతు, భాసూరు, పాలకొండ మండలం స్పష్టత ఏదీ? రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు... ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కేబి నెట్ తీర్మానం చేశామన్నారు. సంబరాలు జరుపుకొన్నారు. 96 శాతం మేర రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. ఇంతవరకూ స్పష్టత లేదు. ఇదంతా రైతులను మభ్యపెట్టేందుకేనా? -భూపతి వెంకటరమణ, రైతు, రంగారాయపురం, సంతకవిటి మండలం ఆచరణ సాధ్యమేనా? రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఎన్నికైన తర్వాత కమిటీ వేశారు. అనంతరం కుటుం బానికి రూ.లక్షా యూభైవేలే వర్తింపజేస్తామన్నారు.. ఇప్పుడు ఎర్ర చందనం అమ్ముతామంటున్నారు. ఇసుక రేవుల నుంచి సెస్ వసూలు చేస్తామంటున్నారు.. అసలు రుణాలను మాఫీ చేస్తారా.. లేదా..? - కంచరాపు వెంకటరమణ, రైతు, మేడమర్తి, సంతకవిటి మండలం -
నేటి పర్యటన ఇలా..
రెండు రోజుల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల్లో చెన్నై బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షడు ధర్మాన కృష్ణదాస్, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొన్నారు. ఉదయం శ్రీకాకుళం నుంచి బయలుదేరి నరసన్నపేట మండలం బాలసీమ, సారవకోట మండలం సత్రాం గ్రామాలకు చెందిన బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో చుట్టిగుండం, పాకివలస గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను ఓదారుస్తారు. అనంతరం భామిని మండలం కొరమ వెళ్తారు. -
ఇక..ఈ-పాస్ పుస్తకాలు!
నరసన్నపేట రూరల్: పారదర్శక పాలనే ధ్యే యంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ-పాసు పుస్తకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రదక్షిణలు అవసరం లేదు ఇప్పటి వరకు పట్టాదారు పుస్తకం కావాలం టే రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇదే అదనుగా కొందరు కార్యదర్శులు వేలాది రూపాయలు తీసుకొని కాళ్లరిగేలా..తిప్పిన సంఘటనలు కోకొల్లలు. ఇకపై ఈ దుశ్చర్యలకు బ్రేక్ పడనుంది. ఇదివరకు.. దరఖాస్తు చేసుకోవడం వరకూ ఆన్లైన్ విధా నం అందుబాటులోకి వచ్చినా, తదుపరి ప్రక్రి య అంతా మామూలుగానే సాగేది. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకుల్లో తనఖాలు వంటి వాటిలో అవకతవకలకు ఆశించిన స్థాయిలో చెక్ పడలేదు. దీంతో రాజాం తదితర మండలాల్లో పలు అవకతవకలు వెలుగు చూసిన విషయం విదితమే. భూముల అమ్మకాల సమయంలో రిజిస్ట్రేషన్‌కు పాసుపుస్తకాలు పరిగణనలోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఉదాహరణకు పదెకరాల రైతు రెండెకరాల భూమిని విక్రయిస్తే, అతని వద్ద మిగిలేది 8 ఎకరాలు. అయితే ఇది పాస్‌పుస్తకాల్లో నమోదు కాక పోవడంతో 10 ఎకరాలు పాస్‌పుస్తకంలో ఉంటుం ది. దీంతో బ్యాంకుల్లో ఈ పదెకరాలకు రైతులు రుణాలు పొందిన సందర్భాలు అనేకం. ఇలాం టి అవకతవకలను సమర్థంగా నిరోదించేందుకు ఈ -పాస్‌పుస్తకం ఉపకరిస్తుందని రెవె న్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాసుపుస్తకం కోసం ఏం చేయాలి దరఖాస్తుదారు భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్, గతంలో ఉన్న పాస్‌పుస్తకాలు తదితర ఆధారాలతో మీ సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వీసు చార్జి కింద రూ. 35, స్టేషనరీ చార్జి కింద రూ.100 చెల్లించాలి. దరఖా స్తు చేసిన 60 రోజుల్లో పోస్టులో హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ముద్రితమైన ఆధునిక ఈ పాస్‌పుస్తకం ఇంటికి చేరుతుంది. ఎంతో మేలు ఈ-పాసుపుస్తకం విధానం మేలైనది. భూ మి రిజిస్ట్రేషన్ సమయంలో పాసుపుస్తకం ఆప్షనను పెట్టుకొంటే రిజిస్ట్రేషన్‌తో పాటు ఈ- పాస్‌పుస్తకం కూడా వచ్చేస్తుంది. దీంతో లింకు డాక్యుమెంట్, యూనిక్ ఐడీ నంబర్ తో సహా ప్రింట్ వస్తుంది. బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో ఆన్లైన్ వివరాలు అందుబాటులో ఉంటాయి. -సుధాసాగర్, నరసన్నపేట -
ప్రజా సమస్యలపై పోరాటం
నరసన్నపేట: ప్రజా సమస్యలపై శాసన సభలో, జిల్లాలో పోరాటం చేస్తామని రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, వి.కళావతి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ జన్మదినోత్సవ వేడుకలు నరసన్నపేటలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ చేపట్టే ప్రతి ప్రజావ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాటాలు చేస్తామన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కల్లెదుటే కోట్లాది రూపాయల ఇసుక అక్రమ దందా నడుస్తుంటే పట్టించుకోని అధికార పార్టీ నేతలు ఇతర పార్టీ నాయకులపై అవినీతి గురించి మాట్లాడుతుంటే ఏ మనుకోవాలో తెలియడం లేదన్నారు. ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు అడ్డదారిలో వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. బాధ్యతాయుతంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు ఏ మాత్రం ఇబ్బందులు ఎదురైనా తామంతా వారి వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసిన రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేద్దామన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కృష్ణదాస్ ఆయన సతీమణి పద్మప్రియ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యు లు పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మె ల్యే ముత్యాలపాప, స్థానిక నాయకులు ధర్మాన రామలింగంన్నాయుడు, ధర్మాన కృష్ణచైతన్య, సాసుపల్లి కృష్ణబాబు, ఆరంగి మురళీధర్, చిన్నాల రామసత్యనారాయ ణ, కొయ్యాన సూర్యనారాయణ, కరిమి రాజేశ్వరరావు, సురంగి నర్సింగరావు, పోలాకి నర్సిం హమూర్తి, కోరాడ చంద్రభూషణగుప్త, పి.సాయిప్రసాద్, రాజాపు అప్పన్న, పతివాడ గిరీశ్వరరావు, ఇ ట్రా జు సూరిబాబు, కణితి కృష్ణారావు, వూన్న రాజశ్రీ, కరి మి ఉమ, పి.కృష్ణప్రసాద్, దుంపల భాస్కరరావు, మా మిడి శ్రీకాంత్, పేడాడ తిలక్, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం
నరసన్నపేట రూరల్: బొరిగివలస అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లలతో పాటు అంగన్వాడీ కార్యకర్త, ఆయాలు పరుగులు తీశారు. సోమవారం ఉదయం కేంద్రం తెరిచేటప్పటికే పాము లోపల ఉంది. అయితే ముందుగా దీనిని ఎవరూ గుర్తించ లేదు. కొద్ది సమయం అయిన తర్వాత పాము బుసలు వినిపించడంతో అనుమానంతో కార్యకర్త, ఆయాలు లోపల వెతికారు. నాగుపాము ఒక్కసారిగా బయటకు వచ్చింది. కేంద్రంలో పిల్లల కోసం ఉంచిన గుడ్లును అప్పటికే అధికంగా పాము తాగింది. దీంతో కదలలేని స్థితిలో ఉండడంతో ఇబ్బంది కలగలేదు. సుమారు గంట పాటు కేంద్రంలోనే పాము ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వచ్చి పామును పట్టుకొని తీసుకువెళ్లారు. దీంతో కేంద్రంలోని పిల్లలు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా కేంద్రంకు ఆనుకొని ముళ్లతుప్పలు ఉండటమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు అంటున్నారు. పాము వల్ల ఒకవేళ ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది మేల్కొని అంగన్ వాడీ కేంద్రాల చుట్టూ ముళ్ల తుప్పలు, పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
విప్ జారీ అధికారం కృష్ణదాస్‌కు
నరసన్నపేట: వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న స్థానిక సంస్థల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సభ్యులకు విప్ జారీ చేసే అధికారాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు ఆ పార్టీ అప్పగించింది. జూలై 3న మున్సిపల్, 4న ఎంపీపీ, 5న జె డ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ కృష్ణదాస్ విప్ జారీ చేస్తారు. దానికి అనుగుణంగా సభ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరించేవారు తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. దీనిపై ఆదివారం కృష్ణదాస్ మాట్లాడుతూ తనకు ఈ అధికారం ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు విప్‌కు బద్దులయ్యేలా కృషి చేస్తానన్నారు. నేడు నరసన్నపేటలో జిల్లా సమావేశం కాగా నరసన్నపేటలో సోమవారం సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కృష్ణదాస్ చెప్పారు. పార్టీ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, మండలాల కన్వీనర్లు, అన్ని విభాగాల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. -
తల్లీకూతురు @ ఎంపీటీసీ
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికలంటే ఎన్నో తమాషాలు, ఎన్నో వింతలు ఉంటూనే ఉంటాయి. అలాగే నరసన్నపేటలోనూ చోటుచేసుకుంది. వేరు వేరు చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన తల్లీ, కూతురు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించారు. అంతేగాక ఇద్దరి మోజార్టీ కూడా ఒకటే కావడం మరో విశేషం. ఈ తల్లీ కూతురు ఇద్దరూ 375 మోజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాకివలస, నరసన్నపేట నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీచేసిన తల్లి శిమ్మ పార్వతమ్మ, కూతురు నేతింటి భారతి ఇద్దరూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. -
నరసన్నపేట... నాలుగు స్తంభాలాట
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నరసన్నపేట నియోజకవర్గంలో ఆది నుంచి నాలుగు కుటుంబాల మధ్యే ఎన్నికల పోరు సాగుతోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకూ ఒక సారి తప్ప మిగిలిన ఎన్నికల్లో శిమ్మ ప్రభాకరరావు, ధర్మాన ప్రసాదరావు, డోల సీతారాములు, బగ్గు లక్ష్మణరావు కుటుంబాల వారే బరిలో దిగుతున్నారు. తాజా ఎన్నికల్లో కూడా వీరే పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి బగ్గు లక్ష్మణరావు దూరపు బంధువు ఈ సారి పోటీ చేస్తుండడంతో కొత్త ముఖం వచ్చినట్లు అయింది. ఈ నాలుగు కుటుంబాల వారు ఒక్కోసారి ఒకరిపై ఒకరు, మరోసారి ఒకే వర్గంగా ఉంటూ ఎన్నిల్లో తలపడుతన్నారు. శిమ్మ ప్రభాకరరావు రెండు సార్లు, ఆయన తండ్రి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా పదవి చేపట్టగా, ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్న కృష్ణదాసులు ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. బగ్గు లక్ష్మణరావు, ఆయన తల్లి సరోజనమ్మ ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. డోల సీతారాములు ఒక పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 1972లో బగ్గు సరోజనమ్మ ఇండియన్ కాంగ్రెస్ తరఫున, ధర్మాన లజపతిరాయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో రాజకీయాల్లోకి మరో రెండు కుటుంబాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో శిమ్మ జగన్నాథంపై సరోజనమ్మ గెలిచారు. 1978లో శిమ్మ జగన్నాధం, బగ్గు సరోజనమ్మలతో పాటు డోల సీతారాములు పోటీకి దిగారు. దీంట్లో అనూహ్యంగా సీతారాములు విజయం సాధించారు. 1985లో కాంగ్రెస్ టిక్కెట్ యువకుడైన లజపతిరాయ్ సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు లభించింది. అప్పట్లో స్వల్ప తేడాతో శిమ్మ ప్రభాకరరావు విజయం సాదించారు. 1989లో మరోసారి వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో బగ్గు లక్ష్మణరావు ధర్మాన శిబిరంలో చేరారు. దీంతో ధర్మాన సునాయాసంగా విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ శిమ్మ ప్రభాకరరావుకు బదులు బగ్గు లక్ష్మణరావుకు టిక్కెట్ ఇచ్చింది. శిమ్మ, బగ్గు కుటుంబాలు ఎన్నికల్లో కలిశారు. దీంట్లో ధర్మానకు రెండో ఓటమి ఎదురైంది. అప్పటి నుంచి 2009 వరకూ ధర్మాన, బగ్గు కుటంబాల మధ్యే పోటీ జరిగింది. 1999లో ధర్మాన, బగ్గు లక్ష్మణరావులు పోటీ పడగా 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రసాదరావు అన్న కృష్ణదాసు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయగా ధర్మాన శ్రీకాకుళం వెళ్లి అక్కడ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణదాసు విజయం సాధించారు. అనంతరం 2009లో కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. ప్రజారాజ్యం తరఫున సీతారాములు కుమారుడు జగన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణదాసు, శిమ్మ ప్రభాకరరావులు ఒకే శిబిరంలోకి వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో కృష్ణదాసుతో బగ్గు లక్ష్మణరావు అల్లుడు శిమ్మ స్వామిబాబు తలపడ్డారు. తాజా ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాసు, బగ్గు రమణమూర్తి, డోల జగన్ పోటీ చేస్తున్నారు. -
జగన్మోహన్రెడ్డితోనే సమస్యల పరిష్కారం
నరసన్నపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరితేనే సమస్యలు పరిష్కారమవుతాయని నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నా రు. ప్రజలంతా..సహకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థిగా మం గళవారం నామినేషన్ దాఖలు చేసే ముందు సత్యవరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్‌పై చర్చ జరుగుతోందని..అందుకు ఆస్కారం లేకుండా..తనకు వేసే ప్రతి ఓటునూ..ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతికి కూడా వేయాలని విజ్ఞప్తి చేశారు. మా జీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అధికార దాహంతో చంద్రబాబు..ప్రజలను మభ్యపెట్టే హామీలిస్తున్నారన్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రైతుల ఆత్యహత్యలకు పురగొల్పిన ఆయన..మళ్లీ రైతు జపం చేస్తుండడం హాస్యాస్పదమన్నారు. సభకు హాజరైన ప్రతి ఒక్కరూ..తమ కుటుంబాలు, బంధువులు ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలా చూడాలన్నారు. ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి మాట్లాడుతూ మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప,పార్టీ నాయకులు ఎచ్చెర్ల సూర్యనారాయణ, అందవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా నామినేషన్ నరసన్నపేట, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ అట్టహాసంగా మంగళవారం నామినేషన్ వేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారిణి కె.తనూజారాణికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు మబగాంలోని తన నివాసంలో పూజలు చేశారు. అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్లి..దర్శించుకున్నారు. అక్కడి నుంచి టాప్‌లెస్ జీపులో బయల్దేరి రావులవలస గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. పైడి తల్లి అమ్మవారికి పూజలు చేశారు. సభ పూర్తయిన తరువాత సత్యవరం జంక్షన్ నుంచి నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి..నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మాన పద్మప్రియ, లోక్‌సభ అభ్యర్థిని రెడ్డి శాంతి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘పేట’ను బీజేపీకి ఇవ్వొద్దు
నరసన్నపేట, న్యూస్‌లైన్ :నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ అధిష్టానం బీజేపీకి కేటాయించడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థే పోటీ చేసేలా అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం మారని పక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బగ్గు రమణమూర్తిని కోరారు. నరసన్నపేటను బీజేపీకి కేటాయించారని తెలిసి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని బగ్గు రమణమూర్తిని డిమాండ్ చేశారు. తామంతా విరాళాలు సేకరించి మరీ గెలిపించుకుంటామని ప్రకటించారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ జాబితాలోనే ఉంచేలా.. బగ్గు రమణమూర్తికే టికెట్ వచ్చేలా చూడాలని జిల్లా పార్టీ నేతలను డిమాండ్ చేశారు. ఈ విషయమై కింజరాపు అచ్చెన్నాయుడుతో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీలోనే కొనసాగుతా.. సమావేశంలో పాల్గొన్న బగ్గు రమణమూర్తి ఉద్వేగంతో ప్రసంగించారు. బీజేపీతో పార్టీ పొత్తు పెట్టుకున్న కారణంగా తనకు టికెట్ రావడం లేదన్న ఆవేదన కంటే ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం నెరవేరడం లేదని బాధగా ఉందని చెప్పారు. పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం పొత్తు జాబితాలో చేరేలా జిల్లాకు చెందిన కొందరు నాయకుల పలుకుబడి ఉపయోగించారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు గొద్దు చిట్టిబాబు, చింతు పాపారావు, తమ్మినేని భూషణరావు, బెవర రాము, శిమ్మ చంద్రశేఖరరావు, బోయిన సతీష్, వారణాశి మురళీ తదితరులు పాల్గొన్నారు. -
‘బొమ్మరిల్లు’పై కేసు నమోదు
నరసన్నపేట, న్యూస్‌లైన్: నరసన్నపేట పరిసర ప్రాంతాల్లోని బొమ్మరిల్లు బాధితులు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బుడితి గ్రామానికి చెందిన తంగుడు గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైరక్టర్లపై కేసు పెట్టారు. నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు 400 మందితో రూ. కోటి వరకు డిపాజిట్ల రూపేణా, రోజువారీ చీటీల పేరుతో చెల్లింపులు చేశామని, సుమారు 400 మంది ఖాతాదారులు జాబితాను సిద్ధం చేసి పోలీసులకు సమర్పించారు. ఈ ప్రాంతంలో కనీసం వెయ్యి మంది వరకు బాధితులు ఉంటారని భావిస్తున్నారు. -
వివాహం అయిన మూడు రోజులకే వరుడు మరణం
-
కి‘లేడీ’లు..!
నెత్తిపై బుట్ట.. అందులో కొన్ని ప్లాస్టిక్ వస్తువులు..ఊరూరా..వీధివీధి సంచారం..చూడగానే..ఈఇంతులకెంత కష్టం..పొట్టకూటి కోసం ఎంత కష్టపడుతున్నారు అనుకునేంత అమాయకత్వం.. అదే వారికి పెట్టుబడిగా మారుతోంది. మహిళలను చూడగానే..జనం సహజంగా ప్రదర్శించే జాలి.. వారి మాయా ప్రవృత్తికి మార్గమవుతోంది. దొంగతనాలకు పాల్పడుతున్నారు. తీరా దొరికిపోయే సరికి..అబ్బే తమకేమీ తెలియదంటూ.. చేతులెత్తేస్తున్నారు. నరసన్నపేటలో సోమవారం జరిగిన ఓ చోరీ ఘటన ఈ ముఠా అసలు రూపాన్ని తేటతెల్లం చేసింది. నరసన్నపేట,న్యూస్‌లైన్: తిలారు గ్రామానికి చెందిన తంగి ధనలక్ష్మి నరసన్నపేట సంతకు వచ్చింది. సరిపడా సామగ్రి కొనుగోలు చేసి.. తన పర్సులోని కొంత సొమ్మును వ్యాపారికి ఇచ్చింది. మిగతా రూ.6 వేల సొమ్ముతో పాటు పర్సును సామగ్రిపై పెట్టింది. అయితే..ఆ సమయంలో నెత్తిపై ప్లాస్టిక్ వస్తువులతో కూడిన బుట్టలతో ఇద్దరు మహిళలు వచ్చారు. ధనలక్ష్మి కాస్త ఆదమరిచి ఉండడంతో పర్సును కొట్టేశారు. పర్సులో ఉన్న నగదును బాలుడు తీసేసి..పర్సును కాలువలో పడేశా డు. అయితే.. తానొకటి తలిస్తే..భగవంతుడొకని తలచు అన్న చందాన..వీరైతే..గుట్టు చప్పుడు కాకుండా..రూ.6 వేలు నొక్కేశామనుకుని సంబర పడుతున్నా.. ఈ తంతంగమంతా..నరసన్నపేటకు ఓ కలాసీ గమనిస్తున్నా డు. అంతలోనే..ధనలక్ష్మి కూడా తన పర్సు పోయిందంటూ..కేకలు వేయడంతో.. అంతా కలిసి..వారి కోసం గాలించారు. స్థానిక మఠం వీధి వద్ద పట్టుకున్నారు. స్థానికులంతా నిలదీయడంతో తమకు కేవలం రూ.1500 దొరికాయంటూ..బాలుడి ద్వారా ఇవ్వబోయా రు.స్థానికులు గట్టిగా నిలదీసి..స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రైనీ ఎస్సై శ్రీనివాసరావు పోలీసులతో సహా వచ్చి..వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. -
తాత్విక రత్నం కుటుంబానికి ఓదార్పు
-
సూర్యప్రకాశ్ కుటుంబానికి ఓదార్పు
-
రాజనగరం బత్తిన్న రత్నం కుటుంబానికి ఓదార్పు
-
నెల్లూరులో వినాయకుని గుడిని సందర్శించిన జగన్
-
జయరామయ్య కుటుంబానికి ఓదార్పు
-
వెంకటగిరిలో రాజన్న విగ్రహావిష్కరణ
-
నెల్లూరు గాంధీ భవన్ రోడ్డులో వైయస్ జగన్ ప్రసంగం
-
మన్యంలో వైయస్ జగన్ ప్రసంగం
-
వంధలూరులో రాజన్న విగ్రహావిష్కరణ
-
నుకినేడు వెంకన్నదొర కుటుంబానికి ఓదార్పు
-
నల్లబల్లిలో రాజన్న విగ్రహావిష్కరణ
-
తునిలో వైయస్‌జగన్ ప్రసంగం
-
తాండవలో వైయస్ జగన్ ప్రసంగం
-
బాబురావు కుటుంబానికి ఓదార్పు
-
అప్పరాజుపేటలో రాజన్న విగ్రహావిష్కరణ
-
అనపర్తి శ్రీరాములు కుటుంబానికి ఓదార్పు
-
వీరవరప్ప పేటలో రాజన్న విగ్రహావిష్కరణ
-
వైయస్ఆర్కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో వైయస్ జగన్ ప్రసంగం
-
నరసింహులు కుటుంబానికి ఓదార్పు
-
చిలకపాలెంలో రాజన్న విగ్రహావిష్కరణ
-
శ్రీకాకుళం జిల్లా రాజంలో రాజన్న విగ్రహావిష్కరణ
-
గాలినాయుడు కుటుంబానికి ఓదార్పు
-
హుకుంపేట కుటుంబానికి ఓదార్పు
-
శ్రీకాకుళం జిల్లా సూర్యామహల్ జంక్షన్లో రాజన్న విగ్రహావిష్కరణ
-
శ్రీకాకులంలో మొదటి రోజు ఓదార్పు యాత్ర
-
ఖమ్మం జిల్లా మీనవోలులో వైయస్ జగన్ ప్రసంగం