సుజలధార పది గ్రామాలకే!
నరసన్నపేట రూరల్/పీఎన్‌కాలనీ : అక్టోబర్ రెండో తేదీ నుంచి స్వచ్ఛమైన మంచి నీరు అందుతోందని భావించిన జిల్లా ప్రజల ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. గాంధీ జయంతి నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందజేయూలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ లక్ష్యం నెరవేరని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం దాతల సహకారంతో ఈ పథకాన్ని ముడిపెట్టడం.. వారు అనుకున్నంత స్థాయిలో ఆర్థిక సా యం చేయకపోవడమే. సుజల స్రవంతి పథకానికి జిల్లా వ్యాప్తంగా 544 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో తొలి విడతలో 485, రెండో విడతలో 59 గ్రామాల్లో నీటి సరఫరాకు వీలుగా ప్లాంటులు ప్రారంభించాలనుకున్నారు.
అరుుతే ఆర్థికసాయం చేసేందుకు దాతలు ముం దుకు రాకపోవడంతో గాంధీ జయంతి నుంచి కేవలం 10 గ్రామాల్లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుద్ధి చేసిన నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందని ప్రజ లు సంబర పడ్డారు. ప్రధానంగా నీటి కొరత ఉన్న గ్రామస్తులు తమ కష్టాలు తీరుతాయని ఆశించారు. రెండు రూపాయలకే మంచి నీరు లభ్యమవుతోందనుకున్నారు. అయితే ఆచరణ దగ్గరకి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. మండలంలో ఒక్క గ్రామంలోనైనా అక్టోబర్ రెండో తేదీ నుంచి ఈ పథకం ద్వారా మంచి నీరు అందిస్తారనే నమ్మకం లేకుండా పోరుుంది. ఆశించినంతగా దాతలు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామంలోనే వచ్చే నెల రెండో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో కోమర్తి, తామరాపల్లిలో ఒక గ్రామంలోనే నీటిని సరఫరా చేయూలని భావించిన అర్‌డబ్ల్యూఎస్ అధికారులు చివరికి తామరాపల్లిలో పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కొరవడిన దాతల సహకారం!
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకే అప్పగించింది. సర్కార్ పైసా ఇవ్వదు. దాతలను కూడా అధికారులే చూసుకోవాలి. దీంతో అనుకున్న విధంగా సిబ్బంది లక్ష్యాలు సాధించ లేక పోతున్నారు. ప్రధానంగా దీని అమలుకు ఎంపిక చేసిన గ్రామా ల్లో పని చేస్తున్న బోరు ఉండాలి. ఇది అంగన్‌వాడీ, పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ భవనం ఉన్న చోటే ఉండాలి. ఆయా గ్రామంలో ఈ పథకం ద్వారా గ్రామస్తులకు మంచి నీరు అందించేందుకు దాతలు ముందుకు రావాలి. ఈ పథకం ఎలా నిర్వహించాలి, ఏమేమి సమకూర్చాలో అధికారులు వివరిస్తారు. దాతల సొమ్ముతో బోరుకు మోటారు, ఫిల్టర్, మంచినీరు సుద్ధి చేసే ఇతర పరికరాలు సమకూర్చాలి. దీనికి ఒక్కో గ్రామంలో దాతలు సుమారు రూ. 4 లక్షలు వరకూ వెచ్చించాల్సి ఉంది. అంతా అయిన తరువాత గ్రామంలో ఉత్సాహం కలిగిన వారికి, లేదా స్వయం శక్తి సంఘాల వారికి నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. గ్రామంలో 20 లీటర్ల నీటిని కేవలం రెండు రూపాయలకే విక్రయించి ఆ మొత్తంతో నిర్వహణ చేసుకోవాలి. ఇదంతా చెప్పడానికి బాగున్నా ఆచరణ వద్దకు వచ్చే సరికి ఎలా ఉంటుందో అనే అనుమానం అంతటా వ్యక్తం అవుతోంది.
సమావేశానికే పరిశ్రమల యజమానుల గైర్హాజర్
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై చర్చిందుకు గత నెల 30వ తేదీన కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పరిశ్రమల యజమానులు గైర్హాజరయ్యూరు. సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని అధికారులు ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని పరిశ్రమల నుంచి కిందిస్థారుు సిబ్బంది మాత్రమే హాజరయ్యూరు. ఆ తరువాత అధికారులు కూడా పెద్దగా దీనిపై దృష్టిసారించిన సందర్భం లేదు. దీంతో లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది. ఫలితంగా తొలి విడతలో కేవలం పది గ్రామాలకే ఈ పథకం పరిమితమయ్యే అవకాశం ఉంది.