ఉండేనా..ఊడేనా..?! | Medical Policy Renewal orders Parishad Government TDP | Sakshi
Sakshi News home page

ఉండేనా..ఊడేనా..?!

Published Sun, Oct 12 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఉండేనా..ఊడేనా..?!

ఉండేనా..ఊడేనా..?!

 నరసన్నపేట:  ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధి ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలందిస్తున్న ఉద్యోగుల భవితవ్యం అంధకారంలో పడింది. రెన్యువల్ ఉత్తర్వులు అందక..వేతనాలు లేక కుటుంబాలతో సహా అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం..వారి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తుందో..లేదోనన్న భయం వారిని వెంటాడుతోంది.  జిల్లాలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో సేవలను దృష్టిలో ఉంచుకుని..ఆస్పత్రుల అభివృద్ధి సంఘాల సిఫార్సుల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీరిని నియమించారు.
 
 పతి ఆరు నెలలకు వీరి ఉద్యోగాలను రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రాకముందు..గత ప్రభుత్వం జూన్ నెల వరకు వీరి ఉద్యోగాలను రెన్యువల్ చేసింది. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరంతా..తమ అమ్యూలమైన సేవలందించారు. జూలై నెల నుంచి రెన్యువల్ కావాల్సి ఉన్నా..వీరికి ఇప్పటి వరకు అటువంటి ఉత్తర్వులేవీ అందలేదు. జూలైతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు వేతనాలు కూడా అందలేదు. అయితే..యథావిదిగా అక్టోబర్‌లో కూడా కొనసాగుతున్నారు. అయితే..ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఉద్యోగాలు..ఉంటాయా..ఊడిపోతాయా? అన్న సందేహం వీరిని వెంటాడుతోంది.
 
 స్పందించని ప్రభుత్వం
 కొత్త ప్రభుత్వం కొలువు దీరినా..వీరి కొనసాగింపు ఉత్తర్వులకు మాత్రం ఆమోదం తెలపలేదు. భవిష్యత్తులో రెన్యువల్‌కు కూడా అంగీకరించే పరిస్థితి లేదని వీరింతా భావిస్తూ..బయపడుతున్నారు. ఇప్పటికే..నాలుగు నెలల పాటు ఉచితంగా సేవలంఇంచిన దృష్ట్యాల ఒక వేళ ఆరు నెలలకు అనుమతించినా..భవిష్యత్తు ఎలా ఉంటోందోనని మథన పడుతున్నారు.
 
 చాలీచాలని వేతనాలు
 అప్పుడప్పుడూ చెల్లించే..వేతనాలు సైతం థర్డ్ పార్టీ ద్వారా చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు ఎందుకూ సరిపోవడం లేదని..అయినా..సేవలందిస్తున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు ఊడిపోతే..కుటుంబాలతో సహా..రోడ్డున పడతామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మానవతా వాదంతో ఆలోచించి..న్యాయం చేయాలని వేడుకుం టున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement